పగటి పూట భూతాలు...(సీరియల్) PART-7
గదిలో అటూ, ఇటూ ఆందోళనగా నడుస్తున్న కళావతి తలెత్తి చూసింది. గొడ మీద అతికించబడినట్టు ఉన్న గడియారాన్ని చూసింది.
టైము రాత్రి పదకుండు గంటలు: చోటు కళావతి ఇల్లు.
‘జడ్జి దగ్గర డబ్బు తీసుకురావటానికి వెల్లిన డేవిడ్ ఇంకా వచ్చి చేరలేదే...?’
‘ఏదైనా సమస్యా...?’
‘పోలీసులకు చిక్కుంటాడో?’
‘ఉండదు. అలా గనుక జరిగుంటే, ఈ పాటికి పోలీసులు ఇక్కడికి వచ్చుంటారే...?’
ఆ గది ఏ.సీ. వలన బాగా చల్లబడి ఉన్నా, కళావతికి చెమట కారుతోంది.
తలుపులు తెరుచుకుని బాల్కనీ లోకి వచ్చి నిలబడి రోడ్డును తొంగి చూసింది.
రోడ్డు నిశ్శబ్ధంగా ఉంది.
‘జడ్జి డబ్బులివ్వకుండా మోసం చేసుంటాడో?’
‘అలా జరిగుంటే డేవిడ్ ఫోన్ చేసుంటాడే?’
కళావతి ఆలొచిస్తున్నప్పుడు లోపల ఫోన్ మోగటం వినిపించింది.
గది తలుపును ఒక్క తోపు తోసి పరుగున వెళ్ళి రిజీవర్ ఎత్తింది.
“హలో...”
“మ్యాడమ్...”
అవతల పక్క డేవిడ్. కళావతి ఆందోళన పడుతూ అడిగింది.
“ఏమిటి డేవిడ్...ఏమైంది...? జడ్జి డబ్బులు తీసుకు వచ్చి ఇచ్చారా లేదా?”
“ఇచ్చారు మ్యాడమ్...”
“మరెందుకు తీసుకురాలేదు...?”
“ఒక చిన్న సమస్య మ్యాడమ్...”
“ఏమిటది...?”
“నేను జడ్జి దగ్గర నుండి డబ్బు పెట్టెను తీసుకుని బైకులో వస్తున్నప్పుడు, నా పాత పార్ట్ నర్ ఒకతను అడ్డగించాడు. నాకూ, వాడికీ ఇదివరకట్నించే పగ. ఒక హత్య చేసినందుకు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన అతను, నన్ను చూసిన తరువాత గొడవ మొదలుపెట్టాడు. వాడికి దొరక కుండా వేరే దారిలో బైకును పోనిచ్చాను. వాడూ నన్ను తన స్కూటర్ లో వెంబడించాడు. మౌలాలీ దగ్గర వెళ్ళేటప్పుడు నా బండి పంక్షర్ అయ్యింది. నేను బండిని అక్కడే పడేసి చీకట్లో పరిగెత్తటం మొదలు పెట్టాను”
కళావతి ఆందోళన యొక్క చివరి వరకూ వెళ్ళి అరిచింది.
“ఆ...తరువాత...?”
“వాడూ నన్ను తరుముకుంటూ వచ్చాడు. ఒకచోట ఎవరూ లేరు. అక్కడ ఇద్దరం గొడవ పడ్డాం. ఇద్దరి చేతిలోని కత్తులూ మారి మారి ఒకల్ని ఒకరు పొడిచాయి. నాకు భుజాల దగ్గర, తొడల దగ్గర లోతుగా కత్తి దిగింది. అయినా కానీ ఓర్చుకోలేక చివరకు వాడిని చంపేశాను.
ఎలాగో పెట్టెను తీసుకుని శ్రమ పడుతూ రోడ్డుకు వచ్చాను. ఇక్కడొక టెలిఫోన్ బూత్ ఉంది. అందులో నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను. ఇక్కడ ఆటో, టాక్సీ ఏదీ లేదు. నేను నడవలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి”
అతను మాట్లాడుతుంటే.
కళావతి అడ్డుపడింది.
“ఇప్పుడు నువ్వు ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు?”
“మౌలాలీ మైన్ రోడ్డు నుండి కొంచం దూరం వెళ్ళి రెండో క్రాస్ రోడ్డులో ఒక ఫోన్ బూత్ ఉంది...మ్యాడమ్. అక్కడ్నుంచే...”
“టెలిఫోన్ బూతులో ఇంకెవరన్నా ఉన్నారా?”
“లేరు మ్యాడమ్...ఇది డబ్బులేసి మాట్లాడే బూత్...! మీరు వెంటనే కారు వేసుకుని రండి మ్యాడమ్. ఎవరి చూపులకైనా నేను కనబడితే ఆపదే...”
“భయపడద్దు డేవిడ్...ఇప్పుడే వచ్చేస్తాను”
రీసీవర్ను ఎగరేసినట్టు పెట్టి, టీపా మీదున్న కారు కీస్ తీసుకుంది కళావతి.
రెండు నిమిషాల తరువాత --
పోర్టికోలో నిలబడున్న ఆమె కారు, కాంపౌండ్ గేటును దాటి ఒక తుటాలాగా దూసుకు వెళ్ళింది.
ట్రాన్స్ పోర్ట్ లేని నగర వీధులలొ, సోడియం లైట్ల వెలుతురులో నిర్మానుష్యంగా ఉండగా -- కిలోమీటర్లను కారు సులభంగా జీర్ణం చేసుకుంది.
మౌలాలీ రోడ్డుకు కారు వచ్చినప్పుడు సమయం పదకొండూ-ముప్పై.
మౌలాలీ చీకట్లో వచ్చింది.
కారు వేగం తగ్గింది. ‘మైన్ రోడ్డులో నుండి సెకెండ్ క్రాస్ స్ట్రీట్ ఏది...?’
కళావతి తలను బయటకు పెట్టి వెతికింది, రెండు నిమిషాల గందరగోళం తరువాత రెండవ క్రాస్ వీధి కళ్ళకు కనబడింది.
కారును ఆ వీధిలోకి పోనిచ్చింది.
పొడుగ్గా ఉన్న రోడ్డు. దానికి రెండు పక్కల వరుసగా ఇళ్ళు. పోను, పోనూ ఆ ఇళ్ళు కూడా లేవు. ఖాలీ స్థలం కనబడింది.
‘ఈ చోట టెలిఫోన్ బూత్ ఉంటుందా?’
కళావతికి మొదటిసారిగా అనుమానం వచ్చింది.
బ్రేక్ నొక్కింది.
కారు ఆగింది.
‘దిగి చూద్దామా?’ చిన్నగా హృదయంలో దఢ పుట్టగా, ధైర్యం తెచ్చుకుని కిందకు దిగింది.
కొన్ని మిడతలు గిర-గిర ఎగురుతుండగా చుట్టూ ఏదీ కనబడలేదు. తల పైకెత్తి చూసింది. ఆకాశం అంతా జల్లినట్లు నక్షత్రాలు కనబడ్డాయి.
‘దారి తప్పి వచ్చామా...?’
ఆలొచిస్తున్న ఆమెను ఆ స్వరం లాగింది.
“రండి మ్యాడమ్...”
కళావతి తిరిగి చూసింది.
పదడుగుల దూరంలో -- చీకట్లో ఎవరో నిలబడున్నారు.
‘ఇది డేవిడ్ గొంతు లాగా లేదే..!’
“ఎవరది...?”
గొంతు వినబడింది.
“నేనెవరో తెలియటం లేదా మ్యాడమ్...?” అడుగుతూ ఆ రూపం దగ్గరకు వచ్చింది.
రెండడుగులు దగ్గరకు వచ్చిన వెంటనే -- రూపం ఛాతికి అడ్డుగా చేతులు కట్టుకు నిలబడగా -- కళావతి ఆ రూపాన్ని క్షుణ్ణంగా చూసిన వెంటనే ఆమె వెన్నుముకలో చలి మొదలయ్యింది.
నక్షత్రాల వెలుతురులో నవ్విన ఆ రూపం --
జనగణమన కేశవ్.
“ను...ను...నువ్వా...?”
“నేనే...”
కళావతి ఆందోళనతో అటూ, ఇటూ చూడగా, జనగణమన కేశవ్ నవ్వుతూ అడిగాడు.
“ఎవర్ని వెతుకుతున్నారు మ్యాడమ్...?”
“డే... డేవిడ్...?”
“ఇప్పుడు డేవిడ్ నే చూడబోతాము. కార్లో ఎక్కండి మ్యాడమ్...”
కళావతి తన మనసులో ఏర్పడుతున్న ఆందోళనను కనబడనివ్వకుండా, ధైర్యంగా అడిగింది.
“డేవిడ్...ఎక్కడ...? మొదట అది చెప్పు. వాడ్ని నువ్వు ఏం చేశావు..?”
“కార్లో ఎక్కండి మ్యాడమ్...వెడుతూ మాట్లాడుకుందాం...”
“కుదరదు...! డేవిడ్ ఎక్కడ...?”
జనగణమన కేశవ్ తన చేతిలో కనబడకుండా ఉంచుకున్న తుపాకీ తీసి కళావతి గొంతుకు పెట్టాడు.
“ఇంకో మాట మాట్లాడావా...! నీ గొంతుకలో తూటా దూసుకు వెడుతుంది...మర్యాదగా కారెక్కి కూర్చో..." చెప్పటంతో ఆపకుండా ఆమె మెడ పుచ్చుకుని కారులోకి తోశాడు.
**********************************
శరీరం కాలుతున్న వాసన గాలిలో నిండిపోయుండగా -- నరేందర్ చేతి రుమాలతో ముక్కు మూసుకుని దగ్గరగా వెళ్ళాడు.
కాలుతున్న శరీరంపైన తన జెర్కిన్ కోటును తీసి కప్పి -- మంటలను ఆర్పేడు
చాలా భాగం కాలిపోయి ఉన్న పరిస్థితి లో, ఆ శరీరాన్ని దొర్లించి, మొహాన్ని చూశాడు నరేందర్.
ప్లాస్టర్ తో అతికించబడ్డ నోటితో గంగన్న.
మనసులో ఏదో విరిగిన భావం. అటూ, ఇటూ చూశాడు. ఎవరూ కంటి చూపులకు కనబడలేదు.
‘గంగన్న శరీరానికి ఎవరు నిప్పు అంటించారు?’
చిన్నగా కదులుతున్న గంగన్న శరీరాన్ని--ఊపాడు నరేందర్. నోటికి అతికించబడిన ప్లాస్టర్ తీశాడు.
“గంగన్నా... గంగన్నా...”
“....................”
“గంగన్నా... గంగన్నా...”
“ఊ...ఊ...” మూలుగు వినబడింది.
“ఇలా చూడు...”
తెరుచుకున్న నోరు మంచి నీళ్ళ కోసం తపించ -- కనురెప్పలు చిన్నగా తెరుచుకున్నాయి.
“అయ్యా...”
“నీ వొంటికి నిప్పు పెట్టింది ఎవరు..?”
చెయ్యి పైకెత్తి ఏదో చెప్ప ప్రయత్నించాడు గంగన్న. నోరు కోఆపరేట్ చేయటం ఇష్టం లేక ఒక పక్కకు పోయింది.
“చెప్పు గంగన్నా...నీ వోంటికి ఇలా మంట పెట్టి పోయింది ఎవరు...?”
“అయ్యా! నీ...నీళ్ళు...”
నోరు వేగంగా తెరుచుకుని మూసుకోగా -- నరేందర్ అటూ, ఇటూ చూశాడు.
కొంచం దూరంలో ఏదో కాలువలాగా కనబడ్డది...పరిగెత్తుకు వెళ్ళి చూశాడు.
కురిసిన వానకు నిలబడ్డ ఆ చిన్న గుంటలో బురదతో కూడిన నీళ్ళు.
రెండు చేతులతోనూ నీళ్ళను తీసుకుని వేగంగా గంగన్న దగ్గరకు వచ్చాడు నరేందర్.
తెరిచున్న నోటిలో ఆ నీళ్ళు పోసాడు.
నీళ్ళు నోటిలో నుండి గొంతుకకు పోకుండా నోటి పక్క నుండి కారిపోయినై.
“గంగన్నా... గంగన్నా...”
బాడీలో కదలిక లేదు.
తెరిచున్న కళ్ళు ప్రాణం విడిచిపోయిందని తెలుపగా... నరేందర్ అతని కళ్ళు మూసాడు.
లేచి నిలబడి చుట్టూ చూసినప్పుడు -- కొంచం దూరంలో ఒక పొదకి పక్కన ఖాలీ కిరోసిన్ టిన్ దొరికింది. నరేందర్ దాని దగ్గరకు చేరుకుని ముట్టుకోకుండా జాగ్రత్త పడుతూ చూశాడు.
ఐదు లిటర్ల క్యాన్ అది.
‘శత్రువులు ఇక్కడే ఉన్నారు!’
‘గమనిస్తూ ఉంటున్నారు!’
నరేందర్ ఆలొచిస్తున్నప్పుడే -- అతని ప్యాంటు జేబులో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయ్యింది.
తీసి ఆన్ చేసి చెవిదగ్గర పెట్టుకున్నాడు.
అవతలి సైడు గౌతం మాట్లాడాడు.
“నరేందర్...అదేమి పోగ? ఏదైనా ముఖ్యమా?”
“చాలా ముఖ్యం...”
“ఏమిటి నరేందర్...?”
“పలుగు తీసుకురావటానికి కిందకు వెళ్ళిన గంగన్న ను ఎవరో అడవిలోకి బలవంతంగా లాక్కుని వెళ్ళి కిరసనాయల్ పోసి తగల బెట్టారు...”
గౌతం ఆశ్చర్యపోయాడు.
“మై గాడ్...! ఇది ఎలా సాధ్యం...?”
“మనం మూడో అంతస్తు ఖాలీ మేడ మీద ఉన్నప్పుడే కింద చాలా విషయాలు జరిగినై...”
“గంగన్న ని కాపాడగలిగారా...?”
“లేదు...! నేను వెళ్ళేటప్పటికే చిన్నగా ప్రాణం కొట్టుకుంటోంది. ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు. మంచి నీళ్ళు అడిగాడు. తీసుకొచ్చి పోసే లోపు ఫ్రాణం విడిపోయింది...”
“రెడ్ రోస్ గెస్ట్ హౌస్ లో -- మనం కాలుమోపినప్పటి నుండి ఒక్కొక్క నిమిషమూ, మనకు తెలియని సంభవాలు ఇస్తున్నది. ఇక రాబోవు నిమిషాలు ఎలా ఉంటుందో...ఇక్కడున్న పాత వాటర్ ట్యాంకు లోపల ఒక శవం ఉంది...”
“గౌతం...”
“చెప్పండి నరేందర్...!”
“నేను ఈ అడవిలోపలకు కొంచం దూరం వెళ్ళొస్తాను. ఈ లోపు ఇన్‌స్పెక్టర్ మొహన్ వచ్చాడంటే, మనుష్యులను పెట్టి వాటర్ ట్యాంకును పగుల గొట్టమనండి”
“నరేందర్! అడవిలోపలకు మీరొక్కరే ఒంటరిగా వెళ్ళటం అంత మంచిగా నాకు అనిపించటం లేదు. ఊటీ పోలీసులకు విషయం తెలిపి ఒక కమాండో బృందాన్ని రమ్మని చెప్పి, వాళ్ళ సహాయంతో అడివిని అన్వేషిద్దాం...ఇంకాసేపట్లో చీకటి పడిపోతుంది”
“దానికి ఇప్పుడు అవసరం లేదు గౌతం. ఊటీకి సమాచారం వెళ్ళి, కమాండో బృందం ఇక్కడికి వచ్చేలోపు శత్రువులు మన కంటి చూపల నుండి మాయమైపోతారు...ప్రస్తుతానికి ఈ వేగంతోనే అడవిలోపలకు వెడితేనే ఏదైనా ప్రయోజనమైన సమాచారం దొరుకుతుంది. నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని సెల్ ఫోన్లో కలుస్తాను...”
“నరేందర్, చాలా అలర్ట్ గా...! తుపాకీ తయారుగా ఉండనీ...”
“నా గురించి కలవరపడకండి గౌతం! పూర్తిగా చీకటి పడేలోపు గెస్ట్ హౌస్ కు వచ్చేస్తాను. ఇన్‌స్పెక్టర్ మొహన్ దగ్గర -- తగలబడిపోయిన గంగన్న శవాన్ని పోస్ట్ మార్టంకి తీసుకు వెళ్ళమని చెప్పండి...ఖాలీ కిరోసిన్ టిన్ను ఒకటి పక్కనే ఉంటుంది. దాన్ని కూడా తీసుకువెళ్ళమని చెప్పండి”
“అవన్నీ నేను చూసుకుంటాను. నరేందర్, అడవిలోకి వెళ్ళే మీరు అలర్టుగా ఉండండి”
నరేందర్ సెల్ ఫోన్ ఆఫ్ చేసి తన చూపులను తీవ్రం చేసి కిందకు చూశాడు.
పచ్చగడ్డి, మట్టి కలిసిన ఆ ప్రాంతంలో కాలడుగుల ముద్ర పదిలమై ఉంది-- అదే దారిలో నడవటం మొదలు పెట్టాడు. సాయంత్రపు సూర్యుడి కిరణాలు చెట్టు ఆకుల మధ్య అడ్డుపడుతుండగా ఒక విధమైన మసక చీకటి కమ్ముకుంది.
‘ఇంకొక అరగంట లోపు సూర్యకాంతి పూర్తిగా తొలగి పోతుంది. అప్పుడు ఈ అడవి ప్రాంతం చీకటి పిడికిలిలో చిక్కుకుంటుంది. అంతలో కనీసం ఒక కిలోమీటర్ దూరమైనా అడవిలోపలకు వెళ్ళిపోవాలీ.
వేగంగా నడిచాడు.
ఆకాశంవైపుకు ఎదిగున్న చెట్ల చివర్లలో పక్షులు కూర్చుని -- కూస్తున్నాయి. పొదల మధ్యలో దాక్కున్న అడవి కోళ్ళు, కుందేళ్ళు నరేందర్ యొక్క కాలి నడక శబ్ధం విని చిన్న చిన్న గంతులేసి వెనకున్న పొదలవైపు పరిగెత్తినై.
చూపులు చుట్టూతా గమనించగా -- వేగంగా నడుస్తున్న నరేందర్ యాభై అడుగులు నడిచినప్పుడు -- గబుక్కున ఆగాడు.
కింద ఒక సిగిరెట్ పెట్టె పడుంది.
తీశాడు.
ప్యాకెట్ కొత్తగా ఉంది. కొద్ది సమయం క్రితమే కింద పడిపోయుండాలి.
అదే దోవలో నడిచాడు.
లోపలకు వెళ్ళను వెళ్లను అడవి యొక్క దట్టమైన పొదలు, చెట్లు, మొక్కలు, ఎక్కువైన సూర్యుడి కాంతి వీపు వెనుక కనుమరుగవుతున్నది.
వంద మీటర్ల దూరం లోపలకు వెళ్ళిన తరువాత -- అంతవరకు తోడుగా వచ్చిన కాలిబాట హఠాత్తుగా మాయమై పొదలు మాత్రమే కనబడ్డాయి. నరేందర్ ఆలొచనతో నిలబడ్డాడు.
Continued...PART-8
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి