19, జూన్ 2022, ఆదివారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-9

 

                                                                       పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                               PART-9

కాలి నడక బాటను ఆక్రమించుకున్నట్టు పొదల గుంపు ఉండగా -- నరేందర్ ఆగాడు.

చూపులను అటూ ఇటూ పోనిచ్చాడు...వేరు బాట కనబడటం నిరాకరించిది.

పక్షుల శబ్ధాల పూర్తిగా తగ్గిపోయి, ఒక విధమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది........

తిరిగి నడుద్దామా?’

నరేందర్ ఆలోచిస్తున్నప్పుడుఖరక్...

వెనుకవైపు కాళ్ళ నడక శబ్ధం వినబడింది.

తిరిగి చూశాడు.

ఎవరూ లేరు!.

శబ్దం వినబడిందే...

భ్రమా...?’

మళ్ళీ చెవులకు శ్రద్ధ, చూపులను క్షుణ్న పరచుకుని జాగ్రత్తగా అంగులం, అంగులంగా జరిగాడు నరేందర్.

ఆకులు విరుగుతున్న శబ్దం మాత్రం ఏదో రహస్యం మట్లాడుతున్నట్టు వినబడుతోంది.

నరేందర్ తుపాకీని రెడిగా ఉంచుకుని -- ముందుకు మెల్లగా జరిగాడు.

ఖరక్...

మళ్ళీ అదే కాలినడక శబ్దం.

సారి శబ్దం వచ్చిన వైపు చూడలేదు.

ఎడమ వైపా, కుడి వైపా...లేక వెనుక వైపా...?’

మళ్ళీ శబ్దం కోసం నరేందర్ కాచుకోనున్నాడు.

ఒక్క నిమిషం.

రెండు నిమిషాలు...--

శబ్దమే లేదు----

నరేందర్ ధైర్యాన్ని తెచ్చుకుని పక్కన కనబడ్డ కాలిబాటలొ దూరి -- లోపలకు తొంగి చూశాడు. దట్టమైన చెట్లకు మధ్య చీకటి అల్లుకోనున్నదిమళ్ళీ నిశ్శబ్దం.

లోపలకు వెళ్దామా, వద్దా?’

నరేందర్ ఆలొచిస్తున్న క్షణంలో

త్తట్...

పక్కనున్న ఒక చెట్టు నుండి ఒక చెయ్యి మొలకెత్తింది. నరేందర్ చేతిలోని తుపాకీని తొసేసింది.

నరేందర్ తడబడుతూ తిరిగి చూడగా.

అతను నిలబడున్నాడు. చేతిలో 'మిషెన్ గన్. మొహం తెలియకుండా ఉండాటానికి తలకి ఒక నల్ల మాస్కు వేసుకుని దాన్ని మెడవరకు దించుకోనున్నాడు. కావాలనే గొంతు మార్చి మాట్లాడాడు.

నరేందర్! ఇన్ని రోజులు నగరాలలో మాత్రమే గూఢాచార పనులు చేసేవారు. ఇప్పుడు అడవి లోపలకు వచ్చేసారు. ఇక్కడ మీరు గెలువలేరు. మీ చేతిలో ఇప్పుడు తుపాకీ కూడా లేదు. నిమిషం నేను తలుచుకుంటే మీ శరీరాన్ని మిషిన్ గన్ లోని తూటాలతో జల్లెడలాగా చేయగలను. కానీ నాకు ఇచ్చిన ఆర్డరే వేరు. మీరు చనిపోయేది ఎవరికీ తెలియకూడదట.

అంటే మీ బాడీ పోలీసులకు దొరక కూడదు. అడవిలో అదెలా సాధ్యమని అడుగుతున్నారా...? సాధ్యమే...శ్రమం అనుకోకుండా ముందుకు నడుస్తారా...

నరేందర్ నడిచాడు.

రెండు చేతులూ పైకెత్తి నడవండి సార్. నా చేతిలోని తుపాకీకి మర్యాద అవసరం లేదు...

నరేందర్ చేతులు పైకెత్తేడు.

హు...నడవండి...! ఒక విషయాన్ని ఇప్పుడే చెప్పేస్తాను. నన్ను ఢీ కొందామని ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేసినా సరే, తుపాకీ మిమ్మల్ని చిల్లులు చేస్తుంది...

నరేందర్ మనసులో మొదటిసారిగా ఒక భయం పుట్టింది. అడవిలోపలే మన జీవితం ముగిసిపోతుందో?’

ఎలా తప్పించుకోవటం...?’

అతని చేతిలో తుపాకీ...!

ట్రిగర్ను చిన్నగా కదిలించినా, ఇరవై తూటాలన్నా మన శరీరంలోకి వెళ్ళిపోతుందే...!

వెనుక ఒక గొంతు వినబడింది.

ఎడమ పక్కగా తిరిగి నడు...

ఎక్కడికి తీసుకు వెడుతున్నాడు...?’

అడుగుదామా...?’

నరేందర్ ఆలొచించిన క్షణం -- వెదురు చెట్ల పొదల్ల పక్కన అటవి శాఖ తగిలించున్న ప్రకటన పలక అక్షరాలను చూపించింది.

హెచ్చరిక.

మనిషిని మింగే బురద గుంట ప్రాంతం.

బాటను వదిలి నడవ కూడదు.

ప్రకటన పలకలో ఉన్న హెచ్చరిక పంక్తులు ఓరకంటితో చదివి జీర్ణం చేసుకున్న నరేందర్ కు తుపాకీ పెటుకున్న మనిషి ఆలొచన అర్ధమయ్యింది.

తుపాకీ తూటాలకు పని ఇవ్వకుండా, బురదగంటకు పని ఇవ్వాలని ఆలొచిస్తున్నాడు...!

నరేందర్ వీపు వెనుక తుపాకీ చివరి అంచు గుచ్చుకుంది.

ఏమిటి ఆలొచిస్తున్నావు? త్వరగా...! అడుగులు పెద్దవిగా వేయాలి

షూ లేస్ ఊడిపోయినై. కట్టుకోవచ్చా?”

నో...

తుపాకీ అంచు నరేందర్ ను మళ్ళీ ముట్టుకుని తోసింది.

                                                                      ***************************

పాత వాటర్ ట్యాంకును పూర్తిగా విరగొట్టి, లోపల ఉన్న ఎముకల గూడును, ఫోరెన్సిక్ మనుషులు ఇద్దరు తీసి, మూడవ అంతస్తు మేడ మీద నేల మీద పడుకో బెట్టారు.

గౌతం పక్కనున్న డాక్టార్ను చూశాడు. దీన్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది డాక్టర్

డాక్టర్ ఎముకల గూడునే కొద్దిసేపు పరీక్షగా చూసి చెప్పాడు.

ఇది ఒక స్త్రీ యొక్క శరీరంగా ఉండొచ్చు. ఎందుకైనా మంచిది. పరిశోధన చేసి చూద్దాం

ఇన్స్పెక్టర్ మొహన్ అడ్డుపడి అడిగాడు.

శవాన్ని ఇక్కడ పూడ్చిపెట్టి సుమారు ఎన్ని రోజులు అయ్యుంటుంది డాక్టర్...?”

ముప్పై రోజుల నుండి నలభై రోజులు! చీమలు శరీరాన్ని తినకుండా ఉండుంటే, కొంత మేరకు మామూలుగా ఉండే ఉండేది

మట్టి అతుక్కోనున్న ఎముకల గూడును, ఒక చిన్న బ్రష్ తో శుభ్రం చేస్తున్న ఫోరెన్సిక్ నిపుణులలో ఒకరు హఠాత్తుగా అరిచాడు.

అయ్యా! ఇది చూడండి...

గౌతం అతనివైపు తిరిగాడు.

ఏమిటది...?”

శవం యొక్క ఎడం చేతి వేలులో ఒక ఉంగరం ఉంది

ఏదీ దాన్ని తీయి

మట్టితో మటికొట్టుకు పోయిన, మాసిపోయి డల్ గా కనిపిస్తున్న ఉంగరాన్ని తీసి -- గౌతం ముందు జాపాడు.

ఆయన తీసుకుని చూశాడు.

ఉంగరంపైన ఏదో ఒక అక్షరం ఉంది.

మట్టిని తుడిచి చూశాడు గౌతం.

కే అని ఆంగ్ల అక్షరం.

పక్కకొచ్చి తొంగిచూసిన ఇన్స్పెక్టర్ మొహన్ చిన్న స్వరంతో చెప్పాడు.

గత ఒక నెల నుండి మాయమైపోయిన అమ్మాయలు ఎవరెవరు అని లిస్టును పెట్టుకుని విచారణ చేస్తే ఇక్కడ చచ్చిపోయింది ఎవరనేది తెలుస్తుంది సార్

మిస్టర్ మొహన్! మీరు వెంటనే ఒక కార్యం చేయాలి...

చెప్పండి సార్...

గెస్ట్ హౌస్ లో కాపలాదారుగా ఉన్న గంగన్న వాగ్మూలం ఇచ్చేటప్పుడు పాత నీళ్ళ ట్యాంకును మూసేసి, కొత్త ట్యాంకును కట్టేటప్పుడు కాకిపాలం గ్రామానికి చెందిన వీరప్ప అనే ఒకతను ఇక్కడ ఉండేవాడట. అతను మన చేతికి దొరికితే... శవం ఎవరిదనేది తెలిసిపోతుంది. మీరు వెంటనే జీపులో ఉన్న వయర్ లెస్ మూలంగా కాకిపాలం పోలీస్ స్టేషన్ని కాంటాక్ట్ చేసి వీరప్పని ఇక్కడికి తీసుకు రమ్మని చెప్పండి...

ఎస్...సార్...

ఇన్స్పెక్టర్ మూడో అంతస్తు మేడ నుండి దిగి జీపువైపు నడక సాగించినప్పుడు, గౌతం డాగ్ స్క్వాడ్ లీడర్ వైపు తిరిగాడు.

కుక్కను స్మెల్ చేయించండి

డాగ్ స్క్వాడ్ లీడర్ గొలుసుతో కలిపి పట్టుకున్న కుక్క దగ్గర కూర్చున్నాడు.

బ్లాకీ...! స్పిక్...!

అది అరిచింది.

దాని మెడను తడిమి గో అండ్ స్మెల్ ఇట్...

బ్లాకీ అని పిలువబడే నలుపు డాబర్ మాన్ మెల్లగా నడిచి, శవం పక్కకు వెళ్ళి నిలబడి ఆలొచనలతో ఒక చూపు చూసి, వాసన చూసింది.

                                                                         ********************************

అడవిలో ఇప్పుడు చీకటి బాగా అలుముకుంది...పురుగుల అరుపులు చెవులు చిల్లులు పడేలా ఉన్నాయి.

నరేందర్ వీపున తుపాకీ అంచు గుచ్చుకుంటూనే ఉంది.

హఠాత్తుగా వెనక్కి తిరిగి అతన్ని దెబ్బతీద్దామా..?’

అది తెలివైన పని కాదు. నేను తిరిగే క్షణం అతని చేతిలో ఉన్న తుపాకీ తొందరపడుతూ తూటాలను కక్కడం మొదలు పెడుతుంది...!

ఏం చేద్దాం?’

నరేందర్ ఆలొచిస్తున్నప్పుడే, అతని ప్యాంటు జేబులోని సెల్ ఫోన్ మోగింది.

తుపాకీ అంచు వీపుకు గట్టిగా గుచ్చుకుంది.

సెల్ ఫోన్లో ఎవరు...?”

తీసి మాట్లాడితేనే కదా తెలిసేది...

మాట్లాడండి...కానీ, ఇప్పుడున్న కష్టమైన పరిస్థితి గురించి ఏమీ చెప్పకూడదు. మామూలుగా మాట్లాడాలి

నరేందర్ సరేనని తల ఊపి, జేబులో ఉన్న సెల్ ఫొన్ని తీసి చెవి దగర పెట్టుకున్నాడు.

అవతల సైడు ముఖ్యమంత్రి విజయలక్ష్మి మాట్లాడింది.

మిస్టర్ నరేందర్...

మ్యాడమ్...

ఇంతవరకు మీ దగ్గర నుండి సమాచారమే లేదు. ఎర్రశిలా అడవులకు వెళ్ళి చేరిపోయారా...?”

చేరాను మ్యాడమ్...ప్రస్థుతం రెడ్ రోస్ గెస్ట్ హౌస్ లో విచారణ ప్రారంభించి జరుగుతోంది...

నా కూతుర్నూ, అల్లుడ్నీ కాపాడి తీసుకు వస్తారా నరేందర్...?”

మీరేమీ కంగారు పడకండి మ్యాడమ్

ఇక్కడ...అన్నీ సాయంత్రం పత్రికలలోనూ న్యూస్ వచ్చేసింది

వాళ్ళకు ఎలా సమాచారం వెళ్ళింది మ్యాడమ్?”

తెలియదు...! దీన్ని విచారించటానికి సి.బి.. అధికారులు వచ్చేశారు. కేంద్ర హోం మినిస్టర్ నాకు ఫోన్ చేసి, ఏం సహాయం కావాలని ఆడుగుతున్నారు. నాకు ఏం చేయాలో  తెలియటం లేదు. నేను ఎలాంటి నిర్ణయానికీ రాలేక పోతున్నాను.

నేను మిమ్మల్నే నమ్ముకున్నాను. ఏదైనా సరే నా కూతురూ, అల్లుడూ కిడ్నాపర్స్ దగ్గర నుండి కాపాడబడాలి. వాళ్ళకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను...

మ్యాడమ్...ధైర్యంగా ఉండండి...

ఇంకో గంటాగి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను...అప్పుడు మీరు మాకు మంచి సమాధానం చెప్పాలి... విజయలక్ష్మి ఏడుస్తున్న స్వరంతో చెప్పగా -- సెల్ ఫోన్ ఆఫ్ చేసి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు.

మాట్లాడాను...

చేతులు పైకెత్తి నడు. ఇక ఫోన్ వచ్చినా మాట్లాడ కూడదు

అలాగే

నరేందర్ చేతులు ఎత్తుకుని నేరుగా చేసుకుంటూ, రెండు నిమిషాల సమయం ఒంటి బాటలో నడవగా...బాట మధ్యలో ఒక చెట్టు కొమ్మ క్రిందకంటా వేలాడుతోంది.

నరేందర్ బుర్రలో చిన్నదిగా ఒక ఫ్లాష్.

కనురెప్పలు మూసి తెరుచుకునే సమయం కూడా పట్టలేదు. చేతులు పైకెత్తుకుంటూ నడిచిన నరేందర్ గబుక్కున ఎగిరి చెట్టు కొమ్మని పట్టుకుని --- బార్ ఆడుతున్నట్టు శరీరాన్ని పైకెత్తి -- తన షూ వేసుకున్న కాళ్ళతో వెనుక వస్తున్న అతని మొహం దగ్గరకు తీసుకు వెళ్ళి ఆపాడు.

హు....!

కొంచం నిర్లక్ష్యంగా వచ్చిన అతను, నరేందర్ యొక్క హఠాత్తు దాడిని ఎదురు చూడకపోవటంతో, అతని దెబ్బకు తూలి కింద పడ్డాడు.

అతని  చేతిలో ఉన్న తుపాకీ పక్కనున్న  పొదర్లలో వెళ్ళి పడటంతో నరేందర్ ఎగిరి వెళ్ళి దాన్ని తీసుకున్నాడు.

కింద పడిన అతను లేచి పరిగెత్తగా -- నరేందర్ చేతిలోని తుపాకీని పైకెత్తి అరిచాడు.......

ఏయ్ పరిగెత్తకు...ఆగు...

అతను ఆగకుండా పరిగెత్తటంతో---

నరేందర్ అతన్ని తరిమాడు.

అతన్ని కాల్చకూడదు...ప్రాణాలతో పట్టుకోవాలి.

అతను అతి సులభంగా చిన్న చిన్న చెట్లను, పొదర్లనూ దాటుకుంటూ రన్నింగ్ రేసులో పరిగెత్తుతున్నట్టు వేగంగా పరిగెత్తుతున్నాడు.

ఒక కిలో మీటర్ దూరానికి పరిగెత్తే లోపు నరేందర్ కు అర్ధమైపోయింది.

అతన్ని తరిమి పట్టుకోవటం కష్టం...!

కాళ్ళకు కింద కాల్చవలసిందే!

నరేందర్ తుపాకీ ట్రిగర్ నొక్కాడు.

టట్...టట్...టట్...టట్...టట్...

తూటాలు దూసుకు వెళ్ళినై.

పరిగెత్తుతున్న అతన్ని తూటాలు శరీరంలో కొన్ని భాగాలలో తగలగా, అతను శబ్ధం చేయకుండా కిందకు వొరిగిపోయాడు.

నరేందర్ ఆయసపడుతూ పరిగెత్తుకు వెళ్ళి -- కింద పడి రక్తం ధారలో కొట్టుకుంటున్న అతని పక్కకు వెళ్ళి వంగాడు. కళ్ళు తేలేసి నీరసంతో పడున్న అతని తలను పట్టుకుని పైకెత్తాడు. తలమీదున్న టోపీని లాగేసి అతని ముఖాన్ని చూశాడు.

గుర్తు తెలియ లేదు.

ఎవరు నువ్వు...?”

“...........................”

చెప్పు...ఎవరు నువ్వు? ముఖ్యమంత్రి అమ్మాయినీ, అల్లుడ్నీ కిడ్నాప్ చేసింది ఎవరు...? పనివాడు గంగన్న ను తగలబెట్టింది ఎవరు...?”

నరేందర్ అడుగుతున్నప్పుడే ----

అతనికి ఊపిరందక, ప్రాణం పోగొట్టుకునే చివరి నిమిషాలలో ఉన్నాడు.

నరేందర్ అతని చెంపలమీద కొట్టాడు.

చెప్పు. నువ్వు ఎవరు...నీ పేరేంటి?”

“...............................”

ముఖ్యమంత్రి అమ్మాయినీ, అల్లుడ్నీ ఎక్కడ ఉంచారు...?”

“...........”

నరేందర్ అతన్ని ఊపుతున్నప్పుడే -- అతని ఊపిరి అతన్ని వదలి వెళ్ళిందనే సూచనను, అతను తన తలను వంచినప్పుడు తెలుసుకున్నాడు.

                                                                                                                   Continued...PART-10

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి