30, అక్టోబర్ 2022, ఆదివారం

ఆనందనిలయం….(కథ)

 

                                                                                        ఆనందనిలయం                                                                                                                                                                                (కథ)

పెద్దలంతా ఒకప్పుడు పిల్లలే. స్నేహా వాతావరణం, ఇంట్లోని పెద్ద వారిని గౌరవించటం, తోటి వారిని అభిమానంగా పలకరించటం, ప్రశాంతంగా జవాబులు ఇవ్వటం... వీటన్నింటినీ పిల్లలు పెద్దవారిని చూసే బాగా నేర్చుకొంటారు.

పిల్లల పెంపకం అనేది కేవలం శరీరాల పెంపకం కాజాలదు. మేధా సంపన్నత్వం సమకూరాలి. కనుక, పూర్ణ వికాసులైన మానవుల వల్లనే ఆ పెంపకం సాధ్యం.

ప్రకృతి ఒడిలోంచి వచ్చిన ప్రతి శిశువూ స్వచ్ఛమైనదే. అత్యంత సుద్ధమైనదే. కానీ, మూర్ఖపు తల్లిదండ్రుల చేతిలో  పెరిగిన శిశువులు తమ తల్లిదండ్రులను పోలికతోనే తామూ తయారవుతారు.

అలాంటి వాతావరణమే ఈ కథలోని తల్లి-తండ్రుల విషయంలోనూ జరిగింది. కానీ తమ పిల్లవాడు ఎలా పెరుగుతున్నాడు అనేది తెలుసుకున్న తరువాత, వారు చేసిన తప్పును తెలుసుకుని వాళ్ళ ఇంటిని ఆనందమయంగా చేసుకున్నారు.

వారు చేసిన తప్పేమిటీ? ఆ  తప్పును ఎలా గ్రహించారు? గ్రహించిన ఆ తప్పును ఎలా సరిదిద్దుకున్నారు? ఎలా ఆ ఇంటిని అనందనిలయంగా మార్చుకున్నారుఅనేది తెలుసుకోవాలంటే ఈ కథను చదవండి:

"విమల్...డైనింగ్ టేబుల్ మీద చపాతీలు ఉన్నాయి. ఫ్లాస్కులో కాఫీ పోసుంచాను. డాడీ ఏడు గంటలకు వచ్చాస్తారు. అంతవరకు చదువుకుంటూ ఉండు. ఆకలి వేస్తే నువ్వు తినేయి. నాకు ఆఫీసుకు టైమైంది" అని హడావిడి పడుతోంది స్వర్ణ.

"నువ్వు తిన్నావా అమ్మా?"

"లేదు బంగారం. నాకు ఆఫీసుకు టైమైంది. నేను  బయలుదేరుతాను. ఇళ్ళు తాళం వేసుకుని జాగ్రత్తగా ఉండు"

"సరేనమ్మా?"

వేగ వేగంగా రెండు ముద్దలు తినడానికి కూడా సమయం లేక వెలుతున్న అమ్మను చూస్తున్న విమల్ కు చదువుకోవటానికో...తినడానికో ఇష్టం లేకపోయింది.

రాత్రి ఏడు గంటల తరువాత ఇంటికి వచ్చిన విమల్ తండ్రి  ప్రశాద్, "తిన్నావా విమల్...?" అని ఏదో అడగాలని అడిగి, భోజనం చేయకుండా పడుకుండి పోయాడు.

ఎప్పటిలాగానే ప్రొద్దున్నే లేచాడు ప్రశాద్. విమల్ కు నాలుగు ముక్కలు 'బ్రెడ్ టోస్ట్' చేసిచ్చి ఉద్యోగానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నైట్ షిఫ్ట్ కు వెళ్ళిన అమ్మ ఎనిమిది గంటలు దాటితేనే వస్తుంది.

ఇద్దరూ '.టి కంపెనీలలో పని చేస్తున్నారు.

చాలా వరకు ఎవరో ఒకరితోనే విమల్ వలన ఇంట్లో గడపడం జరుగుతుంది. రోజుకూడా తల్లి ఇంటికి రావటానికి ముందే స్కూల్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు విమల్.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఆనందనిలయం….(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి