23, జూన్ 2022, గురువారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-10

 

                                                                   పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                                  PART-10

ఇన్స్పెక్టర్ మొహన్ ఇరవై నిమిషాల తరువాత వేగంగా మేడ మీదకు వచ్చాడు.

గౌతం అడిగాడు.

ఏమిటి మిస్టర్ మొహన్...! కాకిపాలెం పోలీస్ స్టేషన్ కి వయర్ లెస్ లో మాట్లాడి, వీరప్ప గురించి అడిగారా...?”

అడిగాను సార్...వాళ్ళు కూడా వెంటనే గ్రామంలో విచారించి సమాచారం ఇచ్చారు...

ఏమిటా సమాచారం?”

వీరప్ప పదిహేను రోజుల కిందటే చనిపోయాడట...

ఏమిటీ? వీరప్ప చనిపోయాడా...?”

అవును సార్…”

ఎలా...?”

ఒంట్లో బాగుండక వారం పది రోజులు హాస్పిటల్లో ఉన్నాడట. కిడ్నీ ఫైల్యూర్ అయి చనిపోయాడట

ఇంకేమైనా సమాచారం ఉందా?”

వీరప్ప కి ఫ్యామిలీ లేదు. ఒంటరి వాడు. పని. ఇళ్ళు కట్టే మేస్త్రీ. సగం రోజులు పనికే వెళ్ళడట. మిత్రులూ, బంధువులూ ఎవరూ లేరు కాబట్టి ఊరి ప్రజలే శవాన్ని తీసుకు వెళ్ళి దహనం చేసేరట

గౌతం తల పట్టుకున్నాడు.

అంతా గందరగోళంగా ఉంది...పోలీస్ కుక్క స్మెల్ చేసేసి ఎక్కడికీ వెళ్ళకుండా ఇక్కడే కూర్చుండి పోయింది.ఇది ఒక నెలకు ముందు జరిగిన సంభవం. హంతకుల స్మెల్ చెరిగిపోయుంటుంది. అందువలన కుక్క వలన ఎటూ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అని డాగ్  స్క్వాడ్ లీడర్ చెప్పాడు

సార్...! పాత ట్యాంకులో ఒక శవాన్ని పూడ్చి పెట్టి, కొత్త ట్యాంకును కట్టాలంటే ఒక ఇళ్ళు కట్టే మేస్త్రీ లేకుండా చేయలేరు. మేస్త్రీ వీరప్పగా ఉండొచ్చు. నేను ఎందుకైనా మంచిది ఇప్పుడే కాకిపాలెం గ్రామానికి వెళ్ళి వీరప్ప తలదాచుకున్న ఇంట్లో శోధన చేసి, ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తాను... ఇన్స్పెక్టర్ మొహన్ చెప్పాడు.  

ప్లీజ్...అది చెయ్యండి... అన్నాడు గౌతం.

                                                                             ******************************

ఢిల్లీ నుండి వచ్చిన ప్రత్యేక టాస్క్ బృందం, పెద్ద అధికారులు ఐదుగురు -- ముఖ్యమంత్రి విజయలక్ష్మి కీ, ఆమె భర్త నాగరాజు కూ ముందు అటేన్షన్ లో నిలబడ్డారు.

మ్యాడమ్...! మీ యొక్క కూతురు, అల్లుడూ కిడ్నాప్ చేయబడి ఉండటం సాధారణ విషయం కాదు. వ్యవహారాన్ని టాకిల్ చేయటానికి ఒక క్రిమినల్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ పోలీస్ అధికారిని వేరుగా అపాయింట్ చేసి అడవికి పంపించటం తప్పు... సమస్యను ఎదుర్కోవటానికి మీరు స్పేషల్ కమాండో బృందాన్ని పంపిచి ఉండాలి

విజయలక్ష్మి భర్త కళ్ళల్లో ఉబికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ నా కూతురు, అల్లుడూ కిడ్నాప్ చేయబడటం బయట ప్రపంచానికి తెలియక ముందే వాళ్ళను విడిపించుకు రావాలనే ఆలొచనతోనే యాంటీ-టెర్రరిస్ట్ స్పేషల్ పోలీస్ అధికారి నరేందర్ గారిని పంపించాము...ఇందులో తప్పూ లేదే...?”

అధికారులలో ఒకరు అన్నారు. మిస్టర్ నరేందర్ చాలా టాలంటడ్ అధికారే. ఒప్పుకుంటాము. కానీ ఇది ఒంటరి మనిషి చేయగలిగే కార్యం కాదు. ఒక ముఖ్యమంత్రి కూతుర్నీ, అల్లుడ్నీ కిడ్నాప్ చేసిన గుంపు మామూలు గుంపు అయ్యిండదు. ఎన్నో ముందేర్పాట్లు చేసుకునే కిడ్నాప్ చేసుంటారు. కాబట్టి, వాళ్లను అంత సులభమైన మనుషులుగా మనం లెక్క వేయడం తప్పు...

విజయలక్ష్మి ఏడుస్తున్న స్వరంతో అడిగింది. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి...

అడవి ప్రాంతానికి వెళ్ళిన నరేందర్ ఏదైనా వివరం ఇచ్చారా?” 

ఇచ్చారు...

ఏం వివరం ఇచ్చారు...?”

ఎర్రశిలా అడవి ప్రాంతానికి ఇప్పుడే వెళ్ళినట్లు, త్వరలోనే కిడ్నాపర్లను కనిపెట్టేస్తానని, త్వరలోనే నా కూతురునూ, అల్లుడినీ విడిపించబోతున్నట్టు చెప్పారు

క్షమించాలి మ్యాడమ్...అంతపెద్ద అడవి ప్రాంతంలో ఒక మిలటరీ బెటాలియన్ లోపలకు వెళ్ళి వెతికినా, కిడ్నాప్ చేసిన బృందాన్ని కనుక్కోలేరు. మిస్టర్ నరేందర్ ఒక ఒంటరి మనిషిగా నిలబడి మీ కూతుర్ని, అల్లుడ్నీ రెస్క్యూ చేస్తాననడం సాధ్యమే కాదు...

సరే...మీ ప్లాన్ ఏమిటి?” నాగరాజు అడిగారు.

రోజు రాత్రికే నాలుగు కమాండో బృందాలు ఢిల్లీ నుండి విమానం ద్వారా వైజాగ్ వెళ్ళి జేర్తారు. వైజాగ్ చేరిన కొన్ని గంటల సమయంలో వాహనాలలో వాళ్ళు ఎర్రశిలా అడవి ప్రాంతానికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు తెల్లవారు జామున నుండి వేతకటం మొదలు పెడతారు

నాగరాజు కళ్ళల్లో నీటితో అధికారులను చేతులెత్తి నమస్కరించాడు.

మిమ్మల్నందరినీ దేవతలుగా అనుకుని, ముఖ్యమంత్రి భర్త అనే అధికారంతో కాకుండా, ఒక కూతురికి తండ్రిగా అడుగుతున్నాను. మాకున్నది ఒకత్తే కూతురు. ఆమె మాకు ప్రాణాలతో దక్కకపోతే మేమిద్దరం ప్రాణాలతో ఉండము...మా కూతుర్నీ, అల్లుడ్నీ కాపాడండి

అధికారులలో ఒకరు అడిగారు. కిడ్నాపర్లు వాళ్ళ కోరికలు ఏమైనా చెప్పారా?”

ఇంతవరకు చెప్పలేదు. తరువాతి సీ.డీ. వచ్చేంత వరకు కాచుకోనుండమన్నారు...

మిస్టర్ నరేందర్ ఇప్పుడు సెల్ ఫోన్ లో దొరుకుతారా...?”

ప్రయత్నం చేద్దాం...

చెప్పిన విజయలక్ష్మి తన సెల్ ఫోన్ తీసి నరేందర్ సెల్ ఫోనుకు ఫోను చేసింది.

కనెక్షన్ దొరకలేదు.

మళ్ళీ...మళ్ళీ...

నరేందర్ యొక్క సెల్ ఫోన్ అవతలసైడు పట్టుదలతో మౌనంగా ఉండిపోయింది.

                                                           **********************************

రాత్రి సమయం తొమ్మిది గంటలు.

రెడ్ రోజ్ గెస్ట్ హౌస్ లో పోర్టికోలో అటూ, ఇటూ నడుస్తున్నాడు గౌతం.

నరేందర్ ఇంకా అడవి ప్రాంతం నుండి తిరిగి  రాలేదు!

నరేందర్ కు ఏమైయుంటుంది...?’

గౌతం కు పొత్తి కడుపులో తిప్పింది. వైజాగ్ నుండి కాపలాకు వచ్చిన  సబ్-ఇన్స్పెక్టర్  ఒకతను, పరిస్థితిని అర్ధం చేసుకుని దగ్గరకు వచ్చి అడిగాడు.

సార్...! ఒక పోలీస్ బృందంతో లోపలకి వెళ్ళి వెతుకుదామా...? అడవి లోపల ఆయనకు ఏదైనా ఆపద ఎదురై ఉండొచ్చు...

ఆయన ఆపదలొ చిక్కుకునే వ్యక్తి కాదు. ఒక వేల చిక్కుకున్నా, జయించుకుని వచ్చేస్తారు...

అయినా కానీ అది ఒక అడవి ప్రాంతం...! ఎందుకైనా మంచిది ఒకసారి లోపలకు వెళ్ళి చూసొద్దాం...

ఇప్పుడు టైమెంత...?”

తొమ్మిది ఐదు సార్...

ఇంకో అరగంట చూద్దాము... అని చెప్పిన గౌతం గెస్ట్ హౌస్ వాకిటి పక్క గేటును చూసుకుంటూ చెమటలు కార్చుకుంటూ నడిచాడు.

ఆందోళనతో ఆయనకు బి.పి. ఎక్కువై, తల తిరుగుతున్నట్టు అనిపించింది.

ఒక మాత్ర వేసుకోవాలి. లేకపోతే  కింద పడిపోతాం...

ఆలొచించిన ఆయన బి.పి. కంట్రోల్ మాత్ర తీసుకోవటం కొసం తన గదికి వైపుకు నడిచారు.

హృదయం లోపల భయం.

నరేందర్ ఎందుకు రాలేదు...?’

కిడ్నాపర్ క్రిమినల్స్ చేత కిడ్నప్ చేయబడుంటాడో...?’ తల తిప్పటం ఎక్కువైంది.

ఆలొచిస్తూ నడుస్తున్న గౌతం వరాండాలో నడుచుకుంటూ, తన గది దగ్గరకు వెళ్ళి -- తలుపు మీద చిన్నగా చెయ్యి పెట్టి తోశాడు.

లోపలకు వెళ్ళాడు.

చూపులు గదిలోకి వెళ్ళగా  --  సంతోషంలో అధిరిపడ్డాడు.

నరేందర్ మంచంలో వెనక్కు ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు.

గౌతం పరిగెత్తుకు వెళ్ళి నరేందర్ ను కౌగలించుకున్నాడు. నరేందర్...!

నరేందర్ కళ్ళు తెరిచి నవ్వాడు ఏమిటి గౌతం...చాలా ఎమొషనల్ అయిపోయారా...?”

మరి...? అవును, అడవి నుండి ఎప్పుడు తిరిగొచ్చావు...?”

నేనొచ్చి ఒక గంట అవుతోంది....వాకిలి ద్వారం నుండి రాలేదు. బంగళా యొక్క వెనుక పక్క గోడ ఎక్కి దూకి వచ్చాను...కొన్ని విషయాలను దూరంగా ఉండి గమనించటానికే ఎవరి కంటిలోనూ పడకుండా గదిలో ఉంటూనే గమనిస్తూనే ఉన్నాను...మీరు, ఇన్స్పెక్టర్ మొహన్ మాట్లాడుతున్నదీ , పొస్ట్ మార్టం వ్యాను వచ్చి పాత నీళ్ళ ట్యాంకులో ఉన్న బాడీని, తగలబడిపోయిన గంగన్న బాడీనీ తీసుకువెళ్ళటం ఇలా అన్నిటినీ చూస్తూనే ఉన్నాను. గుర్తు తెలియని శవం చేతి వేలుకు ఉన్న ఉంగరం మీ దగ్గరే కదా ఉంది...?”

అవును...

అది ఇటు ఇవ్వండి

గౌతం ఒక పాలీతీన్ పేపర్లొ చుట్టిపెట్టున్న ఉంగరాన్ని తీసిచ్చాడు.

నరేందర్ దానిని చూసి సన్నటి స్వరంతో అడిగాడు.

ఉంగరం మీదున్న కె అక్షరం చూసి అది ఎవరనేది గ్రహించారా గౌతం...?”

లేదు! ఇన్స్పెక్టర్ మొహన్ కాకిపాలెం గ్రామానికి వెళ్ళి వీరప్ప ఇల్లంతా పరిశోధించిన తరువాతే కె అక్షరం వేసున్న మనిషి ఎవరనేది తెలుస్తుంది...

నరేందర్ నవ్వాడు.

గౌతం! మనం ఇప్పుడు వెంటనే హైదరాబాద్ బయలుదేరుతున్నాం...."

హైదరాబాదు కా...?”

...

దేనికి నరేందర్...? ఇప్పుడే మనం కేసులోకి దూరాము. ముఖ్యమంత్రి అమ్మాయి, అల్లుడూ ఎక్కడున్నారో తెలియదు. తగలబెట్టబడిన గంగన్న -- పాత నీళ్ళ తొట్టిలో ఒక మహిళ శవం...అంటూ ఇక్కడ ఎన్నో ప్రాబ్లంలు. పరిస్థితిల్లో మనం హైదరాబాద్ వెళ్ళి ఏం చెయ్యబోతాం...?”

హైదరాబాద్ కు వెళ్ళి కొన్ని విషయాలు క్లియర్ చేసుకు రావాలి...

నరేందర్ మీరు చెప్పేది నాకేమీ అర్ధం కావటం లేదు...

కొద్ది క్షణాల మౌనం తరువాత నరేందర్ చెప్పటం మొదలుపెట్టాడు. గౌతం...! నేను అడవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినై. ఒకడు  ఒక మిషన్ గన్నుతో నన్ను  పట్టుకున్నాడు. నన్నొక ఊబి దగ్గరకు తీసుకు వెళ్ళి దాంట్లోకి తొసేద్దామని చూశాడు. కాని నేను వాడిని కొట్టి వాడి దగ్గరున్న తుపాకీని లాగేసుకున్నాను. అతను తప్పించుకుని పారిపోదామని చూశాడు.  నేను కాల్చేశాను. అతను ఆక్కడిక్కడే చనిపోయాడు. వాడి దుస్తులను వెతికాను...ఒక మొబైల్ ఫోనూ, బనీను లోపల పెట్టుకున్న ఒక ఐదువందల రూపాయల కట్ట దొరికింది...

చెప్పిన నరేందర్ తన బనీనులోపల చేతులు పోనిచ్చి ఒక చిన్న మొబైల్ ఫోను, కొత్త ఐదువందల రూపాయల నోట్ల కట్ట తీసి మంచం మీద పెట్టాడు.

వాటిని గౌతం ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడే నరేందర్ మళ్ళీ చెప్పటం కొనసాగించాడు. 

చనిపోయిన అతని దుస్తులను మళ్ళీ పరిశోధిస్తూ, ఇంకేదైనా దొరుకుతుందేమోనని వెతుకుతున్నప్పుడు మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. తీసి ఆన్ చేసి చెవిదగ్గర పెట్టుకున్నా. అవతలసైడు నుండి డేవిడ్... డేవిడ్ అంటూ ఎవరో పిలిచారు. నేను ఎస్ అని సమాధానమిచ్చాను. వెంటనే కనెక్షన్ కట్ అయ్యింది. అంటే నా గొంతు డేవిడ్ గొంతులాగా లేదని అవతల పక్క ఉన్న వ్యక్తికి తెలిసిన వెంటనే కనెక్షన్ కట్ చేసాడు"

అంటే...చనిపోయిన వ్యక్తి పేరు డేవిడ్...?”

అవును...

అవతలసైడు మాట్లాడిన గొంతు ఎలా ఉన్నది, నరేందర్...?”

కొంచం బొంగురుతో ఉన్న మగ గొంతుక. గొంతును ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టు ఉంది...

ఎక్కడ...?”

దాని గురించే గత రెండు గంటలుగా ఆలొచన చేస్తున్నాను...పక్షి వలలొ చిక్కనే లేదు...

డేవిడ్ యొక్క శరీరం ఇప్పుడు ఎక్కడ...? అడవిలోనే పడేసి వచ్చాసారా నరేందర్...?”

లేదు...

మరి...

నేను డేవిడ్ ను కాల్చినప్పుడు వచ్చిన తుపాకీ శబ్ధాన్ని గమనించి ఫారెస్ట్ అధికారులు  వెంటనే చోటుకు వచ్చి చేరారు. నేను ఎవరనేది తెలిసిన వెంటనే కావలసిన సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. డేవిడ్ యొక్క శవాన్ని వైజాగ్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళమని చెప్పి నేను వెనుతిరిగాను....

సరే! మనం ఇప్పుడు ఎందుకు హైదరాబాదుకు వెళ్ళ బోతున్నాం...?”

ఐదు వందల రూపాయల నోట్ల కట్ట మీద అతికించున్న కాగితం ముక్కను చూశారా గౌతం?”

గౌతం ఆ నోట్ల కట్టను చేతిలోకి తీసుకుని చూశాడు. అన్నీ కొత్త నోట్లు -- రబ్బర్ బ్యాండ్ వేసున్న చోట ఒక చిన్న కాగితం ముక్క అతికించబడి ఉంది. కాగితం ముక్కపై అచ్చు చేయబడ్డ అక్షరాలు బాగానే కనిపించినై. అది హైదరాబాద్ బ్యాంకు బ్రాంచ్ పేరు.

నరేందర్ ను తల ఎత్తి చూశాడు గౌతం.

బ్యాంకులో నుండి డేవిడ్ డబ్బులు తీసుంటాడు అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారా నరేందర్...?” 

ఉండొచ్చు! అయినా నాకు ఒక సందేహం...

ఏమిటది...?”

రూపాయి నోటు కట్ట మీద అతికించబడిన కాగితం ముక్కను మళ్ళీ ఒకసారి చూడండి -- బ్యాంకు పేరుకు పైన పెన్సిల్ తో రాసున్న మూడ ఆంగ్ల అక్షరాలు కనబడుతున్నాయే, చూశారా...?”

అవును...! HCJ అని రాసుంది

దానికి ఏమిటి అర్ధం...?”

అది బ్యాంకీ వాళ్ళ రహస్య గుర్తు అయ్యుంటుంది

లేదు గౌతం...! నాకు దగ్గర దగ్గర అన్ని బ్యాంకుల రహస్య గుర్తులు తెలుసు. HCJ అనేది కొంత వ్యత్యాసంగా ఉంది. దాన్ని కనిబెట్టటానికే హైదరాబాద్ వెడుతున్నాము. తోక యొక్క చివరి అంచు దొరికితే తల ఎక్కడుందో తెలుస్తుంది...

ఎప్పుడు బయలుదేరబోతున్నాం నరేందర్...?”

ఇప్పుడే...! వైజాగ్ వరకు కారు. అక్కడ్నుంచి తెల్లవారు జామున విమానం. ఏడు ఎనిమిది గంటల కల్లా మనం హైదరాబాద్ కు వెళ్ళి జేరి, పది గంటల కల్లా బ్యాంకు మేనేజర్ ముందు కూర్చుంటాము

Continued...PART-11

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి