7, అక్టోబర్ 2022, శుక్రవారం

'హీరో'...(సీరియల్)...(PART-4)

 

                                                                                       'హీరో'...(సీరియల్)                                                                                                                                                                              (PART-4)

అన్నీ ఇదివరకే తీర్మానించబడ్డాయి. ఒక చిన్న పనిలో కూడా నీ తీర్మానం లేదు. భూమి మీద కురిసే వర్షం నీరు ఎలా పడినచోటుకు తగినట్లు దొర్లి, పొరలి మురికిపట్టి పరిగెత్తి వెళుతుందో...అలాగే మన జీవితం కూడా సాగుతుంది.

అందులో ఎలా ఒక శాస్త్రీయ శక్తి ఉన్నదో...అదే శక్తి మన జీవిత ప్రయాణాలలోనూ ఉంటుంది. ఎంతగా మనసులో అనుకుని దానికి తగినట్టు నడుచుకోవటానికి ప్రయత్నించినా దానికి ముందే ఒక ప్లాను ప్రకారమే పనిచేస్తూ ఉంటాము అనేదే నిజం.

మన ఆలొచన, ఇంతకు ముందే ఉన్న, వేసుకున్న ప్లాను రెండూ కలిసే నడుచుకోవలసిన పద్దతి. పద్దతి మనం ఆలొచించినట్లే జరిగి ముగియవచ్చు...లేక వేరుగానూ జరగవచ్చు.

ఎప్పుడూ మనం అనుకునట్టు జరిగి -- దానికి తగినట్లు తిరుగు ఫలితాలు దొరికితే...మనిషి, మనిషిగా ఉండడు.

సితారా మార్కెట్టుకు బయలుదేరినప్పుడు ఎదురుపడ్డాడు బిచ్చగాడి లాగా ఉండే ఆ స్వామీజీ.

వదలద్దు...అతన్ని వదలనే వదలద్దు...వదిలితే అతన్ని పట్టుకోలేవు...అన్నారు.

సితారాకి ఆయన చెప్పింది ఆమెకోసమైన మాటలా...లేక వాగుడా...లేక ఏదో ఒక సనుగుడా అనే కన్ ఫ్యూజన్!

ఇంటికి వచ్చింది.

సితారా మొహంలో ఒక గందరగోలం! దానిని గమనించిన ఆమె అన్నయ్య మోహన్, ఆమె ఎదురుగా వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. ఆమె కూడా తలెత్తి అన్నయ్యను చూసింది.

ఏమిటి డల్ గా ఉన్నావు?” – సితారాను అడిగాడు మోహన్.

అలా ఏం లేనే...

అబద్దం చెప్పకు...ఏదైనా సమస్యా?”

సమస్యా లేదన్నయ్యా...

సితారా! నేను నీ అన్నయ్యను. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదా?”

అన్నయ్యా! ఏదైనా సమస్య అయితే నేను ఖచ్చితంగా నీదగ్గర చెబుతాను...చాలా?”

నువ్వు చెప్పద్దు...నేనే చెబుతాను. అవును, హీరోగా నటించాలనే కోరికతో అశ్విన్ మంచి ఉద్యోగాన్ని కూడా వద్దని చెప్పాడటగా?”

అవును... ఉద్యోగంలో నెలకు వచ్చే డబ్బులు, సినిమా రంగంలో ఒకరోజు జీతమటగా...?”

అదంతా గెలిస్తేనే...వీడింకా మొదలు పెట్టనే లేదు. అంతలోపే చేతికి వచ్చిన అదృష్టాన్ని వదులుకోవటం మూర్ఖత్వం. అందులోనూ ఇప్పుడొచ్చిన ఉద్యోగం చాలా గొప్పది

నేనూ అలాగే అనుకుంటున్నానన్నయ్యా...కానీ అశ్విన్ దగ్గర మనం ఇప్పుడు ఏం చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. ప్రస్థుతం ఆకాశంలో తేలుతున్నాడు

సితారా! నాకెందుకో మనం అవసర పడ్డామేమో అని అనిపిస్తోంది

విధంగా...?”

ఉద్యోగాన్ని నమ్మే, నీకూ అతనికీ నిశ్చయం చేశాం. కానీ అతనో...దీని కంటే సినిమానే  గొప్పదని వెళ్ళిపోయాడే...

ఇది కూడా ఒక విధంగా పేరు ప్రతిష్టలు తెచ్చే ఉద్యోగమే కదా అన్నయ్యా?”

అది ఎవరికీ అనేదే ఇక్కడ పాయింట్. నాకు తెలిసి వందకు, పదిమందే సినిమా ఉద్యోగాన్ని దైవంగా భావిస్తారు. మిగిలిన వాళ్ళకు ఇదొక హాయిగా గడిపే ఉద్యానవనం...

గట్టిగా అరిచి మాట్లాడకు... ఎవరైనా సినిమా నటుడు వింటే ఆ తరువాత నీకు వకీల్ నోటీస్ పంపిచేస్తాడు...

ఇప్పుడు ఎవరూ అలా పంపంటం లేదు...

సరే అన్నయ్యా...వెళ్ళు...వెళ్ళి పనిచూసుకో. పోను పోను చూద్దాం...

ఇప్పుడు కూడా చెబుతున్నా. వాడు నటుడు అశ్విన్ గా నీతో స్నేహం చేస్తే దయచేసి అతనికి దూరంగా వెళ్ళిపో. పాత మన అశ్విన్ గా, ప్రేమ మారకుండా ఉన్నాడంటే నీకూ అతనికి పెళ్ళి జరుగుతుంది... మోహన్ తన నిర్ణయాన్ని కట్ అండ్ రైటుగా చెప్పి లేచి వెళ్ళిపోయాడు.

దగ్గరలో ఉన్న సెల్ ఫోన్ ఆమె ఆలొచనలను చెరిపి దగ్గరకు రమ్మంది.

సితారా తీసి చెవి దగ్గర పెట్టుకుంది.

అవతల పక్క వరలక్ష్మి.

అత్తయ్యా!

ఏం చేస్తున్నావు సితారా?”

ఏమీ చేయటం లేదు అత్తయ్యా...ఖాలీగానే ఉన్నాను...

కొంచం ఇంటికి వస్తావా?”

వస్తా అత్తయ్యా......తరువాత అత్తయ్యా, అమ్మ రోజు గుత్తి వంకాయ కూర, ముక్కల పులుసు చేసింది. తీసుకు రమ్మంటారా?”

నేనే చెబుదామనుకున్నాను. రోజు నేను వంట చేయలేదు. నువ్వే తీసుకు వచ్చేయి...

సరే అత్తయ్యా!

...తరువాత సితారా... పదిహేను రోజుల తరువాత అశ్విన్ ఒక నెల రోజులు విదేశాలు వెళ్తున్నాడు. వాడితో ఒకరు వెళ్ళొచ్చట. అంటే భార్యా, తల్లి, తండ్రి..ఇందులో ఎవరో ఒకరు! పాస్ పోర్ట్ఉంటే వీసా ఏర్పాటు చేసి ఇస్తారట. నువ్వు మీ అమ్మా-నాన్నల దగ్గర చెప్పి, నీ పాస్ పోర్టు తీసుకునిరా...

అత్తయ్యా! ఏమిటిది? పెళ్ళికి ముందే ఎలా? పెళ్ళి అయిన తరువాత అలా వెడితే బాగుంటుంది. ఇప్పుడు వెడితే బాగుంటుందా?”

ఏమిటి సితారా నువ్వు...నిన్ను ఎందుకు వెళ్ళమంటున్నానో నీకు అర్ధంకాలేదా...? వాడికి సహాయంగానూ ఉంటుంది...వాడు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుంది...

అర్ధమవుతోంది అత్తయ్యా! కానీ, ఆయన ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలిగా...?”

వాడేమిటి చెప్పేది? నేను చెబుతున్నా...నువ్వు బయలుదేరు...

దానికి మీరే వెళ్ళొచ్చుగా అత్తయ్యా...?”

అది సరే...ఇక్కడ మీ మావయ్యను ఎవరు మేపేది...?”

మేము లేమా?”

ఒక్క రోజు కూడా మీరు ఆయనతో గడపలేరు...అనవసరమైన నీ వాగుడు ఆపి, దయచేసి నీ పాస్ పోర్ట్తీసుకునిరా....

వరలక్ష్మి ఫోన్ కట్ చేసింది.

వేరే దారిలేక సితారా బీరువాలో ఉన్న పాస్ పోర్ట్తీసుకుని బయలుదేరింది.

హాలులో సితారా తండ్రి లాప్ టాప్పెట్టుకుని షేర్ మార్కెట్ వివరాలు చూస్తున్నారు. అందులోకి ఆయన శ్రద్ద పెడితే చూట్టూ జరుగుతున్నది ఏదీ గమనించరు. వంటగదిలో ఉంది ఆమె తల్లి రాజేశ్వరి.

అమ్మా...నేను అత్తయ్య ఇంటివరకు వెళ్ళేసి వస్తాను అంటూనే స్టీలు గిన్నెలో పులుసు పోసుకుని, మరో గిన్నెలో గుత్తి వంకాయ కూర వేసుకుని, వాకిట్లో ఉన్న స్కూటీని స్టార్ట్ చేసింది.

తరువాత ఎగరటం మొదలు పెట్టింది.

అశ్విన్ ఇంట్లో కొంతమంది పత్రికా విలేకరులు వరాండాలో కాచుకోనున్నారు. సితారా లోపలకు రాగానే ఆమెను దీర్ఘంగా చూశారు. ఆమె వాళ్ళను చూసుకుంటూనే లోపలకు వెళ్ళింది. అక్కడ వరలక్ష్మి కొంచం ఆందోళనగా కూర్చోనుంది.

రావే...ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. అశ్విన్ చేసేది కొంచం కూడా బాగలేదే... అన్నది పులుసు గిన్నెను తీసుకుంటూ.

ఏం అత్తయ్యా...ఏం చేసారు ఆయన?”

బయట పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుందామని గంట ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాడు ఇప్పుడే నిదానంగా స్నానాకి వెళ్ళాడు. వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్లచ్చు కదా?”

ఉండండి...నేను వెళ్ళి చూసొస్తాను... అంటూ మెట్లు ఎక్కి మేడపైకి వెళ్ళింది సితారా.

అశ్విన్ స్నానాకి కూడా వెళ్ళలేదు. అతని గదిలో గడ్డం గీసుకుంటున్నాడు.

అశ్విన్...

ఎస్...

ఏం చేస్తున్నావు?”

చూస్తే తెలియటం లేదా...?”

అదిసరే...పత్రిక వాళ్లను కాచుకోబెట్టి షేవ్ చేసుకోవాలా?”

మరి...అలాగే బిచ్చగాడిలాగా మాసిన గడ్డం - మీసంతో వెళ్ళి నిలబడమంటావా?” 

ఏమిటి పెద్ద గడ్డం-మీసం...రోజూషేవ్చేసేవాడివి నువ్వు. ఇప్పుడు అక్కడ ఏముందని గీసుకుంటున్నావు. అది తరువాత చేసుకోవచ్చు. అక్కడ పత్రిక వాళ్ళు గంటసేపటి నుండి కాచుకోనున్నారట. ఎప్పుడూ పత్రిక వాళ్ళను కాచుకో నివ్వకూడదు

అరె...ఏమిటి సితారా నువ్వు, సినిమాల గురించి, పత్రిక ఇంటర్వ్యూ గురించి ఏమీ తెలియకుండానే సలహాలు ఇవ్వటం మొదలు పెట్టావు?”

సలహా కాదు. నా మనసుకు తోచింది చెప్పాను. వాళ్ళు మన గురించి నాలుగు మాటలు మంచిగా రాయాలి. లేకపోతే ఇమేజ్డాన్స్ ఆడటం మొదలవుతుంది

అదంతా ఉత్త మాటలు...మా సినిమా, ఇంటర్వ్యూ లేకుంటే పత్రికలకు మార్కెట్ ఉండదు. కాబట్టి మేము లేకుంటే వాళ్లకు ఎలా గడుస్తుంది? అందుకోసం వాళ్ళు మాకోసం కాచుకోవటంలో తప్పులేదు...

పిచ్చోడిలాగా మాట్లాడకు...పెద్ద చదువులు చదివిన నువ్వు ఇలా మాట్లాడటమే నాకు ఆశ్చర్యంగా ఉంది

సరే...ఇప్పుడేం చెయ్యమంటావు?”

గడ్డం గీసింది చాలు. వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళను పంపించు. తరువాత స్నానం చెయ్యి...

ఇది ఇంకా బాగుందే... డ్రస్సులో వాళ్ళు నన్ను ఫోటోతీసి పత్రికల్లో వేస్తే నా ఇమేజ్ ఇంతే సంగతలు! షర్మీలా ఏం చెప్పిందో తెలుసా?”

ఎవరది?”

నా హీరోయిన్...

అది నేనే కదా... -- సితారా.

నీ తలకాయ్! సినిమాలో నాతో నటించబోతున్న హీరోయిన్ని చెప్పాను. ఆమె అందరితోటి ఒక రౌండ్ వచ్చింది. పత్రిక వాళ్ళతో ఎలా నడుచుకోవాలో నాకు ఒక పెద్ద పాఠమే నేర్పింది...

అశ్విన్ మాటలు షర్మీలా దగ్గరకు వెళ్ళటంతో సితారా కి అర్ధమయ్యింది. ఇప్పుడు అశ్విన్ ఆమె చేతుల్లోనా...లేక ఇతనుగా మాట్లాడుతూ, ఆమె పేరును నా  దగ్గర వాడుతున్నాడా?’

అయోమయంతో అతన్ని చూసింది. ఇక మాట్లాడి ప్రయోజనం లేదుఅనేలాగా దిగి, కిందకు వెళ్ళి వంటగదిలో గబగబా జ్యూస్ తయారు చేసింది. తరువాత దాన్ని గాజు గ్లాసులలో పోసుకుని, ఒక ప్లేటులో అందంగా పెట్టుకుని పత్రికా విలేకర్ల దగ్గరకు వెళ్ళింది.

అందంగా, చిన్నగా ఒక నవ్వు నవ్వుతూ అందరికీ జ్యూస్ ఇచ్చింది. వాళ్ళూ సగం నవ్వుతో జ్యూస్ తాగారు. ఒక విలేకరి అడిగాడు.

సారుకు మీరేం అవుతారు?”

నేను ఆయనకు కాబోయే భార్యను...

అలాగా...మీ పేరు?”

సితారా...ఆయన మావయ్య కూతుర్ని. నిశ్చయ తాంబూలాలు కూడా ముగిసింది..

అరెరె...సార్ వరకు అన్నీ వ్యత్యాసమైన సమాచారాలే ఉన్నాయి...

అన్నీ అంటే...?”

సినిమాలలోకి ఎంట్రీనే హీరొగా. అందులోనూ ప్రసిద్ద నటి షర్మీలా తో జత కలిపి...అమెరికాలో సార్ ఏం చేసేవారు...?”

క్షమించాలి! సినిమాకు పూజ జరిపిన రోజు ఆయన గురించి మీకు ఇవ్వబడిన సమాచారం తప్పు. ఆయనకు అమెరికా ఎటువైపున ఉన్నదో కూడా తెలియదు. ఇక్కడ పక్కనున్న గ్రౌండులో క్రికెట్టు ఆడటానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు చూసి, హీరో చేసేసారు. ఇదే నిజం" -- సితారా అమాయకంగా మాట్లాడగా...పత్రికా విలేకర్లు పెద్ద ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ ఆమెను ఫోటో తీసారు.

ఆమె చేతులతో ముఖం మూసుకుంటూ వద్దండి. నన్ను ఫోటో తీసేది వేస్టు అని చెప్పినా ప్రయోజనం లేకపోయింది.

మీరు కూడా మంచి ఫోటో జెనిక్కే నండి

థ్యాంక్స్. కానీ, నా ఫోటో ఇంటర్వ్యూ లోనూ రాకూడదు... ఆమె ఆదేశించ, అశ్విన్ సూపర్ మేకప్ తో వాళ్ళ దగ్గరకు నమస్కరిస్తూ వచ్చాడు.   

అతను రావటంతో సితారా కొంచం వెనక్కి వెళ్ళింది. అశ్విన్ వాళ్లకు దగ్గరగా ఖాలీగా ఉన్న ఒక సోఫాలో కూర్చున్నాడు.

తరువాత?” -- అన్నాడు చేతులను దులుపుకుంటూ!

ఇంటర్వ్యూ కోసమే సార్ వచ్చాము. ప్రశ్నలు అడగొచ్చా సార్...?”

ఒక్క నిమిషం! ...బై బై...ఈమె నా పి..! పేరు సితారా. నన్ను కాంటాక్ట్చేయలేని సమయాలలో, మీరు ఈమెను కాంటాక్ట్చెయచ్చు -- ఎందుకంటే...నేను మాటి మాటికీ అమెరికా, కెనడా అంటూ తిరగటానికి వెళ్ళిపోతాను... -- అశ్విన్ యొక్క అబద్దపు మాటలు వాళ్ళల్లో నవ్వు పుట్టించింది.

సితారా మాట్లాడింది తెలియక అశ్విన్ మాట్లాడుతున్నాడని తెలుసుకున్న వాళ్ళు -- ఒక సారి ఆమెను ఒక చూపు చూశారు.  

ఆమె దగ్గర ధర్మసంకటం. వంకర్లు తిరిగింది.

ఏమిటీ ఆవిడ్ని చూస్తున్నారు? సితారా! నువ్వెళ్ళు. ఏమిట్రా ఒక అమ్మాయిని  పి.. గా పెట్టుకున్నానని చూస్తున్నారా?”

లేదు. ఆమె మీకు బంధువు అనుకున్నాం...

బంధువంటే...దూరపు బంధువు. మీరు ప్రశ్నలు అడగండి... -- అశ్విన్ యొక్క వైఖరి ఏదో వంద సినిమాలలో నటించి పెద్దగా సాధించిన నటుడిలాగా చెప్పిన అబద్దమంతా ఆవలింతగా పోయింది.

వాళ్ళూ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు.

మీరు నటించటానికి రావటానికి కారణం?”

సినిమా రంగం -- మీన్, నటన మీద నాకున్న ప్రేమ...

దీనికి ముందు ఏం చేస్తూ ఉండేవారు?”

అమెరికాలో సీనియర్ ఇంజనీర్...

మీరు హైదరాబాద్ సిటీలోని ప్రదేశాలనే సగానికిపైగా తెలియనివారని కొంతమంది చెబుతున్నారే...?”

ఎవరు...ఎవరది...?” అశ్విన్ దగ్గర కోపం బొబ్బలెక్కింది.

మీ...మీ....

...ఎవరు చెప్పింది. చెప్పండి?”

సరి. అది వదలండి సార్. పైకొస్తున్న నటుల మీద ఈర్ష్యతో ఇలా ఏదో ఒకటి చెప్పటం సహజమైపోయింది. మీ తరువాత లక్ష్యం ఏమిటి?”

తెలుగు రాష్ట్రాల నెంబర్ వన్ హీరో అని పేరు తెచ్చుకోవాలి...

చాలా థ్యాంక్స్. మేము వెళ్ళొస్తాం... -- పత్రికా విలేకర్లు ఇక నీ దగ్గర అడిగి తెలుసుకోవలసిన విషయాలు ఏమీ లేవుఅన్నట్టు బయలుదేరారు.

అశ్విన్ చాలా నిరాశ పడ్డాడు. ఎక్కువ ప్రశ్నలతో పెద్ద ఇంటర్వ్యూ ఉంటుంది. రేపటి పత్రికలలో కనీసం అరపేజీ మన గురించి వస్తుందీ అని ఆశపడ్డాడు.

ఏమిటిది...ఇంతేనా ప్రశ్నలు?” అంటూ వాళ్ళను కెలికి చూసాడు. వాళ్ళు నవ్వారు. అందులో వెయ్యి అర్ధాలు.

ఇంటి గేటును దాటిన వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకున్నారు.

ఇంకా మొదటి సినిమానే రాలేదు. అంతలోపు ఎన్ని ఘోరమైన అబద్దాలు చెబుతున్నాడు. పాపం అమ్మాయి

పత్రికా ఇంటర్వ్యూ అంటే ఏమిటో ఇకమీదటే అబ్బాయి తెలుసుకోబోతాడు -- అనుకుంటూ విడిపోయి వెళ్ళిపోయారు.

వాళ్ళు అలా మాట్లాడుకుని వెళ్ళటం, పైన బాల్కనీలో ఉండి చూస్తూనే ఉంది సితారా. ఆమె కల్లు తడిసినై. అలాగే చాలాసేపు నిలబడ్డ ఆమె, అక్కడ్నుంచి జరిగి అశ్విన్ ను వెతుక్కుంటూ వెళ్ళింది.

అతను అద్దం ముందు నిలబడి మీసాలను ట్రిం చేసుకుంటున్నాడు.

అశ్విన్...

ఏమిటి?”

మీ దగ్గర కొంచం మాట్లాడాలి...

తెలుసు. నిన్ను నా పి.. అని...దూరపు బంధువు అని చెప్పటం వలన బాధ కలిగి ఉంటుంది. అదేగా...?”

కాదు...

కాదా...అరె, ఆశ్చర్యంగా ఉందే...అలాగైతే ఇంకేమిటి విషయం

మీరు కొంచం నిదానంగా నడుచుకోవచ్చే

నిదానంగా అంటే...? నేను ఇప్పుడు ఎగిరి గంతులు వేస్తున్నానా...

చెప్పేది కొంచం అర్ధం చేసుకోండి. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు నిదానం చాలా ముఖ్యం. పత్రిక వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. మీరు చెప్పేదాంట్లో నిజమేది, అబద్దమేదీ సులభంగా కనిపెట్టేస్తారు. అలా వాళ్ళుగా కనిపెట్టేస్తే అది చాలా అవమానం....?”

ఒక అవమానమూ లేదు. నేను అబద్దం చెప్పేనని వాళ్ళు కనిపెట్టేసుంటే నాకు ఎలాగూ వార్త ఇస్తారు. వాడు కనిపెట్టినందుకు ఒక ఖరీదు కడతాడు. ఇచ్చేస్తే విషయం మరుగైపోతుంది...

అలా అని మీకు ఎవరు చెప్పింది? షర్మీలా నా?”

అశ్విన్ కోపంగా సితారా వైపు చూసి ఇదంతా నాలాంటి ఆర్టిస్టులకు చాలా సర్వ సాదారణ విషయం. నువ్వు కొంచం ఊరికే ఉండు...

ఏమిటి ఊరికే ఉండేది...మీరు రావటానికి ముందే వాళ్ళతో నేను మాట్లాడి మీ ఆలస్యానికి కోపగించుకుంటున్న వాళ్ళను సమాధానపరుస్తున్నాను. నా గురించిన నిజమేమిటో అది చెప్పాను. నేను మాట్లాడింది తెలియని మీరు...వెనుకే వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు...ఇప్పుడు మీరు వాళ్ళకు చెప్పింది విషయం కాదు, నేను చెప్పిందే విషయం.... -- సితారా యొక్క వివరణ అతన్ని ఇరకాటంలో పెట్టింది.

ఆమెను కోపంగా చూసాడు. నువ్వెందుకు వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడావు...?” అన్నాడు ఆవేశంగా.

వాళ్ళను మంచి విధంగా ఫీల్చేద్దామని...

ఏమిటి మంచి విధంగా? నేనేమన్నా వాళ్ళని పిండి రుబ్బమనా చెప్పుంచాను... -- అతని అరుపులు వరలక్ష్మి చెవులకూ వినిపించింది. ఆమె రావటంతో, రఘుపతి గారు కూడా వచ్చారు.

వచ్చీ రాగానే అశ్విన్ ను చూసి అశ్విన్...నీ పద్దతి ఏమీ బాగలేదురా. నువ్వు చాలా ఫోజు కొడుతున్నావు. అది కూడా నీకు తెలియటం లేదు... అన్న ఆయన సితారా ను చూస్తూ అమ్మా సితారా...నువ్వు బయలుదేరు. వీడుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు వస్తుంది. అప్పుడు నొవ్వొస్తే చాలు... అని ఒక నిర్ణయానికి వచ్చారు.  

మీరొకరు...రేపు వీడితో విదేశాలకు ఇదే వెళ్ళబోతుంది...?” అంటూ అడ్డుపడింది వరలక్ష్మి.

ఎందుకు...అక్కడీకీ వెళ్ళి కూడా ఇద్దరూ కొట్టుకోవటానికా?”

అదంతా ఏమీలేదు. ఒకవేల మీరు చెప్పినట్టే వాళ్ళిద్దరూ కొట్టుకున్నా, అదేకదా వాడికి అన్నీనూ...

చాలు వరలక్ష్మీ...నిశ్చయతాంబూలం అయిపోవటంతోనే పెళ్ళి అయిపోయినట్లు అనుకోకు! రోజుల్లో పెళ్ళే జరిగున్నా...పరస్పరం మర్యాద, గౌరవం లేకుంటే, తాళిని విప్పేసి భర్తకు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అది తెలుసుకో...

సితారా ని వాళ్ళ మాటలు ఇరకాటంలొకి తోసింది.

అత్తయ్యా-మావయ్యా... విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఆయనతో ఎవరు రావాలనేది ఆయనే నిర్ణయించుకోవటం మంచిది. ఆయన నన్ను పిలిస్తే వెళ్ళొస్తాను... అని చెప్పి సితారా సమస్యకు తాత్కాలిక ఫులుస్టాప్ పెట్టింది.

చూస్తూనే ఉన్న అశ్విన్ కి వాతావరణం మీద విరక్తి ఏర్పడింది. అక్కడ ఉండటం ఇష్టంలేక వేగంగా తన గదిలోకి దూరి గొళ్లెం పెట్టుకున్నాడు.

అది చూసిన సితారా కి ఏడుపు వచ్చినంత పనైంది!

                                                                                                               Continued...PART-5

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి