4, జూన్ 2022, శనివారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-2

 

                                                                    పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                                PART-2

ఉదయం పదకొండు గంటలు.

రాసిన హెడ్ లైన్స్ ను సరిచూసుకుంటున్న కళావతిని టెలిఫోన్ పిలిచింది. చూస్తున్న పనిని ఆపకుండానే రీసీవర్ ఎత్తి హలో... అన్నది. నలభై ఏళ్ళ కళావతి.

టెలిఫోన్లో స్వరం వినబడింది.

ఇది 'ఎదురీత పత్రిక ఆఫీసా?”

అవును...

ఎడీటర్ కళావతి గారి దగ్గర మాట్లాడాలే...?”

నేను కళావతినే మాట్లాడుతున్నాను...

నిజంగానే కళావతి గారేనా మాట్లాడేది...?”

అవును...

మీ దగ్గర మాట్లాడాలని నాకు చాలా రోజుల నుండి ఆశ. రోజు ఆశ నెరవేరింది...

మీరెవరు...?”

జనగణమన కేశవ్...

పేరే చాలా వ్యత్యాసంగా ఉందే...?”

నేనూ కొంచం వ్యత్యాసమైన మనిషినే...

రకంగా మీరు వ్యత్యాసమైన మనిషి...?”

ఒకటొకటిగా చెప్పనా?”

చెప్పండి...

నేను ఏం.. డిగ్రీ పట్టా పుచ్చుకున్నాను. పనిచేసేది నాచారంలో ఉన్న ఒక పప్పుల మిల్లులో. పదివేల రూపాయలతో రెవెన్యూ డిపార్ట్ మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే...వద్దని చెప్పాను

ఎందుకని...?”

ఇది ఒక అవినీతి దేశం. నిజాయతీ నాయకులూ -- అధికారులూ లేరు. ఎక్కడ చూసినా అవినీతి. అన్నిట్లోనూ అవినీతి. అంతా అవినీతే. అవినీతితో నిండిన ప్రభుత్వంతో పనిచేయటానికి బదులు నాచారంలోని ఒక పప్పుల మిల్లులో పనిచేయటానికి ఇష్టపడ్డాను. నెలకు మూడువేల రూపాయలు జీతం...

సరిపోతుందా...?”

సరిపోదు...అందుకని రాత్రి పన్నెండింటి వరకు రిక్షా లాగుతను...

నిజంగానే మీరు ఒక వ్యత్యాసమైన వ్యక్తే. సరే...ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశారు...?”

మీ పత్రిక రాజకీయ సమతుల్యంతో జరపబడుతున్న విధం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా అందులో వచ్చే శీర్షికల పేర్లు అద్భుతం. రెండు రోజుల క్రితం మీ పత్రికలో రాసిన ఒక వ్యాసం నా మనసులో అలాగే అతుక్కుపోయింది...ఇండియా స్వాతంత్రానికి మాత్రమే అరవై ఏళ్ళు పట్టింది...? అవినీతికి అదే అరవై ఏళ్ళు నిండింది. మత కలహాలకూ, కుల కలహాలకూ అదే వయస్సు! దేశంలో ఉన్న నాయకుడికీ జాతీయ జెండాను ఎగరేసే  అర్హత లేదు! -- ఇలాంటి రాతలు రోజూ నేను మర్చిపోలేను" 

శీర్షికలను పొగడటానికే నాకు ఫోన్ చేసారా...?”

లేదు...

మరి...?”

మీ దగ్గర కొంచం మాట్లాడాలి?”

దేని గురించి...?”

ఫోనులో ఏదీ వద్దు...మిమ్మల్ని కలవటానికి నాకు సమయం కేటాయించారంటే, నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను...

ఏదైనా ముఖ్యమైన విషయమా?”

అతి ముఖ్యమైన విషయం... విషయం మీ పత్రికలో వచ్చిందంటే, మీ పత్రిక సేల్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంది...

నాకు సేల్స్ ముఖ్యం కాదు. పత్రికలో ప్రచురించబడే వార్తలో నిజం ఉండాలి

మీ పత్రిక గురించి నాకు తెలియదా ఏమిటి? నేను మీతో మాట్లాడబోయే విషయానికి ఆధారమే ఇస్తాను...చాలా?”

అది చాలు...

నేను ఎన్నిగంటలకు మిమ్మల్ని చూడటానికి రావచ్చు?”

ఇప్పుడే రండి...! ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి మంచి రోజు, మంచి నక్షత్రం, మంచి టైము చూడాలా ఏమిటి...?”

పది నిమిషాల్లో బయలుదేరి వస్తాను

ఇప్పుడు మీరు ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు?”

పంజాగుట్ట సిగ్నల్ పక్కనున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుండి...

దగ్గరలోనే ఉన్నారు...ఒక ఆటో పట్టుకుని వచ్చాయండి. మీ పేరు ఏం చెప్పారు...?”

జనగణమన కేశవ్...

రండి...మీకొసం వెయిట్ చేస్తాను

కళావతి టెలిఫోన్ రీజీవర్ను ఆలొచనతో పెట్టేసి, జనగణమన కేశవ్ కోసం కాచుకోనుంది.

ఎర్రగా ఉన్న ద్రవం ఆడుతుంటే, బాటిల్ మెడలో కట్టబడి ఉన్న చిన్న కాగితంలో తెలుగులో విడి విడిగా రాయబడి ఉన్న అక్షరాల మీద తన దృష్టిని పెట్టాడు నరేందర్.

సి.ఏం. గారికి,

యాభై మిల్లీ లీటర్ బాటిల్ లోపల ఉన్నది మీ అమ్మాయి శరీరంలోంచి తీయబడిన రక్తం. రక్తం గడ్డకట్ట కుండా ఉండటానికి 'లైసిన్ ఫ్లుయిడ్' చేర్చ బడింది. ఎందుకని రక్తం...? మీ మనసులో ప్రశ్న మొదలై ఉంటుంది. మాకు దొరకవలసిన న్యాయం మీ దగ్గర నుండి మాకు దొరకటానికి ఆలశ్యమయ్యే ఒక్కొక్క రోజూ, మీ అమ్మాయి శరీరంలో నుండి యాభై మిల్లిలిటర్ రక్తాన్ని తీసి మీకు పంపబడుతుంది.

మా మనసులోని కోరికలు ఏమిటి...? కోరికలకు ఎలాంటి న్యాయం దొరకాలి అనే విషయం గురించి చెప్పే సి.డీ. ఇంకో పన్నెండు గంటల లోపు మీకు దొరుకుతుంది. కోరికలను వెంటనే నెరవేర్చి తీరాలి. లేదంటే మీ కూతురు రాధాకుమారి శరీరం నుండి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి యాభై మిల్లిలిటర్ రక్తాన్ని తీసి మీకు పంపుతూ ఉంటాము. రాధాకుమారి శరీరంలో ఇక నెత్తురు లేదనే పరిస్థితి వస్తే, మీ అల్లుడు గణేష్ రాం శరీరంలో నుండి రక్తం తీయటం మొదలుపెడతాం

కాగితంలో రాసున్న లైన్లను చదివేసి విజయలక్ష్మి వైపు చూసాడు నరేందర్.

మ్యాడమ్... బాటిల్లో ఉన్న రక్తాన్ని పరీక్షించి చూసారా...?”

చూశాను...'బయో ల్యాబ్ టెక్నీషియన్ ఒకర్ని ఇక్కడికి పిలిపించి పరీక్ష చేసినప్పుడు, అది నా కూతురు రక్తం గ్రూపుకు చెందిందనేది తెలిసింది...

మ్యాడమ్...! మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగొచ్చా...?”

ప్లీజ్...

రేపటి భారతంసంస్థ ఇంతకు ముందు కారణానికైనా మిమ్మల్ని బెదిరించారా?”

ఒకే ఒక సారి...

ఎప్పుడు...?”

నేను పదవికి వచ్చిన కొత్తల్లో, రాష్ట్రంలోలా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని, కాబట్టి నేను రాజీనామా చేయాలని బెదిరించారు. దాన్ని నేను పెద్దగా తీసుకోలేదు

సరే...ఇప్పుడు వాళ్ళ కోరిక ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు...?”

తెలియటం లేదే...?”

విజయలక్ష్మి చెబుతున్నప్పుడే, ఆమెకు ముందున్నటేబుల్ పైన ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయ్యింది.

తీసి చెవి దగ్గర పెట్టుకుంది.

ఎస్...

అవతలవైపు పోలీస్ కమీషనర్ మాట్లాడారు.

మ్యాడమ్...నేను పోలీస్ కమీషనర్ నిరంజన్

చెప్పండి

నా ముందు అన్ని పత్రికల విలేఖర్లు కూర్చోనున్నారు...

......ఏమిటి విషయం...?”

వాళ్ళు విన్న ఒక విషయం నిజమేనా అని నన్ను అడుగుతూ ట్రబుల్ పెడుతున్నారు...అదేంటంటే మీ కూతురూ, అల్లుడూ రేపటి భారతంఅనే ఒక సంఘం వాళ్ళు కిడ్నాప్ చేసారని చెబుతున్నారు...వార్త కరెక్టేనా మ్యాడమ్...?”

“.....................”

విజయలక్ష్మి మౌనం వహించగా, కమీషనర్ నిరంజన్ అవతలసైడు మాట్లాడారు.

మ్యాడమ్...

అదొచ్చి...

న్యూస్ నిజమా...అబద్దమా మ్యాడమ్...?”

నిజమే... విషయం పత్రికా విలేఖర్లకు ఎలా తెలిసింది...?”

అది అడిగాను...

ఏం చెప్పారు...?”

ఫోనులో సమాచారం వచ్చింది అన్నారు

సరే...మీరు వెంటనే బయలుదేరి నా బేగంపేట బంగళాకు రండి. సమస్యలో సహాయపడటానికి మిస్టర్ నరేందర్ ఇక్కడకొచ్చి నన్ను కలిసి మాట్లాడుతున్నారు

విజయలక్ష్మి సెల్ ఫోన్ ఆఫ్ చేసి శోకంగా చూసింది.

కిడ్నాప్ సంభవం బయటిలోకానికి తెలిసేలోపే, దీన్ని సాల్వ్ చేసేద్దామని అనుకున్నాను...కుదురలేదు. విషయం ఎలాగో పత్రికలకు వెళ్ళిపోయింది...?”

మ్యాడమ్...! ఇది దాచి పెట్టబడే విషయం కాదు. మనం దాన్ని ఎంత దాచి పెడదామన్నా, వ్యవహారం బయటకు వచ్చే తీరుతుంది...శత్రువులను కనిపెట్టటానికి పోలీసులు తమ హడావిడి ప్రయత్నాన్ని చేయనివ్వండి. నేను ఒంటరిగా, అంటే డిపార్టు మెంటుకు తెలియకుండా ఎర్రశిలా అడవి ప్రాంతానికి వెళ్ళి వ్యవహారాన్ని హ్యాండిల్ చేస్తాను

నరేందర్! కార్యాన్ని మీ వలన విజయవంతంగా చేయటం కుదురుతుందా...?”

బాధ పడకండి మ్యాడమ్... రేపటి భారతంసంఘం కోరికలను తెలుపనివ్వండి. కోరికలను తీర్చటానికి పరిశీలిస్తున్నామని ప్రభుత్వం నుండి చెబుతూ ఉండండి లోపు నేను వాళ్ళను చుట్టుముడతాను

విజయలక్ష్మి  స్వరం పెంచింది.

నరేందర్! నాకు నా కూతురు, అల్లుడూ ప్రాణాలతో కావాలి. ఆమె మరో బాటిల్ రక్తం చిందించేలోపు, ఆమె నా కళ్ల ముందు ఉండాలి. ఆమె లేకపోయిన తరువాత లోకంలో నాకు అంతా చీకటే

బాధ పడకండి మ్యాడమ్. ఇంకో నలభై ఎనిమిది గంటల్లో  మీ కూతురు, అల్లుడూ మాత్రమే కాదు. వాళ్ళకు సెక్యూరిటిగా వెళ్ళిన పోలీసులను కూడా మీ ముందు ఉంచుతాను...

నరేందర్ లేచి ఒక సెల్యూట్ చేశాడు.

ఇంటర్ కాంమోగిన వెంటనే తాను ఎడిట్ చేస్తున్న న్యూస్ రిపోర్టును పక్కన పెట్టి ఇంటర్ కాంబటన్ నొక్కింది కళావతి.

ఎస్

రెసెప్షన్ అమ్మాయి మాట్లాడింది.

జనగణమన కేశవ్ అనే ఒక అతను మిమ్మల్ని చూడటానికి వచ్చారు. లోపలకు పంపనా...?”

పంపు...

కళావతి చూస్తున్న ఫైళ్ళను టేబుల్ పై నుండి తీసి, పక్కనున్న టేబుల్ మీద పెట్టి అర నిమిషం కాచుకున్న తరువాత -- తలుపు కొడుతున్న శబ్ధం వినబడింది.

టక్...టక్...

లోపలకు రావచ్చు

తలుపును తోసుకుంటూ లోపలకు వచ్చాడు యువకుడు. ముప్పై ఏళ్ళు ఉంటాయి. పాలతెలుపు రంగులో పంచ, చొక్కా. రెండూ అసలుసిసలు ఖద్దరు. తలమీద ఖదర్ టోపి.

నమస్తే నమ్మా...

రండి జనగణమన కేశవ్...!

కొంచం ఆలశ్యమైంది...

పరవాలేదు...కూర్చోండి! -- కళావతి తనుకు ఎదురుగా ఒక కుర్చీ చూపించగా -- అతను  కూర్చున్నాడు.

కళావతి నవ్వింది.

ఇలాంటి ఒక డ్రస్సులో ఖచ్చితంగా మిమ్మల్ని ఎదురు చూడలేదు. మీరేదో కాలపు స్వతంత్ర పోరాట త్యాగి లాగా ఉన్నారే...?”

నా మనస్సు అయోమయంలో ఉన్నప్పుడు నేను డ్రస్సుకు మారిపోతను. వెంటనే ప్రశాంతత దొరుకుతుంది...

మీ పేరులాగానే మీరు కూడా వ్యత్యాసంగా ఉన్నారే...సరే! నా దగ్గర ఏదో మాట్లాడలని ఫోనులో చెప్పారు. ఏమిటి విషయం...?”

మీ పత్రిక నాకు నచ్చుతుంది. కారణం, స్వయంగా ఆలోచించడం తెలియని తెలుగు ప్రజలను మీ పత్రికే ఆలోచింప చేస్తోంది

కళావతి నవ్వింది.

విషయం మీరు ఫోనులోనే చెప్పారే...!

మ్యాడమ్...! ఒక మహిళగా ఉంటున మీరు ఎవరికీ, రాజకీయ నాయకుడికీ భయపడకుండా...కొరడా దెబ్బలాగా రాస్తున్నారు... ధైర్యం ఎవరికి వస్తుంది...?”

నన్నూ, నా పత్రికనూ పొగడింది చాలు జనగణమన కేశవ్. విషయానికి వస్తారా...?”

ఇదిగో వచ్చేస్తున్నా...! నేను ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. రహస్యమైనది. ఒక అరగంట సేపు మాట్లాడలవలసి వస్తుంది...

మాట్లాడొచ్చే...

ఎవరి డిస్టర్బన్స్ ఉండకూడదు

అంతే కదా... నవ్వింది కళావతి. ఇంటర్ కాంరిజీవర్ ఎత్తి ఒక బటన్ నొక్కి, ‘పద్మా! అన్నది.

అవతల పక్క బర బర అన్నది.

ఎస్ మ్యాడమ్...

ఒక అరగంట సేపు నేను చాలా బిజీ. నన్ను చూడటానికి ఎవర్నీ పంపొద్దు...

ఎస్ మ్యాడమ్...

నాకు ఫోన్ వస్తే పెండింగ్ లో ఉంచు. ఏదైనా అర్జెంటు న్యూస్ అయితే మన సబ్-ఎడిటర్ ను చూడమని చెప్పు

ఎస్ మ్యాడమ్...

కళావతి రీసీవర్ను పెట్టేసి జనగణమన కేశవ్ వైపు చూసింది. ఇక మీరు విషయానికి రావచ్చు...

థ్యాంక్స్...! విషయంలోకి వచ్చే ముందు మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడగాలి...అనుమతిస్తారా...?”

అడగండి...

మీ పూర్తి పేరు కళావతే కదా?”

అవును... కళావతే...

పెళ్ళి చేసుకోవటానికి ఇష్టం లేదని విన్నాను. అది నిజమా?”

కళావతి అతన్ని విసుగ్గా చూసింది.

అతను నవ్వాడు. ఏమిటి మ్యాడమ్. అలా చూస్తున్నారు...?”

లేదూ...మీరు అడిగిన ప్రశ్నలన్నీ అనవసరమైన ప్రశ్నలు. విషయం చెప్పటానికి వచ్చారో, అది చెబితే పరవాలేదు

ఇలా అవసరపడితే ఎలా మ్యాడమ్...? మీకు సంబంధించిన కొన్ని విషయాలు క్లియర్ చేసుకుంటేనే కదా, ముఖ్యమైన విషయానికి రా గలుగుతాను...?”

సరే...మీరు అడగాలనుకున్నవన్నీ అడిగేయండి...?”

మీరు పత్రిక రంగంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలయ్యింది...?”

ఏడెనిమిది సంవత్సరాలు...

పత్రికా రంగానికి రాక ముందు మీరు ఏం చేస్తూ ఉండేవారో చెప్పగలరా?”

అది...వచ్చి...వచ్చి...

...చెప్పండి...

ఒక సంఘ సేవకురాలిగా ఉన్నాను... మీన్ సమూహ సేవ చేసేదాన్ని...

జనగణమన కేశవ్ నవ్వాడు.మ్యాడమ్! మీరు ఎలాంటి సంఘ సేవను చేసేరనేది నాకు బాగా తెలుసు. కేరళా నుండి, ముంబై నుండి అమ్మాయలను రప్పించి, ఇక్కడున్న సంపన్నులకు సప్లైచేసి డబ్బు సంపాదించే వారు. దాన్ని పోయి సంఘ సేవ, సమూహ సేవ అని చెబుతున్నారే...అది సంఘ సేవా కాదు, సమూహ సేవా కాదు మ్యాడమ్, శరీర సేవ

అతను మాట్లాడటం కొనసాగిస్తుంటే మొహం చిట్లించింది కళావతి. ఒక కోపమైన చూపు చూసి ...సే...గెట్ ఔట్! అన్నది.

ఏమిటి మ్యాడమ్...ఉన్నమాట చెబితే కోపం వస్తోందా...? చెప్పవలసిందంతా చెప్పి ముగిస్తాను. అన్నిటికీ కలిపి కోపగించుకోండి...సంఘ సేవ ముసుగులో శరీర సేవ చేస్తున్న మీరు పోలీసుల హడావిడి ఎక్కువ అవటం వలన అది వదిలేసి ఒక రాజకీయవేత్తతో కలిసి పత్రిక నడుపుతున్నారు...నటీ నటులనుబ్లాక్ మైల్ చేస్తున్నారు….

పత్రికను అప్పటి ప్రభుత్వం నిషేధించటంతో ఎదురీత అనే రాజకీయ పత్రికను మొదలుపెట్టారు. దీన్నైనా బాగా నడుపుతున్నారా అంటే...అదీలేదు. సమాజం లోని వి..పి. అంతరంగ విషయాలు, రాజకీయ వేత్తల అంతరంగ విషయాలను ఫోటోలు తీసి, అధికారులను పెట్టుకుని సంబంధించిన రాజకీయవేత్తలను బెదిరించి లక్షల రూపాయలు డబ్బు గుంజే పనిచేస్తున్నారు. ప్రొద్దున పూట ఒక భయంకరమైన బ్లాక్ మైలర్, పత్రికా రంగాన్ని కించ పరిచే మీలాంటి గడ్డి పోచలు బ్రతకటం నాకు ఇష్టం లేదు...సో.."

---అంటూ హీనంగా మాట్లాడుతూ తన తల మీదున్న ఖదర్ టోపీని తీశాడు----

లోపల అరచేతిలోకి సరిపోయే ఒక తుపాకీ అతని కృరమైన అవతారాన్ని చూప, జనగణమన కేశవ్  దాన్ని చేతిలోకి తీసుకుని గురి చూసాడు.

కళావతి నవ్వింది.

ఇప్పుడు...నువ్వు నన్ను చంపబోతావు...?”

అవును

సరే...నీ ఆశను నేనెందుకు చెడుపుతాను! కాల్చు

కుర్చీలో వెనక్కి వాలుతూ జనగణమన కేశవ్ నే చూసింది కళావతి.

                                                                                                  Continued...PART-3

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి