22, అక్టోబర్ 2022, శనివారం

తలవంపు...(కథ)

 

                                                                                       తలవంపు                                                                                                                                                                                           (కథ)

పిల్లలు ప్రేమిస్తే పెద్దలు దానిని తమకు తలవంపుగా భావిస్తారు. అందులోనూ తమకంటే తక్కువ స్టేటస్ లో ఉన్న వారిని ప్రేమిస్తే అది పెద్ద పరువు తక్కువ పని అని పెద్దలు వాదిస్తారు. ఎలాగైనా ప్రేమికులను విడదీయటానికి ప్రయత్నిస్తారు. తక్కువ స్టేటస్ వాళ్ళు పెద్ద స్టేటస్ వాళ్ళకు భయపడి తప్పుకుంటారు. ఇది మామూలుగా సమాజంలో జరుగుతున్న తంతు. కథలో ప్రేమికుడి తండ్రి అదే పనిచేసి(ప్రేమికులను విడదీసి)తన గౌరవాన్ని నిలబెట్టుకుని, కొడుకు వలన వంచుకున్న తలను పైకెత్తుకోగలుగుతాడు. కానీ, విధి ఆయనకు వెరే ముగింపు రాసుంటుంది....విధి రాసిన ముగింపు ఏమిటో తెలుసుకోవాలంటే తలవంపు కథ చదవండి. 

"అయ్యగారండీ...అయ్యగారండీ" అని ఇంటి బయట నుండి కేకలు వినబడటంతో, చదువుతున్న పేపర్ను పక్కన పడేసి, కూర్చున్న ఈజీచైర్ లో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు కేశవరావ్.

వాకిట్లో నడుం చుట్టూ తుండు కట్టుకుని నిలబడున్న పనివాడు కనిపించాడు.

"ఏవిట్రా అరుపులు...ఏదో కొంపలు మునిగిపోయినట్లు"

"అవునండయ్యా...నిజంగానే మన కొంప మునిగిందయ్యా. మన చిన్నయ్యగారు నూకాలమ్మ కూతురితో రైలు స్టేషన్లో కనిపించారండి "

"ఏవిట్రా వాగుతున్నావ్" కళ్ళు పెద్దవి చేసాడు కేశవరావ్.

నే సెప్పేది నిజమేనండయ్యా...నా కళ్ళారా చూసానయ్యా. ఇద్దరి సేతుల్లోనూ సూటు కేసులున్నాయండయ్యా... ఇషయాన్ని మీకాడ సెప్పాలని ఎంటనే లగెత్తుకుని ఈడకొచ్చానయ్యా"

"సావిత్రీ" అంటూ పెద్దగా అరిచాడు కేశవరావ్.

"ఏమిటండీ అలా అరిచారు!" వంటగదిలోనుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావ్ భార్య సావిత్రి భర్తను చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది.

"కిష్టుడు గదిలో ఉన్నాడో లేడో చూడు" భార్యను ఆదేశించాడు కేశవరావ్.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

తలవంపు...(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి