20, అక్టోబర్ 2022, గురువారం

నిజమైన మాగాడు...(కథ)

 

                                                                                నిజమైన మాగాడు                                                                                                                                                                                    (కథ)

యువతీ-యువకుల ప్రేమలో మొదటి భాగం ఆకర్షణ. ఆకర్షణకు కారణం ఏదైనా కావచ్చు. అభిరుచులు కలిసినా అది ఆకర్షణకే దారి తీస్తుంది. ఆ ఆకర్షణే ఇద్దరినీ ఒక చోట చేరుస్తుంది. కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరి మధ్య మానసిక అనుభంధం ఏర్పరుస్తుంది. ఆ తరువాత అది ప్రేమగా మారుతుంది. దాన్ని నిలబెట్టుకోవాలన్నా, తెంచుకోవాలన్నా అది వారిద్దరి ఆలొచనలు, బుద్ది మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కారణం ప్రేమలో బాధ్యత ఉండదు.”

ఇదే రాజు-మాలతీల మధ్య జరిగింది. మామూలే. పెద్దలు ఇద్దరి ప్రేమను అంగీకరించలేదు...ఇప్పుడేం చేయాలి. పెద్దలకోసం ప్రేమను త్యాగం చేద్దాం అని మాలతి...కాదు ప్రేమను గెలిపించే తీరాలని రాజు గొడవపడ్డారు....చివరకు ఎవరు గెలిచారు? ....తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి.

చెంప చెళ్ళుమన్న శబ్ధం వినబడింది.

పార్కులో బెంచి మీద కూర్చుని తన ప్రేమికుడు మహేష్ తో సరదాగా మాట్లాడుకుంటున్న రమ శబ్ధానికి ఉలిక్కిపడి, కూర్చున్న బెంచి నుండి పైకి లేచి శబ్ధం వచ్చిన వైపు చూసింది.

అక్కడ చెట్టు క్రింద తన స్నేహితురాలు మాలతి, ఆమె ప్రేమికుడు రాజు నిలబడున్నారు. మాలతి తన చెంపను పట్టుకుని, తల దించుకుని నిలబడున్నది. ఆమె కంటి నుండి ధారగా నీరు కారడం, ఆమె ప్రేమికుడు రాజు వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోవటం గమనించిన రమ కోపంగా అడుగు ముందుకు వేసింది.

"ఎక్కడికి" అమె చేయి పుచ్చుకుని ఆపిన మహేష్ రమను అడిగాడు.

"ఎక్కడికని అడుగాతావేమిటి మహేష్!?...నా స్నేహితురాలు మాలతిని ఆమె ప్రేమికుడు రాజు కొట్టి వెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా?...ఎందుకు కొట్టేవు అని రాజును నిలదీయ వద్దా?...వదులు, నా చేయి వదులు మహేష్. రాజు తల దించుకునేలా నాలుగు మాటలు అడుగుతాను" కోపంగా చెప్పింది రమ.

"అది కాదు రమా..." అని మహేష్ ఏదో చెప్పబోతుంటే "నన్ను ఆపకు మహేష్...భార్యను కొట్టటమే తప్పు. ప్రేమికురాలును కొట్టటం అంతకంటే పెద్ద తప్పు?...ప్రేమించేటప్పుడే ఇలా కొడుతున్నాడే ...పెళ్ళి చేసుకున్న తరువాతమాలతిని ఎన్ని కష్టాలు పెడతాడో...సరైన రాక్షసుడిలా ఉన్నాడు" ఆవేశంగా చెప్పింది.

రమ ఆవేశంగా మాట్లాడటం మహేష్ కి నచ్చలేదు. చిరాకు కూడా తెప్పించింది.

మిగతా కథ కోసం ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:

నిజమైన మాగాడు...(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి