18, అక్టోబర్ 2022, మంగళవారం

'హీరో'...(సీరియల్)...(PART-9)

 

                                                                                        'హీరో'...(సీరియల్)                                                                                                                                                                           (PART-9)

ఆశ అనే భావోద్వేగం గురించి ఆలొచించి చూస్తే చివరిగా నవ్వే మిగుల్తుంది! మనం వేటి మీదంతా ఆశ పెట్టుకున్నామో...అవన్నీ మనల్ని వదిలి వెళ్ళబోతాయి లేక వెళ్ళిపోయుంటాయి.

ఆశ అనేది ఒక ఆసిడ్లాంటింది. ఎంత అందమైన దానినైనా ఆశ పడ్డ తరువాత చెదలు పట్టిపోయి, వికారంగా అయిపోతాయి. మొదట కొన్న గడియారం, మొదట కొన్న ఇల్లు, మొదట కొన్న కారు అని వరస చేసుకుని, రోజు వాటి మీద మనకు ఉన్న ఆశ  గురించి ఆలొచిస్తే వేడుకగా ఉంటుంది.

మనం ఆశగా కొనే ఒక వస్తువు, క్షణాన మాత్రం ఆనందానిచ్చి -- తరువాత దాని చోటు అడ్డుకునే వేరే ఒకటిగా మారుతుంది. ఇదంతా చూసిన తరువాత కూడా మనం ఆశపడకుండా ఉండలేము అనేదే దురదృష్టం.

సన్యాసి కూడా ఇదే చెప్పారు. ఆశ పడమోకు...ఆశ పడమోకు. అతని మీద నువ్వు పెట్టే ఆశ చాలా ప్రమాదకరమైన ఆశ......అది కూడా సితారా ఆసుపత్రి నుండి తిరిగి వస్తున్నప్పుడు.

అది ఆమె చెవిలో కూడా వినబడింది.

రఘుపతి గారు, రాజేశ్వరి సత్యమూర్తి గారి  ఇంటికే వచ్చి హాలులో కూర్చున్నారు.

ఎదురుగా సత్యమూర్తి గారు , రాజేశ్వరి మరియు మోహన్.

మోహన్ జివ్వు జివ్వుఅని ఎర్రబడి -- కోపంగా కూర్చోనున్నాడు.

రాజేశ్వరి కళ్ళు విచారంగా ఉన్నాయి.

జరిగింది జరిగిపోయింది. ఇంతకు మించి నిశ్చయతాంబూలల గురించి తలుచుకుని మనకి మనమే కన్ ఫ్యూజన్ అవటంలో అర్ధం లేదు... అన్న రఘుపతి గారికి మొదటి నుంచే అదే అభిప్రాయంగా ఉన్నది.

అమ్మాయి ఇలా చేసుకుంటుందని ఎవరూ ఎదురు చూడలేదు. మనమందరం ఒకటిగా కలిసి ఇక పెళ్ళి గురించి ఆలొచించ వలసిన అవసరమే లేదు అనే నిర్ణయానికి వచ్చినా, సితారా వలన కుదురుతుందా అనేది తెలియదు.  ప్రస్తుతానికి కొన్ని రోజులు కావాలంటే మనం మాట్లాడకుండా ఉందాం. కానీ, ఇలా ఎన్నిరోజులు మనం కొనసాగిస్తూ ఉండగలం...అనేది తెలియటం లేదు...

చాలు, మాటలు ఇంతటితో ఆపండి. నా చెల్లెలు మనసు మార్చి ఆమెను పెద్ద పొజిషన్ కు తీసుకురావటం నావల్ల కుదురుతుందని నేను గట్టిగా చెప్పగలను. ఇవన్నీ జరిగిన తరువాత ఒక వేళ అశ్విన్ తిరిగి వచ్చినా, నేను వాడ్ని మన్నించను... అని మోహన్ ఆవేశంగా చెప్పాడు.

రఘుపతి గారు గబుక్కున లేచారు.

నువ్వు ఇప్పుడు చెప్పినట్టు జరిగితే నాకంటే సంతోషపడే మనిషి ఇంకెవరూ ఉండరు మోహన్. అశ్విన్ ఒక రోజు బాధ పడి తిరిగివస్తాడు. ఆ రోజు సితారా గొప్పగా ఉండాలి. అలా జరిగితేనే దరిద్రుడికి తను ఆడిన ఆట ఎంత ఘోరమైనదో అర్ధమవుతుంది.

వరలక్ష్మి, బయలుదేరు...ఇక మనకు ఇంట్లో పనీ లేదు. సత్యమూర్తీ ...నీ కూతురు ఇక మా ఇంటికి రానవసరం లేదు. ఆమె పెళ్ళి పత్రిక మాత్రమే రావాలి. నేనూ, వరలక్ష్మీ ఇద్దరం సితారా పెళ్ళికి వస్తాము... -- అని చెప్పేసి వాకిలి వైపుకు వేగంగా నడిచారు రఘుపతి గారు. ఆయనతో పాటూ ఏడుస్తూ వెళ్ళింది వరలక్ష్మి.

సత్యమూర్తి గారు, రాజేశ్వరీ బయటకు వెళుతున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయారు. కానీ ఆపలేకపోయారు. ఎందుకంటే వాళ్ళను ఏం చెప్పి ఆపాలో వాళ్ళకు అర్ధం కాలేదు.

రాత్రి సమయం!

కానీ, కరెంటు సహాయంతో ఊరినే పగలుగా పెట్టుకున్నారు అమెరికా దేశస్తులు. హోటల్ మేడ మీద కూర్చోనున్న అశ్విన్నలిని మనసులో ఆశ్చర్యపోయే భ్రమ. లోకం, ఇందులో జీవించే మనుషులు, అతని విశ్వరూపం అంతా, ఎంతో తెలియదు?’ అని ఆలొచించి నిట్టూర్పు విడిచాడు. అతని ముందు అతి ఖరీదైన వైన్ బాటిల్ ఉంది.

దాని వాసనే అద్భుతంగా ఉంది. సెంటులాగా తీసి పూసుకోవచ్చు. అయినా, అది తాగే వస్తువుగా ఉన్నందువలన అతనికి సంశయంగా ఉంది.

షర్మీలా పారదర్శక గౌను వేసుకుని, చేతిలో ఒక పైపు సిగిరెట్టుతో అతని దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆమె అంతకు ముందే తాగేసి తూలుతూ వచ్చింది. పొద్దుటి నుండి షూటింగ్ పేరుతో నడుము విరిచారుఅని సనిగింది.

అశ్విన్ చాలా టేకులు తీసుకున్నాడు. నటించటానికి అతను వేసుకున్న ప్లాన్ ఒకటి... రోజు అక్కడ జరిగింది ఒకటి.

డైరెక్టర్ షూటింగ్ సమయంలో అందరి ముందు ఉత్త మట్టి బుర్ర లాగున్నావే... అని పలుసార్లు అందరికీ వినబడేటట్టు అశ్విన్ ను తిట్టారు. ఇవన్నీ అతన్ని కోపగించుకునేలా చేసింది. నిర్మాత కూడా అతని దగ్గరకు వచ్చి ఓదార్పుగా ఏమీ మాట్లాడలేదు.

ఏమిటి అశ్విన్...డైరెక్టర్ తిడుతున్నారే నని వర్రీ అవుతున్నావా?” -- అంటూ షర్మీలా విషయంతో మాటలు మొదలుపెట్టింది.

అవును...నేనేమన్నా పుట్టుకతోనే నటుడినా...కొత్త వాడినే కదా. అంతమాత్రానా అందరి ముందూ అలాగా మాట్లాడతారు...?” అని చెప్పేటప్పుడు అతని గొంతు బొంగురు పోయింది.

హేయ్...ఏంటయ్యా నువ్వు? ‘కమాన్యూ! నేను లెంపకాయలే తిన్నాను. డైరెక్టర్ అంటే అలాగే ఉంటారు... అంటూ వైనును తీసుకుని అతని పెదవుల దగ్గరకు తీసుకు వెళ్ళింది.

న్యూ యార్క్ నగర చలికి ఆమె మాటలూ, ఆమె చేష్టాలూ, పెదాల దగ్గర వైను పరమ సుఖంఅంటే ఇలాగే ఉంటుందని తెలియపరిచింది.

ఆమె గ్లాసులో పోసిచ్చింది. ఆమె కళ్ళు మిక్కిలి చిన్నవిగా మత్తుతో ఉబికి ఉన్నాయి. ముందుకు పడుతున్న కురులను వెనక్కి తోసుకుంది. కావాలనే అతని కళ్ళ ముందుకు ఛాతిని తీసుకు వచ్చి బద్దకం తీర్చుకుంటున్నట్టు విరుచుకుంది. అప్పుడు అనుకోకుండా ఒక విషయం జరిగింది. ఆమె అతనిపై వాలిపోయింది. మొదట చిన్నగా నవ్వుకున్నా, తరువాత ఎందుకో ఆమెను పక్కకు తోసాడు.

ఏమిటి అశ్విన్...నేను నీకు నచ్చలేదా?” అన్నది కొంచం మత్తుతో వచ్చిన ముద్దు మాటలతో.

అది...అది...

నాకు అందరి మగవాళ్ళ గురించి బాగానే తెలుసు. ముఖ్యంగా...నీ గురించి బాగా తెలుసు...  ఆమె ఏదో రహస్యం మాట్లాడుతున్నట్టు చెప్పింది.

అశ్విన్ ఆమెను సుధీర్ఘంగా చూసాడు. ఉన్నది అరవై అంతస్తుల ఎత్తు భవనంలో, అరవైయ్యో అంతస్తులో...అప్పుడప్పుడు మినుగురు పురుగుల్లా విమానాలు రావటం, పోవటం జరుగుతోంది. మన ఊర్లో పొలాలపైన మినుగురు పురుగులు ఎగురుతాయి. ఇక్కడ అది వేరుగా ఉందినేల మీద న్యూయార్క్ నగరం జిగేలు మంటోంది.

ఏమిటి అశ్విన్...ఏమీ మాట్లాడనంటున్నావు! పొద్దున మర్యాదగా మాట్లాడిన నేను ఇప్పుడు రా, పో అని మాట్లాడుతున్నాననా...? స్నేహం చేయగ చేయగ ఫీల్డులో ఇద్దరి మధ్య గ్యాప్ దగ్గరైపోతుంది. నాటకీయతకంతా చోటులేదు. ఎంత కావాలన్నా సరే కెమేరా ముందు నటించ వచ్చు. కానీ, తరువాత  చేయకూడదు...

ఇప్పుడు నేను నటించటం లేదు షర్మీ...

నటిస్తున్నావని నేను చెప్పలేదే. కానీ, చాలా విషయాలు నీ వెనుక దాగున్నాయి...

విషయాలు దాగున్నాయా...?”

అవును. నీ విషయం గురించి ప్రొడ్యూసర్నా దగ్గర మాట్లాడారు. నీతో పాటూ నీకు ఆదరణగా ఉండమని చెప్పారు...

షర్మీ...

నేను ఇరవై సినిమాలు చేసున్నాను. నటి అవటానికి ముందు నేను పడ్డ పాట్లు ఒక కుక్క కూడా పడుండదు. ఎలాగో వాళ్లతో పోరాడి హీరోయిన్అయిపోయాను. ఫాన్స్ మనసులో ఒక హీరోయిన్గా ఉండే నేను నిజానికి ఒక సరకునా పాత జీవితం గురించి నీకు క్లుప్తంగా నీ దగ్గర చెప్పేసాను. నాకు పెద్దగా ఎలాంటి ఆశ లేదు. ఎన్ని రోజులు ఇలా పరిగెత్త గలనో పరిగెత్తి, తరువాత అలాగే కథ ముగించుకోవాలి.

నటికీ, కృతిమ అందానికి మాత్రమే సంబంధం ఉన్నట్లు చాలామంది అనుకుంటున్నారు. అదంతా కరెక్టు కాదు. నటికి, ఆత్మహత్యలకూ మధ్య పెద్ద సంబంధం ఉంది. అలా ఎందుకు అని అడిగితే ఒక పుస్తకం రాసేంత విషయం చెబుతాను... -- రాత్రి పూట అతను పూర్తిగా ఎదురు చూడని ఒక టాపిక్ ను ఆమె మాట్లాడ... అశ్విన్ నాలిక తడబడటం మొదలయ్యింది.

ఒక విధంగా నిన్ను తలుచుకుని గర్వ పడుతున్నాను అశ్విన్. నీ లాంటి క్యారక్టర్సినిమా కథలలోనే వచ్చున్నారు. కానీ, నిజ జీవితంలో ఇప్పుడే చూస్తున్నాను. అశ్విన్! నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను చెయ్యటానికి రెడీగా ఉన్నాను. ఇంకా బాగా చెప్పాలంటే ఒక అద్దె భార్యగా నీతో జీవించటానికి కూడా నేను రెడీ. కానీ, అది నిన్ను కించ పరిచినట్టు అయిపోతుంది. అందువలన విషయంలో నిన్ను బలవంత పెట్టటానికి రెడీగా లేను... -- షర్మీలా అంత విస్తారంగా మాట్లాడి ముగించగా, అతని కళ్ళు మొదటిసారిగా కన్నీరు పెట్టుకోవటం చేసినై.

షర్మీ...నేను ఏడవనే కూడదు అనే ఒక లక్ష్యం గలవాడిని. చచ్చిపోయేటప్పుడు  కూడా నవ్వుతూ చావాలనేది నాకు ఇష్టం. కానీ ప్రొడ్యూసరూ, నువ్వూ నన్ను కళ్ళనీళ్ళు పెట్టుకునేలా చేసారు. సినీ రంగం మీద నాకు పెద్దగా మర్యాదు లేదు. ఇదొక జూదం ఆడే ఆట స్థలంగానే చూసాను. అదేలాగా సినిమాలోకంలోకి దూరిపోయిన నీలాంటి, నటీమణులపైన పెద్దగా గౌరవమో, మర్యాదో లేదు. శరీరం పెట్టుకుని బ్రతికే వాళ్ళే కదా?’ అనే భావనే దానికి కారణం. కానీ, ఇప్పుడది మారిపోయింది. నీకు ఇప్పుడు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. దయచేసి నా గురించి నీకు తెలిసింది నీతోనే పోనీ. అది ఇంకెవరికీ తెలియకూడదు...

తెలియదు అశ్విన్...ఖచ్చితంగా తెలియదు. నిర్మాత....నీ విషయాన్ని ఇద్దరి దగ్గర మాత్రమే చెబుతానుఅని నీ దగ్గర చెప్పారటగా...?”

అవునుఆ ఇద్దరిలో ఒకరు మా నాన్నఅని నాకు తెలుసు. కానీ, రెండో మనిషి నువ్వు అయ్యుంటావని నేను కొంచం కూడా ఎదురు చూడలేదు...

రెండో వ్యక్తిని నేనుగా ఉండటమే నీకు మంచిది. ఎందుకంటే...నేను మాత్రమే నీకు పెద్ద ఎత్తున సహాయం చేయగలను. అవును. అమ్మాయి...అదెవరు గిటారానా, సితారానా...ఏదో ఒక పేరు చెప్పారే...

సితారా...     

ఆమె చాలా సెన్స్ టివా...?”

అలా చెబితే అది మామూలే. ఆమె చాలా పొససివ్. అందులొనూ నా విషయంలో చాలా చాలా...

అవును. నీకు అమ్మవారు వచ్చినప్పుడు, అమ్మాయి అంగప్రదక్షిణం చేసి,  మెట్లకు పసుపు కుంకుమలు రాయడం చేసిందటగా?”

...ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్చెప్పేసారా?”

ఉత్తగా చెప్పలేదు...అలాగే మనసు విరిగి నీరసంగా చెప్పారు...చివరకు ఏడ్చేసారు...

షర్మీలా! చాలు. నేను భరించలేకపోతున్నాను. నేను న్యూయార్కులో అవన్నీ మరిచిపోయి ఉన్నాను...

అదెలా అశ్విన్...నువ్వు మరిచిపోగల విషయాలా ఇవన్నీ? బాధ పడకు...ఇక నీ దుఃఖంలో పాలు పంచుకోవటానికి నేను వచ్చాసాను. సినిమా కల్పిత కథలలో హీరోయిన్ గా నటిస్తున్న నాకు లోకంలో ఎవరికీ దొరకని ఒక సంధర్భం నువ్వు నా కిచ్చావు! నిజ జీవితంలో -- అందులోనూ ఒక గొప్ప లక్ష్యం కోసం నటించే సంధర్భం అనేది మామూలు విషయమా ఏమిటి?” -- చెప్పేటప్పుడే ఆమె కళ్ళు తడిసినై.

మళ్ళీ ప్రారంభించింది.

ఎందుకురా అమ్మాయిగా పుట్టాము...నటి అయ్యాము: ఎంత పాపం చేసుకోనుంటే ఇలా అయ్యుంటాను అని అనుకుని కుమిలిపోయాను. కానీ, ఇప్పుడు నాకు కొంచం హాయిగా ఉంది. లేదంటే నీకు సహాయపడగలనా?” అని ఆమె అడగటంతో, మొదటిసారిగా ఆమె చేతులు వెతికి పట్టుకున్నాడు అశ్విన్.

చేతుల మీద ఆమె కన్నీటి బొట్లు రెండు చుక్కలు పడినప్పుడు...అక్కడ మఫ్లర్ - స్వటర్ లో హాజరైన నిర్మాత మేనేజర్ అతని దగ్గర సెల్ ఫోన్ ఇచ్చి సార్! లైన్లో మీ నాన్న... అన్నాడు. తరువాత ఫోనును చెవి దగ్గర పెట్టుకోవటానికే సంశయంతో ఇబ్బంది పడ్డాడు అశ్విన్. చేతులలోనే చిన్న వణుకు. ఇబ్బంది పడుతూనే చెవి దగ్గర పెట్టుకున్నాడు.

హలో...

నేను రఘుపతి మాట్లాడుతున్నాను హీరో గారూ...

నాన్నా...

అరే...నీకు నేనేమవుతానో అనేది కూడా నీకు గుర్తుందా? పరవాలేదే...నేను కొంచం పుణ్యం చేసుకోనుండాలి. నీకు ఒక వార్త. అది మంచి వార్తా...లేక చెడ్డ వార్తా అనేది నాకు తెలియదు. నా వరకు చెడ్డ వార్తే...

ఏం వార్త నాన్నా...?”

ఏమీ లేదు. మీ అమ్మకు భూమి మీద ఉండటం ఇష్టం లేదట. అందుకని వెళ్ళిపోయింది...

నాన్నా...!

అతని చేతి నుండి సెల్ ఫోన్ జారిపోయింది. దాన్ని షర్మీలా వేగంగా చేతిలోకి తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంది. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు.

చనిపోయేటప్పుడు కూడా నీ జ్ఞాపకమే. అదే సమయం గుండె పగిలి ఆమె చనిపోవటానికి నువ్వే కారణమని చెబుతాను. కానీ నువ్వు అదంతా వినవు! విధి ముగిసిపోయింది. వెళ్ళిపోయిందిఅని చెబుతావే. అది కూడా నిజంగా ఉండొచ్చు. అభివృద్ది అనే పేరుతో ఒక అత్యాశ నిన్ను దిక్కు మార్చి, కుటుంబాన్ని ఇప్పుడు ఏడిపిస్తోంది. ఆమె ఇష్ట ప్రకారమే నీకు వార్త తెలిపాను. బయలుదేరి వచ్చి తలకొరివి పెట్టటం...పెట్టకపోవటం నీ ఇష్టం.

ఎందుకంటే...నా వరకు నువ్వు చచ్చిపోయావని భావిస్తున్నాను. కానీ పాపం వరలక్ష్మీ...దానివల్ల కాలేదు! -- రఘుపతి గారు మాట్లాడి ముగించేలోపు, షర్మీలానే స్థంభించిపోయింది.

అశ్విన్ అలాగే ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. షర్మీలా అతని జుట్టు మీద చెయ్యిపెట్టి తల పైకెత్తింది. అతని కళ్ళల్లో నీరు వరదలాగా పొంగుతోంది. పెదాలు రెండూ వణుకుతున్నాయి.

నిర్మాత చెబుతున్నప్పుడు కూడా ఆయన కొంచం ఎక్కువ చెప్పాడనే అనుకున్నాను. ఇప్పుడే తెలుస్తోంది...ఆయన చెప్పింది. నువ్విక్కడ హీరోగా నటించడానికి వచ్చి, నీ అబద్దమైన పత్రిక ఇంటర్వ్యూ ఎంత కరెక్టో...నువ్వు భయపడ్డట్టే నీ తల్లి ప్రాణం పోయింది. కనీసం అమ్మాయి సితారానైనా జీవించేటట్టు చేయాలి. దానికి ఇప్పుడేంటి దారి అని ఆలొచించటమే మన తెలివితేటలు... -- అన్న ఆమెను చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తూ చూసాడు.

అతని కన్నీరును తుడిచింది ఆమె.

షర్మీ! నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఎవరికీ రాకూడదు... -- అనీ కంటిన్యూ గా వెక్కి వెక్కి ఏడ్చాడు.

బాగా ఏడు అశ్విన్...బాగా ఏడు. మా అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను  నీలాగనే ఇబ్బందుల్లో ఉన్నాను. అప్పుడు ఒక సీనులో నేను శవంగా యాక్టింగ్ చేస్తున్నా. ప్రాణమున్న శవం చెవిలో నిజమైన శవం గురించి చెప్పటం ఎందుకని యూనిట్ లో ఎవరూ ఏమీ చెప్పలేదు.

యాక్టింగ్ పూర్తి అయ్యి నేను మేకప్ ను కడుకుంటున్నప్పుడు చెప్పారు...అందులోనూ అప్పుడే సమాచారం వచ్చిందని చెప్పారు. కానీ ఒక లైట్ మ్యాన్...పొద్దున్నే వార్త వచ్చిందమ్మా. డైరెక్టరే ఇప్పుడు వదిలేస్తే మీ కాల్ షీట్ దొరకటానికి పదిహేను ఇరవై రోజులు అవుతుంది. అందుకని రోజే ముగించేద్దాం అని చెప్పారు అని చెప్పాడు.

తరువాత హడావిడిగా వేగంగా వెళ్ళేనా..వాళ్ళు శవాన్ని తీసుకు వెళ్ళిపోయారు. శ్మశానానికి పరిగెత్తేను. అంతలో కట్టెల మీద పడుకోబెట్టి తల కొరివి పెట్టేశారు. నేను చివరగా చూసింది అమ్మను కాదు...అమ్మ యొక్క నిప్పునే... -- అని చెబుతూ షర్మీలా కూడా కన్నీరు పెట్టుకుంది. 

                                                                                                                                                                                                                                                                   Continued...PART-10 (LAST)

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి