చిక్కుముడి జీవితాలు...(సీరియల్) (PART-7)
దేవుడి తరువాత
ఈ ప్రపంచంలో
శక్తి కలిగినది
దేవుడు రూపొందించిన, మనిషి
సృష్టించిన డబ్బు.
ఎక్కువ మనో
బలం ఉన్న
వాళ్ళు మాత్రమే
దాని ఆకర్షణ
శక్తికి లొంగిపోకుండా, దాన్ని
అనిచి తమ
వసం ఉంచుకున్నారు.
మనో బలం
లేని వాళ్ళను
అది దానికి
బానిసలను చేసేస్తుంది.
తలని భూమిలో
పూడ్చేస్తుంది.
మనిషి మనసు
ఇనుముకు సమానం.
నీళ్ళూ, గాలి
తగల...ఇనుము
శక్తి కోల్పోయి
తుప్పు పడుతుంది.
నిప్పు తగల...శుభ్రమై
కొత్త శక్తి
పొందుతుంది. స్వార్ధమనే
గాలి, డబ్బు
అనే నిప్పు
తగలటం...మనసు
కూడా తుప్పు
పట్టి మనోబలం
తగ్గిపోవటం మొదలవుతుంది.
పట్టుదల అనే
అగ్ని గుండం
లోపల కాలుతున్న
మనసు...కవచం
పెట్టుకున్న ఇనుములా
శక్తితో ఉంటుంది.
తుప్పు దగ్గరకు
రాదు. తండ్రి
దగ్గరున్న లక్షలు
బృందా మనసును
ఒక్క నిమిష సమయంలో
తుప్పు పట్టించినట్టు
అర్ధమవగా... మురళీ ఆమెను
వెర్రిగా చూస్తూ
స్థానువుగా నిలబడిపోయాడు.
తన చేతులు
పుచ్చుకుని బ్రతిమిలాడిన
కూతుర్ని తండ్రి
ఆలొచనతో చూసాడు.
‘ఇల్లు
ఒకటి చూసుకున్నా, వంట
చేసి పెట్టటానికి
వంట మనిషిని
పెట్టుకోవాలి. ఆ
వంట మనిషి
కన్న కూతురుగానే
ఉండనీ’ అని
అనుకున్నారు. “సరే...పిలుచుకు
వెళతాను. మొదట
ఒక ఇల్లు
చూసి వస్తాను.
రెడిగా ఉండు” అని చెప్పి
బయటకు వెళ్ళారు.
ఆయన వెళ్ళిన
తరువాత ఇల్లు
నిశ్శబ్ధం అయ్యింది.
బృందా చేష్టతో
అందరూ స్థంభించిపోయున్నారు.
కొంచం సేపటి
వరకు నిశ్శబ్ధం
ఛేదించబడకుండా అలాగే
ఉన్నది. బృందా
ఎవర్నీ చూడలేక
తలవంచుకుని లోపలకు
వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు...తల్లి
యొక్క స్వరం
ఆమెను ఆపింది.
“హఠాత్తుగా
ఈ ఇల్లు
నీకు గుహలాగా
అయిపోయిందా? తండ్రి
మీద అనురాగం
పొంగుకొస్తోందా? పరవాలేదే
బృందా...నువ్వు
ఎలాగైనా బ్రతగల
దానివే...?”
ఆమె సమాధానం
చెప్పకుండా నిలబడింది.
“ఏం
బృందా...తండ్రి
గుణం తెలిసి
కూడా ఆయనతో
వెళతానని బయలుదేరుతున్నావే! ఆయన ఒక మట్టి
గుర్రమే. దానితో సవారి చేద్దామనుకుంటున్నావే...బుద్ది చెడిపోయిందా నీకు?
లేక...ఆయన దగ్గరున్న డబ్బు నిన్ను లాగుతోందా? ”
-- అక్కయ్య ఆవేదనతో చెప్పగా... బృందా ఆమెను కోపంగా చూసింది.
“అవును...డబ్బుకోసమే
నేను వెళుతున్నాను. అందులో తప్పేముంది? తండ్రి
యొక్క డబ్బే కదా! ఊళ్ళో వాళ్ళ డబ్బు కాదుగా? ఇలా చూడు... మురళీ అన్నయ్యా,
నేను ‘ఓపెన్’
గానే చెప్తాను. నేను ఇష్టపడిన ఆయన ఇంట్లో కట్న కానుకలు ఎక్కువగా
అడుగుతారనే అనుకుంటున్నా. నాన్న దగ్గర లక్షల్లో డబ్బు ఉన్నప్పుడు...మనం పేదరికం పాటలు పాడితే
నమ్ముతారా? నాకు పెళ్ళి చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా?
డబ్బులు పెట్టుకుని ఏం చెయ్యబోతారు? ఎలాగూ సగం
బ్రాందీ షాపుకు వెళ్తున్నప్పుడు, దానికంటేనా నా పెళ్ళి
తుచ్ఛంగా పోయింది?
నేను ఇక్కడ ఉంటూ,
డబ్బు లివ్వండి అని ఆయన్ని అడిగితే ఇస్తారా? లేదు...నీ
వల్ల వాళ్ళడిగే కట్న కానుకలు ఇవ్వటం కుదురుతుందా? అన్ని
విషయాలనూ ఒకటికి రెండు సార్లు ఆలొచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరందరూ నన్ను
స్వార్ధపరురాలు అని అనుకున్నా పరవలేదు. ఇది నా యొక్క ‘ప్రాక్టికల్’
నిర్ణయం”
“పిచ్చి నిర్ణయం! అవును...ఇంకేం
చెప్పను. నాన్న తన డబ్బు ఖర్చుపెట్టి నీ పెళ్ళి చేస్తారని కలలు కంటున్నావే!
నిన్నేం చెప్పాలి బృందా? అంతటి బాధ్యత ఆయనకుంటే...మన ఇల్లు
ఎందుకే ఇంత కష్టపడుతోంది?”
"ఇక ఆయన మారిపోతారనే
నమ్మకం నాకుంది”
అక్కయ్య ఏదో చెప్పటానికి నోరు
తెరుస్తుండగా... మురళీ ఆమెను మాట్లాడొద్దని
సైగ చేసాడు. “ఎవరూ ఎవరినీ ఆపద్దు.
దానికి ఏది సంతోషమో అది చెయ్యనీ...వదిలేయ్"
మళ్ళీ ఇల్లు నిశ్శబ్ధం అయ్యింది!
రెండే రోజుల్లో తండ్రి ఇల్లు చూసాడు. బృందా
బట్టలతో రెడిగా ఉంది. ‘వెళ్తున్నాను’
అని కూడా తండ్రి చెప్పలేదు. ఒక ఆటో తీసుకు వచ్చారు. ఇద్దరూ బయలుదేరారు.
రెండు బెడ్ రూములున్న అపార్ట్ మెంట్,
సకల వసతులతో ఉన్నది. డబ్బు...మంత్ర వాదే! సందేహమే లేదు. వంట పాత్రలు
ఏమిటి? అట్ట పెట్టల్లో దిగిన వంట సరకులు ఏమిటి? అన్నీ క్షణంలో కొన్నది డబ్బు.
ఇలాంటి వసతులున్న ఇంట్లో తానూ ఎప్పటికైనా
ఉండగలనా అని ఆమె ఎన్నో సార్లు ఆశపడింది. ఈ
రోజు తండ్రి వలన అది నెరవేరింది. అదేలాగా పెళ్ళి విషయంలోనూ తన కొరిక నెరవేరకుండానా
పోతుంది? అభిమానంగా ఉన్నట్టు చూపించుకుంటే,
దానికి కట్టుబడకుండానా పోతారు ఆయన?
బృందా వంట సరకులను విప్పి,
డబ్బాలలో పోసి అలమరాలలో అందంగా వరుసపరచింది.
తండ్రి కూరగాయలు కొనుకొచ్చి ఇచ్చి
వెళ్ళారు. ఆయన వచ్చే లోపు వంట చేసి ఉంచింది. మూడు గంటలు అయ్యింది...తండ్రి వచ్చారు!
బృందా కంచం పెట్టింది. ఆయన తిన్న విధం చూసి, వంట
బాగా రుచిగానే కుదిరిందని అర్ధమయ్యింది.
"నువ్వు తిన్నావా?”
"లేదు...ఇక మీదటే?"
"నువ్వు తినుండచ్చు
కదా?"
“నువ్వు తినకుండా...తినడానికి
నాకు మనసు రాలేదు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు?"
"ఏదైనా ఒక వ్యాపారం
మొదలు పెట్టాలని 'ఐడియా’. ఆ విషయంగానే
తిరుగుతున్నా"
"ఏం వ్యాపారం...?"
"నా జాతకం ప్రకారం
ధాన్యం 'ధనం' ఇస్తుందని ఉన్నది.
అందువలన 'మిని సూపర్ మార్కెట్' ఒకటి మొదలు
పెట్టాలని ఆలొచన!"
"మొదలు పెట్టు! నీకు మంచి టైము
వచ్చేసింది నాన్నా. నువ్వు కావాలంటే చూడు...నిన్ను నిర్లక్ష్యం చేసిన వారందరూ నీ కాళ్ళ
మీద వచ్చి పడతారు"
"అది మాత్రం కరెక్టే! మొదటి వ్యక్తిగా
నువ్వొచ్చి పడ్డావే!"
బృందా మొహం వాడిపోయింది. తండ్రి ఎత్తి
పొడుస్తున్నాడా...హేళన చేస్తున్నాడా లేక ఆమె మాటలను ఒప్పుకుంటున్నారా అనేది అర్ధం
కాలేదు. పోనీ! ప్రస్తుతానికి ఓర్పుగా ఉండటమే చాలా అవసరం. ఆయన దయతోటే పెళ్ళి
జరగాలి.
తండ్రిని చూసి నవ్వింది.
"ఎప్పుడూ నాకు నీ మీద ఆశ ఉండేది
నాన్నా. ఆ ఇంట్లో దాన్ని బహిరంగంగా చూపలేకపోయాను...అంతే”
తండ్రి అదోలా నవ్వాడు. "నేను
రావటానికి ఆలస్యం అవుతుంది" అని చెప్పి బయటకు వెళ్ళారు. రాత్రి ఒంటి గంటకు
తిరిగి వచ్చిన ఆయన దగ్గర నుండి సారా వాసన గుప్పుమని వచ్చింది. నిలబడటం కూడా కుదరనంతగా ఊగిపోతున్న ఆయన,
హాలులోనే కటిక నేల మీద ముడుచుకుని పడుకున్నారు. కొంచం సేపటి తరువాత 'వాంతి ' చేసుకున్నారు. ఆ వాసన బృందాకు కడుపులో
తిప్పింది.
హాలు పరిస్థితి చూసిన ఆమెకు తల తిరిగింది.
చికాకుగా ఉన్నది. 'పో...వెళ్ళి కడుగు!'
డబ్బు కావాలంటే కష్టపడే కదా కావాలి? -- లోపల
ఒక స్వరం హేళన చేసింది...మెళ్ళగా ఆయన్ని ఈడ్చి ఒక చివరికి లాగి పడేసి, హాలు కడిగింది.
మరుసటి రోజు పొద్దున...ఏమీ జరగనట్లు
స్నానం ముగించి...ఇస్త్రీ పంచె, చొక్కా
వేసుకుని...సెంటు కొట్టుకుని మైనర్ గొలుసు -- ఉంగరం పెట్టుకుని బయలుదేరారు. “నేను భోజనానికి రాను.'వెయిట్' చేయకు"
అంటూ చెప్పులు వేసుకుని వెళ్ళారు.
"అర్జెంట్ ఖర్చులకు ఎంతో కొంత డబ్బులిచ్చి
వెళ్ళు నాన్నా"
జేబులోంచి వంద రూపాయల కాగితం తీసి
విసిరేసి వెళ్ళారు.
'బిజినస్ ' ప్రారంభించారో లేదో తెలియదు. కానీ రోజూ తాగొచ్చి వాంతి చేసుకోవటం
మర్చిపోలేదు. 'ఇలాగంతా శ్రమ పడాలా? వెళ్ళి
పోదామా? అని కూడా కొన్ని సమయాలలో అనిపించింది. పెళ్ళి
అయ్యేంత వరకే కదా అని సమాధాన పరుచుకుంది.
'తండ్రి ఇప్పుడప్పుడే రాడు
కాబట్టి 'విజయ్' ను చూసి వచ్చేస్తే ఏం?'
అరగంట తరువాత బయలుదేరి వెళ్ళింది. పబ్లిక్
టెలిఫోన్ బూత్ నుండి అతనికి ఫోను చేసింది. మంచికాలం అతనే ఉన్నాడు.
"నేను బృందా మాట్లాడుతున్నాను"
"ఏయ్ నువ్వా...మనిషే కనబడలేదు?"
"ఇంట్లో కొన్ని
సమస్యలు! నేనిప్పుడు నాన్నతో ఉన్నాను"
"ఎక్కడ...?
అడ్రస్సు చెప్పు...వస్తాను"
"మీరా...ఇక్కడికా"
-- ఆలొచించిన తరువాత
"సరే...రండి"
అని చెప్పి
అడ్రస్ ఇచ్చింది.
తరువాతి ముప్పావు
గంటలో విజయ్
'టూ' వీలర్, కింద
కాంపౌండ్ లో
దూరింది. టూ
వీలర్ తాళం
చెవి తీసుకుని, మెట్లెక్కి, ఆమె
అపార్ట్మెంట్ కాలింగ్
బెల్ నొక్కాడు.
తలుపు తెరిచిన
వెంటనే ఈల
వేసుకుంటూ లోపలకు
వచ్చాడు.
"ఇంట్లో
ఎవరూ లేరా?"
"లేరు...!"
"ఒక్క
నిమిషం" అన్న
అతను...తలుపుకు
గొళ్లెం పెట్టి
ఆమెను శ్వాస
ఆడనంత గట్టిగా
కౌగలించుకున్నాడు.
"ప్లీజ్...వదిలేయండి
విజయ్. వద్దు...నన్ను
టెన్షన్ పెట్టద్దు!
వదలండి"
"మాట్లాడకు!
ఎన్ని రోజులయ్యింది...నిన్ను
వాసన చూసి"
“దీని
వలనే ఆలొచించాను.
డేంజర్ అవటానికి
ముందే బయలుదేరండి...చెబుతున్నా"
"అవును...మీ
నాన్నకు లాటరీ
తగిలిందటగా...నిజమేనా?"
"పత్రికలోనే
కదా చదివేవు?"
"అవునూ, ఇదేమైనా
సొంత అపార్ట్
మెంటా...అద్దెకా?"
"అద్దెకే...బాగుందా?"
"ఊ...కిచెన్
బాగుంది. హాలు
బాగుంది. బాత్
రూం బాగుంది.
బెడ్ రూం
ఎలా ఉంటుంది...బాగుంటుందా?"
"కొవ్వు!
బాగానే ఉంటుంది.
చూస్తారా...?"
"బాగుందా...లేదా
అనేది చూసి
చెప్పలేను. పడుకుని
చూసే చెప్పగలను"
-- అతను కన్ను
గీటాడు...ఆమె
నెత్తురు, మనసు
వేడెక్కింది. అబద్దమైన
కోపంతో చూసినా
ఆమె బలహీనం
కళ్ళల్లో తెలుస్తూనే
ఉంది.
ఆ బలహీనాన్ని
అతను వాడుకున్నాడు.
గొళ్ళెం పెట్టిన
ఇంటిలోపల ఎటువంటి
సంబరం లేకుండా
వాళ్ళ మొదటి
పగలు ముగిసింది.
ఆ ఒక
గంట టైములో
అతను కుమ్మరించిన
అభిమానం, ప్రేమ
మాటలతోనూ ఆమె
కరిగిపోయింది. అతను
పెట్టిన ముద్దులలో
కరిగి కనబడకుండా
పోయింది.
'ఎంత
మమకారం...తుఫాన
లాంటి ఎలాంటి
ఒక ప్రేమ?' అని
పొంగిపోయింది. మగవాడి
ఆయుధమే అదేనని
తెలియక పొంగ
పొంగ అమృతం
ఇచ్చింది. కామ
సరస్సులో ఇంకో
రెండు జీవులు!
రాత్రి పదకుండు
గంటలకు ఎప్పుడూలాగా
సారా వాసనతో
వచ్చాడు తండ్రి.
“ఒక
విధంగా ‘బిజినస్’ కు
పార్టనర్ ను
పట్టేసాను. కంకిపాడులో
చోటు చూశాము.
నేను రెండులక్షలు...అతను
నాలుగు లక్షలు
షేర్. అతనో
చాలా పెద్ద
మనిషి...ఆస్తిపరుడు.
అన్ని పనులూ
చూసుకుంటాడు. లాభంలో
నాకు రావలసిన
వాటా మాత్రం
నెలనెలా కరెక్టుగా
వచ్చేస్తుంది”
“ఏ
రోజు ఓపనింగ్?”
“రేపు
నా పార్టనర్
ఇక్కడికి వస్తాడు.
గ్రాండుగా వంట
చెయ్యి. రేపు
మిగితా విషయాలన్నీ
మాట్లాడుకుని, అగ్రీమెంట్
సంతకం పెట్టుకుంటాము”
నాన్-వెజిటేరియన్
వంట వాసన
ఊరినే అక్కడకు
రప్పించింది. వంట
చేసి డైనింగ్
టేబుల్ మీద
పెట్టి స్నానాకి
వెళ్ళింది. పదకుండు
గంటలకు పైన
వచ్చాడు...తండ్రి
పార్ట్నర్. తండ్రి
దగ్గరలాగానే అతని
దగ్గర నుండి కూడా
సారా వాసన
వచ్చింది!
బృందాను మింగేసేవాడిలా
చూసాడు. నలభై
ఏళ్ళు ఉంటాయి.
బ్రీఫ్ కేసులో
కట్టలు కట్టలుగా
డబ్బులు పెట్టుకోనున్నాడు.
కింద నిలిపున్న
తన కొత్త
కారును తండ్రికి
కిటికీలో నుండి
చూపించాడు.
ఇద్దరూ బెడ్
రూం తలుపులకు
గొళ్లెం పెట్టుకుని
చాలాసేపు మాట్లాడుకున్నారు.
తరువాత నవ్వుతూ
బయటకు వచ్చి
భోజనానికి కూర్చున్నారు.
బృందాను దొంగ
చూపులతో చూస్తూ
నాన్-వెజిటేరియన్
వంటకాలను లొట్టలు
వేసుకుంటూ తిన్నాడు...వచ్చినతను.
మూడు గంటలకు
అతను వెళ్ళిపోయిన
వెంటనే...తండ్రి
కూతుర్ని పిలిచి
కూర్చో అన్నారు.
“ఏమిటి
నాన్నా?”
“అతన్ని
చూసావా...ఎలా
ఉన్నాడు?”
“ఎలా
ఉంటే నాకేంటి? యోగ్యుడుగా
ఉంటే సరి!
బిజినస్ అంటే
చాలా జాగ్రత్తగా
ఉండాలి”
“ఛఛ...చాలా
మంచివాడు! బోలెడంత
డబ్బు. ఈ
బిజినస్ కు
ఒకే ఒక
కండిషన్ వేసాడు.
రాయలేని ‘అగ్రీమెంట్’...అంటే
జెంటిల్ మ్యాన్
అగ్రీమెంట్!”
“ఏమిటది?”
“నిన్ను
అతనికి కట్టపెట్టాలట.
‘సరే’ అన్నాను.
పాలు అడిగితే
పాల సముద్రమే
వెతుక్కుని వస్తుంటే
ఎవరైనా వద్దని
చెబుతారా” తండ్రి వెకిలి
నవ్వు నవ్వ... బృందా మేకు
కొట్టినట్టు గోడకు
అతుక్కుని కూర్చుండిపోయింది.
Continued...PART-8
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి