'హీరో'...(సీరియల్) (PART-6)
జీవితంలో రేపు
ఏం జరగబోతోందో
అనేది ముందే
తెలిసిపోకూడదు.
అలా తెలిసిపోతే
జీవితంలో స్వారస్యమే
ఉండదు. దీని
వలనే భవిష్యత్తు
అనేది దాచిపెట్టబడింది.
అయినా కానీ
కొందరు దాన్ని
తెలుసుకోవాలని
తహతహ లాడుతున్నారు.
సితారా ‘బాల్కనీలో’ కొచ్చి
కూర్చుని వీధివైపు
చూస్తున్నప్పుడు
ఆ స్వామీజీ, వీధిలో
కనబడ్డాడు.
“పోయింది...అంతా
పోయింది. విధిని
గెలవటం ఎవరి
వల్ల కుదురుతుంది? ఎవరి
వళ్ళా కాదు” అన్నారు.
సితారా ఓర్చుకోలేక
పోయింది.
‘ఎవరు
నువ్వు...ఎందుకు
నాకిలా షాక్
ఇస్తున్నావు?’ అని
అడగాలనే వేగంతో
బాల్కనీ వదలి
కిందకు వచ్చింది.
కానీ, ఆ
స్వామీజీ కనబడ
లేదు.
సత్యమూర్తి గారు, రాజేశ్వరీ
చేతి నిండుగా
పూలగుత్తి, స్వీట్
బాక్స్, పండ్ల
బుట్ట తో
గొప్పగా వెళ్ళి
అశ్విన్ ఇంట్లో నిలబడ్డారు.
“అల్లుడు
అశ్విన్ ఎక్కడ?”
“పైనే
ఉన్నాడు...ఇవన్నీ
ఏమిటి...?”
“చూస్తే
తెలియటం లేదా...ఇది
బొకే! ఇది
స్వీట్స్! ఇది
రాయల్ ఆపిల్!..”
“అదిసరే.
ఆపిల్ పండ్లు
ఉన్నది చెక్క
బుట్టలో, బొకే
పాలితిన్ కవర్లో, స్వీట్లు
అట్టపెట్టెలో ఉన్నాయని
వాటిని కూడా
కలిపి చెప్పుండచ్చు
కదా?”
“సరే...చెబుతాను.
వినండి అల్లుడూ…”
“చాలు
సత్యమూర్తి! ఎందుకు
ఇలా నడుచుకుంటున్నావు...? మేమేమన్నా
పరాయి వ్యక్తులమా?”
“రఘుపతీ... సితారా ఒక
తప్పూ చేయలేదు.
ఇంకా చెప్పాలంటే
పత్రికల వాళ్ళ
దగ్గర తప్పుగా
నడుచుకోకూడదని, అల్లుడ్ని
కాపాడాలనే అక్కడికి
వెళ్ళి వాళ్ళను
చూసింది. కానీ, ఏం
జరిగింది? సితారా
ఒక నేరస్తురాలిగా
శిలువను మోస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో
నేను నా
చెల్లెలు ఇంటికి
వెళ్తునట్టుగా
చెప్పేసి వచ్చి
-- దానికీ అక్షింతలు
వేయించుకోవాలా...?” సత్యమూర్తి
అడిగిన ప్రశ్నలోని
న్యాయం రఘుపతి
గారిని కట్టి
పడేసింది. వరలక్ష్మి కళ్ళు
చెమర్చాయి.
“అన్నయ్యా...వాడు
చాలా మంచివాడు.
ఎప్పుడు ఈ
‘హీరో’ చాన్స్
వచ్చిందో -- అప్పట్నుంచే
మారాడు. ఎవరూ
ఎదురు చూడనంత
ఒక మార్పు.
ఎప్పుడు చూడు
గదిలోకి వెళ్ళి
తలుపులు మూసుకుంటాడు.
తినడం లేదు.
ఎప్పుడూ మేకప్...మాకే
ఏమీ అర్ధం
కాలేదు...” అన్నది విరక్తిగా.
“మీరు
మారలేదు కదా...అది
చాలు నాకు!
మా అమ్మాయికి
మీ ఆదరణ
ఒకటి ఉంటే
చాలు. అల్లుడ్ని
ఎలాగైనా దారిలోకి
తీసుకు వస్తుంది”
“అది
సరే... సితారా ఎలా
ఉంది?”
“దానికేం? బాగానే
కదా ఉన్నది...”
“మరెందుకు
దానిని పిలుచుకు
రాలేదు?”
“అన్నిటిని
కొంచం వదిలి
పట్టుకుందామని...ఉండండి...పైకెళ్ళి
అల్లుడ్ని చూసి
అభినందనలు చెప్పాసి
వస్తాను. నేను
వచ్చానని అల్లుడికి
తెలిసుంటుంది. కారులో
లోపలకు వచ్చేటప్పుడు
కిటికీ నుండి
చూస్తున్నాడు...సారీ...చూస్తూ
ఉన్నారు. ‘వచ్చి
ఇంత సమయం
అయ్యింది...ఇంకా
మాట్లాడటానికి
రాలేదు చూడు’ అంటూ
ఏదైనా అనబోతారు...” అంటూనే ఫ్లవర్
బొకేతో మేడ
మెట్లు ఎక్కారు
సత్యమూర్తి గారు.
తలుపు దగ్గరకు
వేసుండటంతో...మెల్లగా
తలుపు మీద
తట్టారు. కొద్ది
నిమిషాల తరువాత
తలుపులు తెరిచాడు
అశ్విన్. మొహాన
బురద మట్టి
పూసిన దిష్టిబొమ్మలాగా
ఉన్న అతన్ని
ఆశ్చర్యంగా చూసారు.
“హలో
అల్లుడూ...మీ
ప్రయాణం హాయిగా, సరదాగా
ఉండాలని విష్
చేసి వెళ్ళటానికి
వచ్చాను...” అంటూ ఫ్లవర్
బొకేను జాపారు.
దాన్ని విసుగుతో
తీసుకున్న అశ్విన్ దాన్ని పక్కనున్న
మంచంపైకి విసిరేసాడు.
అది దగ్గర
దగ్గర ఆయన్నే
విసిరేసినట్టు
ఉన్నది.
తమాయించుకున్న సత్యమూర్తి గారు “తరువాత
అల్లుడూ...నేను
కొన్ని విషయాలు
క్లుప్తంగా చెబుతాను.
సితారా కొంచం
తొందరపడింది. ఆ
ఇంటర్వ్యూ కోసం
నేను చాలా
బాధ పడుతున్నా.
దాన్ని ఇంతటితో
వదిలేయండి. అది
ఇక మీదట
మీ సినిమా
విషయాల దగ్గరకే
రాదు...”
---- సత్యమూర్తి
గారి మాటలను
లెక్క చేయకుండా, అద్దం
ముందుకు వెళ్ళి
నిలబడి ఆ
బురదలాంటి పేస్టును
మొహానికి పూర్తిగా
రాసుకోవటం మొదలు
పెట్టాడు అశ్విన్.
ఆయన సహజమైన
పద్దతిలో మాట
మారుద్దామని ప్రయత్నించారు.
“తరువాత...మీకు
ఎన్నింటికి విమానం?”
“.....................”
“నేనూ, మీ
అత్తయ్య, మోహన్
అందరమూ ఏర్
పోర్టుకు రాబోతాము.
మాకు ఈ
రోజు ఒక
దీపావళి. మా
ఇంటి అల్లుడు
ఒక ‘హీరో’ అయ్యి
విదేశాలకు వెళ్తున్నాడనేది...నేను
కలలో కూడా
కల్పన చేయని
ఒక విషయం...”
------ సత్యమూర్తి
గారు ఎంత
మాట్లాడినా అశ్విన్
మనసు కరగలేదు.
ఆయన చూస్తూండగానే
విసురుగా బాత్
రూము తలుపు
తెరుచుకుని లోపలకు
వెళ్ళి గొళ్ళెం
పెట్టుకున్నాడు.
సత్యమూర్తి గారు
ఒక పది
నిమిషాల వరకూ
మంచం
మీద కూర్చునే
ఉన్నారు. లోపల
మనసు ఉడికిపోతోంది...గంతులేసింది.
అదే ఇంట్లో
తన నడుం
మీద, ఒక
గుడ్డ పీలిక
లేకుండా మూడు
నెలల బిడ్డగా
ఉన్నప్పుడు –
అశ్విన్ ను ఎత్తుకుని
బుజ్జగించటం తో
ప్రారంభమైంది ఆయనలో
ఆలొచనా పరుగు.
ఎంత ఆపుకోవాలనుకున్నా, ఆపుకోలేకపోయాడు.
‘మావయ్యా...మావయ్యా…’ అంటూ
ఆయన వెనుకే
వచ్చి వచ్చి
దాక్కునే వాడు
అశ్విన్. అప్పుడు
రఘుపతి వద్దన్నవన్నీ
సత్యమూర్తి వాడికి
చేస్తారు. ఒకసారి
‘జీన్స్
ప్యాంటు’ అడిగినందుకు....‘అదంతా
బయటి దేశాల
కళాచారం’ అని
తండ్రి రఘుపతి
వద్దన్నాడు. కానీ, ఒకటికి
రెండు కొనుకొచ్చి
వాడికి వేసి
ఆనంద పడేవారు
సత్యమూర్తి.
వాడు కావలించుకుని
ముద్దుల వర్షం
కురిపించేవాడు.
అలా ప్రేమ
చూపించిన వాడు
ఇప్పుడు పిచ్చి
పట్టి ఇలా
నడుచుకుంటున్నాడు.
సత్యమూర్తి గారికి
కన్నీరు చేరింది.
కష్టపడి తుడుచుకుని
లేచారు.
ముఖాన బలవంతంగా
నవ్వు తెచ్చుకుని
పైనుండి కిందకు
దిగి వచ్చాడు.
ఆలా వచ్చేటప్పుడు, ‘వీలుంటే
ఏర్ పోర్టుకు
వస్తాను అల్లుడూ.
మీరు బలవంతం
పెడుతున్నారు కాబట్టి
రావటానికి ప్రయత్నిస్తాను...లేకపోతే
కుదరదు అని
ఇక్కడే చెప్పేవాడిని’ అంటూ
ఏదో పరమ
రహస్యంగా మాట్లాడిన
వారిలాగా...మాట్లాడుతూ
వచ్చారు. కానీ
దాన్ని రఘుపతి
గారు నమ్మలేదు.
“సత్యమూర్తీ...ఎందుకలా
గొణుగుతావు? వాడు
నీ దగ్గర
ఒక్క మాట
కూడా మాట్లాడి
ఉండడని నాకు
తెలుసు...” అని ఆయన
సత్యమూర్తీ ను
చూసి చెప్పారు.
సత్యమూర్తీ ముఖంలో
కళాకాంతీ లేదు.
వరలక్ష్మి దాన్ని
చూసి కలత
చెందింది. రాజేశ్వరి
కూడా భర్త
ఇలా అమర్యాద
పడటాన్ని జీర్నించుకోలేక
పోయింది. ‘ఇప్పుడే
ఇలా అంటే, పోను
పోను ఎంత
కష్టపడాలో?’ అని
ఒక ప్రశ్న
ఆమెలో లేచి
గొంతుకను అడ్డుకుంది.
‘ఒక
సినిమా చాన్స్
అనేది ఇలా
కూడా మనుష్యులను
మారుస్తుందా?’ అని
తనలో తానే
మదన పడింది.
రఘుపతి గారు ఆమె
మనసును అప్పుడే
చదివేసిన వాడిలా
సమాధానం చెప్పడం
మొదలుపెట్టాడు.
“సత్యమూర్తీ...ఇక
వీడు మారేటట్టు
కనబడటం లేదు.
నువ్వు సితారాకి
వేరే ఏర్పాటు
చేయాలనుకుంటే దారాళంగా
చేసుకో ‘ఏమిట్రా
నిశ్చయతాంబూలాలు అయిపోయిందే’ అన్న బాధను వదిలేయి...!
”
అన్నాడు.
వరలక్ష్మికి గుండె
దఢ పెరిగింది.
“ఏమండీ...ఎంతమాట
అనేసారు మీరు? వాడ్ని
లాక్కుంటూ వచ్చి
వాడ్ని మార్చే
ప్రయత్నం చేయకుండా, అలాగే
వదిలేస్తే వాడు
ఏదో ఒక
నటిని తీసుకు
వచ్చి...‘ఇక
ఈమే నా
భార్య అని
చెబితే ఒప్పేసు
కుంటారా?’”
“పోవే
పిచ్చిదానా...ఇప్పుడు
మాత్రం నువ్వూ, నేనూ
ఏం చేస్తున్నాం? అదేకదా
చేస్తున్నాము. వాడు
వాడి ఇష్టం
వచ్చినట్లు ఆడుకుంటుంటే
మనం చూస్తూ
ఉన్నాం?”
“లేదండీ...ఇప్పుడేమైందని.
రెండు రోజుల్లో
వాడి కోపం
తగ్గిపోతుంది. ఆ
తరువాత అంతా
బాగుంటుంది...”
“సరే...నీ
మాటకే వస్తాను.
ఆ తరువాత
కూడా వాడు
సరిలేకుండా పోతే?”
“దాని
గురించి తరువాత
మాట్లాడుకుందాం.
మీరు నోరు
మూసుకుని ఉండండి.
సితారా కంటే
మనల్ని అర్ధం
చేసుకోగలిగిన ఇంకో
కోడలు మనింటికి
దొరకనే దొరకదు...”
“ఇలా
చూడవే...మన
స్వార్ధం కోసం, ఆ
అమ్మాయి జీవితాన్ని
పాడుచేయకు!”
రఘుపతి గారి దగ్గర
ఒక న్యాయమైన
మనసు ఉండటం
నిదర్శనమయ్యింది.
“అల్లుడు
చెప్పేదే సరి.
పెళ్ళి అనేది
నూరేళ్ళ పంట.
అందులో నేను
తొందరపడటానికి
ఇష్టపడటం లేదు.
అశ్విన్ ను నాకు
బాగా తెలుసు.
ఇన్ని రోజులలో
నేను వాడి
దగ్గర ఒక
తప్పైన విషయం
కూడా చూడలేదు.
ఇప్పుడు ఇలా
నడుచుకుంటున్నాడంటే
అది సినిమా
రంగానికి ఉన్న
శక్తి అనే
చెప్పాలి. మనం
ఈ టైములో
వాడి మీద
బాగా నమ్మకంగా
ఉండాలి” అంటూ సత్యమూర్తీ
గారు బాధ్యతతో
జవాబిచ్చారు.
తరువాత ఎంత
బ్రతిమిలాడినా ఏమీ
తినకుండానే బయలుదేరారు
సత్యమూర్తి గారు
మరియూ రాజేశ్వరి... వరలక్ష్మికి, రఘుపతి
గారికి అశ్విన్
యొక్క చేష్ట
ఇచ్చిన బాధ
కంటే...వచ్చిన
వాళ్ళిద్దరూ తినకుండా
వెళ్ళిపోవటమే ఇంకా
ఎక్కువ బాధ
ఇచ్చింది.
Continued...PART-7
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి