చిక్కుముడి జీవితాలు...(సీరియల్) (PART-6)
జీతం డబ్బుతో
అర్చనా ఊరికి
వెళ్ళినప్పుడు, ఇంట్లో
అక్కయ్య లేదు.
సినిమాకు వెళ్ళినట్టు
తల్లి చెప్పింది.
ఆమె లేకపోవటంతో
తల్లితో హాయిగా
మాట్లాడ గలిగింది.
తన ప్లాను
గురించి చెప్పింది.
“ఏ
కారణం చేతా
అక్కయ్యకు భయపడక్కర్లేదు” అని ధైర్యం
చెప్పింది.
“ఎవరితో
సినిమాకు వెళ్ళింది?” అని
అడిగింది.
“ఒంటరిగానే!
వారం ఒక
సినిమా చూడకపోతే
దాని బుర్ర
పగిలిపోతుంది. అదీనూ
ఎలా వెళుతోంది
అనుకుంటున్నావ్...మెరిసిపోయే
చీర కట్టుకుని, దానికి
మ్యాచింగుగా గాజులూ, జిమికీలూ, తల
నిండా పూవులు, కంటికి
కాటుక, పెదవులకు
రంగు వేసుకుని
సినిమా చూడటానికి
వెళుతోందా, నటించటానికి
వెళుతోందా అనేది
తెలియదు. మొత్తానికి
దాని ప్రవర్తన
-- మాటలూ -- అలంకరణ
నాకు నచ్చలేదు
అర్చనా. ‘నా
కడుపులోనే పుట్టిందా’ అని
అనుమానంగా ఉంది.
చుట్టూ ఉన్న
వారు గౌరవించేటట్టు
నడుచుకోకపోయినా
పరవాలేదు, ఇంకా
హీనంగా చూసేటట్టు
నడుచుకోకుండా ఉంటే
చాలు అనిపిస్తోంది.
అంతే కాదు...డబ్బు
ఎక్కడ్నుంచి వస్తోందో
తెలియటం లేదు.
అనుకుంటే చీర
కొంటుంది. గాజులు, పూసల
గొలుసు, బొట్టు
బిళ్ళలు, గోళ్ళ
రంగు అంటూ
ఏదో ఒకటి
కొంటూనే ఉంటుంది.
దాని సింగారం, కులుకులు, మెరుపులు
చూడటానికే అసహ్యం
పుట్టిస్తున్నాయి.
నలుగురూ దీన్ని
చూసుకుంటూ వెళ్ళే
తీరు చూస్తే
మనకి అవమానంగా
ఉంది”
రాత్రి పదింటికి
ఇంటికి వచ్చిన
అక్కయ్యను చూసినప్పుడు...తల్లి
చెప్పినదంతా కరెక్టే
అనిపించింది. అక్కయ్య
అవతారం, అలంకారం
వికారం తెప్పించింది.
తండ్రి మంచంలో...తల్లి
భయస్తురాలు. ఏమిటని
అడిగే మన్యుషులే
లేరు. అక్కయ్యలాంటి
స్త్రీ, మనసు
వెళ్లే దారిలోనే
నడవటాన్ని ఎవరాపగలరు?
“నువ్వు
ఎప్పుడు వచ్చావు?” -- అక్కయ్య
చీర మార్చుకుంటూ
అడిగింది.
“ఏమక్కా...సినిమాకు
వెళ్ళాలంటే మాట్నీ
షోకు వెళ్ళ
కూడదా? ఇలా
ఒక్క దానివే
చీకటిలో వస్తున్నావే?”
“నువ్వు
ఒక్కదానివే ఉరు
వదిలి ఉరు
వెళ్ళేవే! నేను
మన ఊళ్ళోనే
కదా తిరుగుతున్నాను.
ఏమీ అవదు”
“ఇంకా
ఎన్ని రోజులు
ఇలాగే ఉంటావు? నీకని
ఒక ఉద్యోగం
వెతుక్కోవచ్చు
కదా?”
“ఓహో...సంపాదిస్తున్నావని
పొగరా? నేను
పనిచేయటం లేదని
ఎవరే చెప్పారు? చూస్తావా...నా
దగ్గరా డబ్బుంది?”
అక్కయ్య జాకెట్టులో
చెయ్యిపెట్టి డబ్బును
తీసి విసిరేసింది.
పది, పదిహేను
ఐదువందల రూపాయి
నోట్లు.
‘ఒకే
రోజులో ఇంత
డబ్బా? లేక
ఒక నెల
ఆదాయమా? ఏం
ఉద్యోగం చేస్తోంది
ఇది’ -- అర్చనా, కన్
ఫ్యూజన్ తో
ఆమెనూ, డబ్బునూ
మార్చి మార్చి
చూసింది.
“ఎక్కడ
పనిచేస్తున్నావు
అక్కా? ఏం
పని, జీతం
ఎంత?”
“దాని
గురించి నీకెందుకు? నీ
దగ్గర చెప్పాలని
రూలా? కొంచంగా
డబ్బు పంపి, వెయ్యి
ప్రశ్నలు అడుగుతారన్నమాట!
నీ పని
చూసుకుని వెళ్ళవే?”
“నువ్వు
బాగుంటే మాకూ
సంతోషమే. నీ
డబ్బు మాకు
అక్కర్లేదు. ఏ
ఉద్యోగమని నా
దగ్గర చెప్పక్కర్లా.
అమ్మ దగ్గర
చెపొచ్చు కదా? ఏదైనా
అర్జెంటు పనుంటే
నువ్వెక్కడున్నావో
ఆమెకు తెలియక్కర్లేదా?”
అక్క సమాధానం
చెప్పలేదు.
చెప్పటానికి ఇష్టం
లేదా? చెప్పటం
కుదరటం లేదా...? తెలియలేదు!
నువ్వు తిన్నావా
అని ఒక్క
మాటకూడా చెల్లెల్ని
అడగ కుండానే...తానే
పెట్టుకు తిని, తిన్న
వెంటనే పడుకుండిపోయింది.
మరుసటి రోజు...ఇంటికి
కావలసిన ప్రొవిజన్
సరకులు కొనటానికి
బజారు వీధికి
అమ్మతో పాటూ
బయలుదేరినప్పుడు, అక్కయ్య
కూడా అలంకారం
చేసుకుని బయలుదేరింది.
“ఎక్కడికి
అక్కా?”
అక్కయ్య కోపంగా
చూసి “ఉద్యోగానికి” అన్నది.
అంతకు మించి
ఏమీ మాట్లాడకుండా
దిగి వెళ్ళిపోయింది.
తండ్రిని ఒంటరిగా
వదిలిపెట్టి వెళ్ళటం
ఇష్టం లేక...తల్లిని
ఇంటి దగ్గరే
ఉండమని చెప్పి, తాను
మాత్రం బయలుదేరి
బజారు వీధికి
వచ్చింది. ప్రొవిజన్
సరకుల లిస్టును
షాపులో ఇచ్చేసి
కొంచం పక్కగా
నిలబడింది. పక్కన
ఉన్న షాపులో
ఇద్దరు మగవాళ్ళు
అర్చనానే చూస్తూ
‘గుసగుస’ మని
ఏదో మాట్లాడుకున్నారు... అర్చనాకు ఒళ్ళు
కొంచంగా వణికింది.
వాళ్ళ చూపులూ, నవ్వులూ
చాలా వెకలిగా
ఉన్నాయి.
కొంచం సేపటి
తరువాత వాళ్ళల్లో
ఒకడు...
అర్చనా దగ్గరకు
వచ్చాడు. ఆమెను
కిందా, పైకి
చూసి నవ్వాడు.
“నీ
రేటు ఎంత
పిల్లా?” గుసగుసగా
అడిగాడు. అదిరిపడింది అర్చనా.
ఒళ్ళంతా చెమట
పట్టింది...భయపడిపోయి
వేగంగా జరిగి
షాపు ఓనర్
దగ్గరకు వచ్చి
“సరకులు
కట్టేసారా?” అని
అడిగింది.
“అడ్రస్సు
రాసిచ్చి, నువ్వు
వెళ్ళమ్మా...ఇంటికి
పంపిస్తాను” అని చెప్పి
ఒక కాగితం
ముక్క, పెన్ను
ఇచ్చాడు.
ఆమె ఆ
పేపర్ ముక్కపై
అడ్రస్సు రాసి
ఓనర్కు ఇచ్చేసి
“డబ్బులు
ఇచ్చేయనా?” అన్నది...పర్స్
తెరుస్తూ. అడ్రస్సు
చదివిన షాపు
ఓనరు అర్చనాను
ఒకసారి కిందకూ, పైకీ
చూసాడు.
“ఆ
అమ్మాయికి నువ్వు
ఏమవుతావు?”
“ఏ
అమ్మాయికి?”
“ఈ
ఇంట్లోనే ఒక
అమ్మాయి...చెడు
కార్యాలు చేస్తూ
ఉన్నది తెలుసా? ఒక
రోజు రేటు
ఐదు వందల
నుండి వెయ్యి
రూపాయల వరకు.
‘సెల్’ ఫోన్
పెట్టుకుని వ్యాపారం
చేస్తోందట. ఊర్లో
ఉన్న వాళ్ళందరికీ
ఈ అడ్రెస్సు, ఆమె
ఫోన్ నెంబరూ
తెలియకుండా ఉండదే!”
షాపతను ఒకలాగా
నవ్వగా...నెత్తి
మీద ఎవరో
యాసిడ్ పోసినట్లు
అయ్యింది. ఏడుపు
పొంగుకుంటూ రాగా...అంతకు
మించి అక్కడ
నిలబడి ఉండటం
కుదరక ఇంటికి
పరిగెత్తుకు వచ్చింది...తల్లి
భుజాలపై మొహం
దాచుకుని గట్టిగా
ఏడ్చింది.
“ఏమిటే...ఏమయ్యింది? డబ్బులు
పోగొట్టుకున్నావా?”
“అన్నీ
పోగొట్టుకున్నానమ్మా!”
“ఏమిటే
చెబుతున్నావు?”
బజారులో జరిగిందంతా
చెప్పింది. తల్లి
తూలుతూ నేల
మీద కూర్చుండి
పోయి, తల
మీద చేతులు
పెట్టుకున్నది.
“దాని
దగ్గర డబ్బులు
చూసినప్పుడే నా
లోలోనా చెప్పలేని
భయం ఏర్పడింది
అర్చనా.
పాపాత్మురాలు...ఇలాంటి
నీచ కార్యం
చేస్తుందా? ఇలా
ఉంటుందని తెలిసుంటే...చిన్న
వయసులోనే చంపుండేదాన్ని!
భగవంతుడా...ఇక
ఎలా ఈ
ఊర్లో తలెత్తుకు
నడిచేది?”
“వద్దమ్మా...
ఇంకా మనం
ఇక్కడుంటే మంచిది
కాదు. మీరూ
నాతో పాటూ
వచ్చేయండి. వెళ్ళిన
వెంటనే నేనొక
ఇల్లు చూసేస్తాను.
గుడిసలో ఉన్నా
పరవాలేదు. మనం
గౌరవంగా ఉందాం.
ఇది ‘గుడి
ఇల్లు’, అద్దె
తక్కువ అని
అల్ప ఆశ
పడితే...పరువు-మర్యాద
అంతా పోతుంది”
తల్లి బొమ్మలాగా
అయిపోయింది ‘నువ్వు
ఏది చేసినా
సరే!’ అన్నట్టు
మౌనంగా ఉన్నది.
ఒంట్లోని శక్తి
అంతా కరిగిపోయినట్లు
నీరసించి పోయింది.
‘ఏ
తల్లికీ ఇలాంటి
ఒక అవమానం
ఏర్పడకూడదు. గర్భం
దాల్చినప్పుడు
గర్వ పడిన
మాతృత్వానికి చావుదెబ్బ!’
‘లేచిపోయి
చెడిపోవటం జరిగిపోయింది.
ఇక చెడిపోవటానికి
బాకీ ఏమీలేదు
కాబట్టి భయపడటం
మానేసి...దాన్నే
వ్యాపారంగా చేసుకుందా? ‘డబ్బే
అంతా!’ అనే
తీర్మానమే దీనికి
కారణమా? లేక
విధ విధమైన
మగ స్పర్షలకు
ఆమె శరీరం
వెతుకుతోందా?’
‘పోతే
పోనీ! ఆమెను
తలుచుకుని ఇక
బాధ పడటానికి
అర్ధం లేదు.
శరీరంలోని ఒక
భాగమే అయినా, క్యాన్సర్
గడ్డను కత్తిరించి
విసిరి పారేయటం
లేదా? అదేలాగా
అక్కయ్య యొక్క
బంధుత్వాన్ని వదిలేయటమే
సరి! బ్రతకటం
అలవాటు చేసుకున్న
దానికి ఇప్పుడు
వెయ్యిమంది తోడు
దొరికిందే! ఇక
ఎందుకు కన్నవారి
తోడు? ఎలాగైనా
పోనీ. ఉరికి
వెళ్ళిన వెంటనే
మొదటి పనిగా...ఒక్క
గదిగా ఉన్నా
పరవాలేదు అనుకుని
ఒక ఇల్లు
చూసి, తల్లి-తండ్రులను
పిలుచుకు వెళ్ళిపోవాలీ’ అని నిర్ణయించుకుంది.
పొద్దున వెళ్ళిన
అక్కయ్య, ఇంటికి
తిరిగి రావటానికి
రాత్రి తొమ్మిదయ్యింది.
అలంకారం అంతా
చెదిరిపోయి, కళ్ళంతా
నీరసించి కనబడింది.
‘అక్క
అనే బంధుత్వం
వద్దనుకున్న తరువాత
ఎందుకు అనవసరంగా
ప్రశ్నించి సమస్యగా
మార్చుకోవటం?’ అని
అనుకోవటంతో ఆమెను
ఏమీ అడగలేదు.
తల్లి గోడవైపుకు
ముఖం తిప్పుకుని
పడుకుంది.
“ఏమిటీ...ఇల్లు
చాలా ప్రశాంతంగా
ఉంది! ఏదైనా
కుట్ర జరుగుతున్నదా? నేను
వచ్చిన వెంటనే
ఆపేసారా?” అడుగుతూ
చీర మార్చుకుంటున్న
అక్కయ్యను చూడటానికే
చిరాకుగా గానూ, నిండిపోయి
కింద పడిన
చెత్త కుండీని
చూసినట్లు అనిపించింది.
“ఏమిటే
చూస్తున్నావు? డబ్బులేమైనా
కావాలా? కావాలంటే
అడుగు”
“చెత్త
కుండీలో నుండి
ఏరుకుని తినేంతగా
ఇక్కడ ఎవరూ
నీచంగా లేరు?”
తల్లి చట్టుక్కున
చెప్పగా...ఆశ్చర్యంగా
చూసింది. తన
గురించి ఏదో
తెలుసుకున్నందు
వలనే ఇలా
పరోక్షంగా మాట్లాడుతున్నారు
అనేది అర్ధమవగా...ఇద్దర్నీ
మళ్ళీ ఆశ్చర్యంగా
చూసింది.
“నేను
విజయవాడలోనే ఇల్లు
చూద్దామనుకుంటున్నా!” -- అర్చనా
మెల్లగా ప్రారంభించింది.
“ఎందుకు...ఈ
ఇంటికి ఏం
తక్కువ?”
“ఇంటికి
ఏం తక్కువ
లేదు. ఒంటరిగా
ఉండటానికి నాకు
కష్టంగా ఉంది.
భోజనానికీ కష్టంగా
ఉంది. వీళ్ళూ
అక్కడికొచ్చి ఉంటే
బాగుంటుందని అనిపిస్తోంది”
“సరే...చూడు.
ఎలాగో ఇల్లు
చూడబోతావు. పెద్ద
ఇల్లుగానే చూడు”
“అక్కడంతా
అద్దే ఎక్కువ
అక్కా...నా
వల్ల కాదు”
“దాని
గురించి నీకెందుకు
బెంగ...డబ్బులు
నేనిస్తాను. మంచి
ఇల్లు చూడు.
నాకోసం ఒక
గది వేరుగా
కావాలి”
‘ఇదేమిట్రా
కొత్త భూతం?’ అని
భయపడి అమ్మను
చూసింది అర్చనా.
తల్లి గబుక్కున
లేచి కూర్చుంది.
“చెత్తను
ఒడిలో కట్టుకుని
వెళ్ళటానికి ఇక్కడేవరూ
తయారుగా లేరు!”
“దేన్ని
చెత్త అంటున్నావు?”
“ఏం...నీ
కంపు నీకు
తెలియటం లేదా? లేక...కంపే
సువాసనగా అనిపిస్తోందా?”
అడిగిన తల్లిని
కోపంగా చూసింది.
‘వీళ్ళకు
అంతా తెలిసిపోయింది!
తెలిస్తే ఏం? ఇంకా
ధైర్యంగా వెళ్ళి
రావచ్చు. బాగా
తడిసిన దానికి
గొడుగు ఎందుకు?’
“అవును
నేను చెత్తనే? ఇప్పుడేమంటారు?”
“సిగ్గుగా
లేదుటే అలా
మాట్లాడటానికి? మంచి
కుటుంబంలో పుట్టి, కంపు
బ్రతుకుకు వెళ్ళటానికి
ఎలా మనసొచ్చింది?”
“సరైన
వయసులో నాకు
మీ ఆయన
పెళ్ళి చేసుంటే
నేనిలా చెత్త
కుండిలా తయారైయ్యేదాన్నా?”
“నీ
బుద్ది కుళ్ళి
పోయింది. మేము
పెళ్ళి చేయలేదు
అనేది ఒక
కుంటి సాకు.
పెళ్ళి చేసున్నా
నువ్వు చెత్త
కుండిగానే తయారయ్యే
దానివి! మా
మీద నెపం
వేసి, నువ్వు
చేసే పనిని
న్యాయపరచకు”
“కనుక, నేను
మీతో రావటం
మీకు ఇష్టం
లేదు...అంతే
కదా?”
“నువ్వు
చెయ్యి దాటిపోయేవే!
ఇక నిన్ను
సరిదిద్దలేము...సరిగ్గా
నడుచుకోవు. ఇక
నీకెందుకు బంధుత్వం
-- ఇల్లు అంతా? నువ్వు
ఊరంతా బంధుత్వం
పెట్టుకున్నావే!
దయచేసి మాతో
వచ్చి...మా
ప్రశాంతతను పోగొట్టకు.
నిన్ను కన్న
పాపాన్ని, ఎక్కడికెళ్ళి
కడుక్కోవాలో తెలియటం
లేదు. ఆ
రోజు పేగు
బంధం తెంచాను.
ఈ రోజు
కన్న బంధుత్వాన్నే
తెంచేస్తున్నాను.
నేను చచ్చిపోతే
కూడా నువ్వు
మునగక్కర్లేదు.
మంచి పిల్లల్ను
కనటానికి కూడా
పెట్టి పుట్టాలి.
నేను ముగ్గుర్ని
కన్నాను. అందులో
ఇద్దరు చచ్చిపోయారనుకుంటా.
మమ్మల్ని వదిలిపెట్టు”
తల్లి చేతులెత్తి
ఆమెకు దన్నం
పెట్టిన వేళ...తండ్రి
గదిలో నుండి
అర్ధం చేసుకోలేని
శబ్ధం వినబడ...
అర్చనా పరిగెత్తింది.
ఒక పక్కకు
ఒరిగిపోయున్న ఆయన
నోటి నుండి
చొంగ కార
ఆయన ప్రాణం
వదిలేసున్నారు.
బయట జరిగిన
సంభాషణ ఆయన
చెవిలో వినబడి, ఆ షాక్
లో చనిపోయారా, లేక
అది ఆయన
ప్రాణం పోవటానికి
పెట్టిన సమయమా
అనేది తెలియక
తండ్రిని పిచ్చిదానిలాగా
చూసింది. వెనుకే
వచ్చిన తల్లి
ఏడుపు ఆ
రాత్రి సమయం
అమానుషంగా ఉంది.
*********
అర్ధరాత్రి వేళ
గొడుగు పట్టుకోవటం
అనేది తండ్రి
దగ్గర పూర్తిగా
చూసాడు మురళీ.
జేబులో డబ్బులు
లేనప్పుడే మైనర్
లాగా ఫోజు
కొట్టిన తండ్రి
దగ్గర, ఏడెనిమిది
లక్షలు ఉంటే
చెప్పాలా? అన్ని
పత్రికలలోనూ ఆయన
ఫోటో, భేటీతో
వార్త వచ్చింది.
లాటరీలో డబ్బులొచ్చింది
నిజమేనని అప్పుడు
నమ్మాడు. ఇక
ఆయన తల, గొంతుపై
ఉండదు అని
అర్ధమయ్యింది. అంత
విర్ర వీగారు.
మాసిపోయిన పంచె, అంగవస్త్రం
పోయి...కొత్తగా
జరీ అంచు
పంచె, అంగవస్త్రం
ఆయన ఒంటి
మీదకు ఎక్కింది.
కొత్త కొత్త
స్నేహితుల గుంపు.
మంత్రిలాగా ఫోజుతో
వెళ్ళారు...వచ్చారు.
ఇంటికని ఒక్క
రూపాయి ఖర్చు
పెట్టలేదు. అయినా
కానీ అధికారం
తగ్గలేదు. తల్లి
వంట చేసిన
వంటకాలను కాలితో
తన్నేరు.
“వంటేనా
ఇది! నన్ను
బిచ్చగాడిని అనుకుంటున్నావా? వంకాయ, ముల్లంగి
తప్ప నీకు
ఇంకే కాయలూ
దొరకలేదా? మంచి
క్వాలిటీ గల
ఇంగ్లీష్ కాయగూరలు
కొంటే తగ్గిపోతావా?”
తల్లిని తిట్టటంతో... మురళీ అదిరిపడ్డాడు.
“ఏది
చవుకగా దొరుకుతుందో...అదేగా
కొనగలం? నా
జీతంతో వంకాయలు, ముల్లంగీ
మాత్రమే కొనగలం.
నచ్చితే తిను, లేకపోతే
ఫై స్టార్
హోటల్ కు
వెళ్ళి కావలసింది
తిను”
“సరిగ్గా
భోజనం పెట్టలేని
వాడివి...ఎందుకురా
నా కాళ్ళ
మీద పడి
నన్ను పిలుచుకు
వచ్చావు?”
“ఇలా
చూడూ! నీ
డబ్బుల కొసం
నిన్ను పిలుచుకు
రాలేదు. ఎవరికి
కావాలి నీ
డబ్బు? పిల్లనిచ్చిన
ఇంట్లోకి వెళ్ళి
ఎవడైనా తిండికి
కూచుంటాడా? వాళ్ళు
తన్ని తరిమేంత
వరకు గొడవ
జరగకూడదనే నేనే
మర్యాదగా పిలుచుకు
వచ్చాను. నువ్వు
ఈ ఇంట్లోనే
ఉండాలని ఎవరూ
ఏడవటంలేదు. నీ
డబ్బులు తీసుకుని, ఎక్కడకైనా
వెళ్ళి తగలడు.
నీ కోసం
నేను వంకాయ, ముల్లంగిని
మార్చుకోవటానికి
రెడీగా లేను”
తండ్రి ఏవగింపుతో
చూసాడు. తన
పప్పులేం అతడి
దగ్గర ఉడకదని
అర్ధమయ్యింది. డబ్బుతో
వాళ్ళను ఒక
ఆట ఆడిద్దాం
అని ఆయన
వేసుకున్న లెక్క
తప్పైంది. లాటరీ
డబ్బువలన ఆవగింజంత
మర్యాద కూడా
పెరగలేదనే నిజం
చిరాకు తెప్పించింది.
‘ఇంతకు
మించి ఇక్కడ
ఉండకూడదు’ అని
అనుకున్న ఆయన
ఇంటి నుండి
వెళ్ళిపోవాలని
నిర్ణయించుకున్నాడు.
‘డబ్బు
విసిరేస్తే...కాళ్ళు
పట్టుకోవటానికి
వెయ్యి కుక్కలు!
మర్యాద లేని
ఇంట్లో ఉండి
ఎందుకు తన
సుఖాన్నీ,సౌకర్యాన్ని
పోగొట్టుకోవాలి!’
ఆయన మురళీని
చూసారు.
“వెళ్తానురా...ఈ
రోజే ఒక
ఇల్లు చూసుకుని
వెళ్తాను. నేను
రాజుని రా!
నా దగ్గర
లక్షల్లో డబ్బున్నది.
ఏ కుక్క
దయా నాకు
అక్కర్లేదు”
“సంతోషం!”
ఆయన అంగవస్త్రాన్ని
విధిలించుకుని
బయలుదేరే సమయం, లోపల
నుండి వేగంగా
వచ్చి ఆయన
ఎదురుగా నిలబడింది
బృందా. ఆయన
చేయి పుచ్చుకుంది.
“నేనూ
వస్తాను నాన్నా.
ఈ గుహ
నుండి నన్ను
విడిపించి నీతో
తీసుకుపో”
ఇల్లు ఆశ్చర్యంతో
నిలబడింది.
Continued...PART-7
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి