2, జూన్ 2022, గురువారం

పగటి పూట భూతాలు…(సీరియల్)...PART-1

 

                                                                            పగటి పూట భూతాలు…(సీరియల్)                                                                                                                                                               PART-1

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల అధ్యయనమును రాజకీయ శాస్త్రం, రాజకీయ అధ్యయనాలు, లేదా ప్రభుత్వ పరిపాలన అంటారు. రోజువారీ జీవితంలో రాజకీయాలు అనే పదం దేశాల పరిపాలన విధానాన్ని, ప్రభుత్వ నియమాలు, చట్టాల తయారీ మార్గాలను సూచించేందుకు ఉపయోగిస్తారు.

అయితే ఇప్పుడు రాజకీయాలకు అర్ధం మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇతర గ్రూపులలో, చాలా పెద్ద సంస్థలలో, పాఠశాలలో, మతసంస్థలలో....అంతెందుకు ప్రతి దాంట్లోనూ రాజకీయమనే పదప్రయోగం కనిపిస్తుంది.

 కానీ మధ్య రాజకీయం అంటే ఇలా చెబుతున్నారు:

రా అంటే రాక్షసంగా

అంటే జనానికి

కీ అంటే కీడు చేసే

యం అంటే యంత్రాగం -

రాక్షసంగా జనానికి కీడు చేసే యంత్రాగం…………..నిజమా...?

                                                                                                      PART-1

గంధము, కుంకుమా కలిసిన రంగులో ఈశాన్య దిక్కు తెల్లవారుతోంది.

శుక్రవార సూర్యోదయ గాలి ఊపిరితిత్తులను తీపి పరుస్తుండగా, బాల్కనీలో నిలబడి గాలిని శ్వాసిస్తున్న నరేందర్ కు పక్కన ఉంచుకున్న సెల్ ఫోన్ పిలుపును  ఇచ్చింది.

నరేందర్ సెల్ ఫోన్ తీసుకుని దాన్ని ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుని ఎస్... అన్నాడు.

మిస్టర్ నరేందర్...?”

స్పీకింగ్...

మిస్టర్ నరేందర్...! ముఖ్యమంత్రి ఇంటినుండి ఆమె పర్సనల్ సెక్రెటరీ పాండురంగం మాట్లాడుతున్నాను...

చెప్పండి సార్...

మీరు వెంటనే బయలుదేరి ముఖ్యమంత్రి గారి ఇంటికి రావాలి...

ముఖ్యమంత్రి ఇంటికా...?”

ఎస్...

విషయం ఏమిటో తెలుసుకో వచ్చా సార్...?”

ఫోనులో చెప్పే విషయం కాదు. నేరుగా రండి. ముఖ్యమంత్రి మీకొసం వెయిట్చేస్తున్నారు. మీరు ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న విషయం ఇంకెవరికీ తెలియనివ్వద్దు. హై ర్యాంకింగ్ పోలీస్ అధికారులకు కూడా విషయం తెలియకూడదు. చాలా రహస్యమైనది. ముఖ్యమంత్రిని మీరు చూడటానికి వచ్చే విషయాన్ని మీ భార్యకు కూడా తెలియనివ్వకండి...బయలుదేరి వస్తారా?”

ఇప్పుడే వస్తా...

ఇంకో ముఖ్యమైన విషయం మిస్టర్ నరేందర్. ప్రగతిభవన్ లో ఉన్న ముఖ్యమంత్రి ఇంటికి రావద్దు...

మరి...?”

బేగంపేట లో ఒక బంగళా ఉంది. మీకు తెలిసుంటుందనుకుంటా...

తెలుసు...?”

అక్కడికి రండి...సి.ఎం, నేనూ కాచుకోనుంటాము

సెల్ ఫోన్ కట్ అయ్యింది.

నరేందర్ బాల్కనీ వదిలి కిందకు వచ్చాడు. నరేందర్ భార్య రూపా స్నానం ముగించుకుని, వంటింట్లో టీతయారుచేయటంలో బిజీగా ఉండగా, పాల కుక్కర్ విజిల్ వేసింది.

రూపా...

ఏమిటండీ...

నాకు టీవద్దు...నేను బయలుదేరుతున్నాను...

ఎక్కడికి...?”

ఉద్యోగ రహస్యం...చెప్పటానికి అనుమతి లేదు. ఇప్పుడే సెల్ ఫోనులో పిలుపు వచ్చింది

వెంటనే బయలుదేరాలా...?”

వెంటనే...వెంటనే...

నరేందర్ తన గదిలోకి దూరి జాగింగ్ డ్రస్సు తీసేసి, వేరే డ్రస్సుకు మారాడు.

క్రీమ్ రంగు సఫారీ.

రూపా వెనుకే వచ్చింది. గౌతం అన్నయ్య ఇంకా కొంచం సేపట్లో వాకింగ్  చేయటానికి బయలుదేరి వచ్చేస్తారే...ఆయనకు నేనేం సమాధానం చెప్పను...?”

వి.పి అని చెప్పు. ఆయన అర్ధం చేసుకుంటారు

వి.పి అంటే...?”

వెరీ పర్సనల్...

నరేందర్ పోర్టికోకు వచ్చి నీలి రంగు కారులోకి ఎక్కాడు. రూపా గేటును తెరిచి ఉంచటంతో, కారు వేగంగా బయటకు వచ్చి రోడ్డు ఎక్కింది.

తెల్లవారుతున్న చీకటి--మంచూ, చేతులు కలుపుకుని అన్ని రోడ్లకూ విరజిమ్మ -- నరేందర్ కారును ఎనభైలో నడిపాడు.

బుర్రలో ఆలొచనలు చెలరేగినై.

సి.ఎం ఇలా రహస్యంగా పిలవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు రాష్ట్రమంతా బాంబు పేలుడ్లు జరిగినప్పుడు, దాని వెనుక ఉన్న దేశద్రోహ శక్తులను కనిపెట్టటానికి ఉన్న దార్లను పరిశోధించటానికి నన్ను పిలిచి రహస్యంగా మాట్లాడారు...

ఇది రెండో పిలుపు

ఎందుకై ఉంటుంది...?’

కరెక్టుగా ఇరవై నిమిషాల పయనం.

ఈ సీరియల్ ను పూర్తి నవలగా ఒకేసారి చదవాలనుకుంటే ఈ లింకు పై క్లిక్ చేయండి

బేగంపేట, చిరు వెళుతురుతో అప్పుడే తెలవారుతోంది. సి.ఎం. కు సొంతమైన బంగళా ఉన్న రోడ్డులోకి కారును తిప్పి, బంగళా దగ్గరకు వచ్చాడు నరేందర్.

సెక్యూరిటీ గార్డు కొద్ది నిమిషాలు ఆపిన తరువాత లోపలకు వెళ్ళాడు.

పోర్టికోలో సెక్రెటరీపాండురంగం ఒక విధమైన ఆందోళనతో కాచుకోనున్నాడు.

రండి...మిస్టర్ నరేందర్...!

నరేందర్ ఆయనతో పాటూ పోర్టీకోలో నడుస్తూ అడిగాడు.

సార్...ఏదైనా ఎదురు చూడని సంఘటనా?”

ఎస్...

ఏమిటది...?”

అది ముఖ్యమంత్రే చెబుతారు...

పెద్ద బంగళా నిశ్శబ్ధంగా ఉంది. పనివాళ్ళేవరూ కంటికి కనబడలేదు.

హాలులోకి వెళ్ళి, దాని మధ్యలో ఉన్న మేడమెట్లు ఎక్కి -- ముఖ్యమంత్రి గది ముందుకు వెళ్ళి నిలబడ్డారు.

దగ్గరగా మూసున్న తలుపు మీద శబ్ధం చేసి, పాండురంగం లోపలకు వెళ్ళగా -- నరేందర్ ఆయన వెనుకే వెళ్ళాడు.

ముఖ్యమంత్రి విజయలక్ష్మి సోఫాలో తల వెనక్కి పెట్టుకుని ఆనుకోనున్నది కనబడింది. పక్కనే విజయలక్ష్మి భర్త ఆందోళన చెందుతున్న మొహంతో ఉండటం తెలిసింది.

ముఖ్యమంత్రి విజయలక్ష్మి కి యాభై ఏళ్ళ వయసు. సన్నగా ఉండే శరీర రూపం. ఎర్రని రంగు, నెరిసిన తలవెంట్రుకల కలయికతో జుట్టు ఒక చిన్న చక్రంలా చుట్టబడి ఉంది. చెవులకు చిన్న చిన్న బంగారు పోగులు తలతల మంటున్నాయి. లైట్ బ్లూ కలర్ చీర కట్టులో దర్జాగా ఉన్నది

విజయలక్ష్మి భర్త నాగరాజు బట్ట తలతో పంచ - జుబ్బాతో ఉన్నారు.

నరేందర్ లోపలకు వచ్చి విజయలక్ష్మి ముందు నిలబడి 'సెల్యూట్' చేయగా -- దాన్ని మౌనంగా తీసుకుంటూ సోఫాను చూపింది.

"కూర్చోండి నరేందర్...

నరేందర్ కూర్చున్నాడు.

విజయలక్ష్మి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, తరువాత నరేందర్ ను తలెత్తి చూస్తూ చెప్పింది.

"మీతో పర్సనల్ గా ఒక సహాయం అడగటానికే ఇంత ప్రొద్దున్నే మిమ్మల్ని రమ్మని చెప్పాను"

నరేందర్ తన మొహంలో ఒక పెద్ద ఆశ్చర్య చిహ్నాన్ని అతికించుకుని విజయలక్ష్మిని చూసాడు.

అడగండి మ్యాడమ్...

విజయలక్ష్మి హఠాత్తుగా పాండురంగాన్ని చూడగా, ఆయన ఆమె చూపులను అర్ధం చేసుకున్న వాడిలాగా, లోపలున్న ఒక గదిలోకి వెళ్ళీ, చేతిలో ఒక సీ.డి. తో బయటకు వచ్చాడు.

నరేందర్ యొక్క కన్ ఫ్యూజన్ ఎక్కువ అవుతున్నప్పుడే పాండురంగం సీ.డి. ని పక్కనున్న ఒక డెక్ లో పెట్టి ఆన్ చేశాడు.

టీ.వీ.తెర తెల్లని చుక్కలతో మొదలయ్యి కొద్ది క్షణాలలో దృశ్యం చూపించి, సడన్ గా ఒక ఆకుపచ్చని అడవి ప్రాంతాన్ని చూపించింది.

చిత్రం నిశ్శబ్ధంగా వెడుతోంది.

అడవి ప్రాంతంలో ఉన్న చిన్న కాలిబాట లాంటి దాన్ని కెమేరా చూపించుకుంటూ వెడుతుంటే--దృశ్యం గబుక్కున మారి ఒక కొండ గుహను చూపించింది.

దృశ్యం ఊగుకుంటూ కొండ గుహలోకి వెళ్ళగా -- ఒక దివిటీ వెలుగుతుండటం కనబడింది.

పసుపుగా ఒక వెళుతురు వ్యాపించి చీకటిని తరిమికొట్టి, తుపాకులతో నిలబడున్న ఇద్దర్ని చూపించింది.

మొహాలు సరిగ్గా కనబడలేదు.

కెమేరా కోణం ఇప్పుడు మారి, గుహలోని ఒక మూలను చూపగా -- చూస్తున్న నరేందర్ యొక్క చూపులు దీక్షగా చూసినై.

గుహలోని మూలలో ఇద్దరు ముడుచుకుని, కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కూర్చున్నారు.

ఒక మగ మనిషి, ఒక స్త్రీ కాళ్ళపైనా, చేతులపైనా బురద మట్టి అతుక్కోనుండ--కళ్ళల్లో భయం. వేసుకున్న దుస్తులు చినిగి వేలాడుతున్నాయి. స్త్రీ ఏడుస్తున్నది.

విజయలక్ష్మి ఇప్పుడు నరేందర్ వైపు తిరిగింది. నరేందర్! మీరు చూస్తున్న, మూల కూర్చున్న వ్యక్తులు ఎవరో తెలుస్తున్నదా?”

ఎవరు మ్యాడమ్...?”

నా కూతురు రాధాకుమారి, అల్లుడు గణేష్ రాం...

నరేందర్ ఆశ్చర్యపోతూ విజయలక్ష్మిని చూడగా, ఆమె కొనసాగించింది.

నరేందర్! నిన్న రాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక ఫోన్ వచ్చింది. అది నా హాట్ లైన్ కి. అందుకనే ఫోనును నేనే తీసాను. ఫోనులో మాట్లాడినతను, గ్రీన్ వేస్ రోడ్డు చివర్లో ఉన్న పోస్టు బాక్స్ లో ముఖ్యమైన ఒక సీ.డీ. ని పడేసినట్లు, అది తీసుకుని డెక్ లో వేసి చూడమని చెప్పాడు. నేను అదేదైనా రాజకీయ సమస్యగా ఉంటుందేమో నని అనుకుని, సెక్రెటరీ పాండురంగం గారిని పంపి సీ.డీ. ని తీసుకురమ్మని పంపాను. వెంటనే వేసి చూసాము. చూస్తే ఇలా ఒక విపరీతం. నా కూతుర్నీ, అల్లుడ్నీ, వాళ్లకు సెక్యూరిటీగా ఉన్న ఆరుగురు పోలీసులనూ రేపటి భారతంఅనే ఒక సంస్థ కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళి, అరణ్య ప్రదేశంలో ఖైదీలుగా అనచబడి ఉంచారు...

నరేందర్ ఆశ్చర్యంతో మళ్ళీ టీ.వీ  తెరని చూసినప్పుడు, అక్కడ ఇప్పుడు దృశ్యం మారింది.

బాడీగార్డులుగా వెళ్ళిన ఆరుగురు పోలీసులనూ, అండర్ వేర్, బనియన్లతో మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. వాళ్ళకు ఎదురుగా తుపాకులు పెట్టబడున్నాయి.

ఇప్పుడు మాటలు వినిపించినై.

కెమేరా ఇప్పుడు అందరి మొహాలనూ క్లోజ్ ఆప్ లో చూపిస్తుంటే, చెవ్వు జివ్వున లాగుతున్న దోరణిలో ఒక గొంతు వినబడింది.

సీ.డీ. ని చూస్తున్న వారందరికీ రేపటి భారతంస్వాగతం చెబుతోంది. అహింస విధానాన్ని పాటించి పోరాటాలు జరిపి దేశంలో ఉన్న అన్ని సమస్యలకూ ఒక పరిష్కారం చేద్దామనే ఒకే ఒక మంచి నమ్మకంతో మొదలు పెట్టబడినదే సంఘం. కానీ, దేశమూ, మనుషులూ ఇప్పుడున్న పరిస్థితిలో అహింసా పోరాటం చేయలేని కారణంగా, ఇలాంటి ఒక హింసను చేతిలోకి తీసుకోవలసి వచ్చింది. గాంధీ గారి ఆత్మకు ఇది నచ్చదని తెలుసు. ఏం చేయను...? గాంధీజీ ఇష్టపడినట్లుగానే దేశంలో అన్ని పనులూ జరుగుతున్నాయా...?”

మాటలు ఆగిపోయాయి--టీ.వీ తెర మీద దృశ్యం మాత్రం పోతోంది. అల్లుడు గణేష్ రాం గడ్డాన్ని ఒక తుపాకి మొన పైకెత్తగా మళ్ళీ ఆడియో వినబడింది.

ఇక విషయానికి వద్దాం. ముఖ్యమంత్రి విజయలక్ష్మి గారి కుమార్తె రాధాకుమారి, అల్లుడు గణేష్ రాం ఇప్పుడు మా దగ్గరున్నారు. పెళ్ళై ఆరునెలలే అయిన యువ దంపతులను ఇలా కొండ గుహలో దాచి పెట్టి ఉంచటం మాకు కష్టంగానే ఉంది. కానీ ఇంకో దారిలేదు. ఎర్రశిలా అడవులకు ఆనందంగా గడపటానికి వచ్చిన యువ దంపతులను, వాళ్ళకు బాడీగార్డులుగా వచ్చిన ఆరుగురు పోలీసులనూ మేము కిడ్నాప్ చేసుకోచ్చి అడవి ప్రాంతంలో దాచి పెట్టటానికి కారణం ప్రభుత్వం దగ్గర నుండి డబ్బులు రాబట్టుకోవాలని కాదు. మేము అడగబోయేది డబ్బు కాదు. న్యాయం...మేమడిగే న్యాయం ఏమిటీ...? తరువాత సీ.డీ. మీ చేతికి దొరికే వరకు ఆలొచిస్తూ ఉండండి. వందేమాతరం! జై హింద్!

స్వరం ఆగిపోగా -- దృశ్యాలను ముగించుకుని టీ.వీ తెల్ల రంగు చుక్కలను ఉత్పత్తి చేసింది

పాండురంగం డెక్ ను ఆపేసి సీ.డీ ని బయటకు తీశాడు.

విజయలక్ష్మి కళ్ళు బాగా ఎర్రబడి -- ఒక చిన్న ఏడుపుకు తయారుకాగా, ఎడమ చేతిలో ఉన్న కర్చీఫ్ ను నోటి దగ్గర పెట్టుకుంది.

నరేందర్ కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి విజయలక్ష్మి వైపు చూశాడు.

మేడమ్! మీ అమ్మాయి, అల్లుడూ ఎర్రశిలా అడవులకు ఎప్పుడు వెళ్ళారు?”

పోయిన వారం

అక్కడ ఎక్కడ బస చేసారు?”

ఒక బంగళాలో...

అది ఎవరి బంగళా...?”

ఒక ఎస్టేట్ ఓనర్ కు చెందింది

ఆయన పేరు...?”

విశ్వం...! నా భర్తకు ఆయన స్నేహితుడు. సింగపూర్ లో ఆయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. సంవత్సరానికి పది నెలలు ఆయన సింగపూర్ లోనే ఉంటాడు. రెండు నెలలు ఇండియాలో ఉంటాడు

నరేందర్ కొద్దిసేపు మౌనంగా ఉండి, తరువాత అడిగాడు. మేడమ్! మీ హాట్ లైన్ టెలిఫోన్ నెంబర్లో మాట్లాడిన వ్యక్తి గొంతు మీకు పరిచియమున్నట్టు అనిపించిందా?”

లేదు

అంతవరకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్న విజయలక్ష్మి భర్త నాగరాజు నీరసించిన స్వరంతో నరేందర్ ను చూసారు.

మిస్టర్ నరేందర్! మాకు ఒక్కత్తే అమ్మాయి. దాన్ని మేము మళ్ళీ ప్రాణాలతో చూడాలను కుంటున్నాము. మా అమ్మాయినీ, అల్లుడ్నీ మీరే రక్షించి తీసుకురావాలి

భయపడకుండా...ధైర్యంగా ఉండండి సార్! మీ అమ్మాయికీ, అల్లుడికీ మాత్రమే కాదు... గుంపు దగ్గర చిక్కుకున్న ఆరుగురు పోలీసుల ప్రాణాలకూ ప్రమాదం లేకుండా కాపాడొచ్చు...

విజయలక్ష్మి దుఃఖాన్ని అనుచుకుని చెప్పింది. నరేందర్! ఇది మీరు మామూలుగా చెప్పే రొటీన్ అభయంగా ఉండిపోకూడదు. కిడ్నాప్ గ్రూప్ మానవత్వమే లేని ఒక గ్రూప్. ఏదైనా చేయగల ధైర్యం ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు సీ.డీ. ని మాత్రమే పంపలేదు...

ఇంకేం పంపారు...?”

పాండురంగం...!

మేడమ్...

అది కూడా తీసుకువచ్చి చూపండి...

నరేందర్ ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడే, పాండురంగం పక్కనున్న గదిలోకి వెళ్ళారు.

ఇరవై క్షణాల తరువాత బయటకు వచ్చారు.

చేతిలో ఒక చిన్న బాటిల్. అందులో ఎర్రగా ఒక ద్రవం ఉంది.

బాటిల్ మూత దగ్గర కట్టబడున్న ఒక కాగితంలో తెలుగులో పొడి పొడి అక్షరాలు రాసున్నాయి.

నరేందర్ ఒక పెద్ద ప్రశ్నార్ధకాన్ని మొహం మీద పెట్టుకుని దాన్ని తీసుకుని చదివాడు.

హృదయంలో చిన్నగా భూకంపం వచ్చింది.

                                                                                                            Continued...PART-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి