16, సెప్టెంబర్ 2022, శుక్రవారం

చిక్కుముడి జీవితాలు...(సీరియల్)...(PART-9)

 

                                                                          చిక్కుముడి జీవితాలు...(సీరియల్)                                                                                                                                                        (LAST PART-9)

నా పేరు మురళీ -- ఆవిడ దగ్గర తనని పరిచయం చేసుకున్నాడు.

ఏమిటి విషయం?”

ఎలా ప్రారంభిద్దాం?’ అని ఆలోచించాడు. ఖరీదైన అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నా, వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్అనేది అర్ధమయ్యింది. పాపం...కొడుకు పైన ఎన్ని కలలు పెట్టుకున్నారో? విషయం గురించి చెబితే షాకౌతారో?’

ఆవిడ అతన్నే కళ్ళార్పకుండా చూసింది.

అది...నా చెల్లెలు బృందా అని పేరు. ఆమె, మీ అబ్బాయ్ విజయ్ ఒకర్నొకరు ఇష్టపడుతున్నారు. విషయంగానే మాట్లాడి వెళ్దామని వచ్చాను

ఆవిడ మోహంలో కొటొచ్చినట్టు కనబడింది షాక్.

లోపలకు వెళ్ళి గదిలో ఉన్న కొడుకును పిలుచుకు వచ్చింది.

ఏం చెబుతున్నారురా ఈయన? ఈయన చెల్లెల్ని నీకు తెలుసా?”

అతని ముఖం భయంతో నల్లబడింది.

చెప్పరా...

అది...తెలుసు. జస్ట్ ఫ్రెండ్స్ !”

ఫ్రెండ్స్ అంటే ఎలాంటి ఫ్రెండ్స్ రా? పెళ్ళి చేసుకోవాలనుకునేంత దగ్గరి ఫ్రెండ్సా?”

అలాగంతా ఏమీ లేదమ్మా...!

అతను భయంతో చెప్పాడా లేక నిజంగానే మోసం చేసే గుణమా?

మురళీ కు అర్ధం కాలేదు!

అలాగంతా లేకపోతే ఎందుకబ్బాయ్ ఆమెతో పక్కను పంచుకున్నావు? టైం పాస్ కోసమా?”

మురళీ ఆవేశంగా అడగగా...ఆవిడ అదిరిపడి కొడుకును చూడ...అతను దొంగ చూపులు చూస్తూ తలవంచుకున్నాడు.

పాపాత్ముడా! నీ బుద్ది ఇలాగా పోవాలి? ఇందుకారా ఇంత కష్టపడి నగలు అమ్మి, ఇల్లు తాకట్టుపెట్టి నిన్ను చదివించింది?”

ఆమేనమ్మా నన్ను రమ్మని చెప్పి...ఏదేదో మాట్లాడి...

షట్ అప్! నా చెల్లెలు అటువంటిది కాదు

మీరూ ఆపండి! నా కొడుకు కూడా అటువంటి వాడు కాదు

.కే! మీరు మంచి వాళ్ళుగానే ఉండండి. ఎవరి మీద తప్పో...మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక బంధుత్వం ఏర్పడిపోయింది. మగవాడికి దాని వల్ల ఎటువంటి నష్టమూ లేదని మీకూ తెలుసు. అమ్మాయలకే అన్ని సమస్యలూ అనేది కూడా మీకు తెలుసు. మీరూ ఒక అమ్మాయే కదా. పెద్దమనసు పెట్టి వీళ్ళదరి పెళ్ళి జరిపించాలి

భగవంతుడా...నేనేం చేయను?” -- ఆవిడ తలమీద చెయ్యి పెట్టుకుని కూర్చుండి పోయింది. తరువాత తలెత్తి మురళీని చూసింది.

సరే...పెళ్ళి చేస్తాను. కానీ ఒక కండిషన్’. వాడ్ని చదివించటానికి ఇంతవరకు ఐదు లక్షలు ఖర్చు అయ్యింది. డబ్బు రెడీ చేయటానికి మేము కుక్క చావు చచ్చాము. ఎందుకు...? వీడికి ఒక మంచి అంతస్తును ఇవ్వటానికే! కష్టం అంతా మాది. కానీ, ప్రేమ అనే పేరుతో వీడ్ని అపహరించుకుపోయి...భార్య అనే అంతస్తుతో అన్నిటినీ అనుభవించబోయేది మీ చెల్లెలు అంటే ఎలాగండి?

ఎంతమంది మగ పిల్లలు పెళ్ళి చేసుకున్న తరువాత తల్లి-తండ్రులను గౌరవిస్తున్నారు? రేపు మీ చెల్లెలు, వీడ్ని వేరు కాపురానికి తీసుకు వెడితే మా గతి? వీడి చదువుకోసం అన్నీ అమ్మి...ఇప్పుడు మా బ్యాంకు బాలన్స్ ఖాలీ అయిపోయి నిలబడున్నాం.

పెళ్ళికి ముందే మీ చెల్లెలు ఇంత తప్పుగా నడుచుకున్నదే...పెళ్ళి తరువాత ఎలా ఉంటుందో ఎలా చెప్పగలం? అయినా కానీ ఆడదాని పాపం నాకొద్దు. వీడ్ని దారాళంగా మీ చెల్లెలికే కట్టబెడతాను. కానీ, మేము ఖర్చుపెట్టిన ఐదు లక్షలు ఎందుకు వదిలిపెట్టాలి? భవిష్యత్తులో డబ్బే కదా మాకు కలో గంజో పోస్తుంది!

అందువలన ఐదులక్షలు కింద పెట్టండి. అల్లుడ్ని కొనుక్కుని వెళ్ళి ఇంటల్లుడ్ని చేసుకోండి. నాకెటువంటి అభ్యంతరమూ లేదు. డబ్బు మీరిచ్చినా సరే...లేక దరిద్రుడు ఇచ్చినా సరే. నాకు కావలసింది ఐదులక్షలు. వరకట్నం కాదు. నా డబ్బు. అది నేను పడ్డ కష్టం! పరువు...మర్యాదా ఉంటే డబ్బు కిందపెట్టి, వీడు ఎటైనా పోవచ్చు. మేము వాడ్ని వదులుకుంటాము. వాడు లేడనుకుంటాము. బిడ్డే పుట్టలేదని అనుకుంటాము

ఆవిడ ఆవేశంగా మాట్లాడి ఆపింది. ఆమె అడిగినదాంట్లో తప్పేమీ లేదు అనిపించింది మురళీకి.  

పాపం...ఎంత కష్టపడుంటే ఇంత విరక్తి ఏర్పడుతుంది? కన్నవాళ్ళ కలలను ఇలాంటి యువకులు ఎంత దారుణంగా చెడిపేస్తున్నారు. తల్లి కన్నీరుకు, ఆవేదనకి ఎవరు కారణం. అబ్బాయి మాత్రమేనా? లేదు బృందా కూడా దీనికి ఒక కారణమే. నిజానికి బృందానే ముఖ్య నేరస్తురాలు. ఖాలిగా ఉన్న ఒక మగాడ్ని ఇంటికి పిలిచి...వాడికి అవకాశమూ, సహకారమూ ఇచ్చి...ఇప్పుడు ఏడుస్తోంది. ఒకవేళ ఏడుపే అబద్దమో! బంధుత్వం ఏర్పరచుకుంటే పెళ్ళి చేసుకోవటం సులభం అని లెక్క వేసుకుందా? ఇప్పుడు ఏం చెయ్యబోతాను?’

పదినెలలు మోసి, కని, వయసు వచ్చేవరకు కష్టపడి పెంచి, తన సుఖాలను తగ్గించుకుని చదివించి, కోత కోసే సమయంలో ఇంకెవరో వచ్చి ఇది నా సొంతం అంటే కన్న మనసు ఎంత కష్టపడుతుంది? విసిగిపోయి అమ్మకం మాట్లాడకుండా ఏం చేస్తుంది? ఇందులో తప్పు ఏముంది? కష్టపడేది ఒకరు...సుఖపడేది ఇంకొకరు అంటే ఏమిటి న్యాయం? కష్టపడ్డ వాళ్లకి, వాళ్ళు పడ్డ కష్టానికి ధర ఇవ్వటమే సరి.

కానీ, అంత ఖరీదు పెట్టి నేను కొనగలనా? ఖచ్చితంగా కుదరదు. ఒక జన్మ అంతా కష్టపడి పనిచేసినా అంత డబ్బు ఆదా చేయటం కఠినం. అలాగైతే తప్పు చేసినది, శిక్ష అనుభవించాల్సిందే. ఏదైనా ఒకరోజు, తల్లే మనసు మారి అయ్యో పాపం...అని జాలిపడితే బృందాకు తెల్లార్తుంది. అలాంటి ఒక జాలి, పెద్ద మనసు ఈమె మనసులో ఏర్పడేటట్టు చేయమని భగవంతుడ్ని వేడుకోవలసిందే!

మురళీ లేచాడు. తల్లిని చూసి చేతులు జోడించి దన్నం పెట్టాడు.

క్షమించండమ్మా! నా చెల్లెలే మొదటి నేరస్తురాలు. మీరు చెప్పిన ఒక్కొక్క మాట న్యాయమే. మీ ఆవేదన నాకు అర్ధమవుతోంది. వేసిన కండిషన్కూడా న్యాయమైనదే. మీ అబ్బాయిని అంత డబ్బు పెట్టి కొనుక్కునే వసతి నాకు లేదు. చట్టం, ధర్మం, న్యాయం అని మాట్లాడి మీ దగ్గర నుండి బలవంతంగా లాక్కుని తీసుకు వెళ్లేంత రాతి మనసు కాదు నాది.

నేరస్తులు శిక్ష అనుభవించి కావలసిందే అనేది విధి అయితే...నా చెల్లెలు అనుభవించనివ్వండి. ఇంకేం చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను వస్తాను -- అతను తిరిగి చూడకుండా నడిచాడు. వాళ్ళూ అతన్ని ఆపలేదు. మనసు మారనూ లేదు. మారుగా, ఒక పెద్ద సమస్య సులభంగా తీరిపోయినట్లు హమ్మయ్యఅని పెద్ద నిట్టూర్పు విడిచారు.

అన్నయ్య మంచివాడు కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టాడు. లేకపోతే కోర్టూ...కేసూఅంటూ మన పరువు కదా పోయుంటుంది?” -- తల్లి కొడుకును చూడలేక ఏడ్చింది!

                                                              ***********************************

ఏం చెప్పారు అన్నయ్యా?”

అతని చదువుకోసం వాళ్ళు ఖర్చుపెట్టిన ఐదు లక్షల డబ్బును కిందపెట్టేసి, అబ్బాయిని కొనుక్కు వెళ్ళమని చెప్పారు. ఎవరి దగ్గరుంది అంత డబ్బు?”

అలాగైతే నా గతి?” -- బృందా ఆందోళనపడింది.

మురళీ ఆమెను కోపంగా చూసాడు.

అతన్ని రమ్మని చెప్పటానికి ముందు దీని గురించి ఆలొచించి ఉండాల్సింది. నేరంలో మొదటి ముద్దాయివి నువ్వేనని అర్ధం చేసుకున్న తరువాత ఎవరి దగ్గరకు వెళ్ళి ఎలా న్యాయం అడగను? వాళ్ళంతా  నవ్వరు?”

తప్పే...ఒప్పుకుంటాను! దాన్నే గుచ్చి గుచ్చి చూపిస్తే ఎలా?”

ఒక పనిచెయ్యి...నీ వల్ల కుదిరితే ఐదు లక్షలు సంపాదించు. వాళ్ళు రెడీగానే ఉన్నారు...అమ్మటానికి! కుదిరితే వెళ్ళి డబ్బులిచ్చి కొనుక్కునిరా. నా వల్ల కుదరదు. జన్మలో కుదరదు

అదివిని కూలబడిపోయిన బృందా...ఏడ్చింది.

ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? నువ్వే నీ తలరాతను కేవలంగా రాసుకున్నావు. కన్నీరు చింది ఏడిస్తే అది చెరిగిపోతుందా? పోనీలే...వాళ్ళు మనసు మారి రావాలని వేడుకుందాం. జరిగిందే తలుచుకుంటూ ఉండక...భవిష్యత్తు గురించి ఆలొచించు. తోడబుట్టిన బాధ్యతకోసం చివరి వరకు వేసుకోవటానికి బట్టలు, తింటానికి తిండి పెట్టగలను. అయినా కానీ, నీ సంతోషం కోసం, స్వయం ఉపాధికోసం ఏదైనా నేర్చుకోవటానికి చదువు. డబ్బు కడతాను. జీవితాన్ని ఉపయోగకరంగా మార్చుకుని జీవించటానికి దారి చూసుకో

మురళీ కు తలనొప్పి ప్రారంభం కావటంతో...లోపలకు వెళ్ళి పడుకున్నాడు. ఇల్లు నిశ్శబ్ధంగా ఉంది. మనసులో ఎంతో ఆవేదన...కలవరం!

                       ***********************************

పచ్చగడ్డి పార్కు ప్రశాంతంగా ఉంది. ఎక్కువగా జనం లేరు. పార్కులో ఆడుకుంటున్న చిన్నపిల్లల అల్లరి శబ్ధం పక్కనున్న శాయిబాబా గుడి నుండి వస్తున్న పాటల శబ్ధం కంటే ఎక్కువగా వినబడింది.

అర్చనా, మురళీని చూసింది. అతను, ఆడుకుంటూ అల్లరి చేస్తున్న పిల్లలనే తధేకంగా చూస్తున్నాడు.

దగ్గర దగ్గర సుమారు ఇరవై రోజుల తరువాత ఇద్దరూ రోజు కలుసుకుంటున్నారు.

ఏమైందబ్బా...ఇంత మౌనం?”

నేను మాట్లాడితే నువ్వు కూడా మౌనం అయిపోతావు! అందుకని నేనే మౌనంగా ఉన్నాను

ఏమిటి విషయం?”

చెప్పాలనే వచ్చాను? కానీ స్టార్టింగ్ ట్రబుల్!అదే సైలెంటుగా ఉన్నాను

ఇంట్లో ఏదైనా సమస్యా?”

మా ఇంట్లో ఎప్పుడూ సమస్యలేగా. తట్టుకోలేకపోతున్నా అర్చనా. నా వ్యక్తిగత సంతోషం, జీవితం అన్నిటినీ, సమస్యలకు బలి ఇవ్వాలన్న నిర్బంధంలో ఉన్నాను.  దాని గురించి మాట్లాడటానికే నిన్ను రమ్మన్నాను

ఏమిటి సమస్య?”

బృందా యొక్క భవిష్యత్తే...ఇంకేముంది?”

ఒక పెద్ద నిట్టూర్పు తరువాత విజయ్ ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. గాఢమైన మౌనం...ఇద్దరినీ చుట్టుకుంది.

నాకు సమస్యలు సముద్రంలోని అలలగా వస్తూనే ఉంటాయి. సముద్రంలో అలలు ఎలా తగ్గవో నాకొచ్చే సమస్యలు కూడా తగ్గవు. సముద్రపు అలలు కాలుని తాకి వెళితే సుఖంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. కానీ, నాకొచ్చే సమస్యలు మనిషినే లాక్కువెళ్ళే అలలు. అలలలో నేను తప్పిపోవటంతో ఆగని. నువ్వూ ఎందుకు? సమస్యలలో నువ్వు కాలు పెట్టద్దు అర్చనా. 

సంతోషాన్ని మనమే రాసుకోవచ్చు...కానీ, అది నిలబడి ఉండటం...కరిగిపోవటం మన చేతుల్లో లేదని అనిపిస్తొంది. అది తెలియక నీకు నమ్మకాన్ని ఇచ్చింది తప్పేమోనని బాధగా ఉంది. వద్దు అర్చనా...మనం కలలను పెంచుకోవద్దు. నిజాన్ని అంగీకరిద్దాం. దీనితో అన్నిటినీ ఆపేసుకుందాం. ఇదే నీకు మంచిది

అతను మాట్లాడటం ముగించి, ఆమె కళ్ళల్లోకి చూడలేక మళ్ళీ ఆడుకుంటున్న పిల్లలవైపే చూడసాగాడు.

ముగించావా...ఇప్పుడు నేను మాట్లాడొచ్చా?”

ఇక మాట్లాడటానికి ఏముంది?” -- అర్చనా వైపు తిరిగి చూడకుండానే మాట్లాడాడు.

ఉందే! నా ఇంట్లోనూ సముద్రం, అలలూ ఉన్నాయే! దాని గురించి మాట్లాడొద్దా? నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు మాట్లాడిందంతా నేను మీతో మాట్లాడాలని అనుకునే వచ్చేను. మీరు మొదట ప్రారంభించారు

అతను ఆశ్చర్యంతో వేనక్కి తిరిగి అర్చనాను చూసాడు. ఆమె పెదాలలో చిన్నటి నవ్వు, ఆవేదనతో చుట్టుకుని కనబడింది.

ఏమైంది అర్చనా?”

అక్కయ్యను నేనే పిలుచుకు రావలసిన నిర్భంధం వచ్చింది

ఏమిటి సమస్య?”

శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి అడ్డుదోవలో వసతులను వెతుక్కోవాలని చూసింది. దేవుడు వసతులను ఇచ్చేడో...లేదో, అతి త్వరలోనే వ్యాధిని ఇచ్చాడు. ఎయిడ్స్ అని తెలిసిన వెంటనే భయంతోనే సగం ప్రాణం పోయింది ఆమెకు. పూర్తిగా కృంగిపోయి నడుస్తున్న శవంలాగా ఉన్నదని ఊరి నుండి తెలిసిన వాళ్ళు ఉత్తరం రాసారు. మనసు ఆగక...వెళ్ళి పిలుచుకు వచ్చాను.

హోటల్లో ఉండటం ఇక మర్యాదగా ఉండదని, ఊరి బయట ఒక ఇల్లు తీసుకుని అమ్మనీ, అక్కని అక్కడ ఉంచి...నేను మాత్రం హోటల్లోనే ఉంటున్నాను. వారానికి ఒకరోజు వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాను. అభిషేక్ చాలా మంచి మనిషి. నా కొస్తున్న కష్టాలను చూసి, జీతం ఇంకా కొంచం పెంచి ఇస్తానని చెప్పారు.

వస్తున్న జీతం కొంచం ప్రశాంతతను ఇస్తున్నా, నన్ను చుట్టి వస్తున్న అలలలో నేనూ అన్నిటినీ వదిలేసుకోవలసిన నిర్భంధంలో ఉన్నాను. మన కలలను ఇంతటితో ఆపేసుకుందామని చెప్పి వెళ్దామని వచ్చాను

మురళీ ఆమెను జాలిగా చూసాడు.

అలాగైతే ఇద్దరం ఒకే పడవలోనే ప్రయాణం చేస్తున్నాం కదా...?”

అది కూడా చిల్లు పడిన పడవ

నా కొకటి అనిపిస్తోంది అర్చనా!

ఏమిటది?”

ఎలాగూ మునిగిపోబోతాం...లేక ఏదైనా వింత జరిగి రక్షణ పడవ వచ్చినా  వస్తుంది. అంతవరకు చిల్లుపడిన పడవలోనే ఉండే కావాలి...అవునా? అందులో నువ్వూ, నేనూ మాత్రమే. నీకు నేను తోడు, నాకు నువ్వు తోడు. మునిగేంతవరకు మనం చేతులు జోడించుకుని ఉందాం! ఎందుకు చేతులను  విడగొట్టుకోవటం?

ఒక పుస్తకంలో చదివిన విషయమే ఇప్పుడు నాకు గుర్తుకు వస్తోంది. దట్టమైన అడవిలో పులి ఒకటి తరుముతుంటే...తప్పించుకుని పారిపోతుంటే అదః పాతాళంలో ఉన్న బావిలో తప్పి పడిపోయిన ఒకడు, అదృష్టవసాత్తు, బావిలోని గోడలో మొలకెత్తిన ఒక చెట్టుకొమ్మలో చిక్కుకున్నాడు. ప్రాణం పోలేదు. కానీ, బావిలోనుండి అతను పైకొస్తాడు...చంపి తినేద్దామని కాచుకోనుంది పులి.

కింద పడిపోతే మింగటానికి రెడిగా ఉన్న పాతాళ బావి నీళ్ళు. బావి గోడ సందులో నుండి తొంగి చూసి బుస కొడుతున్న నాగుపాము వేరే. అతను  వేలాడుతూనే ఉన్నాడు. ఒక పక్క భయం. ఒక పక్క ఆకలి. చుట్టూ ఉన్న ఆపదలు ఒక పక్క. వీటన్నిటికీ మధ్య ఇతను పడిన వేగం వలన చెదిరిపోయిన తేనె గూడు నుండి చుక్కలు చుక్కలుగా కారుతున్న తేనె, ఇతని పెదాల మీద పడుతోంది. తేనెటీగలు అతన్ని కుట్టి వెడుతున్నాయి.

నొప్పి...చుట్టూ ఉన్న ఆపదలు అన్నిటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి, అతను నాలిక చాచి...చుక్కలుగా పడుతున్న తేనెను రుచి చూసాడు. దగ్గర దగ్గర మనమూ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. గాలిలో ప్రాణం ఊగిసలాడుతోంది. పులి అనే పూర్వజన్మ కర్మలు తరుముతుండగా...మరుజన్మ అనే పాతాళ బావిలో పడి ప్రాణమనే కొమ్మన వేలాడుతున్నాము. చుట్టూ మనల్ని మింగేసేంతటి రకరకాల సమస్యలు. సమస్యలవలన చెదిరిపోయిన తేనెగూడు తేనేటీగలు కుడుతున్నాయి. అయినా కానీ మన హృదయాల అంచుల్లోంచి తేనె చుక్కలు పడుతూ ఉన్నాయి. నా హృదయం మీద నీ ప్రేమ చుక్కలు, నీ హృదయం మీద నా ప్రేమ చుక్కలు. మనమూ రుచి చూద్దమే!

సమస్యలు తీరేంత వరకు ప్రేమను రుచిస్తూ బ్రతకటానికి చూద్దాం! పడిపోతే...బావి మింగేస్తుంది. లేకపోతే ఇద్దరం బ్రతికిపోతాం. అంతవరకు మనం జోడించి పట్టుకున్న చేతులు వదులుకో వద్దు అర్చనా. చేరే ఉండనీ! ఏమంటావు?

పెళ్ళి చేసుకుంటేనే కదా...పిల్లా పాపలు ఉంటేనే కదా? అవన్నీ లేకుండా లక్ష్యమూ, దేన్నీ ఎదురు చూడటం  లేకుండా మనం ఒకర్ని ఒకరు ప్రేమించుకుంటూ ఉండటం కుదరదా? ప్రేమ మనకి కొత్త శక్తిని ఇవ్వనీ. ఎందుకు వద్దనాలి...పడుతున్న తేనే బొట్లను రుచిద్దమే...!

ఆమె ఆశ్చర్యంగా చూసింది. అతను చెప్పేది వందకు వంద శాతం కరెక్టు అనిపించింది. ఇన్ని కష్టాలలోనూ ఒక పరుశుద్ధమైన తేనె బోట్లు పడుతున్నాయి. దీనికంటే అదృష్టం ఇంకేం కావాలి? ఎంత వయసైనా అవనీ...సమస్యలు తీరి రోజు దారి ఏర్పడుతుందో రోజే కలిసి జీవిద్దాం! అంతవరకు ప్రేమించుకుంటూనే ఉండటం, ప్రేమ కన్నా ఇంకేది పెద్ద సుఖం ఉంది? ’

అతని చేతులను తీసుకుని తన వెళ్లతో పెనవేసుకుని గట్టిగా పట్టుకుంది. కొంచం దగ్గరగా కూర్చుని, అతని భుజం మీద వాలి పోయింది.

పెద్ద గాలి ఒకటి ఉత్సాహంగా వీసుకుంటూ వచ్చి వాళ్లను ఆశీర్వదించి వెళ్ళింది!

**************************************************సమాప్తం****************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి