4, సెప్టెంబర్ 2022, ఆదివారం

చిక్కుముడి జీవితాలు...(సీరియల్)...(PART-3)

 

                                                                        చిక్కుముడి జీవితాలు...(సీరియల్)                                                                                                                                                                 (PART-3)

తరుణ్ ఏడుపు ఆకాశాన్ని తాకింది. అక్కయ్య వాడ్ని ఎత్తుకుని మురళి దగ్గరకు వచ్చింది.

ఎందుకే వాడ్ని అలా ఏడిపిస్తున్నావు?”

నేనా ఏడిపించాను? చాక్లెట్ కావాలట. ఏం చేద్దాం చెప్పు. నా ప్రాణం తీస్తున్నాడు. నా వల్ల కావటం లేదురా మురళీ. ఏం చెప్పి వాడ్ని సముదాయించేది? ఎందుకురా ఇలాంటి ఒక పరీక్ష?”

పిల్లాడితో పాటూ అక్కయ్య కూడా ఏడ్చింది.

తల్లి ఏడవటం చూసిన తరుణ్ బెదిరిపోయి, తన ఏడుపు ఆపాడు.

ఇటు రా -- మురళీ వాడ్ని పిలిచి తన వొళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.

చాకెట్లన్నీ పాడైపోయాయట. యాక్..! మనకు వద్దు?”

రోజు మాత్రం కొనిచ్చావు...?”

తరుణ్... రోజు చాక్లెట్ తిన్నందువలనే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు! డాక్టర్ ఇంజెక్షన్ కూడా వేసేరా లేదా? ఇంజెక్షన్ వేస్తే నొప్పి పుడుతుంది కదా? అందుకని చాక్లెట్లు వద్దు...ఏం?”

అవును...చాక్లెట్లు వద్దు!

గుడ్ బాయ్! మావయ్య సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వడిగిన గన్తీసుకు వస్తాను. ఇప్పుడు మంచిగా స్కూలుకుబయలుదేరాలి

పెద్ద గన్కావాలి! ఇంత...పెద్దది -- చేతులు పెద్దవిగా విరిచి చూపించాడు.

ఖచ్చితంగా తీసుకు వస్తాను

మురళీ వాడ్ని పంపించి...సేవింగ్ సెట్టు తీసాడు.

కొద్ది సేపట్లోనే తరుణ్ ఏడుపు మళ్ళీ వినిపించింది. అక్కయ్య వాడ్ని కొడుతున్న శబ్ధం వినబడటంతో...రేజర్ను పెట్టేసి బయటకు వచ్చాడు.

ఇప్పుడేమిటి సమస్య?”

ఇడ్లీ లోకి నంచుకోవటానికి చక్కెర కావాలట

చెప్పలేక పోయాడు. చెప్పినా అర్ధం చేసుకునే వయసూ లేదు. ఇదొక పెద్ద సమస్యే! ఎలా మేనేజ్ చెయ్యబోతామో? పిల్లాడి కొసమే మిగిలిన వాళ్ళు కూడా స్వీట్లుతినడం తగ్గించారు. ఇంట్లో కూడా తీపి పదార్ధమూ చేయటం లేదు. అయినా కానీ వాడ్ని సముదాయించే దారి కనబడలేదు.

ఇదిగో చూడు తరుణ్...డాక్టర్ నీ దగ్గర ఏం చెప్పాడు? ఇకమీదట స్వీటుఅదీ తినకూడదని చెప్పారా లేదా? నువ్వు పట్టుదల పడితే నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళి వదిలి పెట్టేస్తాను

స్కూల్లో పిల్లలందరూ తింటున్నారు. నేను మాత్రం ఎందుకు తినకూడదు?”

తరుణ్ యొక్క ఒంటికి స్వీటు పడదట. అందుకే

ఎందుకు నా ఒంటికి మాత్రం...?”   

తెలియదురా నాన్నా. దేవుడి దగ్గరే అడగాలి...పిల్లాడికి ఎందుకు ఇంత కష్టం ఇస్తున్నావు అని?’ నువ్వు పెరుగు నంచుకుని తింటావుట. నీకు గన్కావాలా...వద్దా?”

కావాలి!

అప్పుడు పెరుగు నంచుకు తిను

తుపాకీ కోసం...పిల్లాడు పెరుగు నంచుకుని తిన్నాడు. మురళీ మిగిలిన షేవింగ్ను ముగించుకుని స్నానాకి వెళ్ళాడు.

తినేటప్పుడు తల్లి అడిగింది.

సభాపతి మూడుసార్లు వచ్చాడు. వాళ్ళను ఎప్పుడు రమ్మని చెప్పచ్చు అని అడిగాడు. మనం ఏదైనా సమాధానం చెప్పాలిగా?”

మురళీ ఆలొచించాడు.

మన తాహతు ఏమిటో సభాపతి దగ్గర చెప్పావా?”

చెప్పకుండా ఉంటానా...? బృందాని వాళ్ళు ఒకటి, రెండు సార్లు చూసారట. చేయగలిగేదే చేయని. మాకు అమ్మాయి బాగా నచ్చిందిఅని చెప్పి పంపారు. కాలంలో డిమాండ్చేయకుండా...పిల్లనిస్తే చాలుఅని ఎవరు చెబుతున్నారు? అప్పో, గిప్పో చేసి సంబంధం ఖాయం చేసుకుంటే మనకి భారం తగ్గిపోతుందిరా...ఏమంటావు?”

ఎలా చూసినా కొంతడబ్బు అవసరం కదా? దానికి నేనేం చేయగలను? ఎక్కడ అడగగలను?”

డబ్బులు లేవని పెళ్ళి చేయకుండా ఇంట్లోనే ఉంచుకోగలమా? ఏదైనా చేసే కావాలి. ఏదో నావల్ల అయ్యింది...కడుపు మాడ్చుకుని, నోరు మాడ్చుకుని, నాలుగు కాసులు బంగారం కొనుంచాను. ఇంకో రెడు, మూడు కాసులకు నగలు కొని వేద్దాం. అది పనిచేసే షాపులోనే తక్కువ ధరకు చీరలు కొందాం. అది కూడా ఏదో కొంచం డబ్బు సేవ్ చేసుంచింది. ఎలాగైనా సంబంధం ఓకే చేసుకుని పెళ్ళి చేసేద్దాం. వదులుకుంటే ఇలాంటి సంబంధం మళ్ళీ దొరుకుతుందో, లేదో? ఇల్లు వెతుక్కుంటూ వచ్చి ఇంటి తలుపులు తడుతున్నప్పుడు వదిలేస్తే...మూర్ఖులు అని చెబుతారు

చూద్దాం...నాకు రెండు రోజులు టైము ఇవ్వు. ఆఫీసులో ఏదైనా లోను వేయగలనా అని చూస్తాను. ఎలా చూసినా ఆఫీసులో యాభై వేల కంటే ఎక్కువ రాదు. ఇంతకు ముందే అక్కయ్య పెళ్ళికి తీసుకున్న లోన్ డబ్బులే పూర్తిగా కట్టలేదు. తరువాత బృందా? అప్పుచేయటం దీనితో ఆగిపోతుందా? దీని తరువాత... శాంతీ వేరే ఉంది?”

నిన్ను పిండి పిప్పి చేస్తున్నాను...కదరా మురళీ? మారి మారి ఏదో ఒక ఖర్చు పెట్టిస్తునే ఉన్నాను కదా? నన్నేం చేయమంటావురా? మనిషిని నమ్మి వరుసగా కన్నది తప్పే! అంత బాధ్యతలేని మనిషిగా ఉంటాడని అనుకోలేదురా...

మురళీ మౌనం వహించాడు. ఏం మాట్లాడాలి? అమ్మను తిట్టగలనా? కుటుంబంలో మొదటి వాడిగా పుట్టి బాధ్యతలు మోయాలని నా నుదట రాసుంటే -- అది ఎవరి వలన మార్చటం కుదురుతుంది?’

మురళీ ఆఫీసుకు వచ్చిన వెంటనే, మొదటి పనిగా అకౌంట్ సెక్షన్ కు వెళ్ళి అప్పు గురించి మాట్లాడాడు. అకౌంటంట్ ఏదేదో లెక్కలు వేసి, అదీ ఇదీ  చెప్పి...ఎలాగైనా నలభై వేలుసాంక్షన్ చెయొచ్చు అన్నాడు. దొరికినంత చాలు!’ అనుకుంటూ లోన్ ఫారం తీసుకుని పూర్తి చేసి ఇచ్చాడు.

రోజు సాయంత్రమే పెళ్ళి కొడుకు ఇంటికి తల్లితో కలిసి వెళ్ళి మాట్లాడాడు. గొప్ప ఆస్తి పరులు అని చెప్పలేకపోయినా, వీళ్ళ కంటే వసతి గల వాళ్ళు అనేది అర్ధమయ్యింది. సొంత ఇల్లు, స్కూటర్ ఉంది. అబ్బాయికి ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగం. ట్రాన్స్ ఫర్ కు ట్రై చేస్తున్నారట. సీనియారిటీ ప్రకారం ఒక సంవత్సరంలో దొరుకుతుందట.

మా శక్తి ఏమిటో చెప్పేస్తాం -- అమ్మ ప్రారంభించింది. మీ దగ్గర చెప్పటానికి ఏముంది. నా భర్త పేరుకు మాత్రమే ఇంట్లో ఉన్నారు. అది తప్ప, అన్ని బాధ్యతలూ వీడి తల మీదే. అప్పు చేసే మేము అన్నీ చేయాలి

మధ్యవర్తి సభాపతి అన్ని విషయాలూ చెప్పాడండి. మేమూ కష్టపడ్డ వాళ్ళమే.  అవతలి వారి కష్టాలు మాకూ తెలుసు. మీ వల్ల అయ్యింది చెయ్యండి. గుడిలో పెళ్ళి చేసినా కూడా పరవాలేదు. మా బంధువులందరినీ కలిపితే యాభై మంది ఉంటే ఎక్కువ. ఆఫీసువాళ్ళకు ఒక పూట విందు భోజనం మేమే ఏర్పాటు చూసుకుంటాం. పెళ్ళి ఖర్చులో సగం మేము పెట్టుకుంటాం. మాకు అమ్మయే ముఖ్యం...ఆడంబరం కాదు

పెళ్ళి కొడుకు తల్లి చెప్పగా... మురళీ తల్లి మొహం వికసించింది. మురళీని చూసింది.

అప్పుడైతే ఎప్పుడు పెళ్ళి చూపులకు వస్తారు?”

అమ్మాయిని నేను చూసాను. అది చాలు...తాంబూలాలకు ఏర్పాటుచేయండి

అయినా అబ్బాయి, అమ్మాయిని చూడద్దా?”

నేను చెబితే చాలండి వాడికి! ఏరా...చూడాలా?”

ఎందుకు...? నువ్వు చెబితే చాలమ్మా అబ్బాయి చెప్పగా... మురళీ ఆశ్చర్యపొయాడు. కాలంలో ఇలాంటి ఒక కొడుకా?’

అయితే మేము బయలుదేరతాం. పంతులు గారి దగ్గర అడిగి, మంచి రోజు చూసొచ్చి చెబుతాం

మురళీ లేచి చేతులు జోడించాడు. సంతోషంగా ఇంటికి వచ్చారు.

నాకిప్పుడు పెళ్ళి వద్దు -- బృందా పెద్ద బాంబు విసిరేసింది.

ఏమిటే చెబుతున్నావు?” -- అంటూ కూతుర్ని కొట్టటానికి చేయి ఎత్తిన తల్లిని మురళీ ఆపాడు.

ఎందుకు వద్దంటున్నావు బృందా?”

నాకు నచ్చలేదు

అదే ఎందుకు?”

బృందా మౌనంగా తల వంచుకుంది. మురళీ ఆమెను లోతుగా చూసాడు. దగ్గరకు వచ్చి వేలితో ఆమె మొహాన్ని పైకెత్తాడు. 

ప్రేమా-గీమా అని ఏదైనా అసహ్యం ఉందా?”

బృందా ఆశ్చర్యంతో అతన్ని చూసింది. లేదుఅని జవాబు చెప్పలేకపోవటం నుండి -- ఏదో ఉన్నది అనేది అర్ధమయ్యింది... మురళీ మళ్ళీ గుచ్చి గుచ్చి అదే ప్రశ్న అడిగాడు. చివరిలో ఒక విధంగా ఒప్పుకుంది. అతని ఊహ కరెక్టేనని నిరూపించింది. 

తల్లి నెత్తీ నోరూ బాదుకుంటూ ఏడ్చంది. తలమీద రాయి పడేశావు కదవే పాపిస్టిదానా అంటూ ఆమెను ఊపింది.

బృందా మొండిగా నిలబడటంతో ఆమె దేనికైనా తయారుగా ఉన్నదని అర్ధమయ్యింది మురళీకి.  

ఎవరతను...ఏం చేస్తున్నాడు?”

బి.ఆర్క్. చదువుతున్నాడు. చివారి సంవత్సరం

డబ్బు గల వాడా?”

అలా చెప్పలేము. కానీ, మనకంటే వసతిగల వారే

ఓక్కడే కొడుకా?”

ఒక చెల్లెలు ఉంది

అతను నిన్ను పెళ్ళి చేసుకుంటాడా?”

ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాడు

వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకుంటారా?”

అదంతా ఆయన చూసుకుంటారు

ఒక వేళ ఒప్పుకోకపోతే అతనేం చేస్తాడు?”

ఆమె సమాధానం చెప్పలేదు.

వాళ్ళు కట్నకానుకులు ఎక్కువగా అడిగితే...ఏం చేస్తావు? నేను చెయ్యలేను?”

ఆయన అలాంటివారు కాదు...

అతని చదువు పూర్తి అవకుండానే పెళ్ళి చేసుకుంటే...ఏం చేస్తారు?”

ఎవరిప్పుడు పెళ్ళికి తొందరపడుతున్నారు? చదువు ముగించి...ఆయనకు ఉద్యోగమూ దొరికిన తరువాతే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం

అతన్ని నమ్మి, ఇతన్ని వద్దంటున్నావు...చివరికి నీకు ఎవరూ లేకుండా పోతారు -- తల్లి అడ్డుపడి మాట్లాడింది.

మురళీ, తల్లిని కోపంగా చూసాడు.

మంచి మాటలే మాట్లాడమ్మా ఎప్పుడూ

ఇప్పుడు పెళ్ళి వారికి ఏం సమాధానం చెప్పబోతావురా?”

నిజం చెప్పాల్సిందే!

చాలా బాగుందిరా! ఇది బుద్దిలేక మాత్లాడుతోందని అనుకుంటే...నువ్వు కూడా దానికి తోడుగా డప్పు వాయిస్తున్నావే? అమ్మా తల్లీ, చదువుకున్న వాడు అంటున్నావు....రేపు మనకంటే డబ్బుగల అమ్మాయి దొరికితే...నిన్ను దుమ్ములాగా దులుపుకుంటాడు. అందువలన ప్రేమా--గీమా వదిలేసి, మేము చూసిన అబ్బాయిని పెళ్ళి చేసుకుని ఆనందంగా జీవితం గడపమని చెబుతావా?”

అమ్మ చెప్పింది విన్నావా బృందా? నీ మంచికే చెబుతున్నారు

నా వల్ల ఆయన్ని మరిచిపోవటం కుదరుదు అన్నయ్యా

మేము కుదరదు అంటే ఏం చేస్తావు?”

లేచి పోతా!

పాపిస్టి దానా!

చూసావా అమ్మా...మనం మంచి చెబితే ఇదే జరుగుతుంది. అందుకే పెళ్ళివారికి నిజం చెప్పేద్దాం. మనం ఏం చేయగలం? ఒకవేళ ఇది ప్రేమిస్తున్న వాడు మంచి అబ్బాయిగా ఉండి, దీన్ని బాగా చూసుకుంటూ, దాంపత్యం  చేస్తే?”

నాకెందుకో...ఇది సరి రాదు అనిపిస్తోంది

నేను వెళ్ళి పెళ్ళివారి దగ్గర నిజం చెప్పేసి వస్తాను. పాపం...మనం వస్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు

అమ్మ ఏమీ మాట్లాడలేదు. ఎలాగైనా చావండి...అనేలాగా లేచి వెళ్ళిపోయింది.

మురళీ ఆఫీసుకు  వచ్చాడు. అబ్బాయి వాళ్ళింటో ఏం చెప్పి వాళ్ళను సమాధానపరచాలిఅని ఆలొచించాడు.

ఇదిగో మురళీ...నీకేదో ఉత్తరం వచ్చింది. రెండు రోజులుగా లెటర్ బాక్స్ లోనే ఉంది -- స్టాఫ్ ఒకాయన తీసుకు వచ్చి ఇచ్చాడు మురళీ ఆశ్చర్యంతో దాన్ని తీసుకుని చూసాడు.

అరే. అర్చనా!

ఆమె రాసిన ఉత్తరాన్ని విప్పాడు. ఎవరో ఒక యువకుడు వలన డబ్బు దొరికి జాగ్రత్తగా ఊరు వచ్చి చేరిందనే విషయం చదివి కొంచం ప్రశాంతతను పొందాడు. ఆమె తప్పుగా అర్ధం చేసుకోవటానికి చోటులేనంతగా విషయం ముగిసిందని తెలుసుకుని ఆనందపడ్డాడు.

ఆమెకు ఒక మంచి ఉద్యోగం ఉంటే, ఆమెకు కబురు పంపించాలిఅని కూడా అనుకున్నాడు. తన ఆఫీసుకు వచ్చే క్లయింట్ కంపెనీలకు చెందిన వారి దగ్గర అన్నీ చెప్పుంచాడు.

రోజు సాయంత్రం మధ్యవర్తి సభాపతి చెప్పిన వరుడి ఇంటికి వెళ్ళాడు.

రండి...మీకొసమే ఎదురు చూస్తున్నాను -- ఆవిడ స్వాగతించగా...ధర్మ సంకటంతో లోపలకు వెళ్ళి కూర్చున్నాడు.

చెప్పండి...తాంబూలాలకు డేట్ ఫిక్స్ చేసారా?”

అది... సంశయించిన అతను, ధైర్యం తెచ్చుకుని చెప్పేసాడు. అది విన్న ఆవిడ మొహం అదొలా మారిపోయింది.

క్షమించడమ్మా. నిజాన్ని దాచి పెట్టి పెళ్ళి ఏర్పాట్లు చేసిన తరువాత నా చెల్లెలు ఏదైనా చెయ్యకూడని పని చేస్తే...రెండు కుటుంబాలకూ అవమానం ఏర్పడుతుంది. కట్న కానుకలు ఏమీ వద్దని చెబుతున్న మంచి కుటుంబాన్ని, మంచి మనసులను అవమాన పరచటానికి ఎలాగండి మనసు వస్తుంది? అందుకనే నిజం చెప్పి వెళ్దామని వచ్చాను. మీ మంచి మనసుకు...వేరే మంచి అమ్మాయి దొరుకుతుంది. నేను వెళ్ళొస్తాను లేచాడు.

ఒక్క నిమిషం కూర్చో బాబూ -- అని చెప్పి లోపలకు వెళ్ళిన ఆమె...పదే నిమిషాలలో తిరిగి వచ్చింది. మీ మరో చెల్లెల్ని పెళ్ళి చేసుకోవటానికి మీకు సమస్య ఉండదు కదా?”

మురళీ ఆశ్చర్యపోయాడు!

అది చదువుకుంటున్న అమ్మాయండి...దానికేం తెలుసు?”

ఆమె నవ్వింది. ఏం తెలుసు అని మాత్రం అనకండి! రోజు అమ్మాయలకు ఏం తెలియదు? అన్నీ తెలుసు. మరీ అంత చిన్న పిల్లా...పద్దెనిమిదేళ్ళు అయినై కదా?”

పందొమ్మిది ముగియబోతుంది

ఇంకేం? కాలంలో పద్నాలుగేళ్ళకే పిల్లల్ని కన్నారు! అదేమిటో బాబూ. నిజం చెప్పటం వలనే మీ కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని అనిపించింది. పెద్దది లేకపోతే ఏం...చిన్నది. చదువుకుంటుంటే ఏం? పెళ్ళి చేసుకుని చదువుకోమని చెబుదాం. మేమే చదివిస్తాం

నేను అమ్మ దగ్గర, చెల్లి దగ్గర మాట్లాడి చెబుతానండి

దారాళంగా...!

సంకటంతో వచ్చినవాడు సంతోషంగా బయలుదేరాడు. ఒకదానికి...ప్రేమ పెళ్ళి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ కట్నకానుకలు అడిగి పీక్కు తినదు. ఇంకొక దానికి మంచి సంబంధం దొరకబోతోంది. కాబట్టీ, ఎక్కువ అప్పు చేయకుండా ఇద్దరికీ పెళ్ళి చేసేయచ్చు... తరువాత అతని విషయమే.

అతనూ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. మంచి అమ్మాయి అని అనుకున్న వెంటనే అతనికి జ్ఞాపకం వచ్చింది... అర్చనా మొహమే! ఒక్క క్షణం ఆశ్చర్యపడ్డాడు. వెర్రిగా నవ్వుకున్నాడు.

                                                                                                  Continued....PART-4

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి