చంద్రగ్రహం ఎలా చెత్త కుండి అయ్యింది...(ఆసక్తి)...30/06/22 న ప్రచురణ అవుతుంది

కుడి చేతి వాటం,ఎడమ చేతి వాటం: కారణం?...(ఆసక్తి)...01/07/22 న ప్రచురణ అవుతుంది

గాలితో ఒక యుద్దం...(9 భాగాల సీరియల్ రోజు విడిచి రోజు ప్రచురణ అవుతుంది)....(PART-1)...(02/07/22) న ప్రచురణ అవుతుంది

10, జూన్ 2022, శుక్రవారం

మానవత్వం...(పూర్తి నవల)

 

                                                                                      మానవత్వం                                                                                                                                                                             (పూర్తి నవల)

సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు. మానవత్వం లేని మతం రాణించదు.మానవత్వం అంటే కరుణ, ప్రేమ, దయ, ఇంకా ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకు: బాధితులపట్ల కనికరం చూపటం, కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం ఇంకా ఎన్నో. గుణాలన్నీ ఆడవారికి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. నవలలోని హీరోయిన్  యామిని అలాంటి గుణం కల ఒక ఆడది. పెళ్ళి చూపులకు వస్తున్నారని తల్లి ఆఫీసుకు ఫోన్ చేసి, ఆఫీసు నుండి త్వరగా బయలుదేరి రమ్మని యామినికి చెబుతుంది.

యామిని ఇంటికి వస్తున్న దారిలో చెత్త కుండికి దగ్గరగా ఎవరో అప్పుడే పుట్టిన బిడ్డను పడేశారు. మానవత్వం నిండిన యామిని అందరూ వేడుక చూస్తూండగా, తానుగా ముందుకు వచ్చి బిడ్డను కాపాడి ఇంటికి తీసుకు వెళ్ళింది.

పిల్లను చూద్దామని వచ్చిన పెళ్ళి వారు, యామిని తల్లి, తండ్రి, మిగిలిన కుటుంబ శభ్యులు ఆమె చర్యకు ఆశ్చర్యపోతారు. అది యామిని బిడ్డేనని వాదించి తిరిగి వెళ్ళిపోతారు మగ పెళ్ళివారు.

యామిని బిడ్డను ఏం చేసింది? ప్రేమికుడికి బిడ్డ గురించి ఏం సమాధానం చెప్పింది? తన తల్లి-తండ్రులకు ఏం చెప్పింది?......చివరికి ఆమె, ఆమె జీవితాన్ని, బిడ్డ జీవితాన్ని ఎలా మలుచుకుంది?...ఇవన్నీ నవలను చదివి తెలుసుకోండి.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మానవత్వం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి