14, సెప్టెంబర్ 2022, బుధవారం

చిక్కుముడి జీవితాలు...(సీరియల్)...(PART-8)

 

                                                                       చిక్కుముడి జీవితాలు...(సీరియల్)                                                                                                                                                             (PART-8)

అర్చనా, తల్లిని పిలుచుకుని బందర్ మట్టి నుండి బయలుదేరింది. వస్తువులను మూట కట్టి, తెలిసిన ఒక లారీ సర్వీస్లో పంపించి, సూట్ కేసులను మాత్రం చేత్తో తీసుకుని బయలుదేరింది. అక్కయ్య కోపంగా చూస్తూ కూర్చుంది.

మేమొస్తాం. తోడ పుట్టిన దోషానికి మళ్ళీ చెబుతున్నా. వ్యాపారాన్ని వదిలేయి. ఇంకెక్కడికైనా వెళ్ళి పరువు, మర్యాదతో బ్రతుకు. ఇది నీకు ఎక్కువ రోజులు భోజనం పెట్టదు. యవ్వనం త్వరగా పోతుంది. తరువాతి జీవితం గురించి ఆలొచించు! ఆలొచించి మంచి జీవితానికి ప్రయత్నం చేయి

అక్కయ్య...సరే...పోవే!అనేలాగా కూర్చోనుంది. వాళ్ళిద్దరూ బయలుదేరారు. అభిషేక్ తో ఫోనులో మాట్లాడి, వస్తువులు పెట్టుకోవటానికి అనుమతి తీసుకున్నందు వలన ఇల్లు చూడాల్సిన సమస్య తీరింది. త్వరలోనే వేరే మంచి ఉద్యోగం దొరికితేనే మంచిది. ఇంకొంచం వసతిగా ఉండొచ్చు. ఒకే గదితో ఎక్కువ రోజులు ఉండలేరు. దానికి వాళ్ళు సమ్మతించరు. ఇది తాత్కాలిక అనుమతే! ఇల్లు చూసుకోవటనికి...అని అభిషేక్ చెప్పటానికి ముందే ఏదైనా ఏర్పాటు చేసుకుంటేనే మంచిది.

తల్లిని రూములోనే వదిలేసి రిసెప్షన్కు వచ్చి మురళీకి ఫోన్ చేసింది. అతని గొంతు విన్న వెంటనే...దుఃఖం గుండెను నొక్కి పెట్టింది.

నాన్నకు ఏమైంది అర్చనా? అభిషేక్ నా దగ్గర చెప్పిన వెంటనే షాకయ్యాను. బాగానే కదా ఉన్నారు? ఎలా జరిగింది? వద్దామని కూడా అనుకున్నాను. నీకు ఎటువంటి ఇబ్బంది ఇవ్వకూడదని వదిలేసాను

పెద్ద కథే సంభవించింది మురళీ. దాని యొక్క ముగింపే తండ్రి మరణం. ఏదీ ఫోనులో చెప్పలేను. నేను మిమ్మల్ని చూడాలే! మీ దగ్గర చెప్పి ఏడిస్తేనే నా భారం  తగ్గుతుంది

దానికేం అర్చనా...సాయంత్రం రా

ఎక్కడికి రాను?”

శాయిబాబా గుడి ఎదురుగా పచ్చగడ్డి పార్క్ ఉన్నదే, అక్కడుంటాను. సరిగ్గా ఐదు గంటలకు వచ్చేయి. నేను కూడా చాలా విషయాలు చెప్పాలి

ఫోను పెట్టేసింది. ఊర్లో నుండి తీసుకొచ్చిన టిఫెన్ను అమ్మతో కలిసి తినేసి, కొంచం సేపు పడుకుంది. ఒక వారం రోజులుగా మంచి నిద్ర లేకపోవటంతో అలసిపోయున్న కళ్ళు మూసుకుపోయినై. నాలుగింటికి లేచింది. గదిలో వస్తువులను తల్లి ఒక మోస్తరుగా సద్దింది. ఒక చెక్క బల్లపై స్టవ్వు పెట్టింది. మూటలు విప్పి వంట వస్తువులు తీసి వరసగా అమర్చింది.

నేను బయటకు వెళ్తున్నాను. లైటుగా ఏదైనా టిఫిన్ చేసుంచు.వచ్చి తింటాను

త్వరగా వచ్చేయ్. నాకు టెన్షన్ గా ఉంటుంది

బస్సు పుచ్చుకుని అతను చెప్పిన చోటుకు వచ్చేసరికి, పది నిమిషాలు లేటైంది. గడ్డినేల మీద కూర్చుని వేడుక చూస్తున్నాడు మురళీ. ఆమెను చూసిన వెంటనే లేచాడు.

అలాగే నడుద్దాం. వాకింగ్ చేసినట్టూ ఉంటుంది, మాట్లాడినట్టూ ఉంటుంది
 
అన్నాడు. ఇద్దరూ నడవటం మొదలుపెట్టారు.

అర్చనా ఊర్లో జరిగినదంతా చెప్పింది. అక్కయ్య ప్రవర్తన అమ్మకు పెద్ద పిడుగు. తన కడుపున పుట్టినది ఇలాంటి ఒక నీచమైన వ్యాపారానికి వెళ్ళిందే?’ అన్న షాక్ లో నుండి ఆమె తేరుకోలేదు. మేము మాట్లాడుకున్నదంతా వింటున్న తండ్రి, మా మాటలు వినే చనిపోయుంటాడనే నాకు అనిపిస్తోంది. అది అమ్మ తలమీద మరో పిడుగు. ఇప్పుడు ఆమెకు ఒకే ఓదార్పు...నేనే

ఆమె ఆపిన వెంటనే...కొంచం సేపు మౌనంగా నడిచారు. గ్రామాల నుండి వచ్చిన టూరిస్టులు కొందరు శాయిబాబా గుడి చూస్తూ మధ్యలో ఉన్న వినాయకుడు విగ్రహాన్ని చూసి దన్నం పెడుతూ నిలబడున్నారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.

అవును మీరేదో చెప్పాలన్నారు?”

ఇది కూడా పెద్ద కథే... డబ్బు గల కథ!

కథల్లో డబ్బుగల కథ...పేదరికం కథ అని రెండు రకాలు ఉన్నాయా?”

మా ఇంట్లోని విల్లన్ కు లాటరీ కొట్టిన కథ

విల్లనా...ఎవరు?”

ఇంకెవరు నాన్నే? కృరుడికి లాటరీలో పది లక్షలు వచ్చినై. తరువాతే కథ! మా ఇంటి క్లైమాక్స్ ఏమిటో తెలుసా? నా చెల్లెలి అదిరిపాటు సందర్భవాదం. సడన్ గా నాన్న మీద ప్రేమ! ప్రేమలో జయం పొందాలంటే డబ్బుగల తండ్రితో ఉండటమే మంచింది అనే తీర్మానం. నేను చాలా ప్రాక్టికల్అని ఒక డైలాగ్ వేరే! మనిషి అన్నీ తప్పులనూ చేసేసి, చేసిన తప్పులను న్యాయపరచటానికి వెనుకే ఒక డైలాగ్ చెబుతాడు. నేనూ మనిషినే కదా! వేడుకగా లేదు?”

ఆమె తొందరలో, అవివేకంతో ఒక నిర్ణయం తీసుకుంటే మీరెలా వెళ్ళ నిచ్చారు? ఆమెకు అర్ధమయ్యేటట్టు చెప్పి, బుద్ది చెప్పుండద్దా?”

పసిపాప చూడు! తల్లి అతి తెలివితో తీసుకున్న నిర్ణయం అది. మొత్తానికి చవటను నేనే అర్చనా. చేతిలో డబ్బు ఉందో-లేదో...మనసులో మమకారం- బంధం అని పెట్టుకుని అల్లాడుతున్నాను. ఇప్పుడు కూడా బృందాను తలుచుకుని లోలోపల కుమిలిపోతున్నాను. మా నాన్న దాని వరకైనా మంచిగా నడుచుకోనీ. ఆమె యొక్క ప్రేమని నెరవేర్చి పెట్టనీ అని వేడుకుంటున్నాను. అది తప్ప ప్రస్తుతానికి నేనేమీ చేయలేను

ఇదేమిటి మురళీ...దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు చికాకులో ఉన్నాడో? సంతోషం అనే మాటని మన నుదిటిపై రాయటం మరిచిపోయేడో?”

మనమే రాసుకుందామా?”

ఎలా?”

ఆంగ్లంలో ఒక సామెత ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్...వెన్ యు హోల్డ్ సం ఒన్ యు లవ్!’ -- అని. జీవితంలో ఒక పట్టు రావాలంటే ఎవరినైనా ఇష్టపడాలి.  స్వార్ధం లేని ఇష్టం...సంతోషాన్ని ఇస్తుంది. ఇది నిజమే ననిపిస్తుంది

అనుభవమా? సరే...సంతోషాన్ని ఎలా రాస్తారు? అది చెప్పండి...పెన్నుతోనా? పెన్సిల్ తోనా?”

మురళీ ఆమెను నవ్వుతూ చూసాడు.

నా వేళ్ళతో...

"వేళ్ళతో ఎలా?”

నీ చేయ్యి ఇవ్వు చెబుతాను -- మురళీ ఆమె చెయ్యిని జాపమన్నాడు.

ఆమె చెయ్యి జాపింది.

చాచిన ఆమె చేతిని పుచ్చుకుని మెత్తని ఆమె వేళ్ళలో తన వేళ్ళను జోడించాడు.

సంతోషంగా ఉందా...?”

ఆమె చేతులు జలదరించినై. అరిచేతి నరాల ద్వారా ఒక విధమైన భావన, ఒళ్ళంతా పాకింది. అదేనా సంతోషం? దాని బరువును తట్టుకోలేక అతని భుజాలపై మెల్లగా తల వాల్చింది.  

ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఇక మాట్లాడటానికి ఏముంది?’ అనే పరిస్థితి! ఒక చిన్న స్పర్ష, ఒక వెయ్యి కథలు చెప్పగా...నాలిక మౌనంగా తప్పుకుంది. పచ్చగడ్డి పార్కులోని లైట్లు వెలగటం మొదలైంది.

వెళ్దామా?” -- మురళీ అడుగ, గబుక్కున తన చేతిని లాక్కుని సిగ్గుతో చూపులను తిప్పుకుంది. అతను...ఆమెకు మాత్రం వినబడేటట్టు నవ్వాడు.

ఎందుకు నవ్వుతున్నారు?”

ఎందుకంటే?  సంతోషంగా ఉన్నాను...నవ్వు వస్తోంది! నీకు రావటం లేదా? ...మీ భాషలో దానికి పేరు సిగ్గు. కరెక్టా!

లేదు...నవ్వే...ఆమె, అతన్ని చూసి మళ్ళీ నవ్వింది.దీన్ని కొంచం కూడా ఎదురు చూడలేదు మురళీ. నన్నూ ఒక జీవి పరిశుద్దంగా ఇష్టపడుతుందని కలలో కూడా అనుకోలేదు

నేను మాత్రం అనుకున్నానా? ఇప్పుడు అర్ధమవుతోందా...దేవుడు ఎవరి నుదిటి మీద ఏమీ రాయటం లేదు. మనమే ఒకరికొకరం మన తలరాతలను రాసుకుంటున్నాము. మా నాన్న సరిలేనందుకూ, మీ అన్నయ్య బాధ్యతలేకుండా పోయినందుకు దేవుడు ఏం చేస్తాడు? దేవుడా మా అక్కయ్య భర్తను మైనర్ జీవితం సాగించమన్నాడు? లేక...మీ అక్కయ్యను తప్పు దోవలో వెళ్లమని చెప్పాడా? లేక నాన్న వెనుక బృందాను వెళ్ళమన్నాడా? పాపం దేవుడు! అన్నిటికీ ఆయన్ని నేరస్తుడ్ని చేస్తే ఎలా?”

అర్చనా నోరారా నవ్వింది. మనసు నిండా భారంతో వచ్చిన ఆమె భారాన్ని గాలిలోనూ...పచ్చగడ్డి నేలమీద వదిలేయటంతో వాళ్ళిద్దరూ ప్రేమికులై వెనుతిరిగారు.

మా అమ్మ దగ్గర మన గురించి చెప్పి, త్వరలోనే మీ అమ్మతో మాట్లాడటనికి పిలుచుకు వస్తాను. ఇక మనకి సంతోషం మాత్రమే! బావ మీద దావా వేసి అక్కయ్యకు నష్ట పరిహారం ఏదైనా తీసుకుని ఇచ్చేస్తే...ఆమె బాధ్యత తీరుతుంది. పిల్లలు కొంచం పెద్దవాళ్ళు అయితే...ఆమెను వేరుగా ఉంచి, అప్పుడప్పుడు వెళ్ళి చూసిరావచ్చు.

తరువాత నేనూ-నువ్వూ, మీ అమ్మ, మా అమ్మ అందరం ఒకటిగా ఉందాం. కలో గంజో...సంతోషంగా కలిసి తాగుదాం. ఒకే ఒక బిడ్డను కందాం. మంచిగా పెంచుదాం. బిడ్డ ఆడో-మగో...దాని తలరాతను మంచిగా రాయలి

అర్చనా ఒళ్ళు మళ్ళీ జలదరించింది...మళ్ళీ అతని చేతిని గట్టిగా పుచ్చుకుంది.

తరువాత మనం మనకోసం చిన్న ఇల్లు ఒకటి కట్టుకోవాలి. అందులో చిన్నదిగా ఒక హాలు, వంటగది, దేవుడి గది అన్నీ ఉండాలి

బొద్దింకలకు మండపం ఉందా...లేదా?” – అంటూ నవ్వాడు.

ఆమెను బస్సు ఎక్కించి, అతనూ బస్సు పుచ్చుకుని వెనుతిరిగాడు. అక్కయ్య వాకిట్లోనే నిలబడి ఉన్నది. అతన్ని చూసిన వెంటనే వేగంగా దగ్గరకు వచ్చి, పక్కకు తీసుకు వెళ్ళింది.

ఏంటక్కా?”

బృందా వచ్చుంది!

ఏమిటట?”

నాన్న దాన్ని ఎవడో ఒక డబ్బుగల సగం ముసలాడికి ఇచ్చి పెళ్ళి చేయటానికి ఏర్పాటు చేస్తున్నారట. నువ్వూ వద్దు...నీ డబ్బూ వద్దని పరిగెత్తుకు వచ్చింది. ఒకటే ఏడుపు

బ్యాక్ టు పెవిలియనా?”

పాపంగా ఉందిరా! నువ్వేదైనా చెప్పి, దాని గాయంపైన వేడి నీళ్ళు జల్లకు

నువ్వోదానివి! వేడి నీళ్ళు జల్లటానికి నా దగ్గర శక్తి ఏదీ?  నా శరీరానికి తగిలిన గాయాలు ఎవరికీ కనబడవెందుకు అని ఆలొచిస్తున్నా -- చెప్పలేని బాధ అతని మాటల్లో కలిసి వచ్చింది.

అక్క వెనుకే నడిచి ఇంట్లోకి వెళ్ళాడు. అతన్ని చూసిన వెంటనే బృందా ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. అతనిలో వేగంగా కోపం పెరిగింది. కోపం తగ్గేంత వరకూ అతను మౌనంగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. కోపం తగ్గిన తరువాత ప్రేమగా చూసాడు. భుజం ముట్టుకున్నాడు.

అయ్యిందేదో అయ్యింది...దాని గురించి వదిలేయ్! లేచి వెళ్ళి మొహం కడుక్కో. నీ పెళ్ళి నా బాధ్యత!

బృందా అతని చేతులు పుచ్చుకుని తలవంచుకుంది.

చదువు అయ్యేంత వరకు ఆగద్దు అన్నయ్యా. నువ్వు వెంటనే వెళ్ళి అతనితో మాట్లాడొస్తావా?”

ఇంతలో ఏమైంది? ఇప్పుడే ఇంట్లో ఒక పెళ్ళి జరిగింది. పెళ్ళికొసం చేసిన అప్పులో ఇంకా మొదటి నెల వాయిదానే కట్టలేదు. ఇంతలో ఇంకొక పెళ్ళి అంటే నాకు శక్తి కావద్దా?

నువ్వు ఇప్పుడే పెళ్ళి వద్దన్నావనే కదా శాంతీకి పెళ్ళి చేశాను. ఇంకా ఒక సంవత్సరం టైము ఇవ్వు. ఇంతలో చదువూ అయిపోతుంది. నేను కొంత తేరుకుని, డబ్బు పోగు చేస్తాను. ఏదీ కుదరక పోయినా నా ఉద్యోగం రాజీనామా చేస్తే...కనీసం మూడు లక్షలు దొరుకుతుంది. అది పెట్టుకుని నీ పెళ్ళి చేస్తాను...భయపడకు!

ఏవిట్రా వాగుతున్నావు? ఉద్యోగానికి రాజీనామా చేస్తావా? తరువాత నువ్వేం చేస్తావు?” -- తల్లి ఆందోళన చెందింది.

ఏదో చేసుకుంటాను. ఇప్పుడు అదా ముఖ్యం? డబ్బు పోగు చెయ్యలేకపోతేనే కదా ఉద్యోగం రాజీనామా చేస్తానని చెప్పాను? రేపే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పానా? సరే...ఆకలేస్తోంది. కంచం పెట్టు  -- అన్న అతను స్నానాల గదిలోకి వెళ్ళాడు. మొహం కడుక్కుని స్నానాల గది నుండి బయటకు  వచ్చినప్పుడు బయట టవల్ తో నిలబడుంది బృందా.

నేను చాలా చెడ్డదాన్ని...సందర్భ వాదిని! మిమ్మల్నందరినీ గాయపరిచి వెళ్ళినందుకు నాకు తగినసాస్తి జరిగింది

పిచ్చిదానిలాగా వాగకు!

వాగట్లేదు అన్నయ్యా...నీ దగ్గర ఒక నిజం చెప్పాలి

ఏమిటది?”

నాన్న లేని ఒక సమయం ఆయన...అదే విజయ్ ఇంటికి వచ్చాడు. ఎవరూ లేనప్పుడు అతన్ని రమ్మని చెప్పటం తప్పు అయిపోయింది. చాలా సులభంగా నేను ఓడిపోయాను. అందుకనే...త్వరగా పెళ్ళి చేసేయిఅని చెప్పాను.

బృందా మళ్ళీ పెద్దగా ఏడ్చింది... మురళీ అదిరిపడ్డాడు.

                                                                                                    Continued....PART-9(LAST)

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి