10, అక్టోబర్ 2022, సోమవారం

'హీరో'...(సీరియల్)...(PART-5)

 

                                                                                 'హీరో'...(సీరియల్)                                                                                                                                                                              (PART-5)

కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు అది కష్టంగానే తెలుస్తుంది. కానీ, ఆ విషయమే తరువాత అతిపెద్ద మంచి దగ్గరకు తీసుకువెళ్ళి నిలబెడుతుంది. సమయం కష్టాన్ని తలచుకుని శపించాలని మనసు ప్రయత్నిస్తుంది. కానీ, తరువాత అది అలాగే మారిపోతుంది. తన స్కూటీలో ఎక్కి సితారా తన ఇంటికి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఎదురుగా బిచ్చగాడిలా ఉండే స్వామిజీ నిలబడున్నాడు!

ఒకలాగా వంకరగా ముఖం పెట్టుకుని నవ్విన ఆయన, “అన్నీ తలకిందలుగా మారుతుంది...కలత చెందకు! అన్నారు. స్వామీజీ మాటలు, సారి కూడా సితారా కి అర్ధంకాలేదు.

ఏది తలకిందలుగా మారుతుంది?’

మరుసటి రోజు పత్రికలలో అశ్విన్ ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ హెడ్డింగ్గే అశ్విన్ ను ఆందోళనలో పడేసింది.

భార్యను పి..చేసిన కొత్త హీరో’ -- అన్న హెడ్డింగ్ కింద సితారా చెప్పిన విషయాలన్నీ వివరంగా రాయబడి ఉంది.

ఆమె చెప్పింది పెట్టుకుని పత్రిక వాళ్ళు అశ్విన్ ను తలకిందలుచేసి పక్కనే సితారా ఫోటో కూడా వేశారు!

బయటిదేశంలో సినిమా షూటింగుకు బయలుదేరటానికి రెడీ అవుతున్న అశ్విన్, ఇంటర్వ్యూ చదివి కుమిలిపోయాడు. పేపర్లో వచ్చిన ఇంటర్వ్యూను సితారా, ఆమె అన్నయ్య, అమ్మ, నాన్న అంటూ అందరూ చదివారు.

ఏమ్మా... అశ్విన్ నా ఇలా నడుచుకున్నాడు?” అని తండ్రే మొదట అడిగాడు. తరువాత అమ్మ, తరువాత అన్నయ్య. సితారా ఎవరి దగ్గరా ఏమీ మాట్లాడలేదు. 

అశ్విన్ ఎలా తనని బయట పెట్టబోతాడు అనే దాంట్లోనే ఆమె మనసు గురిగా ఉన్నది. అశ్విన్ మనసులో ఇలాంటి వక్ర బుద్ది దాగుంటుందనేది కలలో కూడా అనుకోలేదు. 

సినిమా చాన్స్ ఒకర్నిఇలా కూడా మారుస్తుందా ఏమిటి...?’

కుములిపోయింది సితారా. మధ్యలో ఫోన్ రింగ్ అయ్యింది. అతనే!

నీకు ఇప్పుడు తృప్తిగా ఉంది కదూ?”

అశ్విన్...ఇది నా తప్పు కాదు!

ఎందుకు వాళ్ళను కలిసి మాట్లాడావు...? నువ్వు రాకుండా ఉండుంటే ఇలాగంతా జరిగుండేదా...?”

అవతలపక్క అతను కుమిలిపోతున్నది, ఇటుపక్క సితారా అర్ధం చేసుకున్నది.

సారీ... అశ్విన్...

ఏమిటి సారీ...నా పరువే పోతోంది...

కావాలంటే నేను పత్రికలకు నా ఖండన తెలుపుతూ మైలు పెట్టనా?”

ఖండించటం వలన పోయిన పరువు రాబోయేది లేదు...

ప్లీజ్ అశ్విన్...నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడాను. ఇలా జరగకూడదనే నా బాధ. కానీ మీరు అవసరపడ్డారు 

ఏమిటి... మళ్ళీ నన్ను తప్పు పడుతున్నావు?”

తప్పు పట్టటం లేదు...జరిగింది చెబుతున్నా...

ఇడియట్...సినిమా రంగం గురించి నీకేం తెలుసు...? ఇక్కడ బిల్డప్ఉంటేనే ఏదైనా నిలబడుతుంది

సరే అశ్విన్. నేను ఇక మీ సినిమా దగ్గరకే రాను

నేనూ ఇక నీ దగ్గరకు రాను...

అశ్విన్...

సారీ సితారా, నాకు ఇక నువ్వు సరిరావు...?”

టొక్అవతలపక్క ఫోను కట్ అయిన శబ్ధం విని, సితారా తన ఫోనును అలాగే వదిలేసి వెళ్ళి సోఫాలో పడిపోయి ఏడవటం మొదలుపెట్టింది. అన్నయ్య మోహన్ సంధర్భం కోసం కాచుకోనున్న వాడిలాగా వచ్చి ఆమె దగ్గర కూర్చున్నాడు.

ఏం చెప్పాడు సగం పిచ్చోడు?”

“.....................”

నిన్నే సితారా...ఏం చెప్పాడు నటుడు?”

తిట్టేరు...

నీ ఏడుపు చూస్తూంటేనే అది తెలుస్తోందే! వాడు అబద్దం చెప్పి, నీమీద నేరం మోపుతున్నాడు...?”

వదులన్నయ్యా...మాట్లాడుతూ వెడితే ఇది ఎక్కువ అవుతుంది...

పోవే పిచ్చిదానా! మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. లేకపోతే సరిరాదు...

ఇదిగో చూడు...ఆయన చాలా మంచివారు. ఇదంతా కొంచం తాపత్రయ తత్తరపాటు వలన జరిగిన విషయాలు. పోను పోను సరిపోతుంది

పిచ్చిదానిలాగా మాట్లాడకు! ఇండస్ట్రీగురించి నీకేం తెలుసు? డబ్బూ-పేరూ వస్తే కొండంత పెద్దగా వస్తుంది. ఇంకా ఒక సినిమా కూడా నటించలేదు. షూటింగు కూడా మొదలుపెట్టలేదు. అప్పుడే గంతులు వేస్తున్నాడు. వీడు గనుక గెలిస్తే... దేశం తట్టుకోలేదు... మోహన్ అభిప్రాయం వింటూ లోపలకు వచ్చాడు సితారా తండ్రి సత్యమూర్తి గారు.

ఆయన దగ్గర ఇంత కోపం లేదు. చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ ఆయనతో పాటూవచ్చింది తల్లి రాజేశ్వరి. ఇద్దరి దగ్గరా ప్రశాంత మౌనం.

కానీ, వాళ్ళ మనసులు ఉడికిపోయినట్లు వాళ్ళ కళ్ళు తెలుపుతున్నాయి.

అమ్మా...నాన్నా...మీరెందుకు బాధ పడతారు? నేను వెళ్ళి వాడ్ని ఒక తాలింపు తాలించి వస్తా అన్నాడు మోహన్.

ఊరికే ఉండరా మోహన్. పెళ్ళి లాగా నిశ్చయ తాంబూలాలు జరిపాము. అప్పుడే అనుకున్నా దిష్టి తగలబోతుందని. అదేలాగా అయిపోయింది

ఇది దిష్టి కాదు నాన్నా...కొవ్వు!

నువ్వు దానికి పేరన్నా పెట్టుకో. విషయం ఇప్పుడు అదికాదు. నిశ్చయం అనేది సగం పెళ్ళి జరిగినట్లే. సితారా పాటికి దగ్గర దగ్గర ఇంటి అమ్మాయి

ఏమిటి నాన్నా మీ అర్ధం లేని వాగుడు? కాలంలో ఉన్నారు మీరు

“2022లోనే. నువ్వు కొంచం నోరుమూసుకోనుండు...

వాడి విషయంలో మీరు ఎలా నడుచుకోబోతారో చెప్పండి...?”

ఇలా చూడూ. వాడు సినిమాలో ఏమైనా చేసుకుపోనీ. నా కూతుర్ని కంటికి  రెప్పగా, దాని కళ్ళ నుండి ఒక చుక్క నీరు రాకుండా చూసుకుంటే చాలు

బాగుందే...ఇప్పుడు ఇది ఇలా కళ్ళు నలుపుకుంటూ కూర్చుందే...అది ఎవరి వల్ల...?”

దీని దగ్గర కూడా తప్పు ఉందిరా...ఇదెందుకురా పత్రిక వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడాలి?”

అంటే...బొమ్మలాగా ఉండాలా మీకు? వాడి బాగోగులలో దీని పార్టు దీనికి లేదా?”

వాడికి అది నచ్చలేదే...

నచ్చని వాడితో ఎందుకు బంధుత్వం అంటాను...?”

ఏమిట్రా చెబుతున్నావు?”

వీడు ఇక మనకి మంచి అల్లుడుగా ఉండడు. వాడుగా విడిచిపెడితే అది అవమానం. ఇంటర్వ్యూ ను కారణంగా చెప్పి మనమే అతన్ని వద్దనటం మన తెలివితేటలు

తరువాత దీన్ని ఎవర్రా పెళ్ళి చేసుకోవటానికి ముందుకు వస్తారు? పత్రికలలో ఫోటోవేరే వేశారు -- వాడికి భార్య కాబోతోందని రాశారే...

భార్య కాబోతోందనే కదా రాశారు. భార్యే అయున్నా విడాకులు ఇచ్చేయమని చెబుతాను నేను...

పోరా పిచ్చోడా! తెంపుకోవటం ఎప్పుడూ  సులభం. కానీ, చేర్చి పెట్టేది అలా కాదు. వెళ్ళి నోరు కడుక్కురా. మన కుటుంబంలో ఒక్కరు కూడా ఒక తాలి కంటే ఎక్కువ కట్టించుకున్నది లేదు.  విడాకులూ -- గొడవలూ అని కష్ట పడిందీ లేదు...

సితారా మన కుటుంబ అమ్మాయే కదా. ఆమె విషయంలో ఇప్పుడు జరుగుతున్నది గొడవ -- పోట్లాటలే కదా. పాత పద్దతులన్నీ చెప్పి ఆమె జీవితాన్ని నాశనం చేయకండి... మోహన్ అరిచి చెప్పాడు. తిన్నగా బయటకు వెళ్ళిపోయాడు.

తండ్రి సత్యమూర్తి గారు కొడుకు మోహన్ చెప్పింది సాధారణంగా తీసుకున్నట్టు కూతుర్ని చూసాడు.

నువ్వేం చెబుతావే? అశ్విన్ మంచి కుర్రాడు. ఇవన్నీ తాత్కాలిక ఇబ్బందులే అనుకుంటున్నా

నేనూ అలాగే అనుకుంటున్నా నాన్నా. ఆయన తప్పు తప్పుగా నడుచుకునేటప్పుడు ఒక నటి పేరు చెబుతాడు. ఆమే ఈయనకి తప్పు తప్పుగా చెప్పిస్తొంది. ఇంటర్వ్యూతో, పత్రిక వాళ్ళంటే ఎలాంటి వాళ్ళో ఆయనకు ఒక ఐడియా వచ్చుంటుంది.  ఇక జాగ్రత్తగా ఉంటారు...

మంచిదమ్మాయ్. ఇలాగే సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించటం తెలియాలి. పాజిటివ్ గా నడుచుకోవటం తెలుసుకోవాలి. సరే...రా, వెళ్ళి అల్లుడ్ని చూసేసి విదేశీ ప్రయాణానికి అభినందనలు చెప్పేసి వద్దాం....

సత్యమూర్తి గారు బాధ్యతగా నడుచుకోవటానికి రెడీ అయ్యాడు. రాజేశ్వరి కూడా.

కానీ సితారా దగ్గర బిడియం.

ఏమ్మా...?”

మీరు వెళ్ళి రండి నాన్నా....

నువ్వూ రా....

లేదు...నన్ను చూస్తే ఆయనకు కోపం వస్తుంది?”

అలాగంటావా?”

అవును. ఇప్పుడు కూడా ఫోనులో...నాకు కనిపించకు. నీ మొహాన్ని చూపించకు. నీకూ,నాకూ సరి రాదు అని ఒకటే అరుపులు.

...నేను అన్నీ సరిచేస్తాను...

సత్యమూర్తి గారు భార్యతో కలిసి బయలుదేరారు.

                                                                                                           Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి