మనవడిని ఇవ్వనందుకు కుమారుడిపై దావా వేసిన భారతీయ జంట (ఆసక్తి)
భారతదేశంలోని ఉత్తరాఖండ్
రాష్ట్రానికి చెందిన
ఒక జంట
తమ కుమారుడిని
కోర్టుకు లాగారు.
వారు అతినిపై
పెట్టిన 51 లక్షల
రూపాయల పెట్టుబడిని
తిరిగి చెల్లించాలని
లేదా ఒక
సంవత్సరంలోపు వారికి
మనుమడిని/మనుమరాలుని
ఇవ్వాలని కోరారు.
సంజీవ్ మరియు
సాధన ప్రసాద్
దంపతులు తమ
సొంత కొడుకుపై
"మానసిక వేధింపుల"
కారణంగా అసాధారణమైన
దావా వేశారు.
సంవత్సరాలుగా అతని
విద్య మరియు
వృత్తిపరమైన శిక్షణ
కోసం గణనీయమైన
మొత్తంలో డబ్బు
పెట్టుబడి పెట్టినట్లు
వారు పేర్కొన్నారు.
అతనికి ఉద్యోగం
దొరకనప్పుడు అతనికి
ఆర్థికంగా సహాయం
చేసారు. మరియు
2016లో
అతని వివాహానికి
ఏర్పాట్లు చేసి
చెల్లించారు. ప్రతిగా, వారు
వారి పదవీ
విరమణ సంవత్సరాలలో
" వారితో ఆడుకోవడానికి
మనవడు లేదా
మనమరాలును" కోసం
ఎదురు చూస్తున్నారు”.
వారి కొడుకు
వారు ఆశించిన
విధంగా డెలివరీ
చేయలేదుట.
"నా
కుమారుడికి పెళ్ళి
అయ్యి ఆరు
సంవత్సరాలు అయింది.
కానీ వారు
ఇంకా బిడ్డను
ప్లాన్ చేసుకోలేదు"
అని మిస్టర్
ప్రసాద్ ది
నేషనల్తో
అన్నారు.
"కనీసం సమయం
గడపడానికి మనవడు
ఉంటే, మా
బాధ భరించదగినదిగా
ఉంటుంది."
62 ఏళ్ల
పెన్షనర్ సంజీవ్
ప్రసాద్ ఇలా
అన్నారు. నా
కొడుకు సాగర్
కి యునైటెడ్
స్టేట్స్లో
పైలట్ శిక్షణా
కోర్సు చేయటానికి
$65,000 ఇచ్చాము. 2016లో
థాయిలాండ్లో
అతని విలాసవంతమైన
వివాహానికి మరియు
తదుపరి హనీమూన్
కు చాలా
డబ్బు ఖర్చు
చేసేము. అంతే
కాకుండా $80,000తో
ఒక కారు
కొనిచ్చాము. తమ
కుమారుడిపై సంవత్సరాలుగా
ఖర్చుపెట్టిన డబ్బు
తన కుటుంబం
దాచుకున్న జీవిత
పొదుపులోనిదని, అది
ఇప్పుడు పూర్తిగా
అయిపోయిందని పేర్కొన్నాడు.
వారు తమ
35 ఏళ్ల కుమారుడు
సాగర్ మరియు
అతని భార్య
నుండి ప్రతిగా
అడిగింది ఏమిటంటే
ఒక మనవడో
లేక మనమురాలో అందివ్వమన్నాము.
అది వారు
అందించడంలో విఫలమయ్యారు.
"అతన్ని
పెంచడానికి మేము
మా కలలను
చంపుకున్నాము" అని
ఆ జంట
తమ పిటిషన్లో
రాశారు. “మేము
అతని చదువు
కోసం 2 మిలియన్ రూపాయల
($25,800)
అప్పు కూడా
తీసుకున్నాము. అయితే
మేం ఎన్ని
ప్రయత్నాలు చేసినా
మనవడినో/మనుమరాలినో
ఇవ్వకుండా నా
కొడుకు, అతని
భార్య మమ్మల్ని
మానసికంగా హింసించారు.
సమాజం కూడా
మమ్మల్ని ప్రశ్నిస్తోంది.
ఇది మాకు
మరింత బాధను
కలిగిస్తోంది"
దంపతుల న్యాయవాది
అరవింద్ కుమార్
శ్రీవాస్తవ ప్రకారం, తల్లిదండ్రులు
ఇప్పుడు తమ
కొడుకుపై క్లెయిమ్
చేసిన, తాము
ఖర్చు పెట్టిన
25
మిలియన్ల రీపేమెంట్
కోసం చూస్తున్నారు.
అదనంగా మరో
25
మిలియన్ రూపాయల
నష్టపరిహారం చెల్లించాలని
చూస్తున్నారు. లేదా, సాగర్
మరియు అతని
భార్య, శుభాంగి
కేవలం ఒక
సంవత్సరంలోపు గర్భవతి
కావచ్చు. అప్పుడు
దావా ఉపసంహరించకోబడుతుంది.
"మానసిక
క్రూరత్వం కారణంగా
వారు డబ్బు
డిమాండ్ చేస్తున్నారు"
అని ప్రసాద్
లాయర్ చెప్పారు.
“ప్రతి తల్లిదండ్రులకు
తాతగా మారాలనేది
కల. వాళ్ళు
తాతలు అవ్వాలని
కొన్నాళ్ళుగా ఎదురు
చూస్తున్నారు. వారు
కొడుకు మరియు
అతని భార్యను
ఒప్పించేందుకు
ప్రయత్నించారు, కానీ
వారు వీరి
డిమాండ్లను పట్టించుకోలేదు.
ఇప్పుడు మనవడిని
చూడకుండానే చనిపోతామని
గుండెలు బాదుకుంటున్నారు.”
ఇది ఖచ్చితంగా
అత్యంత అసాధారణమైన
వ్యాజ్యాలలో ఒకటి.
అయినప్పటికీ, ఇది
ఖచ్చితంగా మంచి
కంపెనీలో ఉంది.
తమ ఇంట్లో
నుండి బయటకు
వెళ్లడానికి నిరాకరించినందుకు
తమ 30 ఏళ్ల
కొడుకుపై దావా
వేసిన తల్లిదండ్రులు
మీకు గుర్తున్నారా? జీవితకాల
ఆర్థిక సహాయం
కోసం తన
తల్లిదండ్రులపై
దావా వేసిన
41
ఏళ్ల వ్యక్తి
గురించి మీకు
తెలుసా? కానీ
చాలా విచిత్రమైన
కుటుంబ వ్యాజ్యం
ఏముంటుందంటే తన
సమ్మతి లేకుండా
తనకు జన్మనిచ్చినందుకు
తల్లిదండ్రులపై
దావా వేసే
వ్యక్తి మాత్రమే
ఇంకా కనిపించలేదు!
Images Credit: To those who took the original
photos.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి