'హీరో'...(సీరియల్) (PART-3)
ఎప్పుడూ మనం
జీవిస్తున్న తరుణమే
నిజమైనది. ఎలా
జీవిస్తున్నామో
జ్ఞాపకాలలో రిజిస్టర్
అయ్యి...ఉన్న
కాలంగానూ, భవిష్యత్
కాలంగానూ వెడుతుంది.
ఒక్కొక్క క్షణాన్నీ...నిన్న--రేపు
అనే ఆలొచనలు
లేకుండా ఎవరైతే
ఒకరు అనుభవించి
జీవిస్తారో వాళ్ళ
జీవితంలో ముప్పాతిక
భాగం విజయవంతంగానే
ఉంటుంది.
కానీ, అలా
జీవించటానికి జీవితం
వదలదే...?
అశ్విన్ ను చూడటానికి
తన స్కూటర్
మీద బయలుదేరి
వస్తున్న సితారాకి
అడ్డుగా వచ్చి
నిలబడ్డారు ఆ
బిచ్చగాడిలా ఉండే
స్వాములోరు. ఉలిక్కిపడ్డ
సితారా సడన్
గా బ్రేకు
వేసింది. కోపంగా
ఆయన్నే చూసింది.
ఆయన సితారాని
చూసి నవ్వుతూ
“వదలద్దు...వాడ్ని
వదలద్దు...వాడ్ని
అటువైపుకు పోనివ్వకు...” అన్నాడు.
“ఎవర్నీ? ఎటు
పక్కకి...?”
ఆయన నవ్వుతూ
రోడ్డుకు అవతలపక్కకు
వెళ్ళిపోయారు.
ఆమెకు అర్ధం
కాలేదు.
ఆ రోజు
ఆ సినిమా
మొదలవటానికి పూజ.
స్టూడియో స్థలం
చుట్టూ తోరణాలు, అరటి
చెట్లు కట్టి
బ్రహ్మాండమైన అలంకారం
చేసారు. కట్
అవుట్...స్వాగతం
పలికే పువ్వుల
వలయాలుతో ఒకటే
హడావిడిగా ఉంది.
స్టూడియో గేటు
నుండే విపరీతమైన
జనం. అశ్విన్
పూర్తి మేకప్
లో ఒక
కుర్చీలో కూర్చోనుండగా...అతనిపై
కెమేరాల యొక్క
వెలుతురు పడుతూనే
ఉంది.
అతనూ ఏదో
ఒక కొత్త
ప్రపంచంలో దేవ
కుమారుడిలాగా ఫీలవుతూ
కూర్చున్నాడు.
పూజకు అతని
తల్లి-తండ్రీ, సితారా
అంటూ అందరూ
వచ్చి విజిటర్స్
వరుసలో కూర్చున్నారు.
కొద్ది సేపటి
తరువాత ప్రఖ్యాత
గ్లామర్ నటి
ఒకామె వచ్చింది.
పైన రెండు
హ్యాండ్ కర్చీఫ్లతో
జాకెట్టు కుట్టి
వేసుకుంది. గ్రౌండ్
లాగా అలా
ఒక గాలిపడటానికి.
అశ్విన్ ఆమెపై
పెట్టిన చూపులను
మరల్చుకోలేకపోయాడు.
ఆమె దగ్గర
నుండి గుప్పుమని
పెర్ ఫ్యూం
వాసన రావటంతో...నరాలు
జివ్వునలాగినై.
ఆమె ‘హలో’ అన్నది.
అతనూ చెప్పాడు.
ఆమె తల
వెంట్రుకలను జడలాగా
వేసుకోనూ లేదు...ముడీ వేసుకోలేదు.
అలాగే వదిలేసింది.
తల వెంట్రుకలు
గాలికి అప్పుడప్పుడు
ముఖానికి ముందు
పడటం, ఆమె
దాన్ని పక్కకు
తోసి తోసి
వదులుతోంది.
చూడనట్లే చూసాడు
అశ్విన్.
విజిటర్స్ గ్యాలరీ
గుంపులో కూర్చోనున్న
సితారాకి ఆమె
రూపం కళ్ళు
కుట్టింది. వరలక్ష్మికి
నచ్చలేదు.
“సితారా!
ఈమె ఏమిటి
బాత్ రూములో
నుండి అలాగే
వచ్చేసిందా...లేక
ఆమె ఇంట్లో
రిబ్బన్-హార్
పిన్ లాంటివి
లేవా?” అని
అడిగింది.
ఆమె దగ్గరకే
అందరూ వచ్చి
నవ్వి, నవ్వి
మాట్లాడ, ఆమె
వెకిలి నవ్వులు
నవ్వింది. అప్పుడు
చున్నీ పక్కకు
జరుగ ఫోటోగ్రాఫర్లు
ఆ దృశ్యాన్నే
పదే పదే
ఫోటోలు తీసారు.
సితారాకి లేచి
వెళ్ళి ఆమెపై ఒక
దుప్పటి వేసొస్తే
మంచిది అని
అనిపించింది.
ఇంతలో పూజకు
కావలసిన వస్తువుల
ప్లేట్లు రావటంతో...ఇంకొక
జుట్టు విరబోసుకున్న
ఒక జన్మ
‘జీన్స్
ప్యాంటు, టీ
షర్టు’ లో
మైకును చేత
పుచ్చుకుని ఆంగ్ల
భాషలో పూజ
జరగబోతోందని అనౌన్స్
చేసింది.
అందరూ గబ
గబా సర్దుకున్నారు!
ఆ జీన్స్
మాట్లాడింది.
“ఈ
సినిమా ఒక
బ్రహ్మాండమైన ప్రయత్నం.
చాలా ప్రత్యేకంగా
-- వయసులో ఉన్న, కొత్తగా
ఉన్నఒక యంగ్ మ్యాన్ తో,
కొత్త కథతో...ఇంతవరకు
ఎవరూ తీయని
విధంగా తీసే
ప్రయత్నం. కొత్త
‘హీరో’ అశ్విన్
నటించబోతారు. ఈయన
ఈ సినిమాలో
నటించటాని కోసం
అమెరికా నుండి
ఆంధ్రప్రదేశ్ కు
వచ్చారని నిర్మాత
చెప్పారు. హీరోయిన్
కూడా మీ
ఊరు కాదు...నార్త్
ఇండియా. మొత్తానికి
ఇది ఒక
యువ జాతరగా
ఉండబోతుంది. అందులో
సందేహమే లేదు...” అన్నది.
సితారా నోరు
వెళ్ళబెట్టింది.
వరలక్ష్మిని చూసి, “అత్తయ్యా!
ఏమిటీ భయంకరమైన
అబద్దం. మీ
అబ్బాయి హైదరాబాదులోనే
చాలా చోట్లను
చూడలేదు. ఇందులో
ఈ మనిషి
అమెరికా నుండి వచ్చాడని
వాగి పారేస్తోందే...” అన్నది.
“సినిమా
అంటే కల్పన
అని, అబద్దం
అని విన్నానే.
కానీ ఇంత
భయంకర అబద్దంగా
ఉండటాన్ని ఇప్పుడే
చూస్తున్నా” అన్నది.
రఘుపతి గారు లేచారు.
“ఏమిటండి...”
“నేను
బయలుదేరుతాను వరలక్ష్మీ...”
“ఎక్కడికి...?”
“ఇంటికే...నేను
ఇక్కడుంటే తరువాత
ఏదైనా గొడవ
చేసేస్తాను. వస్తాను...”
ఆయన మౌనంగా
నడిచారు.
వరలక్ష్మీ ఆయన్ని
ఆపలేకపోయింది. సితారాని
చూసింది.
“మావయ్య
వెళ్లటం ఒక
విధంగా మంచిదే” అన్న సితారా
“పూజ
చూడండి...” అన్నది.
శాస్త్రులు ఒకరు
‘క్లాప్’ చెక్క, ఫిల్మ్
కెమేరా, స్క్రిప్ట్
ఫైలు అన్నిటినీ
పెట్టి పూజ
చేయటానికి రెడీగా
ఉన్నారు. పెద్ద
గుమ్మడి కాయ, కొబ్బరి
కాయలూ అంటూ
ఆయన చుట్టూ
అవి పట్టుకుని
నిలబడ్డారు.
ఫోటోగ్రాఫర్ల గుంపు
ఎక్కువ అయ్యింది.
అందరికీ ఆ
నటే గ్లామర్
పాయింటుగా ఉన్నది.
అప్పుడప్పుడు అశ్విన్
తో నవ్వుతూ
మాట్లాడి అతనికి
వేడెక్కించింది.
మధ్యలో కర్పూరం
ప్లేటు వచ్చింది.
కళ్ళకు అద్దుకున్నారు.
పండ్లు వచ్చినై.
ఒక ముక్క
తీసుకుని నోట్లో
వేసుకున్నారు.
భ్రమ పట్టినట్టు
చూస్తూనే ఉన్నాడు
అశ్విన్.
పూజలోని ఒక
అంశంగా, ప్రైవేట్
టీ.వీ
ఛానల్ వారు
అశ్విన్ ముందు
మైకు జాపి, “ఈ
సినిమాలో మీ
రోల్ ఏమిటి?” అని
అడిగారు.
“ఇందులో
‘హీరో’ గా
చేస్తున్నాను. ఇది
ఒక ప్రేమ
కథ. నేను
మొదట్లో ఒక
పేద అమ్మాయిని
లవ్ చేస్తాను.
అప్పుడు నేనూ
పేదవాడినే. సంధర్భం
రావటంతో ఒక
పెద్ద డబ్బుగల
వాడిని అవుతాను.
డబ్బు రావటంతో
నా గుణం
మారిపోతుంది. డబ్బుగల
అమ్మాయిని పెళ్ళి
చేసుకుంటాను. అందువలన
ప్రేమించిన పేద
కుటుంబ అమ్మాయి
మనసు విరిగి
ఆత్మహత్య చేసుకుంటుంది.
ఆమె కళ్ళూ, మిగిలిన
అవయవాలు నేను
పెళ్ళి చేసుకోబోతున్న
అమ్మాయికి తరువాత
అమర్చటంతో నా
భార్య నా
పాత ప్రేమికురాలుగానే
ఉండటమే కథ.
క్లైమాక్స్ ఎవరూ
కొంచం కూడా
ఊహించలేరు...”
అశ్విన్ ఏదో
వంద సినిమాలలో
నటించిన వాడిలాగా
మాట్లాడుతూనే ఉన్నాడు.
సితారా అలాగే
మాయలో ఉండిపోయింది.
ఇల్లు!
వరాండాలోని ఈజీ
చైర్లో పడుకున్నట్టే
కనిపించారు రఘుపతి.
లోపల వరలక్ష్మి
పడుకోనుంది. ‘డైనింగ్
టేబుల్’ మీద
డిన్నర్ తయారుగా
ఉండటంతో...దగ్గర
కూర్చుని ఒక
నవలను చదువుతూ
ఆవలింతలతో అవస్థపడుతోంది
సితారా.
టేబుల్ పైన
ఒక కవరు
ఉంది! దాని
మీద ప్రభుత్వ
ముద్ర. అశ్విన్
పేరు మీద
వచ్చింది. నిశ్శబ్ధంగా
ఉన్న ఆ
ఇంట్లో గోడ
గడియారం పెండులం
శబ్ధం మాత్రం
క్షుణ్ణంగా వినబడుతోంది.
నిశ్శబ్ధాన్ని
డిస్టర్బ్ చేసింది
కారు హారన్
శబ్ధం. దిగింది
అశ్విన్! ‘ప్రొడక్షన్
మేనేజర్’ కొంచంగా
అతని చెయ్యి
పుచ్చుకుని ఇంటి
గుమ్మం దాకా
వచ్చి విడిచిపెట్టి
వెళ్ళాడు. ఆ
తరువాత ఉగిపోకుండా
-- తూలిపోకుండా నడవటానికి
ప్రయత్నించి తడబడ్డాడు
అశ్విన్.
రఘుపతి చూడగా, సితారానూ
అతన్ని గమనించింది.
అశ్విన్ తాగున్నాడు!
అడిగితే...’పార్టీలో
బలవంతంగా తాగించారు’ అంటాడు.
అందుకని సితారా
ఏమీ అడగలేదు.
రఘుపతి గారు మాత్రం
బాధతో అరిచారు.
“ఏమిట్రా
ఈ తూలుడు...మందు
కొట్టావా?”
“అదొచ్చి
నాన్నా...”
“తెలుసురా...తెలుసు.
నువ్వేం చెప్పబోతావో
బాగానే తెలుసు.
సినిమా అంటే
తాగాలనే బలవంతం
ఏమీ లేదురా.
మా కాలంలో
ఎన్.టి.ఆర్
దాన్ని చేత్తోనే
ముట్టుకోలేదు...”
“సారీ
డాడ్...”
“నీ
బొంద. నీ
ప్రారంభమే సరిలేదురా...”
-- భయంకరంగా
అరిచారు రఘుపతి
గారు. పరిగెత్తుకు
వెళ్ళి ఆయన
నోరు మూసింది
సితారా.
“మావయ్యా!
వదలండి...అంతా
సరైపోతుంది...”
“ఏమిటి
సరిపోయేది? వీడ్ని
ఈ గవర్నమెంట్
ఉద్యోగానికి వెళ్ళమని
చెప్పు. ఆ
సినిమానూ వద్దు, వాడి
బొందా వద్దు...”
“ఏ
గవర్నమెంటు ఉద్యోగం?”
అతని నాలిక
తడబడింది. డైనింగ్
టేబుల్ మీద
ఉన్న కవర్ను
తీసుకు వచ్చింది
సితారా. మౌనంగా
కవర్ను ఓపన్
చేసి అందులోని
కాగితాన్ని అతని
ముందు జాపింది.
“ఆయిల్
అండ్ న్యాచురల్
గ్యాస్ కంపెనీలో
ఆఫీసర్ ఉద్యోగం...” అన్నది చిన్న
స్వరంతో.
“జీతం?”
“నలభై
వేలు...”
“నువ్వూరుకో
సితారా...నేను
ఈ సినిమాను
ముగించి ఇది
వంద రోజులు
ఆడితే నా
ఒకరోజు జీతం
ఇది...”
“సరే...పొద్దున్నే
మాట్లాడుకోవచ్చు.
డిన్నర్ కు
రండి...”
“నొవ్వొక
దానివి...పార్టీలో
బాగా తినేసి
వచ్చాను. ఇప్పుడు
నేను పడుకోవాలి.
తరువాత...రేపట్నుంచే
షూటింగ్. ఇక్కడ
ఒకరోజే. ఆ
తరువాత ఒకనెల
రోజులు అమెరికా
లోనట...” అశ్విన్ చెబుతూనే
తూలేడు.
సితారాకి మనసు
కొంచం చివుక్కుమంది.
వరలక్ష్మీ కూడా
లేచొచ్చి అశ్విన్
తూలుతూ నడవడాన్ని
చూసింది.
ఆమె కళ్ళు
చెమర్చినై.
తన కొడుకు
సినిమా హీరో
అవబోతున్నాడని
కొందరి దగ్గర
గొప్పగా చెప్పుకున్నప్పుడు
వాళ్ళు ఒకలాగా
చూసారు. దాని
అర్ధం ఇప్పుడు
తెలిసింది.
“ఎక్కడైనా
మనం నడుచుకునే
విధం అని
ఒకటుంది. నా
కొడుకు అతనిలాగా ఒక
నటుడు ఉండడని
పేరు తెచ్చుకుంటాడు.
మీరు కావాలంటే
చూడండి. ఎందుకంటే
నేను వాడ్ని
అలా పెంచాను...” అని చెప్పిందంతా
ఆమె ముందు, చేతిలో
ఒక సీసాతో
వచ్చి నిలబడినట్లు
అనిపించింది.
సితారా తెలివిగలది!
ఎక్కువసేపు అశ్విన్
ని డైనింగ్
టేబుల్ దగ్గర
కూర్చోబెట్టకుండా, బెడ్
రూముకు లాక్కెళ్ళింది.
హక్కుతో చొక్కా
విప్పడం మొదలుపెట్టింది.
అదే హక్కుతో
ప్యాంటు బటన్ల
మీద చైపెట్టింది.
అతను కొంచం
సిగ్గు పడ్డాడు.
“పరవాలేదే.
మత్తులో ఉన్నా
సిగ్గుపడటం మరిచిపోలేదే” అంటూ అతన్ని
పరుపు మీదకు
తోసి, ప్యాంటును
లాగింది. తరువాత
పక్కనున్న అలమరాలో
నుండి లుంగీ
ఒకటి తీసి
పడేసింది. అతనే
శ్రమపడి అది
కట్టుకున్నాడు.
“టాంక్యూ
సిటారా...చాలా
టాంక్స్. స్వీట్
కిస్సస్ టు
యు. సెట్టులో
ఉన్న అందరు
నటీమణులూ ఈ
రోజు నాకు
ముద్దులు పెట్టారు.
అందులో బాలమనోహరి
యొక్క ముద్దులో
ఒక జలదరింపు...పెదాలకు
ఆమె ‘మెంతాల్
లిప్స్ టిక్’ పూసుకుందట...” అన్న అతను
అలాగే దొర్లి
అటు తిరిగి
పడుకున్నాడు.
మొదటి రోజే
ముద్దుల కథ
గురించి చెప్పాసాడు.
రేపు మళ్ళీ
ఏదో చురక.
ఇతను చివరి
వరకు ఆగుతాడా?
Continued...PART-4
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి