6, జూన్ 2022, సోమవారం

పగటి పూట భూతాలు...(సీరియల్)....PART-3

 

                                                                         పగటి పూట భూతాలు...(సీరియల్)                                                                                                                                                               PART-3

నరేందర్ హైదరాబాద్ నుండి వైజాగ్ కు ఒక గంట సమయం విమాన ప్రయాణం, వైజాగ్ నుండి ఎర్రశిలా కు నాలుగు గంటల సమయం కారు ప్రయాణం చేసి, లాడ్జింగ్ ముందు తన సహ ఉద్యోగి గౌతం తో కలిసి నిలబడ్డప్పుడు, మద్యాహ్నం రెండు గంటలు.

వేడి లేని ఎండ. కొండ శిఖరాలకు తలపాగా కట్టి అందం చూస్తున్న మేఘాలు. వీస్తున్న చల్లని గాలికి బద్దకంగా ఎగురుతున్న పక్షులు. పచ్చటి ఆకులతో నిండిపోయిన 'టీ' తోటలకు మధ్యలో వీపు వెనుక బుట్టలను మోసుకు వెడుతున్న మహిళలు.

నరేందర్, గౌతం మెల్లగా నడుస్తూ కాంపౌండ్ గేటుకు ముందుకు వచ్చి నిలబడి, గ్రిల్ కడ్డీల మధ్య నుండి తొంగి చూశారు.

కాంపౌండ్ గేటు దగ్గర నుండి వంద మీటర్ల అవతల యూకలిప్టస్ చెట్లకు మధ్యలో బ్రహ్మాండమైన బంగళా కనబడింది. బంగళా కిటికీలు సగం వరకు రంగులు నిండిన గాజు గ్లాసుతో కనిపించినై.

నరేందర్ కాంపౌండ్ గేటును తోసి చూసాడు. అది కదలకుండా మొండికేసింది.

గౌతం చెప్పాడు.

లోపల వైపు తాళం వేసున్నారు నరేందర్ 

అలాగైతే లోపల ఎవరో ఉన్నారనే కదా అర్ధం?”

చూపులకు ఎవరూ చిక్కలేదే! పిలిచి చూద్దామా...?”

వద్దు, గౌతం...నేను మొదట్లో లోపలకు వెళ్ళి ఒక చూపు చూసి వస్తాను. ఎవరికీ కనబడకుండా వెళ్ళేటప్పుడే కేసుకు ఉపయోగపడే సమాచారం ఏదైనా దొరుకుతుంది

అయితే నేను...

నేను లోపల నుండి చెయ్యి చూపించేంత వరకు మీరు బయట ఉండే చూస్తూ ఉండండి...

నరేందర్... ఆయన స్వరం పెంచాడు.

చెప్పండి గౌతం...

బంగళా గురించి మీకుగానీ, నాకుగానీ ముందూ,వెనుక ఏమీ తెలియదు. మీరు ఒంటరిగా లోపలకు వెళ్ళటం అంత మంచిగా నాకు అనిపించటం లేదు...ఇద్దరం కలిసే వెళదాం...

గౌతం చెబుతున్నప్పుడే బంగళా లాన్ వెడల్పుకు మధ్య మఫ్లర్ చుట్టుకున్న ఒక వ్యక్తి వేగంగా వస్తున్నది కనిపించింది.

నరేందర్...! ఎవడో వస్తున్నాడు...

చూస్తే తోటమాలి లాగా కనబడుతున్నాడు

కొద్ది నిమిషాల నడక తరువాత వ్యక్తి దగ్గరకు వచ్చాడు. నలభై ఏళ్ళు ఉంటాయి. బొగ్గు పూసినట్టు నల్లని ముఖం. నడి నెత్తి మీద ముళ్ళు ముళ్ళుగా నెరిసిన వెంట్రుకలు. పక్షి ముక్కులాగా పొడువుగా ఉన్న ముక్కు కింద దట్టమైన మీసాలు, స్వల్పంగా వెలిసిపోయిన స్వటర్. సుమారుగా మురికి పడ్డ లుంగీ.

ఎవరు కావాలి...?”

రెడ్ రోస్ రిసార్ట్ అంటే ఇదేనా?”

అవునండి...

లోపల ఎవరున్నారు...?”

ఎవరూ లేరండీ...నేను మాత్రమే...

గేటు తియ్యి...

మీరు ఎవరనేది తెలియకుండా నేను గేటు ఎలా తెరుస్తాను. తెలిస్తే యజమాని తిడతారు

గౌతం స్వరం పెంచాడు. పోలీసు డిపార్ట్ మెంట్ నుండి వచ్చాము. మర్యాదగా గేటు తెరు...! ప్రశ్నలు అడుగుతూ నిలబడద్దు...

పోలీసు అన్న మాట వినంగానే, పనివాడి కళ్ళల్లో ఒక షాక్ తగిలిన భయం కనిపించింది. స్వటర్ లోపలకు చేతులు పోనిచ్చి, ఒక తాళం చెవుల గుత్తిని తీసి, గేటుకున్న తాళానికి విడుదల ఇచ్చి గేటును వెనుక వైపుగా లాగాడు. అది వినోదమైన మృగం లాగా క్రీచ్అన్నపెద్ద శబ్ధంతో సగానికి పైగా లోపలకు వెళ్ళింది.

నరేందర్, గౌతం ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ లోపలకు వెళ్ళారు. 

బంగళా చుట్టూ పెరిగున్న యూకలిప్టస్ చెట్ల గాలి వలన ఆయిల్ వాసన ఎక్కువగా ఉంది.

గేటుకు తాళం వేసి, పనివాడు అత్యంత భవ్యంగా వాళ్ళ వెనుకే వస్తుండగా -- నరేందర్ అడిగాడు.

నీ పేరేమిటి...?”

గంగన్న సార్

ఊరేనా..?”

అవునండి...

బంగళాలో నీకేం పని...?”

బంగళాను చూసుకునే బాధ్యతను యజమాని నాకు అప్పగించి వెళ్ళారు

ఎవరు నీ యజమాని?”

విశ్వం అయ్యగారు. ఆయన ఎక్కువగా సింగపూర్ లోనే ఉంటారు. ఎండా కాలంలో మాత్రం రెండు నెలలు ఇక్కడకు వచ్చి స్టే చేసి వెళతారు...

సరే...! ఆయన కాకుండా ఇంకా ఎవరెవరు ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు...?”

యజమానికి కావలసిన వాళ్ళు వచ్చి వారం, పది రోజులు ఉండి వెళ్ళటం ఉందయ్యా...

ఇప్పుడు ముగ్గురూ హాలులో నడుస్తూ ఉన్నారు. ఒక చెట్టు కింద పడుకోనున్న డాబర్ మ్యాన్ కుక్క నరేందర్ నూ, గౌతం నూ చూసి మొరుగుదామా, వద్దా అని ఆలొచించింది.

నరేందర్ గంగన్న దగ్గర అడిగాడు.

కావలసిన వాళ్ళు అంటే ఎవరు...?”

అదంతా నాకు తెలియదు సార్...యజమాని యొక్క పి.. గారు నాకు ఫోన్ చేసి, ఫలానా తారీఖున...ఇన్ని గంటలకు ఇంతమంది వస్తారు...ఒక వారం, పది రోజులు ఉంటారు. కావలసిన వసతులు చేసివ్వు అని సమాచారం ఇస్తారు...నేను వచ్చిన వాళ్ళను బాగా చూసుకుని పంపిస్తాను

పోయిన వారం ఇక్కడకు ఎవరు వచ్చి స్టే చేశారు?”

అది...వచ్చండి...

ఎందుకు తటపటాయిస్తున్నావు...?”

ఎవరి దగ్గర చెప్పకూడదని పి..సార్ గారి ఆర్డర్ అండి...

పోలీసుల దగ్గర చెప్పొచ్చు...చెప్పు...

గంగన్న రెండుసార్లు ఎంగిలి మింగి చెప్పాడు.

ముఖ్యమంత్రి గారి కూతురూ, అల్లుడూ....

వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారా?”

లేదండి...వాళ్ళ సెక్యూరిటీకి ఆరుగురు పోలీసులు కూడా వచ్చారండి...

ఎన్ని రోజులు స్టే చేసారు...?”

ఒక వారం...! మొన్ననే నండి బయలుదేరి వెళ్ళారు...

పోర్టీకో వచ్చింది.

రెండు విదేశీ కార్లు, రెక్సిన్ కవర్లు వేసి కప్పబడి ఉన్నాయి.

ఇవన్నీ ఎవరి కార్లు...?”

యజమానివి సార్...

పోర్టికో మెట్లు ఎక్కి లోపలకు వెళ్ళారు.

గంగన్నా...

అయ్యా...!

రోజైనా నువ్వు పోలీస్ స్టేషన్ కు వెళ్ళావా?”

లేదండయ్యా...

ఇక మీదట కూడా నువ్వు పోకూడదు అనుకుంటే ఇప్పుడు నేనడిగే ప్రశ్నలకు, నిజమైన జవాబులు ఇవ్వాలి. అబద్దం చెప్పకూడదు...చెబితే పోలీస్ స్టేషన్ కు నువ్వు రావలసి వస్తుంది

గంగన్న మొహంలో విచారం నాట్యమాడింది.

అయ్యా...! నాకు అబద్దం చెప్పే అలవాటు లేదయ్యా. నాకు తెలిసినదంతా చెబుతాను..

ముఖ్యమంత్రి కూతురు, అల్లుడు ఎప్పుడు ఇక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళారని చెప్పావు?”

మొన్న...

ఎన్ని గంటలకు...?”

సాయంత్రం నాలుగు గంటలు ఉంటుంది

కారులోనేగా వెళ్ళారు...?”

అవునండయ్యా...

కారుకు ముందు, వెనుక రెండు జీపులలో ఆరుగురు పోలీసులూ వెళ్ళారా?”

అవునండయ్యా...

ముఖ్యమంత్రి కూతురు, అల్లుడూ రిసార్టులో ఉన్న వారం రోజులలో, వాళ్ళను చూడటానికి ఎవరైనా వచ్చారా...?”

లేదండయ్యా...

బాగా ఆలొచించి చెప్పు...

నాకు తెలిసినంత వరకూ లేదయ్యా...

రిసార్టులో గదిలో నువ్వు స్టే చేస్తావు?”

అదిగో...అవుట్ హవుస్ లో...

గంగన్న చెయ్యి చూపిన వైపు నరేందర్, గౌతం చూపులను తరమ, కొంచం దూరంలో ఒక చెట్టుకు కింద రేకుల షెడ్డుతో ఒక చిన్న గది కనబడింది.

నీకు కుటుంబం ఉందా...?”

లేదయ్యా...నేను మాత్రమే...

ముఖ్యమంత్రి కూతురూ, అల్లుడూ బంగళాలో గదిలో ఉన్నారు...?”

మేడ మీద రెండో గదిలో...

వచ్చి చూపించు

గంగన్న పెద్ద హాలులో నుండి మేడ మీదకు తీసుకు వెళ్ళాడు.

బంగళా గోడలకూ, నేలకూ వేయబడ్డ టైల్స్ పాల యొక్క తెల్ల రంగును ఛాలెంజ్ చేసే విధంగా ఉంది.

టీకు చెక్క మెట్లు ముగ్గురినీ మేడ మీదకు తీసుకు వెళ్ళినై.

పాలీష్ చేయబడ్డ ఒక రోస్ వుడ్తలుపు ముందుకు తీసుకు వెళ్ళి నిలబెట్టాడు గంగన్న.

గదే నండి...

తలుపును తోశాడు నరేందర్.

పెద్ద గది - చూపులను విస్తరించింది. రాజుల కాలంలో ఉండేలాగా అందమైన ఒక డబుల్ బెడ్ -- లైట్ బ్రౌన్ కలర్ లో. గోడకు అతికించిన ఒక వాల్ పేపర్ కన్యాకుమారి యొక్క సూర్యోదయాన్ని న్యాచురల్ గా చూపించింది.

నరేందర్, గౌతం ఇద్దరూ లోపలకు వెళ్ళారు.

పది నిమిషాల వెతుకుదల.

నరేందర్ పిలిచాడు.

గంగన్నా...

అయ్యా...

మొన్న ఇక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి కూతురూ, అల్లుడూ, ఆరు పోలీసులూ ఒక గుంపుగా కిడ్నాప్ చెయ్య బడ్డ విషయం నీకు తెలుసా..?”

అతను ముఖం ఆశ్చర్యంలో మునిగిపోయింది.

నా...నా...నాకు తెలియదయ్యా...

నరేందర్ నవ్వాడు.

నీకు తెలియకుండా ఉండే ఛాన్సే లేదే! ఎందుకంటే నీకు తెలిసే కిడ్నాప్ జరిగుంటుందని గదిలో ఉన్న ఒక వస్తువు చెబుతోంది...

అయ్యా...మీరేం చెబుతున్నారు...?”

ఇలారా...నా పక్కకు...

గంగన్న చెమట పట్టిన మొహంతో భయపడి వణికిపోతూ వచ్చాడు.

ఇది చూసావా...?”

నరేందర్ తన చేతికి, చేతిరుమాలను చుట్టుకుని వస్తువును తీశాడు.

                                                                                                      Continued...PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి