7, అక్టోబర్ 2022, శుక్రవారం

ప్రేమకు సహాయం...( పూర్తి నవల)

 

                                                                               ప్రేమకు సహాయం                                                                                                                                                                            (పూర్తి నవల)

"యుక్త వయస్సులో, ఉడుకు రక్తం పొగరుతోనూ - మోహంతోనూ, మాక్సిమం పదిహేనేళ్ళ వయసు నుండి ముప్పై ఏళ్ల వయసు లోపల వచ్చి వెళ్ళే ప్రత్యేక కామమే ప్రేమ!

ఒక మగవాడికి ఏర్పడి, అదే లాగా ఒక ఆడదానికీ ఏర్పడేటప్పుడే ఇద్దరూ ఆకర్షితులై దగ్గరవుతారు. అలా ఆకర్షితులైన వారికి తల్లి-తండ్రులు, ఊరు, ప్రపంచం, తోబుట్టువులు, బంధువులూ అందరూ దూళి లాగా మారిపోతారు.

ప్రేమ అనేది ఎంతపెద్ద ప్రమాదమైన విషయమో అప్పుడే నాకు అర్ధమయ్యింది.

జీవితంలోకి దిగి జీవించటం ప్రారంభించినప్పుడే రంగు అంతా వెలిసిపోవటం మొదలవుతుంది!  అందంగా మేకప్ చేసుకుని, పరస్పరం ఏమార్చుకున్నది పగిలి ముక్కలై,

అందవికారాన్ని కలుసుకున్నప్పుడే యధార్ధం అర్ధమవుతొంది. ఇప్పడు భారానికి చేయూత నివ్వడానికి చుట్టూ ఎవరూ లేరు. చుట్టు పక్కల ఉన్నవాళ్ళు కూడా ప్రేమికులను ద్రొహులుగానే చూసే ఒక పరిస్థితి.

ప్రేమనేది పెళ్ళి తరువాత భార్య దగ్గరే జరగాలి.

పెళ్ళికి ముందు ఒకరికి ఏర్పడితే...అది పాపం తోనే చేరుతుంది! పాపాత్ములకు మాత్రమే ప్రేమ వస్తుంది. వాళ్ళువాళ్ళు కష్టపడుతూ, తమ కుటుంబాన్ని కష్టపెట్టి, తమ పిల్లలనూ కష్టపెడతారు.

పెళ్ళి తరువాత వస్తే అది తేనె. పెళ్ళికి ముందు వస్తే అది సందేహం  లేదు...విషం

ప్రేమించ కుండా ఉండటమే తెలివిగలతనం"

అంటూ తన కూతురి స్కూల్ టీచర్ కు హితబోద చేసిన నవల హీరో, చివరకు టీచర్ ప్రేమ విజయం చెందటానికి సహాయం చేస్తాడు.........అతను చేసిన పనికి టీచర్ ఆశ్చర్యపోతుంది. ఎవరూ ఊహించని పని హీరో చేసి టీచర్ను ఆమె ప్రేమికుడితో కలుపుతాడు.

హీరో చేసిన పనేమిటి? ఎలా టీచర్ కు సహాయపడ్డాడు? ప్రేమను వ్యతిరేకించిన హీరో ఎందుకు ఆమె ప్రేమకు సహాయం చేశాడు?... నవల చదివి తెలుసుకోండి:

ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమకు సహాయం...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

*************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి