10, జూన్ 2022, శుక్రవారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-5

 

                                                                      పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                               PART-5

నరేందర్ తన చేతి రుమాలను చేతికి చుట్టుకుని తీసిన ఒక వస్తువు ఆష్ ట్రే’.

ఆష్ ట్రేలోపల నాలుగైదు బీడీ ముక్కలు కనబడగా-- నరేందర్ అడిగాడు.

గదిలో స్టే చేసింది ముఖ్యమంత్రి కూతురు, అల్లుడూనే కదా?”

...అవునండయ్య...

ముఖ్యమంత్రి అల్లుడికి బీడీ తాగే అలవాటుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా ఒక అనుమానంతో అడుగుతున్నా...అల్లుడు బీడీ తాగటం నివ్వెప్పుడైనా చూశావు

లేదండయ్యా...

అలాగైతే బీడీ ముక్కలకు సొంత వాళ్ళు ఎవరు?”

తెలియదయ్యా...

నీకు తెలియకుండా ఉండే ఛాన్సే లేదే?”

అప్పుడు గంగన్న చెమటతో ఉన్నాడు.

గౌతం అతని భుజాలు తట్టారు. తప్పు చేసిన వాడికే ఇలా చెమటలు పడతాయి. నువ్వుగా నిజం చెబుతావా...లేకపోతే నేను చెప్పించనా...?”

అయ్యా! నాకేమీ తెలియదయ్యా...

గౌతం! వీడ్ని ఇలా శాంతియుతంగా అడిగితే జవాబు చెప్పడు. కొంచం కుశలం విచారించండి...

గౌతం తన నడుముకు కట్టుకున్న బెల్టును నిదానంగా ఊడదీసాడు -- గంగన్న మోకాళ్ళపై కూర్చున్నాడు.

దన్నం పెట్టాడు. అయ్యా...! నన్ను కొట్టద్దయ్యా! నిజం చెప్పేస్తాను

చెప్పు...

అడవి ప్రాంతానికి ఎవరైనా వేటకు వస్తే, రాత్రి స్టే చేయటానికి గది దొరుకుతుందా అని అడుగుతారు. ఎక్కువ డబ్బులు ఇస్తారు...అలా  దొరికే డబ్బుకు ఆశపడి నిన్న రాత్రి ఇద్దరి మనుషులకు గదిని అద్దెకు ఇచ్చాను. ఇది గెస్ట్ హౌస్ యజమానికి తెలియకుండా చేస్తున్న కార్యం

నిన్న రాత్రి ఇక్కడున్న వారు ఎవరు...?”

పేరంతా తెలియదయ్యా...కానీ, బస చేసిన ఇద్దరూ మళయాల భాషలో మాట్లాడుకున్నారయ్యా. నిన్న రాత్రి వచ్చి బస చేసి రోజు ప్రొద్దున పది గంటలకల్లా బయలుదేరి వెళ్ళారండి...

సరే...! ముఖ్యమంత్రి కూతురూ, అల్లుడూ ఇప్పుడు ఎక్కడున్నారు...?”

దాని గురించి నాకేమీ తెలియదయ్యా

గౌతం...! కుశలం విచారించండి...

నరేందర్ చెప్పిన వెంటనే ఆయన చేతిలో ఉన్న బెల్టును పైకి ఎత్తేరు.

గంగన్న భయపడ్డాడు.

అయ్యా...నిజంగా ముఖ్యమంత్రి కూతురు గురించీ, అల్లుడు గురించీ నాకేమీ తెలియదయ్యా. యజమానికి తెలియకుండా గదులను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించటం తప్ప వేరే తప్పూ నేను చెయ్యలేదయ్యా

గౌతం చేతిలోని బెల్టు, బలంగా గంగన్న వీపు మీద పడింది.

అయ్యా.........!

చెప్పు...నిజం చెప్పు...

అయ్యా...! చనిపోయిన మా అమ్మగారి మీద ఒట్టేసి చెబుతున్నాను. నాకు ఏమీ తెలియదయ్యా...

మళ్ళీ కొట్టటానికి చెయ్యెత్తిన గౌతం ను ఆపిన నరేందర్ -- గంగన్న ని చూసాడు.

నిజంగా నీకు తెలియదా?”

తెలియదయ్యా...

సరే...గత ఒక నెలలో గెస్ట్ హౌస్ లో ఎంత మంది స్టే చేసుంటారు? అంటే మీ యజమాని అనుమతితో వచ్చిన వాళ్ళు

ముఖ్యమంత్రి అమ్మాయి, అల్లుడూ తప్ప వేరే ఎవరూ స్టేచెయ్యలేదండి...

డబ్బుకోసం నువ్వు ఎంతమందికి తావిచ్చావు...?”

ఏడెనిమిది మంది ఉంటారండి...

వాళ్ళ పేర్లూ, అడ్రస్సులూ అన్నీ తెలుసా?”

తెలియదు సార్...ఒక రాత్రి...రెండు రాత్రులు అని బస చేస్తారండి...ప్రొద్దున్నే వెళ్ళిపోతారండి...

ఆడవారూ ఇక్కడికి వస్తుంటారా..?”

వస్తారు...

గెస్ట్ హౌస్ లో మొత్తం ఎన్ని గదులు?”

పద్నాలుగు...

రా...వచ్చి...ఒకొక్కటీ చూపించు

గంగన్న బెల్టు తో దెబ్బ తిన్న చోటును చేత్తో తోముకుంటూ, గది బయట ఉన్న వరండాలో తడబడుతూ నడవటం మొదలుపెట్టాడు.

దారిలో వస్తున్న ఒక్కొక్క గదిని చూపగా -- నరేందర్ మరియూ గౌతం గదిలోకి వెళ్ళి చూపులతో చెక్ చేస్తున్నారు.

మొదటి అంతస్తులో ఏడు గదులు. రెండో అంతస్తులోనూ ఏడు గదులు.

అన్నిటినీ చూసుకుంటూ టెర్రస్ కు వచ్చారు. ఐదువేల చదరపు అడుగులతో టెర్రస్ బ్రహ్మాండంగా కనబడింది -- దాని చివరకు వెళ్ళి -- నిలబడి చూశారు.

కళ్ళకు కనిపించినంత దూరం వరకు చెట్లు దట్టంగా ఒకదాని నొకటి చేతులు పుచ్చుకున్నట్టు కనిపించాయి. సాయంత్రపు సంధ్యా సూర్య కిరణాలు, వోల్టేజీ తగ్గిన ఒక బల్బు లాగా మారి యుండగా, సాయం సమయం -- చీకటిలో దాక్కోటానికి నిమిషాలను లెక్క పెట్టుకుంటోంది.

గంగన్నా... నరేందర్ పిలిచాడు.

అయ్యా...!

గెస్ట్ హౌస్ కి రావటానికి అడవి ప్రాంతంలో ఎన్ని దోవలున్నాయి...?”

రెండు దార్లు ఉన్నాయయ్యా

రెండు దోవలూ ఏవెవో ఇక్కడ్నుంచే చూపించు...

అదిగో...ఎర్రటి పూత పడిపోయి ఒక చెట్టు తెలుస్తోందే... చెట్టు దగ్గర నుండి వెడితే ఒక దారి ఉందయ్యా. అందులో కారు పోలేదు. బైకులు మాత్రం పోవచ్చు

ఇంకో దారి...?”

గంగన్న తిరిగి చూసి పశ్చిమ దిశలో ఒక బాటను చూపించాడు.

బాటను అతికినట్టు ఒక దారి ఉందండి! అదే బంగళాకు వచ్చే కరెక్ట్ దారండి

అడవి ప్రాంతంలో ఎవరైనా నివాసమున్నారా...?”

లేరండయ్యా...

నరేందర్ ఇంకేదో అడగాలనుకున్నంతలో  -- అతను సాక్స్ వేసుకున్న కాలి లోపల ఏవో పాకుతున్న ఫీలింగ్.

వంగుని చూశాడు.

గండు చీమలు.

కాలు విధిలించి -- చీమలను వదిలించుకుని చూపులను కిందకు తీసుకు వెళ్లాడు........

టెర్రస్ యొక్క పారాపెట్ గోడ అంచుల్లో నుండి చీమలు వరుసగా ఒక విధమైన మిలటరీ డిసిప్లేన్ తో వేగంగా వెడుతున్నాయి.

అయ్యా...! ఇలా జరగండి. గండు చీమ కుట్టిందంటే, తేలు కుట్టినంత నొప్పి పుడుతుంది...

నరేందర్ కొంచం జరిగి నిలబడి మళ్ళీ చీమల వరుసను చూశాడు.

చీమల నోటి దగ్గర ఏదో నల్లని ముక్కలు.

నరేందర్ బుర్ర గోక్కున్నాడు.

బాగా శుభ్రంగా ఉండే టెర్రస్ పారాపెట్ గోడలో ఇన్ని చీమలకు ఏం తిండి దొరికుంటుంది...?

గౌతం అడిగాడు.

ఏమిటి నరేందర్...! చీమల్నే చూస్తూ నిలబడ్డారు

చీమల నోరు చూశారా?”

నల్లగా దేన్నో పట్టుకోనుంది...

అది ఏమిటో తెలియటం లేదే...?”

దానికి నచ్చిన -- తినే వస్తువుగా ఉంటుంది

గౌతం చెబుతున్నప్పుడే, చీమల వరుసను చూస్తూ అవి ఎటు నుండి వస్తున్నాయో, రెండో వరస ఎక్కడికి వెడుతోందో చూడటానికి నడిచాడు నరేందర్.

చీమల వరుస టెర్రస్ యొక్క పారాపెట్ గోడ అంచులో హుషారుగా పోతూ -- టెర్రస్ చివరిలో ఉన్న ఒక వాటర్ ట్యాంక్ దగ్గర ముగిసి -- వాటర్ ట్యాంక్ ఎడమ వైపు చిన్న విరిగిన గోడ సంధులోకి వెడుతున్నాయి...వస్తున్నాయి.

నరేందర్ పక్కనే నిలబడున్న గంగన్న ను చూసాడు.

ఇదేమిటి, వాటర్ ట్యాంకా...?”

ముందు ఇది నీటి తొట్టిగా ఉండేదయ్యా. ఇందులో పగుల్లు ఉన్నాయని చెప్పి తొట్టిలోపల మట్టిపోసి మూసేసి, పైన సిమెంటు వేసి మూశాసారు. తొట్టికి బదులు ఒక కొత్త తొట్టిని కట్టాశాము... మూల చూసారా...అదే కొత్త నీటి తొట్టి...

నరేందర్ కొత్త వాటర్ ట్యాంకును చూసేసి -- మళ్ళీ కిందకు వంగి చీమల వరుసను చూసాడు. పక్కన పడున్న ఒక చెక్కను తీసుకుని--ఒక చీమను మాత్రం వరుసలో నుంచి తోసి, దాని నోటిలో ఉన్న నల్లని ఆహార ముక్కను చూసాడు.

చీమ దాన్ని వదిలేసి పరుగుతీయగా -- నరేందర్ ఆహర ముక్కను చెక్కతో కెలక -- అది చెక్కకు అతుక్కుంది.

గంగన్నా

అయ్యా!

కిందకు వెళ్ళి ఒక గాజు గ్లాసులో నీళ్ళు నింపి, అందులో కొంచం ఉప్పు వేసి  తీసుకురా..."

సరేనయ్యా...

గంగన్న తల ఊపి అక్కడ్నుండి జరుగగా -- గౌతం పక్కకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

నరేందర్! ఇప్పుడెందుకు చీమ పరిశోధన?”

పరిశోధన చీమ గురించి కాదు, గౌతం...

మరి...?”

దాని నోటిలో ఉన్న ఆహారం ముక్క గురించి

ఏమిటి నీ అనుమానం...?”

అది చర్మం ముక్క అయ్యుండచ్చు...! అందులోనూ ఒక మనిషి యొక్క చర్మం తోలు ముక్క...

నరేందర్...! అంటూ ఆశ్చర్యంతో గౌతం చూడగా, నరేందర్ నవ్వాడు.

ఉప్పు కరిగిన నీళ్ళు రానివ్వండి. అందులో ఆహారం ముక్కను వేస్తే తెలిసిపోతుంది...

నరేందర్...! మీరు చెప్పేది నిజం అయితే, మట్టి పోసి నింపిన తొట్టె లోపల...

మనిషి దేహం ఉంటుంది...

మై-గాడ్--- గౌతం తల మీద చెయ్యి పెట్టుకున్నారు.

సరిపోయింది...! గెస్ట్ హౌస్ లోపలకు వచ్చీరాగానే ఇలా ఒక సమస్యా...?”

                                                                                                                   Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి