13, జూన్ 2022, సోమవారం

పగటి పూట భూతాలు…(సీరియల్)...PART-6

 

                                                                     పగటి పూట భూతాలు…(సీరియల్)                                                                                                                                                                PART-6

డేవిడ్!

పిలుస్తూనే ఎదురుకుండా నిబడున్న అతన్ని చూసింది కళావతి.

అతను భవ్యంగా, "మ్యాడమ్..." అన్నాడు.

జనగణమన కేశవ్ ను ఏం చేశావు?”

ప్రస్తుతానికి సెడెటివ్ ఇచ్చి స్పృహలో లేకుండా చేసుంచాను. రాత్రి పదకుండు గంటల తరువాతే డిస్పోజ్ చేయాలి...

జాగ్రత్త... కార్యం చేసినా అందులో మిగులు ఉంచకూడదు

నాకు తెలియదా మ్యాడమ్...?”

జనగణమన కేశవ్ కథను ముగించటానికి ముందు, నీకు ఇంకో పని ఉన్నది...

చెప్పండి మ్యాడమ్...

రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఎనిమిదిన్నర గంటల లోపు ట్యాంక్ బండ్ వెనుక ఉన్న రోడ్డులో ఉండే లాబరర్స్ శిల దగ్గర జస్టీస్ శివప్రసాద్ తన తెల్ల కార్లో వస్తారు

ఏదైనా సమాచారం అందించాలా మ్యాడమ్?”

సమాచారం ఏమీ లేదు. ఆయన ఒక బ్రీఫ్ కేసు ఇస్తారు. తీసుకునిరా...

ఎస్...మ్యాడమ్

ఆయన కారు దగ్గరకు వెళ్ళి, ఆయనతో మాట్లాడే ముందు చుట్టు పక్కల ఉన్న పరిస్థితులు ఒకటికి రెండు సార్లు గమనించు...

ఎస్...మ్యాడమ్....

బైకు నెంబర్ మార్చేయి...నీ మొహం గుర్తు తెలియకుండా హెల్మెట్ వేసుకో. మిగిలిన మొహాన్ని కనబడనివ్వకుండా కూలింగ్ గ్లాసు వేసుకో...

ఎస్...మ్యాడమ్...

సూట్ కేసులో ఐదు లక్షలు ఉంటాయి. జాగ్రత్తగా తీసుకురా...

నేను ఇక్కడ్నుంచి ఎన్ని గంటలకు బయలుదేరాలి మ్యాడమ్...?”

ఎనిమిదింటికి...

నేనొక్కడినే ఒంటరిగా వెడితే చాలుగా మ్యాడమ్?”

చాలు... ప్రతాప్ కి వేరే పని ఇచ్చాను...నువొక్కడివే పని ముగించుకునిరా ...

అతను తల ఊపి బయలుదేరుతున్న క్షణం -- కళావతి చెయ్యెత్తి చిటిక వేసి ఒక్క నిమిషం... అన్నది.

అతను ఆగాడు.

ఏమిటి మ్యాడమ్...?”

ఇది న్యాయమూర్తి వ్యవహారం. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి

మీరు చెప్పక్కర్లేదు మ్యాడమ్. నాకు వీపు వైపు కూడా రెండు కళ్ళు ఉన్నాయి...

డబ్బు జాగ్రత్త

నా ప్రాణమే పోయినా డబ్బు మీ చేతికి వచ్చి చేరుతుంది...

సరే! జనగణమన కేశవ్ ని ఎక్కడికి తీసుకు వెళ్ళి డిస్ పోస్ చేస్తావు...?”

రెండు రకాలుగా ఆలొచించి ఉంచాను మ్యాడమ్...

ఎలా? చెప్పు...

జనగణమన కేశవ్ ని హైదరాబాద్ అవుటర్ కు తీసుకు వెళ్ళి తగలబెట్టేద్దామని ఆలొచిస్తున్నా...లేదంటే...

చెప్పు...

రేపు తెల్లవారు జామున ఏనుగు దంతాలను తీసుకు రావటం కోసం ఇక్కడ్నుంచి నాకు తెలిసిన ఒక మనిషి ఎర్రశిలా అడవికి బయలుదేరి వెడుతున్నాడు. అతనితో నేనూ వెడతాను.

వ్యానులో ఉన్నప్పుడే జనగణమన కేశవ్ ని కూడా తీసుకువెడతాను. అక్కడ అడవికి వెళ్ళిన తరువాత, జనగణమన కేశవ్ కథను ముగించి, శవాన్ని డిజ్ పోస్ చేయటం సులభం..."

కళావతి నవ్వింది.

ఏది చెసినా, తరువాత ప్రాబ్లం రాకుండా చెయ్యి! ఎర్రశిలా అడవులకు వెళ్ళి ఎప్పుడు తిరిగొస్తావు?”

రెండు రోజుల్లో...

ఏనుగు దంతాలు దొంగరవాణా చేసే మనిషి ఎవరు?...మన ఫారెస్ట్ మినిస్టర్ గోవింద రాజులే కదా...?”

అవును...మ్యాడమ్...

కమీషన్ మాట్లాడుకున్నావా...?”

మాట్లాడ కుండా ఉంటానా మ్యాడమ్...?”

రెండు రోజుల్లో తిరిగి వచ్చేయి...ఆలశ్యం చెయ్యకు...ఇక్కడ హైదరాబాద్ లో చాలా పనులున్నాయి...

నాకు తెలియదా మ్యాడమ్...? రెండు రోజుల్లో అన్ని పనులూ ముగించుకుని ఇక్కడికి వచ్చేస్తాను...

బయలుదేరు...

నరేందర్, గౌతం ఇద్దరూ కాచుకోనుండగా -- గంగన్న ఒక గాజు గ్లాసులో ఉప్పు కరిగించిన నీటితో వచ్చాడు.

ఇదిగోనండయ్యా...

నరేందర్ ఉప్పు కలిపిన నీళ్ళల్లో చీమల దగ్గర నుండి సేకరించిన చర్మం ముక్కలను ఒక పుల్లతో గుచ్చి తీసి నీళ్ళల్లో వేశాడు.

నీళ్ళల్లోని చర్మం ముక్కలు తేలుతుండగా -- నరేందర్ వాటిని పుల్లతో తీసి శుభ్రం చేసి తీవ్రంగా గమనించాడు.

గౌతం...

ఏమిటి నరేందర్...?”

ఇది మనిషి చర్మం యొక్క ముక్కలే

ఎలా చెబుతున్నావ్ నరేందర్...?”

చర్మం ముక్కల యొక్క టిష్యూ స్ట్రక్చర్ చెబుతోంది. ప్రాణి, పక్షుల యొక్క చర్మం ముక్కలై ఉంటే, ఉప్పు నీటిలో వేసిన ఈ సమయానికి చర్మం ముక్కలు మరికొన్ని ముక్కలై ఉండేవి..." నరేందర్ చెప్పుకుంటూ గంగన్న వైపు తిరిగాడు.

గంగన్న మొహం ఇప్పుడు బొగ్గు నలుపుకు మారింది.

" గంగన్నా

అయ్యా...

పాత నీటి ట్యాంకును ఎప్పుడు మూసేసి, కొత్త ట్యాంకును కట్టారో తెలుసా...?”

ఒక రెండు నెలలు ఉంటుందయ్యా...

అప్పుడు నువ్వు పక్కనే ఉన్నావా?”

లేదండి...! నేనప్పుడు ఊరికి వెళ్ళానండి...

నీ ఊరు ఏది...?”

అమలాపురం దగ్గర కోరుమంచి గ్రామమండి

నువ్వెందుకు ఊరికి వెళ్ళావు...?”

ఊర్లో రెండు పెద్ద విషయాలు జరిగిపొయినై అయ్యా...వెళ్ళి చెయ్యాల్సింది చేసేసి వచ్చానయ్యా...

ఊర్లో ఎన్ని రోజులు ఉన్నావు...?”

రెండు వారాలు...

నువ్వు ఊరు వెళ్ళిన సమయంలో ఇక్కడ గెస్ట్ హౌస్ ఎవరి చూపుల్లో ఉండేది...?”

అది...వచ్చయ్యా...

...చెప్పు...

నాకు తెలిసిన ఒక మనిషిని చూసుకోమని చెప్పి వెళ్ళాను...

ఎవరా మనిషి...?”

అతని పేరు వీరప్ప...కాకిపాలెం లో వాడి ఇళ్ళు

నువ్వు ఊరెళ్ళిన రెండు వారాలూ, వీరప్ప ఇక్కడే ఉన్నాడా?”

అవునండయ్యా...

నువ్వు ఊరికి వెళ్ళేటప్పుడు బంగళాను ఎవరికి అద్దెకు ఇచ్చి వెళ్ళావు....?”

అప్పుడు ఎవరూ లేరండయ్యా...

సరే... నీటి తొట్టిని కట్టిందెవరు?”

అంతకు ముందే మాట్లాడుంచిన కూలీ పనోళ్ళు. పాత తొట్టిని మూసేసి, కొత్త తొట్టిని కట్టి వెళ్ళినట్టు నేను ఊరి నుండి తిరిగి వచ్చిన వెంటనే వీరప్ప చెప్పాడు

వీరప్ప ఇల్లు ఎక్కడుందని చెప్పావు...?”

కాకి పాలెం గ్రామం...

కరెక్టు అడ్రస్సు...?”

ఇంటి నెంబర్ అంతా తెలియదయ్యా... గ్రామానికి వెళ్ళి వీరప్ప ఇల్లు ఏదీ అని అడిగితే చెప్పేస్తారటయ్యా

ఇక్కడ పలుగు ఉందా?”

ఉందయ్యా...

తీసుకు వచ్చి ట్యాంకును పగులకొట్టు...

అయ్యా...

ఏమిటి...?”

ఇంటి యజమానిని ఒక మారు అడిగి చూద్దామయ్యా

ఎవరినీ అడగక్కర్లేదు. ట్యాంకు లోపల ఒక శవాన్ని పడేసి, మట్టి పోసి మూసేసి, ఇటిక రాళ్ళు పెట్టి సిమెంటుతో పూసి సమాధి చేసి వెళ్ళున్నారు. ఒక్కొక్క చీమనూ చూడు...వాటి నోటిలో బటానీ సైజుకు చర్మం ముక్క...లోపలున్న శవం ఎవరిదనేది తెలియాలంటే ఇప్పుడే తొట్టిని పగులకొడితేనే కుదురుతుంది! వెళ్ళి పలుగు తీసుకురా...

గంగన్న చెమెట కారుతున్న మొహంతో, కిందకు వెళ్ళగా నరేందర్ తన సెల్ ఫోన్ తీసుకుని -- విశాఖపట్నం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. తాను ఎవరిననేది పరిచయం చేసుకున్నాక అవతల సైడున్న ఇన్‌స్పెక్టర్ మోహన్ భవ్యమయ్యాడు.

చెప్పండి సార్...

రెడ్ రోస్ రెస్ట్ హౌస్ మీకు తెలుసా?”

తెలుసు సార్

వెంటనే జీపు వేసుకుని రండి. ఇద్దరు కానిస్టేబుల్స్, ఒక పోలీసు కుక్క, ఇక్కడే పోస్ట్ మార్టం చేయడానికి ఒక డాక్టర్, ఇద్దరు వార్డ్ బాయిస్...

ఎస్...సార్

పత్రిక వాళ్ళకు తెలియకూడదు...

ఎస్...సార్

నరేందర్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి పాత వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి దాన్ని చుట్టూ చూశాడు.

ట్యాంకును హడావిడిగా మూసేసారు అనేది మొదటి చూపులోనే తెలిసిపోయింది.

నరేందర్...

చెప్పండి, గౌతం...

మనం అడవికి వచ్చింది, ముఖ్యమంత్రి అమ్మాయినీ, అల్లుడ్నీ కనుక్కోవటానికి...కానీ, గెస్ట్ హౌస్ లోపల ఏవేవో చెడు కార్యాలు జరిగాయి. ఇక్కడ జరిగిన కార్యాలకూ,------ముఖ్యమంత్రి అమ్మాయి, అల్లుడ్నీ కిడ్నాప్ చేయటానికీ ఏదైనా సంబంధం ఉంటుందని అనుకుంటున్నారా?”

ఉండొచ్చు....ఉండకపోవచ్చూ. కానీ ఒక విషయం నిజం...

ఏమిటది...?”

ముఖ్యమంత్రి అమ్మాయీ, అల్లుడూ కిడ్నాప్ చేయటానికి కారణం రెడ్ రోస్ గెస్ట్ హౌస్ సంబంధించిన ఏదో ఒక సమస్యే... ట్యాంకులోపల ఉండే శవం ఎవరిదనేది తెలిస్తే, కేసులో కొంచం వెలుతురు దొరుకుతుంది

నరేందర్ చెబుతున్నప్పుడే -- గౌతం చిన్నగా ఆందోళన పడుతూ అడవి ప్రాంతంలోని ఎడమ వైపుకు చెయ్యి చూపించారు.

నరేందర్...అక్కడ చూడండి...

నరేందర్ తన చూపులను ఆయన చూపిన వైపుకు తీసుకు వెళ్ళగా ----

బంగళా నుండి వంద మీటర్ల దూరంలో చెట్ల మధ్య నుండి చిన్నగా పొగ వస్తోంది.

హఠాత్తుగా పొగ ఎలా...

అక్కడ ఎవరో ఉన్నారు నరేందర్...

గౌతం! మీరు ఇక్కడే  ఉండండి...నేను వెళ్ళి అది ఏమిటో చూసొస్తాను...

నరేందర్...! నేనూ రానా...?”

వద్దు. పలుగుతో గంగన్న వచ్చిన వెంటనే వాటర్ ట్యాంకును పగులకొట్టే పని వెంటనే జరగాలి....

చెప్పేసి, నరేందర్ పరిగెత్తుతూ, నడుస్తూ మేడ మీద నుండి కిందకు దిగి వచ్చి -- హాలులోకి వచ్చి  -- బంగళా బయటకు పరిగెత్తాడు.

అడవి యొక్క ఎడమ వైపు చెట్లకు పైన పొగ కనబడింది.

నరేందర్ పరిగెత్తే వేగాన్ని పెంచాడు.

చెట్లతో దట్టంగా ఉన్న చోట సన్నని కాలిబాట కనబడగా -- నరేందర్ షూ శబ్ధం చేస్తూ పరిగెత్తాడు.

చిన్న చిన్న మొక్కలను తాక్కుంటూ వెళ్ళాడు.

రెండు నిమిషాల పరుగు.

పొగ వస్తున్న చోటు వచ్చింది. దట్టమైన కారు నలుపు పొగ మండలం.

నరేందర్ ఇంకా పక్కకు వెళ్ళాడు.

ఒక మనిషి దేహం తట్టుకోలేక కొట్టుకుంటూ...కాలుతున్నది కనబడింది.

గాలిలో నెత్తురు, చర్మం కాలే వాసన.

                                                                                                                   Continued...PART-7

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి