3, అక్టోబర్ 2022, సోమవారం

హీరో...(సీరియల్)...(PART-2)


                                                                                        హీరో...(సీరియల్)                                                                                                                                                                              (PART-2)

బయటున్న ఒక అరుగు మీద ముడుచుకు పడుకోనున్నారు పెద్దాయన. ఆయన చుట్టూ ఒక గుంపు నిలబడున్నది. అందులో కొందరు వి..పి లు. అశ్విన్ కూడా కారు ఆపమన్నాడు. ఆ పెద్దాయన నన్ను చూసి చూసి తిడితే నా హీరోప్రయత్నం విజయం సాధించినట్లే అని అశ్విన్ కి ఒక చిన్న నమ్మకం కలిగింది.  మొదట్లో ఆయన్ని ఒక బిచ్చగాడనే అనుకున్నాడు. కానీ, అవసరం అనేది  వచ్చినప్పుడు ధీమా వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి -- ఆశ ముందరకు వచ్చేస్తుందే!

ఆయనా మెల్లగా కళ్ళు తెరిచారు. అందరినీ పక్కకు జరగమని చెయ్యి ఊపి చెప్పి, అశ్విన్ ను చూసి నవ్వుతూ ఆశీర్వాదం చేసారు.

అశ్విన్ అయోమయంలో పడిపోయాడు. ఆయన భక్తుల వరకు ఆయన తిడితేనే కదా ఆశీర్వాదం? ఆయనేమో తిట్టకుండా నవ్వుతూ ఆశీర్వాదం చేసారు? ‘అంటే నేను హీరోగా నెగ్గలేనా? హీరోనే అవలేనా? అదెలా? నేనే హీరో అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చారే! ’    

అయోమయంతోనే సినిమా కంపెనీ ఆఫీసులోకి అశ్విన్ వెళ్లేడు. వెళ్ళే ద్వారం దగ్గరే ప్రొడ్యూసర్ అసిస్టంట్ కాచుకోనున్నాడు.

రండి సార్...రండి -- అంటూ మర్యాదపూర్వకంగా అశ్విన్ ని పిలుచుకుని లోపలకు వెళ్ళాడు.

ఆఫీసు చూసి కళ్ళు చెదిరింది. నేల కనబడకుండా కార్పెట్ పరచబడి ఉంది. చల్ల చల్లటి .సి! మెత్తని సోఫాలు. సోఫాకు వేసిన కవర్లమీద చదుర ఆకారంలో గాజు పలకలు.

లోపలకు చొరబడిన క్షణం -- అశ్విన్, అద్దంలో అతని ప్రతిబింభాలను చూసి కొంచం అవాక్కయ్యాడు.

కూర్చోండి సార్...డైరెక్టర్ ఇప్పుడు వచ్చేస్తారు...అని చెప్పేసి, ప్రొడ్యూసర్ అసిస్టంట్ కూడా ఒక అద్దాల తలుపు తోసుకుని కనబడకుండా పొయాడు. ఆతను అలా వెళ్ళిన తరువాతే తెలిసింది, అది అద్దంతో చేయబడిన తలుపు అనేది.

ఒక అశ్విన్ కి, నలుగురు అశ్విన్ లు అక్కడ కూర్చోనున్నారు. అశ్విన్ మనసులో చిన్నగా ఒక ధఢ.   

హీరోయిన్ గా తనతో నటించబొయేది ఎవరై ఉంటారు? పాత నటియా...లేక ఆమె కూడా కొత్త ముఖమా? ఫైట్ సీన్లలో డూప్వెయ్యాల్సి ఉంటుందా? లేక నిజంగానే ఫైట్ చెయ్యమంటాడా డైరెక్టర్? ’  

అలా అశ్విన్ లో పలురకాల ఆలొచనలు చోటుచేసుకున్నాయి.

హాయ్, యంగ్ మ్యాన్! అంటూ గాలిలాగా లోపలకు వచ్చాడు డైరెక్టర్. అశ్విన్ లేచి నిలబడ్డాడు.

నో ఫార్మాలిటీస్. మొదట కూర్చోండి...

..........................”

సరే...నిలబడు. నువ్వు చెయ్యబోయే సినిమాకూడా నిలబడాలి... -- అని, తాను రాసిన డైలాగులాగానే మాట్లాడారు.

సమాధానంగా చిన్నాగా నవాడు అశ్విన్. అప్పుడు అసిస్టంట్ డైరెక్టర్ లోపలకు వచ్చాడు. అతని చెంకలో ఒక ఫైలు.

సార్...ధియేటర్ రెడీ అన్నాడు.

రా అశ్విన్...వెళదాం అంటూ అతన్ని పిలుచుకుని నడిచాడు డైరెక్టర్.  అసిస్టంట్ డైరెక్టర్ చెప్పిన మేకప్ ధియేటర్చల్లటి .సి తో, రాక్చస అద్దం సింహాసనం లాంటి గుండ్రంగా తిరిగే కుర్చీతో దర్శనమిచ్చింది. అశ్విన్ కి ఏదో ఒక కొత్త లోకంలోకి వీసా...పాస్ పోర్టులేకుండా చొరబడ్డట్టు అనిపించింది.

కూర్చోండి... అన్నాడు డైరెక్టర్.

అశ్విన్ కూర్చున్నాడు. మేకప్ వేసే అతనికి ఏవో ఆదేశాలు, సూచనలూ ఇచ్చేసి బయటకు వచ్చాసాడు డైరెక్టర్. మేకప్ మ్యాన్ తల ఊపి, అశ్విన్ దగ్గరకు వచ్చి అతని చెంపలను చూసాడుదేవుడ్ని ప్రార్ధించుకుందామా?” అంటూ అడిగిన మేకప్ మ్యాన్ ఒక కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి వెలిగించాడు.

మేకప్అద్దాన్ని, అశ్విన్ ను కలిపి దిష్టి తీసి, అలాగే తన అసిస్టంట్ దగ్గర కొబ్బరికాయను ఇచ్చేసి, చేతులు జోడించి దన్నం పెట్టుకుని ముగించాడు.

మొట్టమొదటి సారిగా మీకు మేకప్ వేస్తున్నాను. మీరు బాగా పైకి రావాలి. నాకూ బోలెడు చాన్సులు వచ్చి, నా వ్యాపారం బ్రహ్మాండంగా నడవాలి.అని మాట్లాడుతూనే మెత్త మెత్తగా ఉండే రోస్ పౌడర్ స్పాంజ్ తీసి అశ్విన్ మొహం మీద పూయటం మొదలుపెట్టాడు. ఒక్కొక్క మగాడికీ, జుట్టు కత్తిరించుకునేటప్పుడు అలాగే నిద్రలోకి జారుకుందామని ఆశగా ఉంటుంది.

లోకంలో ఎన్నో సుఖాలు! అందులో ప్రధానమైన సుఖం సలూన్ లో దొరికేదే. పడుపు వృత్తిలో ఉన్నవారు ఎంత శ్రమపడినా కూడా ఇలాంటి ఒక సుఖాన్ని ఇవ్వలేరు. అందులోనూ రెండు చేతులలోని పదివేళ్ళతో తలను కడిగి -- అలాగే జుట్టులోపలకు దూర్చి విడదీసి -- తరువాత దువ్వెనతో దాన్ని అనిచి నిలబెట్టి పట్టుకుని 'సరక్, సరక్' అంటూ కత్తెరతో కత్తిరిస్తున్నప్పుడు అలాగే రోజంతా ఉందామా అని అనిపిస్తుంది.

ఇక్కడ కూడా దగ్గర దగ్గర అలాగే ఉంది. సుమారుగా ఒక గంటసేపు దాకా పనిచేసి అశ్విన్ యొక్క కురులను, మీసాలను అన్నిటినీ మార్చి...మొహాన ఒక కొత్త వెలుగును సృష్టించి, అద్దంలో చూసుకోమన్నప్పుడు, అశ్విన్ అతని దగ్గర అడిగాడు... ఎవరండి ఇది?”

మేకప్ మ్యాన్ నవ్వాడు. డైరెక్టర్ కూడా వచ్చాడు. అశ్విన్ ని నిలబెట్టి అటూ, ఇటూ పలు కోణాలలో నుండి చూసాడు. చివరగా సూపర్ అన్నాడు.

మేకప్ మ్యాన్ పెద్ద నిట్టూర్పు విడిచి, "సార్...తప్పించుకున్నారు. మీరే హీరో..." అన్నాడు.

మేకప్ వేసుకోవటానికి ముందే, నేనే హీరో అని చెప్పి, యాభైవేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు...

అదంతా మామూలే సార్...షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒకతన్ని వెళ్ళిపొమన్నారు. ఇది...

అయ్యయో... అలాగంతా కూడా జరుగుతుందా?”

అవును...మనిషి అందంగా ఉంటే సరిపోతుందా? నటించటం రావాలే. బొమ్మలాగా నిలబడితే ఎవరు వచ్చి నటిస్తారు...?”

మేకప్ మ్యాన్యదార్ధాన్ని చెప్పి భయపెట్ట, అశ్విన్ కడుపులో కొంచం తిప్పటం జరిగింది.

ఒకవేల తనకీ అలాంటి ఒక పరిస్థితి వచ్చేస్తే...?’ -- భయపడుతూనే, తరువాతి ఘట్టమైన ఫోటో సెషన్కు తయారయ్యాడు. అంతకు ముందు మేకప్ మ్యాన్ సహాయకుడు ఒకడు వచ్చి అశ్విన్ ని పై నుండి కిందకూ, రెండు వైపులకు వెళ్ళి ఒకసారి చూసాడు. తరువాత కొంచం పక్కకు వెళ్ళి ఒక పెట్టిని తీసుకు వచ్చాడు. అలా వచ్చేటప్పుడు సడన్ గా అశ్విన్ వైపు ఒక చూపు చూసాడు. తరువాత అతని దగ్గరకు వచ్చి ఎప్పుడూ మీసాలను ఇలాగే ఉంచుకుంటావా?” అని అడిగాడు.

అవును...ఎందుకు అడుగుతున్నావు?”

లేదు...నీకు చదుర ముఖం. ఇలా మీసం పెడితే సుమారుగానే ఉంటుంది. కింద చిన్నగా ఒక ఫ్రెంచ్ గడ్డం పెడితే పెద్ద నిపుణుడి లుక్కు... మొహానికి వచ్చేస్తుంది అన్నతను పెట్టెను తీసాడు. లోపల చాలా మేకప్ వస్తువులు. బోలెడు బ్రష్ లు, కత్తెరలు, లోషన్లు, రోస్ పౌడర్, చిన్న మీసాలు, గిరదాలు...

మనిషిని తలకిందలుగా మార్చే ఒక లోకమే దాంట్లో దాగున్నది అప్పుడే చూసాడు అశ్విన్.

కొంచం తనని విలేజ్ మనిషిగా ఫీలయ్యాడు. వచ్చినతను పని ప్రారంభించాడు. చొక్కా విప్పేసి కుర్చీలో కూర్చోండి అన్నాడు.

నేను నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికే మేకప్వేసిన వాన్ని...! అంటూనే అశ్విన్ తలమీద చెయ్యి పెట్టి జుట్టును చెదర గొట్టేడు. తరువాత వేళ్లతో కొలిచి పని చూపించడం మొదలుపెట్టాడు.

అరగంటలో అశ్విన్ తలకిందలుగా మారిపోయాడు. అతనికే అతని ముఖం చూస్తే ఆశ్చర్యంగా ఉన్నది. కొత్తగా ఒక జన్మ ఎత్తినట్టు కూడా అనిపించింది.

ఇది పెద్ద బడ్జెట్ సినిమాట...బయటి దేశాలకంతా వెళ్ళి ఖర్చు పెట్టబోతారట. సినిమా హిట్ అయితే నువ్వు కూడా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. తరువాత హైదర్ ను జ్ఞాపకం పెట్టుకుంటారా?”

మీ పేరు హైదరా?”

సరీపోయింది. సినిమాలు చూసేటప్పుడు టైటిల్స్ చూసే అలవాటు లేదా?”

చూస్తాను. అందులో వంద పేర్లు వస్తాయి. అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోగలనా...? అందులోను టైటిల్స్ ఒక్క క్షణం కూడా వుంచరు. చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు

అది కూడా కరెక్టే. ఇప్పుడు చెబుతాను వినండి. ఒక సినిమా తయారవటానికి కనీసం ఎనభై ఐదుమంది నుండి నూటపది మంది కావాలి. ఇందులో మొదట పది పేర్లు మేకప్ మ్యాన్స్. మేము ముసలి వాళ్ళను, యువకులుగా మారుస్తాం, యువకులను ముసలివారుగా మారుస్తాం. మీకు నటి జయశ్రీ అంటే ఇష్టమేనా?”

...గ్లామర్ ఆర్టిస్ట్ కదా...ఇష్టం లేకుండా   పోతుందా?”

ఆమె గ్లామర్ అంతా డూపు సార్. ఆమెకు యద కూడా లేదు. అంతా మన ఏర్పాటే. ఒక బ్రా ఉంది. దాని వెల పదిహేడు వేలు. అది వేసుకుంటే ఎవరైనా సరే, ఇరవై సంవత్సరాలు తగ్గిపోతుంది...

అలాగైతే ఇరవై ఏళ్ళ అమ్మాయి వేసుకుంటే, పుట్టిన పిల్ల అయిపోతుందా?” -- అశ్విన్ జోక్ వేసాడు.

హైదర్ అనబడే మేకప్ మ్యాన్ కూడా నవ్వాడు.......చివరగా మేకప్ మ్యాన్ ఒక నోట్ బుక్ను తీసి అశ్విన్ ముందు జాపాడు.

ఏమిటిది?”

బహుమతి...నాకెంత టిప్స్ ఇస్తారో రాయండి...

బహుమతా...?”

అవును...నేను మేకప్ వేసిన ముఖాన్నే ఫోటోతీయబోతారు. ఇదే మొహంతో మీరు నటించి గెలిస్తే, దానికి నేనే కదా కారణం?”

గెలిచిన తరువాత మాట్లాడుకుందామే...

అప్పుడు మాట మారిస్తే...?”

అదంతా మార్చను. ఇదేమిటి కొత్త విధమైన వసూలు లాగా ఉంది?” -- అన్నాడు. తరువాత ఫోటో తీసే చోటుకు తీసుకు వచ్చారు. అక్కడ అతనికి దుస్తులు మార్చబడ్డాయి. దగ్గర దగ్గర ఇరవై ప్యాంట్లూ -- షర్టులూ తొడిగి విప్పాడు. కాళ్ళూ, చేతులూ అలసిపోయినై. తొడిగి విడిచిపెట్టినవన్నీ ఒక రెడీమేడ్ షాప్ సరకు. అది ఇచ్చినతనే తీసి మడత పెట్టుకుంటున్నాడు. చివరగా ఒక డ్రస్సు .కే. అవటంతో వీటిని కొట్టుకే తీసుకు వెళ్ళండి అన్నాడు ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్.

అవన్నీ ఏం చేస్తారు?” అడిగాడు అశ్విన్.

చెత్తలో పడేయగలమా? బట్టల్లో బట్టగా కలిపేసి అమ్మేయటమే...

అయ్యో...కొనేవాళ్ళు...

మీరు వచ్చిన పని చూసుకోండి... నవ్వుతూ చెప్పాడు రెడీమేడ్ షాప్ అతను.

అశ్విన్ మొహం మీద పలు దిక్కుల నుండి వెలుతురు వచ్చి పడింది. వచ్చే వెలుతురును వడకట్టే ఫిల్టర్లును కొంతమంది పట్టుకున్నారు...ఒక్క ఫోటో తీయడానికి ఇంత హడావిడి అవసరమా అని అనిపించింది.

చివరగా ఫోటో ఒకటి తీయబడింది -- దాన్ని కంప్యూటర్ తెరమీద వేసి చూసినప్పుడు, అశ్విన్ హీరోగా కన్ ఫర్మ్ చేయబడ్డాడు. అంతవరకు అతని కళ్లకు కనబడని నిర్మాత గబుక్కున అతని ముందు ప్రత్యక్షమై చేయిచ్చి కంగ్రాట్స్ చెప్పాడు.

తమ్ముడూ...మీకు మంచి భవిష్యత్తు ఉంది...ఎక్కువ శ్రమపడితే తెలుగునాట మీరు ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాలు జమాయించవచ్చు. హీరోఅంటే ఫాన్స్ కి పిచ్చి పట్టించాలి. అలాగే కరెంటు లాగా నిలబడాలి అంటూ ఆయనకు తెలిసినందంతా చెప్పి కంపెనీ కారులోనే ఇంటికి పంపించారు. 

అశ్విన్ కి అంతా వ్యత్యాసంగానూ -- కొత్తగాను ఉన్నది. మేకప్ ను తుడుచుకోకుండా అలాగే తల్లి-తండ్రి ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. ఇద్దరూ బెదిరిపోయారు.

అశ్విన్...నువ్వారా?”

సాక్షాత్ నేనే... అవతారంలో నా పేరు క్రిష్ణా...

అబ్బో...ఎంత అందంగా ఉన్నావు నువ్వు...

కారణం...మేకప్ మ్యాన్అనే బ్రహ్మ

నిజమే...ఇప్పుడే నువ్వు ఇంత అందంగా ఉన్నావే...నీ యొక్క సినిమా గెలిచి, నువ్వు ప్రభలమైతే ఎంత జోరుగా ఉంటుంది?”

నువ్వు చెప్పేసావు కదమ్మా...ఇక శుక్రదశే! ఇరవై సంవత్సరాలు నా రాజ్యమే... గర్వంగా కాలరు పైకిలేపి పైకెత్త -- ఫోను మోగింది.

వరలక్ష్మి వెళ్ళి ఫోను ఎత్తింది. అవతలపక్క సితారా.

అత్తయ్యా! ఆయన వచ్చేసారా?”

...ఇప్పుడు నువ్వు వాడ్ని చూసావంటే...అదిరిపోతావే...

అలా ఏం చేసారు?”

వాడు ఇప్పుడు హీరో మేకప్ లో ఉన్నాడే. వస్తావా...? వచ్చి చూడు...

ఆయన దగ్గర ఫోన్ ఇవ్వండి... ఆమె చెప్పగా, రిసీవర్ ఇప్పుడు అశ్విన్ చెవికి మారింది.

చెప్పు సితారా!

ఏమిటి సార్...వేసుకున్న మేకప్ కడుక్కోవటానికి మనసు రావటం లేదా?”

ఇది అడగటానికే ఫోన్ చేసావా?”

లేదు లేదు వెళ్ళిన పని ఏమైందని తెలుసుకోవటానికి...

ఇక నాకు శుక్రదశ సితారా. విజయం పైన విజయం. బయటి దేశాలకు వెళ్ళబోతాను...

అదరగొడుతున్నావే...తరువాత?”

ఏమిటి తరువాత, వెంట్రప్రగడ వాడి దగ్గర...ఇప్పుడు మాట్లాడినట్టు, అప్పుడంతా నాతో మాట్లాడలేవు...తెలుసుకో...

ఏమిటి...ఇప్పుడే సినిమా చూపిస్తున్నావా?”

సరే సితారా...నువ్వు ఎక్కువ సుత్తి వేస్తున్నావు...పెట్టేయ్! -- ఫోను కట్ చేసాడు. చూస్తూ నిలబడ్డ వరలక్ష్మీ, రఘుపతి కూడా వాడు గర్వ పడుతున్నట్టే అనిపించింది.  

                                                                                                         Continued...PART-3 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి