3, జూన్ 2022, శుక్రవారం

రేడియో పేళుళ్ల సంకేతాలు గ్రహాంతరవాసులవేనా?...(ఆసక్తి)

 

                                                   రేడియో పేళుళ్ల సంకేతాలు గ్రహాంతరవాసులవేనా?                                                                                                                                                                  (ఆసక్తి)

2007 లో, ఖగోళ శాస్త్రవేత్తల బృందం వింతైనదాన్ని గుర్తించారు-రేడియో తరంగాల శక్తివంతమైన పేలుడు. అది కనిపించినంత త్వరగా అదృశ్యమైంది. వారు వింత సంఘటనను "వేగవంతమైన రేడియో పేలుడు" అని పిలిచారు. అప్పటి నుండి శాస్త్రవేత్తలు విషయాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఎక్కడో 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రోదసీలో ఉన్న ఒక కుబ్జ పాలపుంతనుంచి 15 రేడీయో పేళుళ్ల సంకేతాలు వెలువడ్డాయి. పైన తెలిపినట్లు 2007 మొదటిసారి. తరువాత 2012 లో ఒకసారి, 2015 లో ఒకసారి, 2016 లో ఒకసారి

గ్రహాంతర వాసులపై భిన్న కథనాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వారు ఉన్నారని కొందరు అవన్నీ ఒట్టి పుకార్లని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు వారిపై కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. గ్రహాంతరవాసుల నుంచి రేడియో పేళుళ్ల సంకేతాలు వస్తున్నాయని చెబుతున్నారు.

రేడియో సంకేతాలు గ్రహాంతర వాసులు తమ వ్యోమనౌకలను స్టార్ట్ చేయడానికి ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన కాంతిపుంజాలు కావచ్చని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం మార్క్జుకెర్బెర్గ్, స్టీఫెన్హాకింగ్, యూరీ మిల్నర్రూ.640 కోట్లతో చేపట్టిన బ్రేక్త్రూ లిజన్ప్రాజెక్టులో ఆసక్తికర విషయాలు తెలిసాయి.

వెస్ట్వర్జీనియాలోని గ్రీన్బ్యాంక్రేడియో టెలిస్కోప్, హామిల్టన్పర్వతంపై ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ప్లానెట్ఫైండర్, ఆస్ట్రేలియాలోని పార్క్స్రేడియో టెలిస్కోపు సాయంతో గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

సంకేతాలు వెలువడినప్పుడు మన సౌరవ్యవస్థ వయసు 200 కోట్ల సంవత్సరాలని, సమయానికి మన భూమ్మీద ఏక కణ జీవులు మాత్రమే ఉన్నాయని.. ఏక కణ జీవులు బహు కణ జీవులుగా పరిణామం చెందడానికి మరో 100 కోట్ల ఏళ్లు పట్టిందని బ్రేక్త్రూ లిజన్ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు.

అయితే ఫాస్ట్రేడియో బరస్ట్స్‌ (ఎఫ్ఆర్బీ- రేడియో సంకేతాల)ను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 2012 నవంబరు 2 ఆస్ట్రేలియాలో పార్క్స్టెలిస్కోప్ద్వారా గుర్తించారు.

రేడియో సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకపోయినా. చోటుకుఎఫ్ఆర్బీ 121102' అని పేరు పెట్టారు. తర్వాత ఇది పదేపదే సంకేతాలు వెలువరిస్తున్నందున దీన్నిరిపీటర్'గా కూడా వ్యవహరిస్తున్నారు. సంకేతాలు 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్వార్ఫ్గెలాక్సీ నుంచి వస్తున్నట్టు గత ఏడాదే గుర్తించారు కూడా.

తాజాగా ఆగస్టు 26 విశాల్గజ్జర్‌.. అక్కడి నుంచి వచ్చిన 15 బర్స్ట్స్ను గుర్తించారు. గతంతో పోలిస్తే వీటి తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువగా ఉందని బ్రేక్త్రూ లిజన్ప్రోగ్రామ్డైరెక్టర్ఆండ్రూ సైమన్తెలిపారు.

Images Credit: To those who took the original photos.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి