16, అక్టోబర్ 2022, ఆదివారం

'హీరో'...(సీరియల్)...(PART-8)


                                                                                         'హీరో'...(సీరియల్)                                                                                                                                                                            (PART-8) 

జీవిత సంఘటనలకు కారణంగా ఉండేవి మన చేష్టలే అనేది పలువురి సలహాలు. మన మొత్త చేష్టలే మన జీవితం అంటున్నారు. అదే సమయం జీవితాన్ని మన ఆలొచనల వలనే జీవిస్తున్నాం అని అనుకుంటున్నాం. కానీ నిజం అది కాదు. శరీరంలో ఒక విషయం కూడా మన కంట్రోల్లో లేదు.  రక్త ప్రవాహం, హృదయం కొట్టుకోవటం, అవయవాల పనులు, ఆకలి-దాహం ఇలాంటివన్నీ వాటి ఇష్టానికి అవి పనిచేస్తున్నవే! మనసు దాన్ని అర్ధం చేసుకుని దానికి కావలసింది చేసిస్తోంది. సన్యాసి కూడా ఇదే చెప్పాడు.

నువ్వు శ్వాసించుకుంటున్నావు అని అనుకుంటున్నావు. నిజం అదికాదు...శ్వాస ప్రక్రియ ఒక ప్రకృతి సంబంధితం. నీ మనోబలంతో దాన్ని ఆపాలి అనుకుంటే ఆపవచ్చు. ఆపుకోవటం అనేది నీ ఆలొచనా శక్తి. కానీ ఎంతసేపు అలా చేయగలం? దానికి ఇంతే సమయం అని నిర్ణయించబడింది. దాని కంటే ఎక్కువసేపు చేస్తే శరీరం సహకరించదు.

జీవితంలో కూడా ప్రకృతికి ఎదురుగా ఎవరైనా సరే కొంచం సమయమే చేయగలరు. అలా యెడతెరిపి లేకుండా చేస్తూనే ఉండలేరు.

సితారా గది తలుపు దగ్గరకు వేసుకుంది.మామూలుగా పొద్దున ఏడు గంటల తరువాత తలుపులు మూసి ఉండవు. కానీ, రోజు ఎవరూ చూడలేదు. టైము తొమ్మిది దాటుతోంది. తలుపులు తీయలేదు. మోహన్ కు ఎందుకో అనుమానం వచ్చింది.

తలుపు దగ్గరకు వెళ్ళి చూసాడు. అవతల వైపు తాళం ద్వారంలో అడ్డు. లోపలకు చూడలేకపోయాడు. మోహన్ కు ఆందోళన మొదలయ్యింది. గదిని చుట్టి వచ్చాడు. కిటికీ తలుపులు కూడా మూసున్నాయి.

సితారా...ఏయ్, సితారా... -- అని తలుపుకు ముందు నిలబడి అరిచిన అతను చేతులు నలుపుకున్నాడు.  మోహన్ అరుపులు విని సత్యమూర్తీ, రాజేశ్వరీ హడావిడి పడుతూ వచ్చారు.

నాన్నా...సంతింగ్ రాంగ్. టైము తొమ్మిదైనా సితారా లేవలేదు చూడండి

నేనూ దాని గురించే ఆలోచిస్తున్నాను...ఇంతసేపటి వరకు లోపల అది ఏం చేస్తోందిరా?”

ఏం ప్రశ్న నాన్నా అది...తలుపులు పగలకొట్టాల్సిందే. ఎందుకంటే... సితారా  ఇప్పుడు స్ప్రుహలో ఉన్నట్టు నాకు అనిపించడం లేదు...

అయ్యయ్యో...ఏమిట్రా ఏమిటెమిటో చెబుతున్నావు. సితారా...తల్లీ...

రాజేశ్వరి శోకగీతం పాడటం మొదలుపెట్టింది. చివర్లో సినిమాలలోలాగా తలుపులు పగలకొట్టుకునే లోపలకు వెళ్ళాల్సి వచ్చింది.

అక్కడ మంచం మీద సితారా ఒళ్ళు మరచిన నిద్రలో...దగ్గర్లో ఆమె మింగిన నిద్ర మాత్ర అట్టలు. సుమారుగా యాభై మాత్రలు మింగుంటుంది.

అవే మోహన్ కు సితారా తీవ్ర పరిస్థితిని ఎత్తి చూపినై. వాటి పక్కనే ఒక లెటర్. తీసి చదివాడు.

అశ్విన్ బావ లేని ఒక పెళ్ళి జీవితాన్ని నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఇక ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారనే నమ్మకం పోయింది. నేను ఒక తప్పూ చెయ్యలేదు. కానీ, దేవుడు నాకు అతిపెద్ద శిక్ష వేసాడు. అందుకని దేవుని దగ్గరే న్యాయం అడుగుదామని అడగటానికి వెళ్తున్నాను. దీనికి నేనే కారణం...వేరే ఎవరూ కారణం కాదు!

--అని రాసి, సంతకమూ పెట్టుంది.

చదివిన క్షణాన్న దాన్ని మడతపెట్టి చొక్కా జేబులో పెట్టుకున్న మోహన్, ఆమెను అలాగే ఎత్తుకుని కారువైపుకు పరిగెత్తాడు. వెనుకే సత్యమూర్తీ రాజేశ్వరి పరిగెత్తారు.

న్యూయార్క్!

మ్యాన్ హటన్ అనే చోట సినిమా షూటింగుకు ఏర్పాటు చెయ్యబడింది. భారదేశాన్ని అలాగే ప్రతిబింబిం చేసే చోటు. ఎక్కడ చూసినా ఒకటే జనం. కారును పార్క్ చేయటం, తీయటం రోజూ 'జిం' కు వెళ్ళినట్లు కఠినమైన ట్రైనింగ్ చేష్ట. భారతీయులు చాలామంది కళ్ళకు కనబడ్డారు. వాళ్ళల్లో గుజరాతీ ప్రజలు ఎక్కువ.

మేకప్ వేసుకుని ఒక స్టోరీ క్యారెక్టర్ లాగా కార్లో కూర్చోనున్న అశ్విన్ పరిస్థితిలో తననే మరిచిపోయాడు...పూర్తిగా కొత్త పరిస్థితి. కొత్త మనుషులు! లోకం ఎంత అభివృద్ది చెందిదో తెలుసుకోవాలంటే అక్కడ ఐదు నిమిషాలు కూర్చుని గమనిస్తే చాలు. అశ్విన్ కూడా గమనించాడు. షూటింగ్ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

హీరోయిన్ హడావిడిగా ఉన్న బజారు వీధిలో హీరోని వెతుక్కుంటూ వస్తోంది. ఆమెను చూసేసిన హీరో, ఆమెను ఆటపట్టించటానికి, దాక్కుంటాడు. కానీ, అతను దాక్కున్నదే విపరీతమైపోతుంది. విరామంలో ఒక టెర్రరిస్ట్, హీరోయిన్ని లాగి పట్టుకుని ఆమె గొంతుకకు నేరుగా తుపాకీ పెట్టి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాడు.

పోలీసులు చుట్టు ముడతారు. వీధే భయపడి చూస్తోంది.

తరువాత ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి...దఢ దఢ నిమిషాలు ప్రారంభం.

వెండితెర మీద సుమారు ఇరవై నిమిషాలు రాబోవు దృశ్యం. దానికోసమే పనులు జరుగుతున్నాయి. హీరోయిన్ భారతదేశంలోనే తన దుస్తుల విషయంలో పెద్ద పట్టింపు లేకుండా ఉంటుంది. అమెరికాలో గాలికి బదులు తుఫాన గాలి వీచవచ్చు. అలా ఒక దారాళం!

బుసబుసలాడుతున్న వులన్ కోటు. దానిపై భాగాన బటన్ వేయకుండా వదిలేసింది. తల జుట్టును రంగు రంగుల పూతతో నింపేసింది. భుజాలకు ఒక సంచీ. ఆమె చూపులు అప్పుడప్పుడు అశ్విన్ ను వెతుకుతున్నట్టు ఉంటాయి. అతనూ ఆమెను చూస్తున్నాడు.

నిర్మాత సహాయకుడు అటూ ఇటూ తిరుగుతున్నాడు. సెల్ ఫోన్ మోగటంతో తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు అతను. అతని మొహాన ఆశ్చర్యం విస్తరించటం చూస్తే అతని చెవిలో ఏదో చెడ్డ వార్త ఒక ఎలుకలాగా దూరుండాలి అని అనిపించింది. చేతులు విధిలించుకుంటూ--ఒక కారులోపల కూర్చోనున్న అశ్విన్ వైపుకు పరిగెత్తుకు వచ్చాడు.

అచ్చు మన ఊరి బుద్ది! అతను వచ్చిన వేగంతో చాలా కార్లు బ్రేక్వేసుకుని కీచ్మని శబ్ధం చేస్తూ సడన్ గా ఆగటంతో కొన్ని కార్లు ఒకటికొకటి ఢీ కొన్నాయి. ప్రపంచం మొత్తం మనుషులు ఒకేలాగనే ఉన్నారు.

డర్టీ బిచ్...ఇడియట్... అని కార్లో వాళ్ళు గొనుక్కోగా, అశ్విన్ దగ్గరకు జేరి, అతని ముందు సెల్ ఫోన్ ను జాపాడు నిర్మాత సహాయకుడు.

ఏమిటి సార్?”

మాట్లాడండి...మీ అమ్మగారు లైన్లో ఉన్నారు...

అమ్మగారా...?” అని నోరు తెరుచుకుని సగం మనసుతో చెవిలో పెట్టుకున్నాడు.

అశ్విన్...

ఏంటమ్మా...

బాగున్నావా?”

...ఇప్పుడు ఇది అడగటానికే ఫోన్ చేసావా?”

లేదయ్యా...ఇక్కడ జరగకూడని విషయం ఒకటి జరిగిపోయింది...

ఏంటమ్మా?”

సితారా నిన్ను చూడటానికి ఏర్ పోర్టుకు వచ్చిందా?”

దానికేంటమ్మా ఇప్పుడు... సితారా కి వేరే పెళ్ళి చెయ్యి అని నీతో చెప్పాను కదా. ఇంకా ఎందుకు ఆమె గురించి మాటలు

దాని దగ్గర కూడా మాటే మాట్లాడావా?”

మాట్లాడాను. నేనిప్పుడు షూటింగులో ఉన్నాను. అందులోనూ ముఖ్యమైన పాత్ర...ఇప్పుడు మాట్లాడాల్సిన విషయమా ఇది?”

లేదయ్యా... సితారా నిద్ర మాత్రలు మింగింది. మంచికాలం మోహన్ చూసేసాడు. లేదంటే చాలా ఘోరం జరిగిపోయేది

అనుకున్నా...ఇలాంటిదేదో ఆమె చేసుకుంటుందని నేను ఎదురు చూసాను. కానీ ఒక విషయం...ఇదంతా ఉత్త మూర్ఖత్వం. ఇలా ఏదైనా చేసుకుంటే ఆమెపై జాలిపడి మనసు మార్చుకుంటానని ఎదురు చూడకండి. నా వరకు సితారాని వదిలేసింది వదిలేసిందే

ఎందుకురా ఇలా మాట్లాడతావు...? నీకే ఇది కరెక్ట్ అనిపిస్తోందా? అలా ఏమిట్రా అమ్మాయి అంత పెద్ద తప్పు చేసింది? ఏదో తెలియక ఇంటర్వ్యూ ఇచ్చింది! దానికి ఇంత పెద్ద శిక్షా? నీ మామా -- అత్తయ్యలు ఇద్దరూ బెదిరిపోయి నిన్ను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు...

ఏమ్మా... సితారాకి ఏం తక్కువ? తనకి నేను తప్ప ఇంకెవరూ దొరకరా? ఎందుకు మీరందరూ నన్ను సితారాకి కట్టబెట్టటానికి ప్రయత్నిస్తున్నారు? పెళ్ళి అనేది ప్రకృతిగా జరగాల్సిన విషయం...కొట్టి కూర్చోబెట్టి చేసేది కాదు. ఇది మీకు తెలుసు 

లేదురా...మీ అమ్మను నేను చెబుతున్నా. నువ్వు నా ఎదురుగా ఉంటే నీ కాళ్ళ మీద పడేదాన్ని. సితారాని పెళ్ళి చేసుకుంటానని చెప్పరా. అప్పుడు ఆమె త్వరగా గుణమై లేచి వస్తుంది

చాలమ్మా...ఇక విషయంగా ఫోను అదీ చెయ్యకు...పెళ్ళి అనేది చాలా ఆశగా జరగాల్సిన విషయం. నా ఆశ ఇప్పుడు సితారా మీద లేదు. లేనే లేదు...

దానిపైన ఆశ లేదా...లేకుండానే ఆమెతో కలిసి తిరిగావా? నీకు ఆమె...ఆమెకు నీవు అని చెప్పి చెప్పి పెంచటం నీకే తెలుసు కదరా?”

అమ్మా...నేనిప్పుడు షూటింగులో ఉన్నాను. ఎప్పుడు ఏది మాట్లాడాలో తెలియదా నీకు...? సాధారణ చిన్న వయసు కథలన్నీ ఇకమీదట చెప్పకమ్మా. ఇలా నా దగ్గర మాత్రమే కాదు, ఎవరి దగ్గరా చెప్పకండి. పెళ్ళి అనేది వారి వారి సొంత విషయం. అది తీర్మానించుకోవలసింది పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు. మీరు కాదు...మీ ఆశ కోసం పెళ్ళి చేసుకోవటం కుదరదు....

ఇప్పుడు ఇంత మాట్లాడుతున్న నువ్వు, నిశ్చయ తాంబూలాలకు ఎందుకురా ఒప్పుకున్నావు...? అల్లుడుగా దాని పక్కన కూర్చుని నవ్వుతూ ఫోటోలు కూడా తీసుకున్నావే...అప్పుడు ఎక్కడ పోయింది బుద్ది?”--ఇప్పుడు ఆమె మాటలలో కఠినత్వం గ్రహించాడు అశ్విన్.

అప్పుడు కూడా నేను కన్ ఫ్యూజన్ లో ఉన్నాను. నిజం చెప్పాలంటే అప్పుడు మీ దయ మీద బ్రతుకుతున్నాను. అందువలన మీ మాటను వినే తీరాల్సిన అవసరం ఉంది. కానీ, ఇప్పుడు నా కాళ్ళ మీద నిలబడటానికి నేర్చుకున్నాను. ఇక నాకు ఎవరి దయాదాక్షణ్యాలు అవసరం లేదు.

కాదూ కూడదూ అంటూ ఇదే విషయం కోసం నాకు మాటి మాటికి ఫోన్ చేసేవనుకో... సితారా నిద్ర మాత్రలు వేసుకున్నట్టే ఇక్కడ నేనూ వేసుకుంటాను. చిన్నగా ముగియ వలసిన విషయాన్నిపెద్ద విషయంగా చేయకు! కొడుకునే  చంపిన తల్లిగా తరువాత నిన్ను లోకమే ఆడిపోసుకుంటుంది. ఆలొచించకో... అని చెప్పి సెల్ ఫోన్ను కట్ చేసాడు.

బయట...నిర్మాత సహాయకుడు అందరి దగ్గర ప్రాధేయపడుతున్నాడు. ఇదే ఇండియా అయ్యుంటే...సరే పొండిరాఅని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండచ్చు. ఇక్కడ అలా కుదరదు. పోలీసులూ వచ్చారు. ఒక్కొక్క పోలీసు పుష్టిగా, దేహ దారుఢ్యంతో ఉన్నాడు.

ఒకటికి పది జీవ నదులు. పంట పండించే భూములే ఇండియాకంటే పదిరెట్లు ఎక్కువ...పంటలకు కరువు లేదు. ప్రతి ఇంట్లోనూ నాలుగైదు కార్లు...అదే అమెరికాలో పెద్ద చిక్కు. మనుష్యులకు అక్కడ కావలసిన చోటు తక్కువ. కార్లకు మాత్రం ఎక్కువ చోటు కావాలి. అందువలనే ఎప్పుడు చూడూ సమస్య.

అక్కడ జరిగి ముగిసిన సంభవం -- నిర్మాతను కూడా లాకొచ్చింది. హీరోయిన్కూడా తన కారు దిగి అశ్విన్ దగ్గరకు వచ్చి, “ఏమిటి ప్రాబ్లం...?” అన్నది.

చిటపటలాడుతున్న అతను, ఆమెను చూసిన వెంటనే కొంచం చల్ల బడ్డాడు. కృతిమ నవ్వుకు మారాడు.

నతింగ్...ఒక చిన్న యాక్సిడెంట్ అన్నాడు.

ఆమె... అశ్విన్ కారులోకి ఎక్కి, అతని దగ్గరగా కూర్చుని బయటకు చూసింది.

ఒక విధంగా ఫైను కట్టి సమస్యను పోలీసులు ఒక ముగింపుకు తెచ్చారు. నిర్మాత సహాయకుడు బలసాలులైన పోలీసు వారితో కరచాలనం చేసాడు.

ఇక్కడ సమస్య ముగిసింది. బై బై...రేపు నయగారాలో షూటింగట. మీరు ఇంతకు ముందే అక్కడికి వెళ్ళారు కదా?” అని హీరోయిన్ సహజంగా మాట్లాడటం ప్రారంభించింది.

లేదు. నాకు విదేశీ ట్రిప్పు చాలా కొత్త మ్యాడం

మ్యాడమా...వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్?”

మరి...మిమ్మల్ని ఎలా పిలవాలి?”

నాకు అందంగా షర్మీలా అనే పేరుంది మిస్టర్. అశ్విన్...

సో... షర్మీలా అని పిలవమంటున్నారు

అశ్విన్...ఏమిటిది? మనం నటిస్తున్న సినిమా మాత్రం బాగా ఆడిందా, మనకు కనీసం పది సినిమాలు ఖచ్చితం. మనమూ ఒక ప్రేమ పక్షులలాగా పత్రిక వాళ్ళ ముందు తిరగాలి. మనం పెళ్ళి చేసుకుంటామో...చేసుకోమో అని వాళ్ళు జుట్టు పీక్కోవాలి...

ఎందుకు అలా?”

మీకు సినిమా ప్రపంచం గురించి సరిగ్గా తెలియదనుకుంటా. ఒక నటుడో, నటో  ఫాన్స్ మనసులో నెమ్మదిగా తెల్లుతున్న పాలు లాగా ఉండాలి. పాలు పొంగనూ కూడదు, చలారి పోనూ కూడదు. అదేలాగా ఒక జోడి ఇక్కడ సెట్ అవడం కష్టం. సెట్ అయ్యిందా, జోడి విడిపోకుండా వాళ్ళే చూసుకోవాలి. నేను చెప్పేదాంట్లో పలు రహస్యాలు ఉన్నాయి... షర్మీలా ఒక పెద్ద నిట్టూర్పు వదిలి మళ్ళీ మొదలు పెట్టింది.

నన్ను సినిమాకు బుక్ చేయటానికి వచ్చిన వాళ్ళ దగ్గర హీరోఎవరు అని అడుగుతా. వాళ్ళు ఎవర్ని వేయాలని నన్ను అడిగితే...వెంటనే మీ పేరు చెబుతా. మీరు కూడా మిమ్మల్ని అడిగినప్పుడు నా పేరు చెప్పాలి. అలా చేస్తే ఇంకో జోడి లోపలకు రాకుండా చూసుకోవచ్చు... -- షర్మీలా ఒక రహస్యాన్ని మాత్రమే చెప్పింది. అంతలో విజిల్ శబ్ధం వినబడి షాటుకైన విషయం చెవిలో వినబడటం మొదలయ్యింది.

.కే...నేను రాత్రి రూములో మాట్లాడుతాను. మనిద్దరికీ పక్క పక్క రూములే. కానీ మనకి ఒక రూము చాలు. ఎందుకో తెలియదు. మీరు నాకు బాగా నచ్చారు. ఇద్దరికీ పేర్ల జాతకం బాగా కుదురుతొందని మా జోస్యుడు చెప్పారు. మీరు కావాలంటే చూడండి... సినిమాలో మన ఒక్కొక డూయెట్టు పెద్ద హిట్ అవుతుంది... అంటూనే కిందకు దిగి తనకైన పొజిషన్ వైపు వెళ్ళసాగింది షర్మీలా అనే నటి.

అశ్విన్ కి అంతా కలలాగా ఉంది. సినిమా పత్రికలలో వచ్చిన ఈమె ఫోటోలను చూసి సొల్లు కార్చాడు. అప్పుడేమో ఆమెతోనే నటిస్తాడనో...ఆమె ఇలా మాట్లాడుతుందనో అతను కలలో కూడా ఊహించుకోలేదు.

అతను నోరెళ్ళ బెట్టాడు. అది ఎవరు చూసారో లేదో...ఇద్దరు లైట్ బాయ్'స్! చూశారు. అర్ధమైనట్టు ఒకర్ని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.

ఏమిటి నాగరాజ్...పార్టీఒక కొత్త మోహానికే బీటు వేస్తోంది

అది సరైన దయ్యం...! రోజు రాత్రికి కుర్రాడ్ని పొట్లం కట్టేస్తుంది. ఇతని జీవితాన్ని కూడా అలాగే మింగేస్తుంది. ఇతనూ, అన్నీ పోగొట్టుకున్నాకే కళ్ళు తెరుచుకుంటాడో...లేక ముందే కళ్ళు తెరుచుకుంటాడో...ఎవరికి తెలుసు...?”

కుర్రాడ్ని చూస్తే పాపంగా ఉంది. మంచి కుటుంబం నుంచి వచ్చాడు. స్టార్టింగే హీరోవేషం.

కానీ, ఇది నిర్మాతను బుట్టలో వేసుకుని హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు వీడినీ బుట్టలో పడేసి...పెళ్ళి వరకు తీసుకు వెళ్ళి ముగిస్తుంది చూడు... అని మాట్లాడు కుంటూ ఒక తర్మోకోల్ వంచి పుచ్చుకుని, దాని మీద పడుతున్న సూర్యకాంతిని, రోడ్దుపైకి చెదరగొడుతున్నారు.

ఇంకొకడు అదేలాగా ఇంకో పక్క నిలబడ...రోడ్డు మీద కొత్త విధమైన కాంతి. అలాంటి వెలుతురే సినిమా కెమేరాకు ఇష్టం. దృశ్యాలను అద్భుతంగా తీసి ఇస్తుంది. కెమేరా మ్యాన్ మ్యాజిక్ చేసాడు అని చెప్పుకుంటారు. పత్రిక వాళ్ళు రాసి పారేస్తారు.

                                                                                                        Continued...PART-9

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి