14, అక్టోబర్ 2022, శుక్రవారం

'హీరో'...(సీరియల్)...(PART-7)

 

                                                                                        'హీరో'...(సీరియల్)                                                                                                                                                                             (PART-7)

మనసునూ,ఆకాశాన్నీ ఎప్పుడూ ఒకటనే చెబుతారు. ఆకాశంలో ఉండటానికి ఎటువంటి నిషేధమూ లేదు. పొడువు-వెడల్పు-ఎత్తూ లేదు. మనసు కూడా అంతే. అదికూడా ఎన్ని ఆలొచనలనైనా సరే తనలో ఉంచుకోగలదు.

ఒక క్షణసమయం లోపే ప్రపంచంలో మూలలోనైనా ఉన్నట్టు కల్పన చేసుకోవటం కుదురుతుంది. అందువలనే ఎవరి మనసులో ఏముందో ఎప్పుడూ అర్ధంకాని పజిల్ గానే ఉంటుంది.

సత్యమూర్తి గారూ మరియు రాజేశ్వరి మనో భారంతో బయటకు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉన్నాడు బిచ్చగాడిలాగా ఉండే సన్యాసి. ఆయనకి అశ్విన్ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద ఉన్న స్థలమే కూర్చునే పీఠం. ఆయన్ని చూడటానికి ఎవరెవరో వస్తూ ఉంటారు. కానీ, ఆయన ఎవరినీ తిరిగి కూడా చూడరు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడరు.

రఘుపతికీ, వరలక్ష్మికీ ఆయన వాలకం మాత్రమే కలత పెట్టే విషయం. అంతకు తప్ప, ఆయన వచ్చిన దగ్గర నుండి అన్నీ మంచిపనులే జరుగుతున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు.

సరికొత్త సూట్ కేసులో బట్టలను నొక్కిపెట్టి, నిర్మాత పంపిన కారు డిక్కీలో సూట్ కేసును పెట్టించి, తానూ కారు ఎక్కాడు అశ్విన్. గుమ్మం దగ్గర నిలబడున్న రఘుపతి ని, వరలక్ష్మి ని ఒక సారి చూసాడు.

ఒక్కడే కొడుకు!

మొదటి సారిగా విదేశాలకు వెళుతున్నాడు.

ఎవరి తోడు అవసరం లేదని చెప్పాడు.

వరలక్ష్మి చివరి వరకు ప్రయత్నించిది.

నేనేమీ చిన్న పిల్లాడ్ని కాను. నేనే చూసుకుంటా అని చెప్పాడు. ఆమె మొహంలో కొడుకును విడిపోతున్నామే అన్న శోకం. రఘుపతి గారు విపరీతమైన విసుగులో ఉన్నందువలన ఆయన మొహంలో కోపం మాత్రమే ఉంది.

కారులో ఎక్కి కూర్చున్న అశ్విన్ దిగి, వాళ్ళ దగ్గరకు వచ్చాడు. సంప్రదాయంగా కాళ్ళు ముట్టుకున్నాడు. వెళ్ళోస్తానమ్మా... వెళ్ళొస్తా నాన్నా... అని చెప్పి బయలుదేరాడు.

కొన్ని అడుగులు ముందుకు వేసిన అతను ఎందుకనో ఆగాడు. తిరిగి వచ్చాడు. ఇద్దరినీ ఒకసారి లోతుగా చూసిన అతను గొంతు సవరించుకుని, “అమ్మా... నిర్మాత తీయబోయే తరువాతి సినిమాలోనూ నేనే హీరోను.

కంటిన్యూ గా నాకు షూటింగ్ ఉంది. రెస్టే లేదు. ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోవటం నిర్మాతకు నచ్చలేదు...సినిమా రంగంలో పెళ్ళి అవటమనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ ఏర్పరిచే విషయం. అందువలన పెళ్ళి చేసుకోవటాన్ని కొన్ని సంవత్సరాలు వాయిదా వెయ్యి అని చెప్పారు.

కానీ, నేను పెళ్ళే వద్దు అనే  నిర్ణయానికి వచ్చాసాను. మావయ్య దగ్గరచెప్పి సితారాకి ఇంకొక చోట సంబంధం చూసుకోమని చెప్పండి. నా కోసరం ఆమె కాచుకోవద్దు... అని ఒక విధమైన కంగారుతో చెప్పిన అశ్విన్ గబగబా నడుచుకుంటూ వెళ్ళి కారులో ఎక్కి కూర్చున్నాడు...కారు బయలుదేరింది.

వరలక్ష్మీ, రఘుపతీ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని బిత్తర పోయారు. తరువాత....

ఏమండీ వాడు నిర్ణయమే చేసేసాడే

మనసులోనే దాచుకోకుండా బయటకు చెప్పాడే! దానికి పెళ్ళి అయ్యి, వీడి భార్యగా సితారా ఉండుంటే ఏం జరిగుండేది? విడాకులు ఇవ్వబోతాను అని మాట్లాడటం మొదలు పెట్టుంటాడు. మంచి కాలం సితారాకి మంచి జాతకం. తప్పించుకుంది...

అయ్యో...మా అన్నయ్య ఇప్పుడు కూడా నమ్మకంగా మాట్లాడి వెళ్ళాడే...?”

ఇక మీదట మట్లాడవద్దని చెప్పు...నువ్వేంటి చెప్పేది నేనే చెబుతాను

రఘుపతి గారు ఫోను వైపు నడిచారు. పెదవులపై ఉగ్రమైన గొణుగుడు.

ఆయన ఫోను దగ్గరకు వెళ్ళేటప్పుడు, అది మోగటం మొదలైయ్యింది. చేతిలోకి తీసుకున్నారు. హలోఅన్నారు.

మావయ్యా! నేను సితారా మాట్లాడుతున్నాను.  ఆయన బయలుదేరేరా...?”

బయలుదేరి వెళ్ళేడమ్మా. వెళ్ళేటప్పుడు నీకు ఒక విషయం చెప్పి వెళ్ళాడు

అలాగా మావయ్యా! నాకు తెలుసు. ఏమిటీ...అన్నిటికీ సారీచెప్పమన్నారనుకుంటా? కానీ నేను దేనినీ మనసులో పెట్టుకోలేదు. దానికంత అవసరం లేదని చెప్పాలి...ఎందుకంటే...నేను మూడో మనిషిని కాదే...

వాడు చెప్పింది ఏమిటి అనేది తెలుసుకోకుండా, నువ్వుగా ఇలా ఆశగా మాట్లాడితే ఎలాగమ్మా...? అవును, మీ నాన్న ఇంటికి వచ్చాడా?”

లేదే...

సరే. వస్తే నాకు ఫోను చేయమని చెప్పు

చెబుతాను. ఆయన ఏదో చెప్పారని చెప్పారే...అది?”

నేను చెప్పేస్తాను. చెప్పే తీరాలి. కానీ నువ్వు తట్టుకోగలవా?”

అలాగంటే?”

నావరకు అదొక మంచి విషయమే. కానీ నీకు షాకుగా ఉంటుంది...

విషయం చెప్పండి మావయ్యా

చెప్తాను. అంతా నా తలరాత. నీ పెళ్ళి నిశ్చయ తాంబూలాలకు ఎటువంటి అర్ధమూ లేకుండా పోయింది. ఫోటో ఆల్బం -- సీ.డీ. అన్నిటినీ పారేసి తగలబెట్టు. నిన్ను ఇంకొకర్ని పెళ్ళి చేసుకోమని చెప్పాడు. ఆయన గారు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోబోయేది లేదట...

మావయ్యా...

"నాకు తెలుసు నువ్వు బాధపడతావని. బాధ పడు. ఏడవాలి అనిపిస్తే ఏడ్చేయి. నేను ఏమీ చెయ్యలేను? ఒక విధంగా నా కొడుకును అభినందిస్తున్నాను. ఏదో ఒక ముగింపుకు వచ్చి కట్ అండ్ రైట్ గా చెప్పాడే...అంత వరకు సంతోషం...

ఆయన మాట్లాడుతున్నప్పుడే అవతల పక్క కనెక్షన్ కట్ చేసింది సితారా. దాన్ని ఆయన ఎదురు చూసిన వాడిలాగా పిచ్చి పిల్ల. ఇకమీదట చిన్న వయసు నుండే నీకు అతను -- వాడికి నువ్వుఅని చెప్పి చెప్పి పెంచే విధానాన్ని అన్ని కుటుంబాలూ వదిలి పెట్టాలి. ఏదో సమయానికి గోక్కునే లాగా ఏదో ఒకటి ఇలా మాట్లాడి పెట్టేస్తున్నాము. కానీ అది తరువాత విపరీతంగా పని చేసేటప్పుడు ఎవరు తట్టుకోగలరు...?”  అనుకుంటూ తనలో తానే మాట్లాడుకున్నారు.

వరలక్ష్మి అలాగంతా గొనుక్కోలేదు. కాని, భర్త చెప్పింది కరెక్టేనని అనుకుంది.

విమానశ్రయం!

లోహానికి రెక్కలు పెట్టే చోటు...మనిషి బుర్రకు ఎంత శక్తి ఉన్నదో ఇక్కడికొస్తే తెలుసుకోవచ్చు. అలాగే, శ్రమకు ఆకాశం కూడా హద్దుకాదు అనేది చెప్పేది కూడా ఇదే చోటు.

మహాలక్ష్మిని కవులుకు తీసుకున్న వాళ్ళు -- మహాలక్ష్మిని లాగి పట్టుకుని తాళం వేసి ఉంచుకున్న వాళ్ళూ-- అందరూ సరళంగా వచ్చి వెళ్ళే చోటు అది. రిసెప్షన్ అని రాసున్న చోట అశ్విన్ కూర్చోనున్నాడు. అతనితో పాటూ సినిమా కోసం పనిచేసే ముఖ్య వ్యక్తులు కొందరు ఉన్నారు.

గ్లామర్ డ్రస్సుతో విమానాశ్రయంలోని ఉద్యోగస్తులను, వస్తున్న, వెళ్తున్న ప్రయాణీకులను తన దుస్తుల అలంకార ఆకర్షణతో తనవైపు తిప్పుకుంటున్న నటి ఒకత్తి  అశ్విన్ పక్కనే కూర్చుని అతనితో నవ్వి నవ్వి మాట్లాడుతోంది.

అల్లుడూ... షర్మీలా మ్యాడం ను గమనించావా... అశ్విన్ కొత్త మనిషి. భవిష్యత్తులో అతనికి విపరీతమైన మార్కెట్ ఉంటుందని లెక్క వేసుకుని ఇప్పుడే వల విసురుతోంది... -- అసిస్టంట్ డైరెక్టర్ ఒకరు తన మనసులో ఉన్నది చెప్పాడు.

బండి నడవాలి కదా...లేకపోతే ఏడు సంవత్సరాలుగా సినిమా చాన్స్ లు లేకున్నా అంత డబ్బు పోగుచేయ గలిగేదా?”

అది సరే... కుర్రాడు ఒక రౌండు కొడతాడని నమ్ముతున్నావా?”

కాలంలో ఎవరి గురించీ ఏదీ చెప్పలేం. తమిళనాట ఒకాయన ముప్పై ఏళ్ళు నిలబడలా?”

ఎవర్ని చెబుతున్నావనేది తెలియటం లేదు... కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు...స్వరం లేకపోయినా డబ్బింగ్ వాయిస్’, ఫైటుకు డూపు, డాన్స్ తెలియకపోతే వ్యాయామం, కెమేరామ్యాన్ దయతో కొన్ని యాంగిల్స్ మాత్రమే నవ్వే సెటప్. మ్యాకప్ మ్యాన్ దయవలన అమ్మోరి మచ్చలను కూడా, మూసి ఉంచే రంగులు కూడా ఉన్నాయే...

అయితే ఎవరూ ఒక నటుడుగా ఉండక్కర్లేదు. ఒక మంచి శరీరం, అందులో ప్రాణం ఉంటే అదే చాలూ అంటావా?”

అలా అయిపోయిందే...ఎన్.టి.ఆర్. లాగా ప్రాణమిచ్చి నటించే వారు ఎవరున్నారు?”

అలాగంతా జనరలైజ్ చేసి మాట్లాడకు...తరువాత నీ పని గోవిందా. రోజు అన్ని రంగాలలోనూ పోటీ. కాలంలోలాగా కొట్టేసి -- ఫైట్ చేసేదని చెప్పలేరు. నిజంగానే కొట్టుకోవాలి... అని వాళ్ళిద్దరూ మారి మారి మాట్లాడుకుంటుంటే ఒక విషయం ఖాయం అయ్యింది.

అశ్విన్ వాళ్ళను బాగా బాధించటం మొదలు పెట్టాడని.

వీడు కనుక ప్రభలమైతే తరువాత చాలా కష్టమవుతుందప్పా. ఇంకా మొదటి సినిమా షూటింగ్ కూడా మొదలవలేదు. కానీ, ఈలోపే ఇంటర్వ్యూ అనే పేరుతో అతను చెప్పిన డూప్స్ చూసావా?”

అదీ చూసాను. దాన్ని కూడా లక్ష్యం చేయకుండా ఉండే మన నిర్మాతనూ చూసాను! నాకేమో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లాగా కనబడుతోంది. పత్రిక వాళ్ళ వరకు మంచిగా రాయించటమే కష్టం. గుస గుసలు రాయించటం పెద్ద విషయమే కాదు...?”

వాళ్ళల్లో కొంతమంది మరీ మోసం. లోకంలో ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు. అవన్నీ వదిలేస్తారు. ఒక సినిమా వాడు వీపు గోక్కోవటంలో కూడా వెనుక ఏదో రహస్యం ఉంది అని ఏదేదో రాసేస్తారు...అది ఎందుకలా...?”

ఏమిటి నువ్వు...పిచ్చి పిచ్చిగా ప్రశ్నలు అడుగుతున్నావు...? ఎవరో ఒక రామస్వామి ఏదో ఒకటి చేసేడే అనుకో. దాన్ని అలాగే రాస్తే ఎవరు రామస్వామి అని మొదట్లో అడుగుతారు. తరువాతే విషయానికే వస్తారు. కానీ, ఒక నటుడు చేస్తే ...అతనా?’ అని నేరుగా విషయానికే వస్తారు. పత్రిక వాళ్ళకు బాగా తెలుసు స్వామీ...మనం మాత్రం ఏం పెద్ద యోగ్యులమా? షూటింగులో మనం ఎన్ని అవకతవక పనులు చేస్తున్నాం?” -- వాళ్ళు పలు విషయాలు మాట్లాడి అలిసిపోయారు.

విమానం ఆలస్యంగా వస్తోందని తెలిసింది. దూరంగా ఒక గాజు అడ్డు పలక అవతల డైరెక్టరూ -- నిర్మాత మాట్లాడుకుంటున్నారు.

అసిస్టంట్ డైరెక్టర్ మాటలకు మధ్య...సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా అని చూడటానికి వెను తిరిగినప్పుడు -- అతని కళ్ళకు కాంతిలాగా కనబడింది సితారా.

శోకంగా నిలబడి, అశ్విన్ నే చూస్తూ ఉన్నది. అక్కడ్నుంచి పిలిచినా అశ్విన్ చెవిలో పడదు. పిలవటానికి సంధర్భం కూడా దొరక లేదు. అందువల్ల ఏం చేయాలో తెలియక అవస్తపడుతోంది. అది చూసిన అసిస్టంట్ డైరెక్టర్ కు సితారా ని చూస్తే పాపం అనిపించింది. మెల్లగా లేచి అశ్విన్ దగ్గరకు వెళ్లి అతని ఏకాగ్రతను చెరిపి, సితారా వైపు చెయ్యి చూపించాడు.

అశ్విన్ కి కాస్త చిరాకు అనిపించింది.

నటి కూడా చూసింది. అశ్విన్ నటి దగ్గర చెప్పేసి సితారా వైపుకు మెల్లగా నడిచి వెళ్ళాడు. ఆమె దగ్గరకు వెళ్ళిన అతను ఆమె కళ్ళల్లో కన్నీటి బొట్లు చూసాడు. అతను చూస్తున్నప్పుడు ఆమె రెండు కళ్ళలో నుంచి రెండు బొట్లు, కొండమీద నుండి దూకినట్టు కిందపడి దొర్లినై.

ఏమిటి సితారా! ఇక్కడకొచ్చి ఏడ్చి గోలచేసి సీన్క్రియేట్ చెయ్యబోతావా? ఎవర్నీ రావద్దని నేను చెప్పానే...?”

అతని ప్రారంభమే ఆమె వరకు బాణంలా గుచ్చుకుంది.

అశ్విన్...ఏమైంది! నీకేమైంది? ఒక కాళ్ళ జర్రిని కూడా కొట్టి చంపాలనే నీకు అనిపించదే. దాని వలన మనిషికీ బాధింపు లేదు దాన్నెందుకు భయపడి చంపటంఅంటూ దాన్ని అలాగే వదిలేసిన వారు మీరు...

ఇదిగో చూడూ...ఇప్పుడు కూడా నేను అటువంటి వాడినే. ఇప్పుడెందుకు కాళ్ళజెర్రి కథ...అది చెప్పు

నేను ఒక తప్పూ చేయలేదే...చేయని తప్పుకు నాకెందుకు ఇంత పెద్ద శిక్ష?”

శిక్షా...ఏమిటి వాగుతున్నావు?”

మరి...జరిగిన నిశ్చయ తాంబూలాలను లేదని చేస్తే దానికి అర్ధమేమిటి?”

ఇదిగో చూడు...నేను సంతోషంగా విదేశాలకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. ఇలా నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ప్రశాంతతను చెడపకు. నీ ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం చెబుతాను.

నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డ అశ్విన్ వేరు...ఇప్పుడున్న అశ్విన్ వేరు. అశ్విన్ హీరోకాదు. సాధారణ యువకుడు. కానీ ఇప్పుడు అలా కాదు!  ఇప్పుడున్న అశ్విన్ ఒక హీరో. నాకు చాలా విషయాలు అవసరమవుతున్నాయి. అందులో ఒకటి ఇమేజ్’. పెళ్ళి చేసుకుంటే అది వేరే విధంగా అయిపోతుంది. ఇది అర్ధం చేసుకుని నా నుంచి తొలగిపో... 

అశ్విన్...ఇదే నీకు ఆటంకమైతే, నేను కాచుకోనుంటానే...?”

అది సరే... పాపాన్ని గంగలో స్నానం చేసి పోగొట్టుకోను?”

అశ్విన్...కాచుకోవటంలో నాకు ఎటువంటి విచరమూ లేదు...

నాజూకుగా చెప్పి చూసాను. నీకు అర్ధం కాలేదు. ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నాను...విను. నేనొక హీరో’. నువ్వు ఒక సాధారణ ఆడదానివి. హీరోకి హీరోయిన్నే సరైన జోడిగా ఉండగలదు. అదిగో కనబడుతోందే... షర్మీలా! ఆమెలాంటిదని పెట్టుకో... అంటూ షర్మీలా ని ఆమెకు చూపించాడు.

సితారా కి మొదటిసారిగా ముల్లు గుచ్చుకున్నట్టు చురుక్కు మన్నది.

అతని దగ్గర ఒక హేలన నవ్వు.

చూస్తున్న అసిస్టంట్ డైరెక్టర్లలో ఒకరు రావడంతో, అతని వైపుకు తిరిగాడు.

ఆమె స్థానువులా అయిపోయింది.

                                                                                                  Continued...PART-8

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి