పగటి పూట భూతాలు...(సీరియల్) PART-4
జనగణమన కేశవ్ చేతిలో ఉన్న
తుపాకీ
కొంచంగా
వంగింది.
“కళావతి నవ్వింది......ఎందుకు
తటపటాయింపు...కాల్చు...”
ట్రిగర్ నొక్కటానికి
ప్రయత్నించిన
జనగణమన
కేశవ్ కు వెనుక ఏదో
శబ్ధం
వినబడింది.
వెనక్కి తిరిగాడు.
శబ్ధం చెయకుండా, ట్రిమ్
చేసిన
గడ్డంతో
ఒక
మనిషి నిలబడి ఉన్నాడు.
అతని
చేతిలో
ఉన్న
తుపాకీ
జనగణమన
కేశవ్ నెత్తికి గురిపెట్టబడి
ఉంది.
కళావతి నవ్వును
పెద్దది
చేస్తూనే
తన
ఎడం
చేతిని
జాపి
-- జనగణమన కేశవ్ దగ్గరున్న తుపాకీ
తీసుకుంది.
“ఖద్దర్ టోపీ
పెట్టుకుని
తుపాకీని
ఇలా
చేతితో
పట్టుకోవచ్చా?”
“.........................”
“నీలాంటి వాళ్ళను
ఎంతో
మందిని
చూసాను...!
ఎవరు
ఏ
వేషం
వేసుకుని
ఈ
గదిలోకి
చొరబడ్డా, మాకు
తెలిసిపోతుంది.
ఈ
పత్రిక
ఆఫీసులో
మిగిలిన
వారి
తుపాకీలు
పేలవు”
జనగణమన కేశవ్ షాక్ దెబ్బ
తిని
కూర్చోనుండ...
కళావతి గడ్డం ఆసామిని
చూసింది.
“జనగణమన కేశవ్ ని
మన
మిల్లుకు
తీసుకువెళ్ళి
ఆ
పరంధాముడి
పాదాలను
మొక్కుకోవటానికి
దారి
చూపండి...ఎక్కువ
నెత్తురు
చిందించకుండా
అహింసా
మార్గంలో
పంపించి
రండి...”
కళావతి మాట్లాడుతున్నప్పుడే
మరణ
భయం
బుర్రకు
జేర, గబుక్కున
కుర్చీలో
ఉన్న
తన
శరీరాన్ని
జార్చి, లేచి, గడ్డం
ఆసామిని
తోయడానికి
ప్రయత్నించ
----
అతనూ నవ్వుతూ
తప్పుకున్నాడు.
“చూశావా...ఈ
తుంటరి
పనులనే
కదా
వద్దనేది!
నా
చేతిలో
తుపాకీ
ఉన్నది
నీకు
కనబడలేదా...? మ్యాడమ్
...వీడ్ని ఇక్కడే
కాల్చి
చంపేద్దామా...?”
“వద్దు...ఇది
వ్యాపారం
చేసే
చోటు.
మన
రెగ్యులర్
చోటికి
తీసుకు
వెళ్ళిపో”
తల ఊపిన
గడ్డపతను
జనగణమన
కేశవ్ యొక్క గొంతు
మీద
తన
ఎడం
చేతిని
వేసి
-- ముఖం మీద
తుపాకీ
ఉంచాడు.
“ఊ...నడు...”
ఆ గది
వెనుక
పక్క
దాగి
ఉన్న
ఒక
తలుపు
వైపుకు
నెట్టుకుంటూ
వెళ్ళాడు.
టేబుల్ మీద
ఉన్న
ఇంటర్
కాం
పిలవగా, కళావతి
రిజీవర్ని
తీసి
“ఏమిటి?” అన్నది.
అవతల
సైడు
రిసెప్షనిస్ట్
మాట్లాడింది.
“రిపోర్టర్ సుందర
మూర్తి ఒక అవసర
విషయంగా
మిమ్మల్ని
చూడటానికి
వచ్చారు...మ్యాడమ్...”
“పంపించు...! సుందర
మూర్తి ఎప్పుడొచ్చినా సరే, వైట్
చేయ
నివ్వకు!
వచ్చిన
వెంటనే
పంపు...”
“ఎస్...మ్యాడమ్...”
కళావతి రీజీవర్ను
పెట్టేసి
-- బాటిల్లో ఉన్న
మంచి
నీళ్ళను
తీసుకుని
గొంతు
తడుపుకుంది.
తలుపు కొట్టబడింది.
“టక్...టక్...”
“రా...
సుందర మూర్తి”
తలుపు తోసుకుని
లోపలకు
వచ్చిన
ఆ
సుందర
మూర్తి కి వయసు
ఎంత
ఉంటుందో
తెలుసుకోలేనంత
శరీర
దేహం.
కారునలుపు
రంగు.
పక్కకు
దువ్వుకున్న
జుట్టు, ముందున్న
బట్టతలని
కనిపించకుండా
చేస్తోంది.
కళ్ళకు
కళ్ళద్దాలు.
భుజాన
ఒక
సంచీ, చొక్క
జేబులో
ఒక
పెన్ను.
పెన్ను
పెట్టుకున్న
చోట
ఇంకు
కారుంది.
“నమస్తే మ్యాడమ్...”
“కూర్చో...
సుందర మూర్తి...! ఏమిటీ
నాలుగైదు
రోజులుగా
ఇటుపక్కకు
రాలేదు...?”
సుందర మూర్తి బీడా వేసుకున్న
మరకలతో
ఉన్న
పళ్ళు
చూపిస్తూ
నవ్వాడు.
“గాలంలో ఒక
చేప
చిక్కు
కుంది
మ్యాడమ్.
దాని
గురించి
వివరాలు
సేకరించటానికే
సమయం
పట్టింది.
చాలా
తిరగ
వలసి
వచ్చింది...”
కళావతి నిటారుగా
కూర్చుంది.
“దొరికిన చేప
ఎక్కడిది...?”
“మనం ఎదురు
చూడని
చేప
మ్యాడం...జడ్జ్
శివప్రసాద్”
“ఎలా...ఎలా..?”
సుందర మూర్తి తన భుజాన
తగిలించుకున్న
సంచీని
తెరిచి, పచ్చ
రంగు
కవర్
తీశాడు.
టేబుల్ మీద
పెట్టాడు.
అందులో నుండి
ఫోటోలు
బయటకు
వచ్చాయి.
అన్ని ఫోటోలలోనూ
ఒక
యుక్త
వయసు
అమ్మాయి
కనబడింది.
ఏదో
మత్తులో
ఉన్నట్టు
ఒక
ధోరణి.
కళావతి ఫోటోలను
చూసి
అడిగింది.
“సుందర మూర్తీ! ఈ
ఫోటోలో
ఉన్న
అమ్మాయి
ఎవరు...?”
“జడ్జ్ శివప్రసాద్
యొక్క
రెండో
కూతురు.
పేరు
కవితాశ్రీ...”
“ఇదేం ఫోజు...?”
“మ్యాడమ్! ఈ
కవితాశ్రీ
డ్రగ్స్ తీసుకునే
అలవాటుకు
బానిస.
అందాపూర్
వెళ్లే
దోవలో
ఒక
ఎక్స్
టెన్షన్
ప్రాంతంలో
ఉన్న
ఒక
బంగళా
లోపల
డ్రగ్స్
వ్యాపారం
జరుగుతోంది.
చాలా
మంది
ఆడపిల్లలు
అక్కడికి
వచ్చి
వెడుతున్నారు.
ఆ
ఆడపిల్లలో
ఈ
కవితాశ్రీ
కూడా ఒకత్తి. ఈ
వివరం
తెలుసుకున్న
నేను
కెమేరాతో
వెళ్ళి
ఆమె
మత్తు
డ్రగ్స్
తీసుకుని
మత్తులో
ఉన్నప్పుడు
పది
పదిహేను
ఫోటోలు
తీశాను...అవే
ఇవి...”
“గుడ్...! నువ్వు
ఫోటోలు
తీసేటప్పుడు
ఎవరూ
చూడలేదుగా...?”
“లేదు మ్యాడమ్...”
“ఈ రోజు
చాలా
వేడి
వేడి
వార్త
తీసుకొచ్చావు!
సాయంత్రం
వచ్చి
కాషియర్
దగ్గర
ఒక
ఐదు
వేలు
తీసుకో...”
“థ్యాంక్యూ...మ్యాడమ్...”
“ఇక ఈ
వార్తను
నేను
చూసుకుంటాను.
నువ్వు
బయలుదేరు
సుందర
మూర్తీ...”
సుందర మూర్తి లేచి సెలవు
తీసుకుని
వెళ్ళిన
తరువాత, కళావతి
టెలిఫోన్
డైరెక్టరీని
తీసి
పేజీలు
తిరగేసింది.జడ్జ్
శివప్రసాద్
టెలిఫోన్
నెంబర్ను
కనిబెట్టి
డయల్
చేసింది.
రింగు వెళ్ళి
రిజీవర్
ఎత్తబడింది.
“హలో...”
“ఎస్...”
“జడ్జ్ శివప్రసాద్
గారి
ఇల్లా...?”
“అవును...”
“జడ్జ్ గారు
ఉన్నారా...?”
“ఉన్నారు...మీరెవరు...?”
“నేను లా
మంత్రి
గారి
సెక్రెటరీ-కం-స్టెనో
మాట్లాడుతున్నాను.
జడ్జ్
గారి
దగ్గర
ఒక
ముఖ్య
విషయం
చెప్పాలి”
“ఒక్క నిమిషం...!
లైన్లో
ఉండండి”
అర నిమిషం
కాచుకుని
ఉన్న
తరువాత
జడ్జ్
శివప్రసాద్
గారి
గొంతు
వినబడింది.
“ఎవరు...?”
“నమస్తే జడ్జి
గారు...నేను
ఎదురీత
పత్రిక
ఎడీటర్
కళావతి
మాట్లాడుతున్నాను...”
“ఏమిటి విషయం...?”
“ఒక అసహ్యమైన
విషయం
గురించి
మీ
దగ్గర
మాట్లాడాల్సి
ఉంది...”
“అసహ్యమైన విషయమా...?”
“అవును సార్...మీ
రెండో
అమ్మాయి
కవితాశ్రీ
కాలేజీకి సరిగ్గా
వెళ్ళకుండా
డ్రగ్స్
అలవాటుకు
బానిసై
ఉన్నదని
చెప్పటం
అసహ్యమైన
విషయమే
కదా...?”
“ఏ...ఏమిటీ? నా
కూతురు
కవితాశ్రీ
డగ్స్ తీసుకుంటోందా...ఏమిటి
వాగుతున్నావు...?”
“తండ్రులందరూ ఇలాగే
జడ్జ్
గారూ
తమ
కూతురు
సవ్యంగా
కాలేజీకి
వెడుతున్నట్టు
అనుకుంటూ
ఉంటారు.
అంతే
గానీ
అమ్మాయలు
దారి
తప్పి
వెడుతున్నది
తెలియదు...మీ
కూతురు
కవితాశ్రీ
డగ్స్ తీసుకుని ఆ
మత్తులో
కళ్ళు
మూసుకుని
అర్ధ
నగ్నంగా
కూర్చోనున్న
ఫోటోలు
నా
చేతిలో
ఉన్నాయి...కొంతమంది
మగ
పిల్లల
మొహాలు
కూడా
కనబడుతున్నాయి”
“నో...”
“ఇలా నో
అంటూ
గట్టిగా
అరిస్తే
నిజం
అబద్దం
అయిపోతుందా...? సాక్ష్యాలు
నా
దగ్గర
ఉన్నాయి
సార్.
ఇంకో
రెండు
రోజులు...మీ
అమ్మాయి
గురించిన
వార్త
పేజీ
నా
పత్రికకు
హైలైట్.
అదేంటంటే
‘ఒక
లేడి
దారి
తప్పి
వెడుతోంది’
అనే
హెడింగ్
తో
ఆర్టికల్, మీ
అమ్మాయి
ఫోటోలు
ప్రచురణ
అవబోతున్నాయి...”
“వ...వద్దు”
“వద్దా...అదెల
జడ్జ్
గారు...ఈ
సమాజంలో
తప్పు
చేస్తున్న వారిని బయటకు
తీసుకు
వచ్చి, బయటపెట్టటమే
కదా
మా
పని”
జడ్జ్ శివప్రసాద్ ఆందోళన పడ్డాడు.
“దయచేసి మా
అమ్మాయి
గురించి
రాయకండి.
నా
కూతుర్ని
ఖండించి
ఉంచుతాను.
పత్రికలలో
దాని
గురించి
వస్తే
దాని
భవిష్యత్తే
దెబ్బ
తింటుంది”
“ఓ...! మీ
అమ్మాయి
భవిష్యత్తు
ఈ
విషయంలో
దాగుందా...? ఇది
నేను
ఆలొచించనే
లేదే.
కానీ
జడ్జ్
గారూ...మా
పత్రిక
ధర్మం
ప్రకారం
మాకు
దొరికిన
సమాచారాన్ని
మేము
వార్తను
చేసుకోవాలే...”
“ప్లీజ్...వద్దు...”
“మీరు ఇప్పుడు
చెబితే...ఈ
‘ప్లీజ్’
కు
ఒక
రేటు
మాట్లాడుకుందామా
సార్”
“........................”
“ఏమిటి సార్...సైలెంటుగా
ఉన్నారు...?”
జడ్జ్ గొంతు
సవరించుకుని
చిన్న
స్వరంతో
అడిగారు
“నీకు
ఎంత
డబ్బు
కావాలి?”
“మీ స్టెటస్
కు
నేను
ఫిక్స్
చేసిన
అమౌంట్
ఐదు
లక్షలు...”
“అ...అ...అంత
డబ్బు
నా
దగ్గర
ఉండదే!”
కళావతి నవ్వింది.
“జడ్జి గారూ...మీరు
మీ
ఉద్యోగంలో
పెద్దగా
నీతి
మంతులు
కాదని
నాకు
న్యూస్
వచ్చింది...నేరారోపణ
కు
లోనైన
వాళ్ళకు, వాళ్ళకు
ఫేవర్
గా
తీర్పు
రాయాలంటే
దానికి
మీరు
తీసుకునే
ఖరీదు
పలు
లక్షలు
ఉంటాయని
విన్నాను.
అవినీతి
కేసుల్లో
చిక్కుకున్న
ఎందరో
మంత్రులనూ, ఐ.ఏ.ఎస్.
అధికారులనూ
బయటపడేసే
పుణ్యం
మీకే
కదా
ఉన్నది...”
“దాని గురించంతా
మాట్లాడకు”
“సరే...మాట్లాడను...ఐదు
లక్షలకు
ఏం
చెబుతారు...? మీరు
డబ్బు
ఇవ్వలేదనుకోండి, ఇంకో
రెండు
రోజుల్లో
మీ
అమ్మాయి
గురించిన
విషయం
న్యూస్
గా
వచ్చేస్తుంది.
ఒకవేల
నేను
బ్లాక్
మైల్
చేసిన
విషయాన్ని
మీరు
పోలీసులకు
చెప్పి, నన్ను
చట్ట
పూర్వకంగా
కలుద్దామనే
ప్రయత్నం
జరిగినా...మీ
కూతురు
పరువు
అల్లరిపాలు
అవుతుంది...”
“నీకు కావలసింది
డబ్బే
కదా...? ఇస్తాను...”
“ఇది తెలివగల
వాళ్ళు
చేసే
పని...”
“డబ్బును ఎక్కడకొచ్చి
ఇవ్వాలి...?”
“రేపురాత్రి
ఎనిమిది
గంటల
నుండి, ఎనిమిదిన్నర
లోపు
ట్యాంక్
బండ్
దగ్గరున్న
‘లాలూ
మార్ట్’
దగ్గరకు
కారులో
వచ్చి
కాచుకోనుండండి...మా
మనిషి
ఒకతను
మోటార్
సైకిల్లో
వచ్చి
మీతో
మాట
కలుపుతాడు.
డబ్బు
పెట్టెను
అతని
దగ్గర
ఇచ్చేయండి...”
“సరే....”
“జడ్జ్ గారూ...!
ఇప్పుడు
నేను
చెప్పింది
ఎటువంటి
ఇబ్బందీ
లేకుండా
జరగాలి.
ఇందులో
ఏదైనా
తప్పు
జరిగిందో, దాని
ఫలితం
మీ
అమ్మాయికి
కష్టాలు
తెచ్చి
పెడుతుంది"
“ఆ ఫోటోలు...?”
“నా డబ్బు
నా
చేతికి
ఎంత
సేఫ్
గా
వస్తుందో, ఫోటోలు
కూడా
అంతే
సేఫ్
గా
మీ
దగ్గరకు
వస్తాయి”
కళావతి రీజీవర్ను
పెట్టేసి
-- గ్లాసులో మిగిలున్న
మంచి
నీళ్ళను
గొంతులోకి
పోసుకుంది.
Continued...PART-5
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి