6, సెప్టెంబర్ 2022, మంగళవారం

చిక్కుముడి జీవితాలు...(సీరియల్)...(PART-4)

 

                                                                      చిక్కుముడి జీవితాలు...(సీరియల్)                                                                                                                                                                 (PART-4)

అమ్మవారు ఎప్పుడూ లాగానే మందహాసంగా నవ్వుతూ ఉన్నది. అర్చనా కళ్ళు తిప్పుకోలేకపోయింది. గుడిలో ఎక్కువ జనం లేరు. త్వరగా ఒక ఉద్యోగం దొరకాలని వేడుకుని గుడి ప్రహారాన్ని మూడుసార్లు తిరిగి, ఇంటికి వచ్చింది.

వెంటనే ఉద్యోగం దొరకక పోతే ఇంటి పరిస్థితి విషమిస్తుంది. నాన్నకు వచ్చే డబ్బు హాస్పిటల్ ఖర్చులకు సరిపోగా, చేతిలో ఉన్న డబ్బు మిగిలిన వాటికి ఖర్చు అవుతూ తగ్గిపోతోంది. ఎక్కడ బాధ్యత తీసుకోవలసి వస్తుందోఅనుకునే అన్నయ్య అసలు ఇంటికే రావటం లేదు. అక్కయ్య ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు.

ఎవర్ని తలుచుకుని ఏడవాలో తల్లికి అర్ధం కావటంలేదు.

పెద్ద చదువులు చదువుకున్న వారికే ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో....వుత్త బి.కాం డిగ్రీ ని చూసి ఎవరు ఉద్యోగం ఇస్తారు? దాంతో పాటూ 'కంప్యూటర్ కోర్స్ ' ఏదైనా ముగించుంటే కొంచానికి కొంచం చాన్స్ఉంది అనచ్చు. దానికే ఆమెకు దారిలేదు.

డబ్బున్న వారికే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మంచి ఉద్యోగానికి పెద్ద చదవు, అర్హత కావాలి. అర్హతను వెతుక్కుంటూ వెళ్ళటానికి డబ్బు కావాలి. డబ్బే సమస్య! అటూ ఇటూ కాని జీవితానికి రోజు ముగింపు పడుతుందో! ఎంతోమందిలాగా వసతిగా -- సంతోషంగా జీవించే కాలం నాకు వస్తుందా? లేక ఇలాగే చివరి వరకు ఉంటామా?’-- అర్చనా నిట్టూర్పు విడిచింది.

ఆమెకు అత్యాశ అంతా లేదు. అయినా కానీ స్నేహితురాళ్ళు కొందరు పెద్ద ఆస్తి ఉన్న అమ్మాయలు. వాళ్ళ ఇళ్ళకు అర్చనా వెళ్ళుంది. ఇళ్ళ అందం, అలంకారం, ఖరీదైన సోఫా సెట్లు, .సి రూములు. మనిషిని మింగే మంచాలు, మిరుమిట్లు గొలిపే బాత్ రూమ్ టైల్స్, ఆమెను భ్రమింప చేస్తుంది. మనిషికో కారు, రకరకాల దుస్తులు, అనుకున్న వాటిని, అనుకున్న సమయంలో కొనగలిగే వసతి, ఈమెను ఎన్నో సార్లు ఆశ్చర్యపరిచేది.

ఆ స్నేహితురాళ్ళు డబ్బు గల ఇంట్లో పుట్టిన యువరాణులుగాను, నేను మాత్రం ఎందుకు అతి సాదారణ కుటుంబంలో పుట్టి, అన్ని రకాల సమస్యలకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాను? దేవుడు పక్షపాతము లేనివాడు అయితే ఎందుకిలా మనుష్యుల మధ్య ఎక్కువ తక్కువలు ఏర్పరచాలి?

అందమైన బంగళాలో ఎటువంటి కష్టమూ లేకుండా జీవితం గడపాలి అనేది అందరి మనుష్యులకూ ఉండే సరాసరి ఆశే కదా? ఇందులో ఏముంది తప్పు? దేవుడెందుకు దీన్ని అర్ధం చేసుకోకుండా...ఒకర్ని వసతిగానూ, ఇంకొకర్ని కష్టాలలోనూ ఉంచాడు? ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం దొరుకుతుంది.

ఏమే...ఎక్కడికెళ్ళేవే! త్వరగారా. నీకు ఏదో ఒక ఉత్తరం వచ్చింది. ఏమిటో చూడు... -- వాకిట్లో నిలబడే అరిచింది.

ఏమ్మా...ఊరంతా వినేటట్టు ఇలా అరవాలా? లోపలకు వచ్చిన తరువాత చెప్పకూడదా?”

ఉద్యోగానికి రమ్మని ఏదైనా పిలుపు వచ్చిందేమో చూడు -- ఆత్రుతతో ఒక కవరు తీసి ఇచ్చింది తల్లి.

అర్చనా కవర్ను విప్పింది. ఉత్తరం చివర ఉన్న మురళీ అనే సంతకంతో ఆమె ముఖం వికసించ -- ఉత్తరాన్ని చదివింది.

స్నేహితుడు ఒకడి సహాయంతో నీకు ఉద్యోగం ఏర్పాటు చేసాను. త్రీ స్టార్ హోటల్ ఒక దాంట్లో రిసెప్షనిస్ట్. జీతం కొంచం బాగానే ఉంటుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడటం తెలిసుండాలి. మీరు బాగా మాట్లాడతారని చెప్పుంచాను. .కే. అనుకుంటే వెంటనే కింద రాసున్న అడ్రస్సుకు వెళ్ళి నేరుగా మాట్లాడండి. హోటల్ ఉద్యోగమా?’ -- అని సందేహించకండి. బాగా నమ్మగలిగే మనుషులు కాబట్టే ఉత్తరం  రాసేను

ఏమిటే?”

ఉద్యోగానికేనమ్మా

ఎక్కడ్నుంచి?”

రిసెప్షనిస్ట్ ఉద్యోగం. కొంచం ఎక్కువ జీతం వస్తుందట

కంపెనీ?”

కంపెనీ కాదు...త్రీ స్టార్ హోటల్

హోటలా?” -- తల్లి మొహం నిరుశ్చాహపడింది.

ఏమ్మా?”

హోటల్ ఉద్యోగానికి ఎలా?”

ఇప్పుడంతా లేడీస్ అందరూ అన్నీ చోట్ల ఉద్యోగం చేస్తున్నారమ్మా. ఆటో, లారీ కూడా తోలుతున్నారు

అయినా కానీ మీ నాన్న ఒప్పుకోవాలే?”

హోటల్ ఉద్యోగమని నాన్నకు చెప్పకు. నీకు నా మీద నమ్మకం ఉంటే ధైర్యంగా పంపు. డబ్బు లేకుండా ఎన్ని రోజులు ఉండగలం? పూర్తిగా డబ్బులు లేనప్పుడు, దీనికి తక్కువగా ఉండే జీతానికైనా తప్పక వెళ్ళాల్సి వస్తుంది. దానికంటే ఉద్యోగంలో చేరొచ్చు కదా? ఇప్పుడు మనమున్న పరిస్థితికి...ఇది దాహంతో ఉన్న మనకు మంచి నీళ్ళు దొరికినట్లు! దీనికంటే మంచి ఉద్యోగం దొరకకుండానా ఉంటుంది. అంతవరకు ఉద్యోగం చేస్తాను?”

నువ్వక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు?”

ఒక నెల ఏదైనా హాస్టల్లో ఉంటాను. మన శక్తికి తగిన  ఇల్లు దొరుకుతుందా చూస్తాను. దొరికితే మీరూ అక్కడికి వచ్చేయండి

మీ నాన్న ఇంటిని వదిలి రారే! పెంకుటిల్లు అయినా వంశపారపర్య ఆస్తి కదా? గుడికి సొంతమైన ఇల్లు అయినా, సంవత్సరాల తరబడి వంశపార్యంగా ఉంటూ వచ్చిన ఇల్లు అయ్యిందే! దీన్ని వదిలిపెట్టి ఆయన వస్తారంటావా? ఒక వేళ ఇల్లు వదిలేసి వస్తే...మళ్ళీ కావాలంటే ఇల్లు దొరకదే!

మన పరిస్థితికి ఇంత తక్కువలో మనకు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? హాస్టల్లోనే చేరిపో! వీలు దొరికినప్పుడు ఇక్కడకొచ్చి మమ్మల్ని చూసెళ్ళు. నువ్వు పంపించే డబ్బును పొదుపుగా ఖర్చుపెట్టి ఇక్కడే ఉంటూ...కుదిరితే నీకు కొంచం చేర్చి పెడతాను

అయితే నేను వెళ్ళొచ్చా?”

వేరే దారి?” -- ఆమె సగం మనసుతో ఒప్పుకుంది. ఆకలి, పేదరికం పట్టుదలను సడలించిందని చెప్పొచ్చు. మరుసటి రోజు మళ్ళీ విజయవాడకు ప్రయాణం చేసింది అర్చనా!

బస్సు దిగిన వెంటనే రోజు డబ్బులిచ్చి సహాయం చేసిన యువకుడ్ని మర్యాదకొసం కలిసి ధన్యవాదాలు చెప్పింది.

ఇందులో ఏముందండి...కూర్చోండి. చల్లగా ఏదైనా తాగి వెళ్ళండి

పరవాలేదు...నేను అర్జెంటుగా వెళ్ళాలి. కుదిరితే తరువాత వస్తాను

ఉద్యోగం దొరికిందా?”

"దొరికినట్లే! అయినా కానీ, సాయంత్రమే ఖచ్చితంగా స్వీటు ఇచ్చి చెప్పగలను. నేను వస్తాను?"

ఆల్ బెస్ట్!

అతనికి థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది. టైము తొమ్మిదే అవుతోంది. మురళీ ఆఫీసుకు వచ్చుంటాడా? తెలియలేదు. వెళ్ళి చూద్దాం. రాకపోయినా, వచ్చేంతవరకు ఉండి చూసి వెళ్దాం

ఆమె మెల్లగా నడిచింది. బిల్డింగులోకి వెళ్తున్నప్పుడు బొద్దింక జ్ఞాపకం...భయమూ వచ్చింది. ఎక్కడైనా బొద్దింక ఉన్నదా అనే భయంతో అటూ ఇటూ చూసుకుంటూ మెట్లు ఎక్కింది. మంచికాలం...ఏదీ లేదు. హమ్మయ్య అని నిట్టూర్పు విడుచుకుంటూనే అతని ఆఫీసులోపలకు వెళ్ళింది.

 మెట్లు ఎక్కి రావటానికి ఇంతసేపా?”

ఆమెను స్వాగతిస్తూనే అడిగిన మురళీని ఆశ్చర్యంతో చూసింది.

నేను వచ్చేది చూసారా?”

బిల్డింగు లోపలకు దూరుతున్నప్పుడే చూసాను. మెట్లు ఎక్కి రావటానికి పదిహేను నిమిషాలా?”

బొద్దింక భయమే?” -- నవ్వింది.

భయపడకూడదు. వీలైతే దానికో గుడి కట్టి పూజ చేయాలి

కళ్ళు పెద్దవి చేసింది.

మరి...? అది మాత్రం రోజు మిమ్మల్ని బెదిరించి ఉండకపోతే, మీరు రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుంటారా?”

అందుకా...? అదేమో నిజమే?” --మళ్ళీ నవ్వింది.

మీరు ఆఫీసుకు వచ్చుంటారా...వచ్చుండరా అనుకుంటూ వచ్చాను

ఎనిమిదన్నరకల్లా వచ్చాసాను?”

ఖచ్చితమైన మనిషి అని చెప్పండి

అదంతా ఏమీలేదు...ఇంట్లో అన్ని సమస్యలు -- సరే...ఏం తిన్నావు నువ్వు?”

ఆకలే లేదు

ఉద్యోగం నీకే. టెన్షన్ పడక్కర్లేదు. పదకుండు గంటలకు అక్కడుంటే చాలు.  కావాలంటే నేనూ వస్తాను. ఏదైనా తిను మొదట -- అతను లేచాడు.

ఆమెకు నిజంగానే ఆకలేసింది. ఒంటరిగా హోటల్ కు వెళ్ళి తినాలంటే భయం.అందుకని అబద్ధం చెప్పింది. ఇప్పుడు అతను తినడానికి పిలవగానే...అకలి ఎక్కువైంది.

దగ్గరున్న హోటల్ కు తీసుకు వెళ్ళాడు. ఇడ్లీ చాలు అన్నది. ఆమెకు ఇడ్లీ, తనకి కాఫీ చెప్పాడు.

హోటల్లో ఉద్యోగం అనేటప్పటికి అమ్మ భయపడింది. తరువాత వివరంగా మాట్లాడి ఓకే అనిపించాను

అది విని నవ్విన అతను...బిల్లుకు డబ్బులిచ్చేసి వెళ్దామా?” అన్నాడు.

హోటల్ చాలా అందంగా, ఫైవ్ స్టార్ రేంజు లో ఉన్నది. ఎందు వల్ల రెండు నక్షత్రాలు తగ్గినాయో తెలియలేదు.

ఆమెను కూర్చోబెట్టి, స్నేహితుడ్ని చూడటానికి వెళ్ళాడు మురళీ.

రారా మురళీ! వచ్చిందా మీ ఫ్రెండు?”

స్నేహితుడు కంప్యూటర్ దగ్గర నుండి లేచాడు. బయట కూర్చోనున్న అర్చనాను చూసాడు.

పరవాలేదు...రిసెప్షన్ లో కూర్చునే పర్సనాలిటీ ఉంది. తెలివితేటలు ఎలా ఉంటాయో?”

నాకు తెలిసినంత వరకు అది కూడా అమ్మాయికి బాగానే ఉంది. అయినా, నాకు మాత్రం ఎన్ని రోజులు పరిచయ మంటావు? ‘జస్ట్ఒకే ఒక రోజు. నేను చెప్పాను కదా! నువ్వు కూడా మాట్లాడి చూడు. .క్యూ ఎంతుందో తెలిసిపోతుంది

ఛఛ...నువ్వు చెబితే సరేరా! ఇదేమన్నా సైంటిస్ట్ పనా? కొంచం మాట్లాడే టెక్నిక్, మర్యాద, ఓర్పు, ఇంటరాక్షన్...ఇవన్నీ ఉంటే ఉద్యోగంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు

అడ్జస్ట్ అయిపోతుంది అనుకుంటా. పాపం...కష్టపడుతున్న కుటుంబం. ఈమె  సంపాదనను ఎదురు చూసే పరిస్థితి

అర్ధమయ్యింది.  రా...వెళ్దాం. అప్పాయింట్ మెంట్ ఇచ్చే పూర్తి అధికారం నాకు ఇచ్చారు. బాధ పడకుండా రా

ఇద్దరూ బయటకు రాగానే...మర్యాద నిమిత్తం అర్చనా లేచి నిలబడింది.

రండి... యాం అభిషేక్’ -- పేరు చెబుతూ సహజమైన దోరణిలో అతను చెయిజాపా...ఆమె సంశయించకుండా తన చేతులనూ జాపి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

పరవాలేదే! అనవసరమైన భయం లేదు...’ -- అతను అతని మనసులో లెక్క వేసుకున్నాడు. అరగంటసేపు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. సమయంలో ఇంగ్లీష్ ప్రతిభ, తెలివితేటలూ, జెనెరల్ నాలెడ్జ్, ఆమె ఇష్టా -- అయిష్టాలు, భవిష్యత్ పథకాలు అన్నిటినీ అర్ధం చేసుకున్నాడు.

భయం పుట్టించే ఇంటర్వ్యూ లాగా కాకుండా, స్నేహమైన మాట్లతోనే -- తెలుసుకోవలసినవి -- తెలియ...ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని తీర్మానించుకున్నాడు. అతను లేచి మళ్ళీ ఆమెతో షేక్ హ్యాండ్ చేశాడు.

ఉండి ఆర్డర్ తీసుకోండి

థ్యాంక్యూ సార్!

నో సార్...గీర్! జస్ట్ కాల్ మి అభిషేక్. నేనూ ఇక్కడ ఒక ఉద్యోగినే. అనవసరమైన మర్యాదలన్నీ వద్దు

అతను పని ఉన్నదని చెప్పి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయాడు. మురళీ సంతోషంగా ఆమెను చూసాడు.

ఇప్పుడు సంతోషమేగా?”

మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు!

తెలియకపోతే నేను చెప్పిస్తాను. అదేమన్నా అంత కష్టమా ఏమిటి...?”

ఎలా?”

సాయంత్రం పీక్ టైములో నెహ్రూ రోడ్డు మధ్యలో నిలబడి ఒకే ఒక నమస్కారం చేస్తే చాలు

ఎవరికి?”

నాకే! నేనే కదా ఉద్యోగం ఇప్పించింది

నేను రెడీ, మీరు రెడీనా? ఏమిటి భయపడిపోతాను అనుకున్నారా?”

అక్కడ ట్రాఫిక్ జాం అవుతుంది. పోలీసులు పబ్లిక్ న్యూసన్స్అని కేసు పెట్టి ఇద్దర్నీ పట్టుకుని లోపల వేస్తారు

కావాలంటే వాళ్ళకీ ఒక నమస్కారం పెడితే పోతుంది!   

ఆమె గలగలమని నవ్వింది. మనసు సంతోషంతో నిండిపోయింది. ఒకసారేమిటి...వందసార్లు కూడా అతని కాళ్ళ మీద పడి అతనికి థ్యాంక్స్ చెప్పటానికి రెడీగా ఉంది.

ఒక గంటలో ఆర్డర్తాయారై వచ్చింది.

మిమ్మల్ని అభిషేక్ గారు పిలిచారమ్మా -- ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు.

నువ్వు వెళ్ళిరా...నేను ఇక్కడే ఉంటాను

ఆమె మాత్రం వెళ్ళింది.

రండి! ఆర్డర్ దొరికిందా...చదివి చూసారా?”

ఇంకా లేదు సార్! ఇప్పుడే ఇచ్చారు

జీతం ఎంత రాసున్నాను. పోను పోనూ మీ తెలివితేటలు చూసి జీతం పెరుగుతుంది. మీకు సంవత్సరానికి ఒక డజన్చీరలు, బ్లౌజులూ...మా ఖర్చులతో ఇస్తాము. లేడీ డ్రస్ డిజైనర్ఉన్నారు. ఆమె దగ్గరకు వెళ్ళి కొలతలు ఇవ్వండి.

మీ రూపు రేఖలను మీరు ఇంకా మాడరన్ చేసుకోవాలి. మన హోటల్ లోనే ఒక పార్లర్ ఉన్నది. మీకు వాళ్ళు ఆలొచనలు ఇస్తారు.  గౌరవమైన మనుషులే ఇక్కడకొచ్చి స్టే చేస్తారు. వాళ్ళ తృప్తే మనకు ముఖ్యం. వాళ్ళు కోపంగా మాట్లాడినా కూడా...మనం నవ్వు మొహంతోనే ఉండాలి. మీరు మీ పనిని సక్రమంగా చేస్తారని నమ్ముతున్నాను. ఎప్పుడు జాయిన్అవుతారు?”

రెండు రోజులు టైమివ్వండి అభిషేక్. ఊరికి వెళ్ళి నా వస్తువులన్నీ తెచ్చుకోవాలి. హాస్టల్ వెతుక్కోవాలి

హాస్టల్  దేనికి?”

నేను ఉండటానికే

ఎందుకు బయట ఉండటం? ఇక్కడే స్టాఫ్ కోర్టర్స్ ఉన్నాయే! అందులో ఒక రూము ఇమ్మంటాను. స్టే చేయండి

థ్యాంక్స్ అండి

మేమే థ్యాంక్స్ చెప్పాలి. మా స్టాఫ్ ఇరవై నాలుగు గంటలూ పిలిచేంత  దూరంలోనే ఉండటం మాకూ హ్యాపీనే కదా?”

అతను ఇంటర్ కాం తీసి ఎవరితోనో మాట్లాడాడు. తరువాత ఆమెను చూసాడు.

మా డిజైనర్ ఫస్ట్ ఫ్లోరులో ఉంటుంది. బ్లౌజ్ ఆది ఇచ్చి వెళ్ళండి. మీరు వచ్చేలోపు చీర, బ్లౌజ్ రెడీగా ఉంటుంది

ఆమె నవ్వుతూ బయటకు వచ్చింది. మురళీ తో చెప్పి ఫస్ట్ ఫ్లోరుకు వెళ్ళి ఆది ఇచ్చొచ్చింది.

తరువాత ఇద్దరూ బయలుదేరారు. మురళీ బస్ స్టేషన్ వరకు వచ్చాడు.

ఉద్యోగం దొరికిందా?” -- బస్ స్టేషన్ యువకుడు అడిగాడు.

దొరికింది! సార్ ఇప్పించారు -- మురళీని అతనికి పరిచయం చేసింది. ఇద్దరూ ఒకరినొకరు స్నేహంగా చూసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.

                                                                                                            Continued....PART-5

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి