పగటి పూట భూతాలు...(సీరియల్) PART-8
కారులోని డ్రైవర్
సీటులోకి
కళావతిని
తోసేసి... జనగణమన కేశవ్ ఆమె పక్కన
కూర్చున్నాడు.
“ఊ...కారును...నడుపు...”
కళావతి కారును
నడపకుండా
జనగణమన
కేశవ్ నే చూడగా...అతను
నవ్వాడు.
“ఏమిటి చూస్తున్నావు...? కారు
ఎలా
నడపాలనేదే
మరిచిపోయిందా...నేర్పించనా...?”
కళావతి చిన్నదైన
మొహంతో
అడిగింది.
“డేవిడ్ ను ఏం
చేశావు...?”
“డేవిడ్ ను
నువ్వు
చూడాలి...అంతే
కదా...? కారును
నేను
చెప్పే
వైపుకు
తోలు.
డేవిడ్
ను చూడొచ్చు”
“అతను ప్రాణాలతో
ఉన్నాడా...లేడా?”
“వెడితే నీకే
తెలుస్తుంది...ప్రశ్నలడగకుండా
కారు
నడుపు...” చేతిలో ఉంచుకున్న
తుపాకీని
మళ్ళీ
కళావతి
గొంతు
దగ్గర
పెట్టాడు.
కారు ఇగ్నీషియన్
కు
ప్రాణమివ్వగా
-- గియర్ మార్చ
బడి
బయలుదేరి
వెళ్ళింది.
జనగణమన కేశవ్ ఆమెను చూడటానికి
వసతిగా
ఉంటుందని
తిరిగి
కూర్చుని, తుపాకీని
ఆమె
మెడ
దగ్గర
పెట్టి
ఆమెను
తరుముతున్నాడు.
“కారును వేగంగా
నడపకూడదు.
నలభై, యాభై
లలో
వెలితే
చాలు.
మధ్యలో
ఎక్కడా
కారును
ఆపకూడదు.
తప్పించుకోవటానికి
ఎలాంటి
ప్రయత్నమూ
చేయకూడదు.
ఈ
మూడు
నిబంధనలు
పాటిస్తూ
కారు
నడపాలి.
ఈ
మూడింటిలో
ఏ
నిబంధనను
మీరినా
సరే
నిన్ను
కుక్కను
కాల్చినట్టు
కాల్చిపారేసి
నా
పాటికి
నేను
వెళ్ళిపోతాను”
కారు మైన్
రోడ్డుకు
వచ్చింది.
“చెర్లపల్లి వైపు
తిరుగు...”
కారు తిరిగింది.
రవాణా రహదారి.
ఒక
నల్ల
రిబ్బన్
లాగా
కనబడింది.
కారు వెడుతూ
ఉంటే...
జనగణమన కేశవ్ నవ్వాడు.
“ఇలాంటి పరిస్థితి
వస్తుందని
నువ్వు
ఎదురు
చూసుండవు...కదా
కళావతి...?”
“........................”
“ఓడ కూడా
ఒక
రోజు
బండీలో
ఎక్కుతుంది.
బండి
కూడా
ఒక
రోజు
ఓడలో
ఎక్కుతుందని
పెద్ద
వాళ్ళు
చెప్పింది
నిజమైంది.
చూశావా...?”
“.........................”
“నీ మనసులో
ఇప్పుడు
ఏమేమి
ఆలొచనలు
వెడుతున్నాయో
నేను
చెప్పనా...?”
“............”
“డేవిడ్ దగ్గర
నుండి
ఈ
జనగణమన
కేశవ్ ఎలా తప్పించుకున్నాడు...? -- ఇది
నీ
యొక్క
మొదటి
ఆలొచన”
“....................”
“రెండో ఆలొచన.
జడ్జి
దగ్గర
నుండి
డేవిడ్
డబ్బులు
తీసుకున్నాడా
...లేదా?”
“....................”
“ఆలొచన మూడు.
అలా
డబ్బులు
తీసుకోనుంటే, ఆ
డబ్బు
ఎక్కడ...?”
“......................”
“ఇది నాలుగో
ఆలోచన.
డేవిడ్
ప్రాణాలతో
ఉండుంటాడా...లేదా...?”
చెమట కారుతున్న
మొహంతో
కళావతి
జనగణమన
కేశవ్ ను చూసింది.
“ఇలా చూడూ!
జరిగినదంతా
మర్చిపో
ఇక
మీదట
మనం
స్నేహితులం.
నీకు
ఎంత
డబ్బు
కావాలి? చెప్పు, ఇస్తాను” అన్నది
కళావతి.
జనగణమన కేశవ్ నవ్వాడు.
“నేను డబ్బు
కోసమా
ఇదంతా
చేసేనను
కుంటున్నావు...ఓసి
పిచ్చి
దానా...!
నీ
డబ్బు
ఎవరికి
కావాలి...?”
“నీకు చేతులెత్తి
నమస్కారం
చేస్తాను.
ఇకమీదట
ఎటువంటి
తప్పు
పనీ
చేయను.
జడ్జి
గారి
దగ్గర
డబ్బులు
తీసుకోనుంటే, మళ్ళీ
తిరిగి
ఆ
డబ్బు
ఆయనకే
ఇచ్చేస్తాను.
పత్రికను
కూడా
మంచిగా
జరుపుతాను.
నన్ను
ఏమీ
చెయ్యద్దు...”
“నిన్ను క్షమించగలిగేంత
అధికారం
నాకు
లేదు
కళావతి...ఆ
అధికారం
నా
బాసుకే
ఉంది”
“ఎవరు నీ
బాస్...?”
“వచ్చి చూడు...తెలుస్తుంది!”...చెప్పేసి జనగణమన
కేశవ్ చిన్నగా ఒక నవ్వు
నవ్వాడు.
**************************
విశాఖపట్నం నుండి
ఇన్స్పెక్టర్
మొహన్, పోలీసు
బృందంతో
వచ్చి
చేరినప్పుడు
సాయంత్రం
సమయం
ఆరు.
ఇద్దరి కానిస్టేబుల్స్, ఒక
డాగ్
స్క్వాడ్
చీఫ్, అక్కడే
పోస్ట్
మార్టం
చేయటానికి
ఒక
ప్రభుత్వ
డాక్టర్.
ట్యాంకును
పగుల
కొట్టటానికి
ఇద్దరు
కూలీలు.
గౌతం ఎదురుగా వెళ్ళి, మూడో
అంతస్తు
మేడ
టెర్రస్సుకు
తీసుకు
వెళ్ళాడు.
ఇన్స్పెక్టర్
మొహన్
అడిగాడు.
“సార్...మిస్టర్
నరేందర్
ఎక్కడ...?”
గౌతం వివరంగా చెప్పగా
-- ఇన్స్పెక్టర్
మొహన్
ఆశ్చర్యపోతూ, కానిస్టేబుల్స్
ను
చూశాడు.
“మొదట గంగన్న
యొక్క
శవాన్ని
ఇక్కడికి
తీసుకు
వచ్చేయండి...”
శవం ఎక్కడుందో
గౌతం
చెప్పిన తరువాత
కానిస్టేబుల్స్
అటు
వెళ్ళారు.
“ఏ ట్యాంకు
సార్...?”
“అదిగో...ఆ
పాత
తొట్టె”
దాని పక్కకు
వెళ్లారు.
ఇన్స్పెక్టర్
మొహన్
పనివాళ్ళను
చూసి
కళ్ళు
చూపగా...వాళ్ళు
పలుగుతో
పాటు
ట్యాంకు
దగ్గరకు
చేరేరు!
ట్యాంకు దెబ్బ
తినడం
మొదలయ్యింది.
ఇటికలు, సిమెంటూ
చేదర
-- తొట్టి పళపళ
మంటూ
విరిగింది.
పది నిమిషాలు!
ట్యాంకు పైన
సిమెంటుతో
కప్పిన
పలక
వేరుగా
కింద
పడి
ముక్కలైంది.
లోపల మట్టి.
పనివాళ్ళల్లో ఒకడు
మట్టిని
కెలుక, వందల
లెక్కలో
గండు
చీమలు
గుంపు
గుంపుగా
పైకొచ్చినై.
గౌతం, డాక్టర్, ఇన్స్పెక్టర్
మొహన్
జరిగి
నిలబడగా
-- మట్టిని తవ్వి
బయట
పోస్తున్నారు.
మట్టి లెవల్
తగ్గను
తగ్గను
ఇప్పుడు
ముక్కు
తట్టుకోలేని
వాసన.
పనివాళ్ళు సెంటు
జల్లుకున్న
చేతి
రుమాలను
ముక్కుకు
అడ్డుగా
పెట్టుకుని, మట్టిని
వేగంగా
తీసి
పడేశారు.
గండు
చీమలు
టెర్రస్
మొత్తం
పరిగెత్తుతున్నాయి.
మట్టి యొక్క
లెవల్
పూర్తిగా
తగ్గినప్పుడు
-- ముడుచుకున్న స్థితిలో
ఒక
చేయి, కాలూ
బయటపడ్డాయి.
చీమలతో చుట్టుకోనున్న
ఆ
చెతిపైనా, కాలుపైనా
సగం
శాతం
చర్మం
మిగిలి
ఉంది.
గౌతం చేతి గుడ్డతో
ముక్కును
మూసుకుని, తొట్టెకు
పక్కకు
వెళ్ళి
తొంగి
చూశాడు.
“మిగిలిన మట్టిని
తవ్వి
తీసేసి, శవాన్ని
అలాగే
ఉంచేయండి...”
పనివాళ్ళు ఆ
పనిలో
దిగారు.
తొట్టిలో ఉన్న
మట్టినంతా
బయట
పడేసిన
తరువాత
-- కొంచంగా చర్మం
అతుకొనున్న
ఆ
మానవ
ఎముకల
గూడు
కాళ్ళనూ, చేతులనూ
జరిపి
బోర్లా
పడుకోబెట్టి
ఉన్నది.
***************************
“ఇంకా ఎంత
దూరం
పోవాలి...?”
కారు నడుపుతున్న
కళావతి
అడుగ,
జనగణమన
కేశవ్ తన చేతిలో
ఉంచుకున్న
తుపాకీ
అంచుతో
తన
ముక్కును
గోక్కుంటూ
చెప్పాడు.
“పక్కనే ఉన్నాం....వచ్చాశాము...”
“నాకు టయర్డుగా
ఉన్నది.
ఏదైనా
ఒక
బడ్డీ
కొట్టు
దగ్గర
ఆపి, ఒక
కూల్
డ్రింక్
తాగనా?”
“వద్దు! కారును
ఎక్కడా
ఆపకూడదు.
మన
చోటుకు
వెళ్ళి
చేరిన
వెంటనే
నీకు
కావలసిన
కూల్
డ్రింక్
దొరుకుతుంది.
ఇప్పుడు
ఎడం
వైపుకు
తిరుగు...”
రోడ్డుకు ఎడంవైపు
ఇప్పుడొక
చిన్న
మట్టి
రోడ్డు
కనబడగా, కళావతి
కారును
ఆవైపుకు
తిప్పింది.
చీకటి రోడ్డు.
ఏ దిక్కులోనూ
లైటు
వెలుతురు
లేదు.
“ఈ చోటు
ఏ
చోటు...”
“అది తెలుసుకోవటం
వలన
నీకేమీ
ప్రయోజనం
ఉండదు.
మాట్లాడకుండా
కారు
నడుపు”
కళావతి వస్తున్న
కోపాన్ని
అనుచుకుని
కారు
నడప
-- కొద్ది నిమిషాల
ప్రయాణం
తరువాత
జనగణమన
కేశవ్ ఆమె వీపును
తుపాకీతో
ముట్టుకుని
“కారుని
అలాగే
ఒక
పక్కగా, రోడ్డుకు
చివరగా
ఆపు” అన్నాడు.
కారును రోడ్డుకు
చివరిగా
తీసుకు
వెళ్ళి, పొదలను
రాసుకుంటూ
ఆపింది.
కళావతిని కారు
దింపాడు.
“ఊ...నడు”
వీపుకు తుపాకీ
ఆనించి, దానితో
తీసుకుంటూ
నడిచాడు
జనగణమన
కేశవ్.
చెట్టు ఎక్కువగా
ఉన్న
ఆ
ప్రాంతంలో
ఒక
ఇల్లు
తక్కువ
కాంతితో
కనబడగా
-- ఒక కుక్క
రెండు
సార్లు
అరిచి
వూరుకుంది.
తలుపు దగ్గరగా
మూసుకున్నది
-- అది తెరుచుకుని
లోపలకు
వెళ్ళారు.
కొంచం పాత
కాలపు
ఇల్లు.
కళావతి ఆశ్చర్యపోతూ, భయంతో
అటూ, ఇటూ
చూస్తున్నప్పుడే
-- బలవంతంగా ఒక
సోఫాలో
కూర్చో
బెట్టబడింది.
కళావతి ఆందోళనతో
అడిగింది.
“ఎవరు...నీ
బాస్...?”
“ఇప్పుడు వచ్చేస్తారు...దానికి
ముందు
నువ్వు
వెంటనే
ఒక
ఫోన్
చేయాలి”
“ఫోనా...ఎవరికి?”
“నీ పి.ఏ.
కి...”
“దేనికీ?”
“ప్రశ్నలేమీ
అడగక...రీసీవర్
తీయి.
నీ
పి.ఏ.
ఇంటికి
ఫోన్
చెయ్యి.
ఏం
మాట్లాడాలో
నేను
ఇప్పుడు
చెబుతాను.
నీ
పి.ఏ.
పేరు
హేమానే
కదా? ‘హేమా...నేను
కళావతి
మాత్లాడుతున్నాను...నాకు
రెండు
రోజులుగా
మనసు
ప్రశాంతంగా
లేదు.
వారం, పది
రోజులు
బయట
ఊరికి
వెళ్ళి
ప్రశాంతంగా
ఉండేసి
రావాలని
అనుకుంటున్నా.
నేను
ఏ
ఊర్లో
ఉన్నానో
నీకు
కూడా
తెలియకపోవడం
మంచిది.
పత్రికకు సంబంధించిన
పనులన్నీ
నువ్వు
చూసుకో.
నేను
ఎక్కడ
అని
అడిగే
వారికి, నార్త్
ఇండియా
ఆలయాలకు
వెళ్ళానని
చెప్పు...నాతో
నువ్వు
సెల్
ఫోన్లో
కూడా
మాట్లాడొద్దు.
ఏదైనా
ముఖ్య
విషయం
అయితే
ఖచ్చితంగా
నేనే
నీకు
ఫోన్
చేస్తాను’--
ఇదే
నువ్వు
నీ
పి.ఏ.
కు
చెప్పాల్సిన
విషయం”
కళావతి జనగణమన
కేశవ్ ను కోపంగా చూసింది.
“దేని కోసం
నేను
అలా
మాట్లాడాలి?”
“ఎదురు ప్రశ్నలు
వేయకు...చెప్పినట్టు
ఫోన్
చెయ్యి...లేకపోతే...?”
కళావతి యొక్క
ఎడమ
చెవి
రంధ్రంలో
తుపాకీ
పెట్టాడు.
“నీ చెవిలోపల
బుల్లెట్
పేలుతుంది.
నువ్వు
ఇప్పుడే
చావడానికి
ఇష్టపడితే...దారలంగా
మొండి
పట్టు
పట్టొచ్చు...ఫ్రాణాలతో
ఉండాలని
ఇస్టపడితే...నేను
చెప్పినట్టు
నీ
పి.ఏ.కి
ఫోన్
చెయ్యి...”
చెవి లోపల
తుపాకీ
గుచ్చుకుంది.
నొప్పితో
ప్రాణమే
పోయినంత
ఫీలింగ్.
“చే...చే...చేస్తాను.
తు...తు...తుపాకీ
తీయ్యి...”
“ఊ...ఫోన్
చెయ్యి...”
టెలిఫోన్ ను
దగ్గరకు
జరిపాడు
జనగణమన
కేశవ్. “నేను
చెప్పినదాంట్లో
ఒక్క
మాట
కూడా
మార్చకుండా
చెప్పాలి...”
కళావతి రీసీవర్ను
చేతిలోకి
తీసుకుని, తన
పి.ఏ.
ఇంటి
నెంబర్లను
నొక్కింది.
అవతలసైడు తన
పి.ఏ.
దొరికిన
వెంటనే, జనగణమన
కేశవ్ చెప్పినట్టు మాట్లాడేసి
రిజీవర్ను
పెట్టేసింది.
“చాలా...ఇక
నేను
ఏం
చేయాలి?”
“చచ్చిపోవాలి...”
వెనుక గొంతు
వినబడటంతో
తిరిగి
చూసింది
కళావతి.
డేవిడ్.
చేతులు కట్టుకుని, భవ్యమైన
ఒక
నవ్వుతో
నిలబడున్న
డేవిడ్
ని
చూస్తూ
మెల్లగా
లేచింది
కళావతి.
“డే...
డేవిడ్...నువ్వా?”
“నేనే...! అనుమానంగా
ఉంటే
నా
పక్కకు
వచ్చి
నిలబడి
నన్ను
ముట్టుకు
చూడండి...".
కళావతి వొళ్ళంతా
చెమటలు--గొంతు
ఎండి
పోవటంతో
ఉమ్మును
మింగి
అడిగింది.
“ను...వ్వె...ఎలా...ఇతనితో...?"
“సారీ మ్యాడం...!
పార్టీ
మారాను.
పార్టీలు
మారటం
రాజకీయవేత్తలకే
హక్కా...? ఇక
మీదట
నాకు
బాస్
మీరు
కాదు.
అదిగో...ఆయనే..."
డేవిడ్ చెయ్యి
చూపిన
వైపుకు
కళావతి
చూపులను
తీసుకు వెళ్ళింది.
ఒక తలుపుకు
ఆనుకుని
నిలబడ్డ
ఆ
మనిషిని
చూసి
ఆశ్చర్యపోయింది.
డేవిడ్ కొనసాగించాడు
“జడ్జి
ఇచ్చిన
డబ్బు
ఇప్పుడు
నా
దగ్గరే
ఉంది
మ్యాడమ్.
కొత్త
బాస్
ఆ
డబ్బును
నన్నే
తీసుకోమని
చెప్పారు”
“డే...
డేవిడ్...ను...ను...నువ్విలా?”
“పార్టీ మారింది
తప్పు
అని
చెబుతున్నారా...? మీరు
న్యాయమైన
దారిలో
డబ్బు
సంపాదించుంటే, ఈ
రోజు
ఈ
పరిస్థితి
మీకు
వచ్చేది
కాదు.
ఏ
చెట్టు
విత్తనాలు
నాటారో, ఈ
రోజు
దానినే
మీరు
పంటగా
తీసుకోవాలి...చేతిలో
ఒక
పత్రిక
ఉంచుకుని
వి.ఐ.పి.
లను
బ్లాక్
మైల్
చేసి
కొల్లలుగా
డబ్బు
సంపాదించారు...ఇదంతా
ఏ
విధంగా
న్యాయం
మ్యాడమ్?"
“నేను...సంపాదించిన
మొత్త
డబ్బును
ఇచ్చేస్తాను.
ఆ
పత్రిక
వృత్తిని
వదిలేస్తాను...నన్ను
ఏమీ
చేయకండి"
డేవిడ్ నవ్వాడు.
“క్షమాబిక్ష పిటీషన్ను
నా
దగ్గర
పంపించటం
వలన
ఏ
ప్రయోజనమూ
లేదు.
మీ
క్షమాబిక్ష
పిటీషన్ను
పరిశీలించాల్సింది
నా
కొత్త
బాస్.
బాస్!...మీరేం
చెబుతారు...?”
ఆయన తలుపుకు
ఆనుకుని
నిలబడే కళావతిని
చూసి
చిన్న
స్వరంతో
అడిగారు.
“పత్రిక వృత్తిని
వదిలేస్తావా?”
“అవును”
“వదిలేసి ఏం
చెయ్యబోతావు...?”
“ఇంకేదన్నా వ్యాపారం
చేసుకుని...!”
“నీకు ఇంకా
ఏ
ఏ
వ్యాపారాలు
తెలుసు...? అదీ
కాకుండా
ఇప్పుడు
నేనెవరో
నీకు
తెలిసిపోయింది.
ఇక
మీదట
నువ్వు
ప్రాణాలతో
ఉంటే
అది
నాకు
తల
మీద
వేలాడుతున్న
కత్తిలాగా
ఉంటుంది.
ఇప్పుడు
నీకేం
వయసు
...?
నలభై
ఉంటుందా? చాలు!
ఈ
భూమి
మీద
నలభై
ఏళ్ళు
జీవిస్తే
చాలు.
ఎనభై
ఏళ్ళు
జీవించినా
ఇదే
జీవితమే...జీవిత పోరాటాన్నిమొదలు
పెట్టక
ముందే
వెళ్ళి
చేరిపోవటం
మంచిది”
మాటలను ఒక్క
క్షణం
ఆపిన
ఆ
మనిషి, మళ్ళీ
నోరు
తెరిచాడు.
“అందువలన నీ
క్షమాబిక్ష
పిటీషన్ను
రిజెక్ట్
చేస్తూ, నీకు
మరణ
దండన
ఖాయం
చేస్తున్నా”
జనగణమన కేశవ్ అడ్డుపడి
మాట్లాడాడు.
“కళావతి!
నీ
యొక్క
మరణం
కత్తితోనో, తుపాకీతోనో, విషంతోనో
జరగబోదు.
అది
సుఖమైన
మరణం”
కళావతి మరణ
భయంతో
అలాగే
శిలలాగా
కూర్చుండిపోగా, డేవిడ్
హడావిడిగా
ముందుకు
వచ్చాడు.
Continued...PART-9
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి