మాతృత్వం (కథ)
మాతృత్వం
స్త్రీలకు దేవుడిచ్చిన వరం. మాతృత్వం ఓ మధురానుభూతి. సృష్టిలోనే మధురమైనది..
మాతృత్వం... వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని... పండంటి బిడ్డకు
జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది.
సంతానలేమి
కారణంగా మహిళ సామాజికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో
ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే వాటిని మౌనంగా భరించాల్సి వస్తోంది. పిల్లలు
లేకపోతే ఆమె పరిపూర్ణం కాదనే భావన చాలామందిలో ఉంది. అందమైన కలలకు, మధురమైన అనుభూతులకు, ప్రతిరూపమే మాతృత్వం. పండంటి
బిడ్డకు జన్మనివ్వడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టగల త్యాగమే మాతృత్వం. నవమాసాల యజ్ఞఫలమే మాతృత్వం.
గౌరికి
పిల్లలు పుట్టడం సాధ్యం కాదని ఆమెను పరీక్ష చేసిన డాక్టర్లు చెబుతారు. సరోగసి
ద్వార పిల్లలను కనవచ్చు అని సలహా ఇస్తారు. సరొగసికీ ఒక మహిళను వెతికే ప్రయత్నంలో
ఉన్నప్పుడు, గౌరి భర్త యొక్క ప్రాణ స్నేహితుని భార్య అర్చన,
‘అద్దె గర్భానికి మహిళను వెతకొద్దు, నేనే నీకు
సరొగసీ మహిళగా ఉంటాను’ అని సలహా ఇస్తుంది. ప్రాణ
స్నేహితులిద్దరూ సంతోష పడతారు. గౌరి బిడ్డ అర్చన కడుపులో పెరుగుతున్నప్పుడు సడన్
గా గౌరికి, ఆమె భర్తకు మనస్పర్ధలు ఏర్పడటంతో గౌరి అర్చన
దగ్గరకు వచ్చి బిడ్డ మాకు అవసరం లేదు, అబార్షన్ చేయించేసుకో
అని చెబుతుంది.
కొన్ని
నెలలుగా గౌరి బిడ్డను తన గర్భంలో మొస్తున్న అర్చన, గౌరి
చెప్పిన మాటకు ఆశ్చర్యపోయి, గౌరి తప్పు చేస్తున్నట్టు,
మాతృత్వం అనేది ఒక మహిళకు ఎంత ముఖ్యం అనేది చెబుతుంది. కానీ గౌరి
అర్చన మాటను పెడచెవిన పెడుతుంది. గౌరి, అర్చనల మధ్య మాటల
ఘర్షణ జరుగుతుంది.
గౌరి
చెప్పిన మాటవిని అర్చన అబార్షన్ చేయించుకుందా? గౌరి,
అర్చనల మధ్య జరిగిన మాటల ఘర్షణ సారంశం ఏమిటి? ఆ
తరువాత ఏం జరిగింది?....ఈ కథ చదివి తెలుసుకోండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మాతృత్వం...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
https://teluguvyasalu.com/telugulo-vyasalu/
రిప్లయితొలగించండి