ప్రేమించుకోవచ్చు...ఎప్పుడు? (కథ)
రెండక్షరాల చిన్న పదం ప్రేమ. రెండు హృదయాల మధ్య మొలకలా అంకురించి, వికసించి, వటవృక్షమై వ్యాప్తి చెంది, అంతా తానై ఉండే సమ్మొహనం. అది బౌతిక రూపం లేనిది, మనసులకు గొచరించేది ప్రేమ!
మానవ జీవితంలో ప్రేమదే అగ్రస్థానం. ఆప్యాయంగా మాట్లాడుకోవటం, మనసులు పంచుకోవడం ----గొప్ప శకినిస్తాయి. తనకోసం ఆలొచించే ఒక వ్యక్తి ఉన్నారన్న భావన ప్రేమ వల్ల ఏర్పడుతుంది. ప్రేమను కొలిచే సాధనాలు లోకంలోనే లేవు.
యౌవనంలో ఇరు హృదయాల్లో పుట్టే ప్రేమకు విశిష్ట స్థానం ఉంది.
ఐతే చాలా మంది యువతలో అది ఎప్పుడూ తాత్కాలిక వ్యామోహంగానూ, ఆకర్షణగానూ మారి జీవితాల్ని చిద్రం చేస్తోంది. అందుకనే చాలామంది పెద్దలు ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఈ మధ్య యువత పెద్దలను బెదిరించి, వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్నో రకాలుగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. దీనివలన ఆ యువత కుటుంబాలలోని మిగిలిన వ్యక్తులకు ఎన్నో సమస్యలు, అవమానాలు తలెత్తి ప్రశాంతతను కోల్పోయేటట్టు చేస్తోంది.
కాబట్టి ఎవరూ పెళ్ళికి ముందు ప్రేమించకూడదు.
కానీ, ప్రేమించుకోవచ్చు!
ఎప్పుడు? ….పెళ్ళి అయిన తరువాత.
పెళ్ళి అయిన తరువాత భర్త భార్యను, భార్య భర్తను ప్రేమించుకోవచ్చు. కానీ పెళ్ళికి ముందు ఎవరూ ప్రేమించ కూడదు. ఎందుకంటే ప్రేమ చాలా వరకు ప్రేమికులను ఇబ్బందులలోకి తోసేస్తుంది. ప్రేమికులను మాత్రమే కాదు, వారి కుటుంబాలనూ, సన్నిహితులను, స్నేహితులను కూడా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది చాలామందికి పెద్దలకు తెలుసు. కానీ, యువతకు తెలియదు. ప్రేమ వలన జీవితాన్నే పారేసుకున్న వారిని చూసిన తరువాత కొంతమంది యువతకు ప్రేమ మీద వాళ్ళకున్న అభిప్రాయం మారింది. అలా ప్రేమ మీద అభిప్రాయాలు మార్చుకున్న చాలామందిలో రాజశేఖర్, కౌసల్య కూడా ఉన్నారు.
ప్రేమించి పెళ్ళిచేసుకుంటేనే జీవితం బాగుంటుందని రాజశేఖర్ కు అపారమైన నమ్మకం ఉండేది. కానీ తన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన వలన అతనికి ప్రేమ మీద నమ్మకం పూర్తిగా అపనమ్మకంగా మారిపోయింది.
అదేలాగా కౌసల్యకు కూడా ప్రేమించి పెళ్ళిచేసుకోవటమే జీవితానికి మంచిది అనే అభిప్రాయం ఉండేది. కానీ తన స్నేహితురాలికి జరిగిన సంఘటన ఆమె అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ఇద్దరూ అరేంజడ్ మ్యారేజ్ చేసుకోవటమే జీవితానికి మంచిది అని ప్రేమ పెళ్ళిల్ల మీద వారికున్న నమ్మకాన్నీ, ఇష్టాన్ని, అభిప్రాయాన్నీ మార్చుకున్నారు…… ఆ తరువాత:
ఈ కథ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
'ప్రేమించుకోవచ్చు...ఎప్పుడు?'...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి