25, జూన్ 2022, శనివారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-11

 

                                                                       పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                                 PART-11

కూర్చోనున్నారు.

బ్యాంకు మేనేజర్ జోసఫ్ తల జుట్టుకు డై వేసుకుని, గొంతుకు ఒక టై కట్టుకోనున్న యాభై ఏళ్ళ మనిషి. .సి. చల్లదనంలో కూర్చుని ఒక ఆరొగ్యమైన ఉత్సాహంలో ఉన్నాడు.

ఐదు వందల రూపాయల నోట్ల కట్ట మీద ఉన్న HCJ అక్షరాలను చూసేసి, తన నుదిటి బాగాన్ని ఒక వేలితో గోక్కుంటూ ఆలొచించాడు.

బ్యాంకులో ఇలాంటి ఒక రహస్య గుర్తు లేదే?”

HCJ అక్షరాలను మీ బ్యాంకు ఉద్యోగస్తుల్లో ఎవరో ఒకరే కదా రాసుండాలి...?”

అదెలా! డబ్బు తీసుకున్న తరువాత బ్యాంకు కస్టమర్ కూడా ఏదైనా  గుర్తు కోసం రాసుండొచ్చు...?”

ఎందుకైన మంచిది, మీ స్టాఫ్ కి చూపించి ఇది ఎవరి రాతో అడగండి...

అవును... డబ్బు మీకు ఎలా దొరికిందో నేను తెలుసుకోవచ్చా...?”

అతనొక క్రిమినల్ వ్యక్తి. పేరు డేవిడ్

మేనేజర్ ఆలొచించాడు.

డేవిడ్...! అలాంటి పేరుతో మాకు కస్టమరూ లేడే... చెప్పిన మేనేజర్ ఇంటర్ కాం ను నొక్కి మాట్లాడారు.

మిస్టర్ దేవా...! ఒక్క నిమిషం వచ్చి వెళ్ళండి

దేవా వచ్చాడు.

మేనేజర్ రూపాయల నోట్ల కట్ట చూపించి వివరాలు చెప్పగా...ఆయన తీసుకుని చూసి, “సార్! ఇది కాషియర్ ప్రతిమా యొక్క రాత... అన్నాడు.

కాషియర్ ప్రతిమా పిలుచుకురాబడ్డది. ఇరవైమూడేళ్ళ వయసు. సాల్వార్ కమీజ్, మీగడలాంటి వొళ్ళు, ఐస్క్రీం స్వరం, చెవిలో బంగారు జిమికీలు ఆడుతున్నాయి.

సార్...ఇది నా అక్షరాలే. HCJ అంటే హై కోర్టు జడ్జి"

హై కోర్టు జడ్జి...?”

ఎస్...! హై కోర్టు జడ్జి శివప్రసాద్. బ్యాంకులో చాలా సంవత్సరాలుగా కస్టమర్. ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు డ్రా చేయాలి. ఇంకో గంటలో వస్తాను. డబ్బు ఐదు వందల రూపాయల నోట్ల కట్టలుగా ఉంటేనే మంచిది. తీసి పెడతావా అమ్మాయ్?’ అని అడిగారు. నేనూ, ఆయన వచ్చేలోపే ఐదు వందల నోట్ల కట్టలను తీసి ఒక గుర్తుకోసం HCJ అని కాగితం రాసి ఉంచాను. చెప్పినట్టే అరగంట తరువాత ఆయన వచ్చారు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు

నరేందర్ కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు.

ఆయనే వచ్చేరా...?”

అవును...

ఎంత డబ్బు డ్రా చేశారు...?”

ఐదు లక్షలు...

అంత పెద్ద అమౌంట్ ఆయన ఎందుకు తీయాలి...?’ నరేందర్ తనలో తానే ప్రశ్నించుకున్నాడు. తరువాత ప్రతిమాను చూశాడు.

తారీఖున డబ్బు డ్రా చేసేరో తెలుసా...?”

కంప్యూటర్లొ చూసి చెబుతాను సార్

ప్లీజ్

ఆమె మేనేజర్ గది వదిలి వెళ్ళి, కంప్యూటర్ చూసి తిరిగి వచ్చింది.

పోయిన నెల నాలుగో తారీఖు సార్...

డబ్బును తీసుకు వెళ్ళటానికి ఆయన మాత్రమే వచ్చారా? లేక ఎవరైనా తోడు వచ్చారా...?”

ఆయన మాత్రమే వచ్చారు. చాల టెన్షన్ లో ఉన్నారు...

నరేందర్ లేచాడు.

వివరాలు బయట ఎవరికీ తెలియకూడదు. చాలా రహస్యంగా ఉంచాలి

మేనేజరూ, ప్రతిమా ఇద్దరూ తల ఊపగా -- నరేందర్, గౌతం ఒక క్లూదొరికిన సంతోషంలో మేనేజర్ గది వదిలి బయటకు వచ్చారు.

కారులో ఇరవై నిమిషాల ప్రయాణం.

కోర్టుకు బయలుదేరటానికి రెడీ అవుతున్న హై కోర్టు న్యాయమూర్తి ఆయన బంగళాలోనే దొరికేరు.

నరేందర్ వివరాలు చెప్పగా...చిన్నగా ఆశ్చర్యపోయారు.

ఏస్...! తారీఖున నేను ఐదు లక్షలు డ్రా చేసింది నిజమే...

డబ్బును ఎవరికి ఇచ్చారు?”

అది...వచ్చి...వచ్చీ...

ప్లీజ్...! నిజం చెప్పండి...మీరు చెప్పబోయే ఒక నిజమే పలు నిజాలను బయటకు తెస్తుంది

జడ్జి శివప్రసాద్ కర్చీఫ్ తో నుదుటి చెమటను తుడుచుకుని, ఒక ఐదు నిమిషాలు ఖర్చుపెట్టి -- పోయిన నెల నాలుగవ తారీఖున కళావతి ఫోన్ చేసి బ్లాక్ మైల్ చేసి ఐదు లక్షల రూపాయలు డబ్బు అడిగిన వివరాలు చెప్పేరు.

మీరు డబ్బు తీసుకు వెళ్ళి ఇచ్చారు?”

అవును

అతను ఎవరనేది తెలియదు...?”

తెలియదు...

తరువాత కళావతి మీకు ఫోన్ చేసి మాట్లాడిందా...?”

లేదు...

మీరు ఆమెను కాంటాక్ట్ చేయటానికి ప్రయత్నించారా...?”

చేశాను...! నా కూతురు మాదక ద్రవ్యాల మత్తులో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను కళావతి దగ్గర నుండి తిరిగి తీసుకుందామని ఆమె పత్రిక ఆఫీసుకు ఫోన్ చేసాను. కానీ, ఆమె బయట ఊరు వెళ్ళినట్లు ఆమె పి.. చెప్పింది

బయట ఊరంటే... ఊరు..?”

ఏదో నార్త్ ఇండియా వైపు వెళ్ళినట్టుగా చెప్పింది

పి.. ఫోన్ నెంబర్ ఏమిటో చెబుతారా సార్...

నాకు తెలియదు ----చెప్పిన జడ్జి శివప్రసాద్ ఏడుపు స్వరంతో నరేందర్ ను చూశాడు.

మిస్టర్ నరేందర్...! ఇది నా కూతురికి సంబంధించిన సమస్య. ఆమె పెళ్ళి కావలసిన అమ్మాయి. విషయం బయటకు పొక్కకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత మీదే...

నరేందర్ నవ్వాడు.

భయపడకండి సార్...మీ అమ్మాయి పేరు కేసులో రాకుండా చేయటం నా బాధ్యత

                                                                        ******************************

పత్రిక ఆఫీసు.

కళావతి యొక్క పి.. హేమా తన ఎదురుగా వచ్చి కూర్చున్న నరేందర్ ను, గౌతం ను భయం చూపులతో చూస్తూ ఎస్...మీకు ఏం కావాలి సార్...? అన్నది.

నిజం కావాలి...

నిజం...?”

కళావతి ఊరికి వెళ్ళింది...?”

దాని గురించి నాకేమీ తెలియదు సార్

సరే, నడు...లాకప్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఒక రెండు రోజులు లోపల ఉంటే చాలు. నీ మనసులో ఉన్న అన్ని నిజాలూ బయటకు పరిగెత్తుకు వస్తాయి...

హేమా కన్నీటితో నమస్కారం చేసింది.

సార్! సత్యంగా...ఆమె ఊరికి వెళ్ళిందనేది నాకు తెలియదు సార్...పోయిన నెల నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటలకు పైన నా ఇంటికి ఫోన్ చేసి బయట ఊరు వెళ్తున్నానని, తిరిగి రావటానికి కొన్ని రోజులవుతుందని చెప్పింది

కారణం...?”

మనసు బాగుండలేదని చెప్పింది

పోయిన నెల నాలుగవ తారీఖున ఫోన్ చేసి మాట్లాడిన కళావతి తరువాత...అంటే ఒక నెల రోజులుగా నీకు ఫోన్ చేయనే లేదా...?”

లేదు సార్...

ఎందుకు ఫోన్ చేయలేదనే సందేహం నీకు రాలేదా...?”

వచ్చింది సార్...కానీ నేను ఎవరిదగ్గరకు వెళ్ళి విషయం గురించి మాట్లాడగలను...

ఇక్కడ కళావతి గది ఎక్కడుంది?”

పత్రిక ఆఫీసుకు వెనుక ఉంది సార్.

రా...వచ్చి చూపించు...

హేమా వాళ్ళను తీసుకు వెళ్ళింది.

ఆఫీసు వెనుక ఉన్న భవనంలో ఉన్నది గది. మంచి బద్రత కోసం కట్టబడింది.

తాళం చెవి...?”

నా దగ్గర లేవు సార్...

గౌతం ను తలెత్తి చూసాడు నరేందర్. సరే! పెద్ద తాళం చెవిని ఉపయోగించుకో వలసిందే

ఇక్కడ ఒక పలుగు దొరుకుతుందా?

                                                                                              Continued....PART-12 (చివరది)

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి