12, సెప్టెంబర్ 2022, సోమవారం

మొట్ట మొదటి క్వారంటైన్ క్వార్టర్స్....(ఆసక్తి)

 

                                                                  మొట్ట మొదటి క్వారంటైన్ క్వార్టర్స్                                                                                                                                                (ఆసక్తి) 

వైరస్ అంటువ్యాధి వ్యాపించినప్పుడు సామాజిక దూరం మరియు క్వారంటైన్ అనేవి కొత్త అంశాలు కాదు...మధ్య యుగాలలో, యూరప్ మరియు ఆసియా ఖండాలు ప్లేగు మరియు స్మాల్ పాక్స్ యొక్క ఘోరమైన  అంటువ్యాధి వ్యాప్తితో నాశనమైనప్పుడు, వైద్యులకు వైరస్లు మరియు బ్యాక్టీరియా గురించి తెలియదు. కానీ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వ్యాధి సోకిన వారిని వేరుచేయడానికి వారికి తగినంత తెలుసు.

మొట్ట మొదట  క్వారంటైన్ ను ప్రవేశపెట్టినది, దానికోసం మొట్టమొదటి అధికారిక ఉత్తర్వు జారీచేసింది రిపబ్లిక్ ఆఫ్ రాగుసా. అదే ఇప్పుడు దక్షిణ క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్ నగరం. రిపబ్లిక్ ఆఫ్ రాగుసా దేశంలోని అడ్రియాటిక్ తీరంలో ఒక చురుకైన ఓడరేవు ఉంది. ఓడరేవు ద్వారా ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు మరియు వస్తువులు దేశంలోకి వస్తాయి.  14 శతాబ్దంలో మధ్యధరా మరియు బాల్కన్ దేశాలలో ప్లేగు వ్యాది సంభవించినప్పుడు, గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ రాగుసా ఒక చట్టాన్ని ఆమోదించింది, దీని ప్రకారం ప్లేగు సోకిన ప్రాంతాల నుండి వచ్చే అందరూ వ్యాపారులు, నావికులు మరియు వస్తువులు క్వారంటైన్ లో ఒక నెల గడపవలసి ఉంటుంది. వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని రుజువైతేనే, క్వారంటైన్ కాలం ముగిసిన తరువాత, వాళ్ళను నగరంలోకి అనుమతించారు.  

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మొట్ట మొదటి క్వారంటైన్ క్వార్టర్స్....(ఆసక్తి)  @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి