20, అక్టోబర్ 2022, గురువారం

'హీరో'...(సీరియల్)....(PART-10/LAST)

 

                                                                                         'హీరో'...(సీరియల్)                                                                                                                                                                           (PART-10)

పుట్టినప్పుడే మన మరణం తారీఖు తీర్మానం చేయబడుతోంది. దాన్ని తెలుసుకోవటం అనేది, మన వీపును మనం ఎలా చూడలేమో అలాగే ఉంటోంది.

తెలియకుండా ఉండాల్సినవి...తెలియకుండా ఉండటమే కరెక్ట్. అది తెలిసిపోతే...తెలుసుకున్నా క్షణం నుండే ఒక విధమైన మనో మరణం ఏర్పడిపోతుంది.

వరలక్ష్మీ చావుకు అందరూ వచ్చారు. బాగా నీరసమైన వ్యక్తిత్వంతో సితారా కూడా వచ్చింది. ఎదురుగా ఉన్న చెట్టు నీడలో కూర్చుని నవ్వుతూ సన్యాసి చూస్తూ ఉన్నాడు. చివరిదాకా అశ్విన్ రాలేదు. అందరూ దాని గురించే మాట్లాడి అలసిపోయారు. వాడు ఒక మనిషే కాదు’, ‘రాతి గుండె మనిషి’, సినిమా మోహం వాడ్ని మార్చేసిందిఅన్నారు.

సన్యాసి మాత్రం నవ్వాడు.

ఎప్పుడూ, అన్నిటినీ లోకం తలకిందలు చేసేస్తోంది అన్న ఆయన, ఖచ్చితంగా సితారా ఆయన్ని దాటి వెడుతున్నప్పుడు నిన్ను కాపాడాడు...నిన్ను కాపాడాడు అన్నారు.

ఏమిటీ వాగుడు? నన్ను చూసినప్పుడల్లా ఏదైనా మాట్లాడుతూ...? ఏదైనా సరే తిన్నగా చెప్పండి...మీరొక పెద్ద భగవంతుడునని అనుకుంటున్నారో?” -- అని ఒక కసురు కసురుకుంది.

ఆయన కొంచం కూడా చలించలేదు.

అవును...కానీ నేను కాదు...అతను! అన్నారు రెండు అర్ధాలతో!

అన్ని కార్యాలూ ముగిసిపోయినై!

వరలక్ష్మీ ఫోటో ముందు దీపం వెలుగుతూ ఉంది. కొంచం దూరంగా రఘుపతి గారు మౌనంగా కూర్చోనున్నారు. రఘుపతి గారి ఇంట్లో అన్ని పనులూ సితారానే చేస్తోంది.

మిక్కిలి మౌనంగా ఉన్నది.

ఇంట్లో అక్కడక్కడా అశ్విన్ ఫోటోలు.

రఘుపతి గారు లేచారు. ఒక్కొక్క ఫోటోనూ తీసుకుంటూ వెళ్ళారుఅది చూసిన రాజేశ్వరీకి కూడా మనసు కొట్టుకుంది.

వద్దు అన్నయ్యా...అవన్నీ ఇప్పుడెందుకు తీస్తున్నావు?”

“.......................”

చెబితే వినండి...అంత దూరం నుండి టికెట్టు కొనుక్కుని రావద్దా?”

రాజేశ్వరీ...నోరు ముయ్యి! ఎన్ని టికెట్లు కావాలి నీకు? నేను కొనివ్వనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు...? కన్న తల్లి కార్యం కంటే వాడికి షూటింగే ముఖ్యమై పోయిందా...?”  అంటూ రఘుపతి గారికి సపోర్టుగా మాట్లాడారు సత్యమూర్తి గారు.

లేదు...ఇది చాలా ఎక్కువ. నీళ్ళు తగిలి నీళ్ళకు నొప్పి కలగదు. రోజుల్లో సినిమా ఛాన్స్ రావడమనేది చాలా పెద్ద విషయం. అందులోనూ హీరో ఛాన్స్ అనేది సాధారణ విషయం కాదు. దాన్ని వదిలి పెట్టకుండా ఉండాలని అశ్విన్ ఎలా నడుచుకోవాలో తెలియక నడుచుకుంటున్నాడు అంటూ రాజేశ్వరీ తన నమ్మకాన్ని ఒలకబోసి చూపించింది.

మాటలను ఖండిస్తున్నట్టు చూసాడు మొహన్.

మనసు ఎంత కష్టపడుంటే వరలక్ష్మీకి హార్ట్ అటాక్ వచ్చుంటుందమ్మా? ఆలొచించి చూడు. ఈమె ప్రాణం పోయినందుకు వాడే కారణం. నా వరకు ఇక వాడు నా కొడుకు కాదు..." అని రౌద్రంగా గర్జించారు రఘుపతి గారు.

అవన్నీ వింటూ చిన్న చిన్న పనులు చేస్తోంది సితారా.

ఆమె ఏమనుకుంటోందో ఎవరివల్లా ఊహించను కూడా కుదరటం లేదు. ఆమె కూడా పరిస్థితిలో మనసు విరిగి తాను అనుకున్నది చెప్పటానికి రెడీగా లేదు.

మొహన్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. గొంతు  సవరించుకున్నాడు. ఆమె కూడా తలెత్తి చూసింది.

ఏమిటి సితారా...ఇంత పెద్ద సంఘటన జరిగింది. నువ్వేమీ మాట్లాడటం లేదు?”

ఏం మాట్లాడాలి?”

అతను చేసింది కరెక్టా?”

ఎవరు?”

సితారా...ఏమిటే...నన్నే లోతుగా చూస్తున్నావా?”

నువ్వే నా లోతు చూడటానికి వచ్చావు...

సరే...అలాగే పెట్టుకో...వాడికోసం నిద్ర మాత్రలు మింగేవే...ఇప్పుడేమంటావు?”

నేనేం చెప్పలేదే...

సితారా! నా కోపాన్ని ఎక్కువ చేయకు. అల్ప సినిమా హీరో ఛాన్స్ కోసం బంధుత్వాలనే అవతల పారేసిన వాడిని నువ్వు ఇంకా మనసులో పెట్టుకోనుంటే అది అబద్దం...

తరువాత?”

ఏమిటే తరువాత అంటూ నన్ను వెక్కిరిస్తున్నావు...? మీ గొడవల వలన ఒక ప్రాణమే పోయింది. ఇంకా నీకు బుద్ది రాలేదంటే తరువాత నిన్ను దేవుడే కాపాడాలి...

ఆయన నీ రూపంలో వచ్చి తలుపులు పగులకొట్టి నన్ను కాపాడేరే...!

"చాలు ఆపు. ప్రాణం అనేది విలువకట్టలేనిది. దాన్ని ఒక మంచి విషయం కొసం త్యాగం చేయొచ్చు. ఇలా హీరోఅయిపోయాను కదా అని తల గర్వంతో ఆడుతున్న కేవలమైన ఒకరి కోసం దాన్ని వదిలేయకు...

చూద్దాం...

ఏమిటే చూద్దాం...? ఇంకానా నీకు వాడిపై నమ్మకం ఉంది?”

నేనేం చేయను? నాకూ, ఆయనకూ ఉన్న బంధం పలు సంవత్సరాల బంధుత్వంతో ఏర్పడింది. ఇప్పుడు జరుగుతున్న చేదు విషయాలన్నీ మహా అయితే ఒక నెల కూడా అయ్యుండదు. కొన్ని రోజులా... పలు సంవత్సరాలా? గెలిచేది?”

చెడిపోవటానికి పలు రోజులు అక్కర్లేదు...కొన్ని క్షణాలు చాలు. ఇదే అతని విషయంలో జరిగింది. అత్తయ్య చనిపోయే ముందు, ఒక విషయం చెప్పి చనిపోయింది...అది నీకు తెలుసు కదా?”

“..................” -- ఆమె నెమ్మదించింది.

నిన్నే...ఆమె ఇష్టపడినట్టే నువ్వు నడుచుకోవాలి

అత్తయ్య ఇలా ఒక ధర్మ సంకటాన్ని నాకు ఇచ్చుండకూడదు...

అది నీకు ధర్మ సంకటం కాదు! విడుదల. అత్తయ్యను తలుచుకుంటే నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా?”

అత్తయ్య వరలక్ష్మి గురించి అతను గర్వ పడుతున్నప్పుడు... రఘుపతి గారు అక్కడకు  వచ్చారు.

అవునమ్మా... మొహన్ చెప్పిందే కరెక్టు. నీ మనసును మార్చుకో. నేనే నీకు మంచి సంబంధం చూస్తాను. నా పదో రోజు కార్యం జరిగే లోపు సితారాకి సంబంధం ఖాయం చేయాలిఅని మీ అత్తయ్య చెప్పింది. ఆమె ఆత్మ సంతోష పడటానికీ, శాంతించడానికీ...నువ్వు దానికి ఒప్పుకునేదాంట్లోనే ఉంది... అన్నారు.

వేరే దారిలేక సితారా మౌనంగా ఆయన్ని చూసింది. 

తొమ్మిదో రోజు!

సంబంధం కుదిరి అన్ని విషయాలూ మాట్లాడి ముగించారు. రఘుపతి గారు పెళ్ళి కొడుకు దగ్గర మాట్లాడాడు.

"అల్లుడు గారూ...మీకు నా హౄదయపూర్వక కృతజ్ఞతలు. నా వరకు మీరు ఎవరై ఉన్నా, నా కొడుకు లాగానే మిమ్మల్ని అనుకుంటున్నా. నా కన్న కొడుకు గొంతు కోసాడు. కానీ, అన్నీ తెలిసి మీరు ఒప్పుకున్నారు. నా భార్య చనిపోయి రోజు తొమ్మిదో రోజు. వాడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక ఫోను కూడా రాలేదు. వాడేమిటో ప్రపంచానికే మహారాజు అయినట్టు అనుకుంటున్నాడు.

నా ఆస్తి - పాస్తులతో వాడికి దేని మీదా ఇంటరెస్ట్ లేదు. ఇవన్నీ ఎక్కడికి పోతాయి? ఒకే వారసుడైన నాకే వచ్చి చేరబోతోంది అనేది వాడి ఆలొచన అయ్యుంటుంది. కానీ, ఒక ద్రోహి అయిన వాడికి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇదంతా నా స్వీయ సంపాదనతో వచ్చింది.

నా వరకు సితారా నా కోడలుగా అవాల్సింది. కానీ, ఆమెను నా కూతురుగా దత్తతు తీసుకోబోతున్నాను. ఆస్తి అంతా ఇక దానికీ, మీకూ మాత్రమే. నాకు ఒకే ఒక ఆశ. నా కొడుకు ఎదురు కుండా మీరు పిల్లా పాపలతో బ్రహ్మాండంగా జీవించి చూపాలి. అంతే... అని రఘుపతి గారు కొడుకు మీదున్న తన కోపాన్నంతా కక్కాడు.

పెళ్ళికొడుకు కూడా అంగీకరిస్తున్న భావనతో ఆయన చేతులు పట్టుకున్నాడు.

అంతా చూస్తూ నిలబడ్డాడు మొహన్. సితారా ఏదైనా గొడవచేసి వాళ్ళ ప్రయత్నాలను పాడుచేస్తుందో అనే ఒక భయం అతని దగ్గర తిరుగుతూనే ఉన్నది.

సమయంలో ఒక కొరియర్పోస్ట్.

మొహన్ వెళ్ళి సంతకం పెట్టి తీసుకున్నాడు.

అమెరికా నుండి అశ్విన్ పంపించాడు. అతని చేతి రాతను చూసిన మరు క్షణం... మొహన్ దగ్గర వణుకు.

అశ్విన్ మన్నించమన్నట్టు ఏదైనా రాసి, అది ఇప్పుడు బయటకు తెలిస్తే, సితారా వేగంగా తన మనసు మార్చుకుని...పాత మనో పరిస్థితికి వెళ్ళిపోతే అనే అనుమానంతో ఉత్తరాన్ని దాచటానికి ప్రయత్నించాడు.

ఏమిటా ఉత్తరం...ఎవరి దగ్గర నుండి?” -- సత్యమూర్తి గారు బలమైన స్వరంతో అడుగగా, “ఏమీ లేదు నాన్నా! టెలిఫోన్ బిల్లు వచ్చింది అన్నాడు.

మాటతో సితారా గబుక్కున వెనక్కి తిరిగింది. నిన్ననే టెలిఫోన్ బిల్లు వచ్చింది, ఉత్తరాన్ని ఆమె తీసుకున్నది. అదీ కాకుండా టెలిఫోన్ బిల్లు కొరియర్ లో వస్తుందా?  కాబట్టి, మొహన్ దేన్నో దాస్తున్నాడు అనే ఆలొచనతో -- అక్కడున్న పరిస్థితి గురించి బాధ పడకుండా వేగంగా అతని ముందుకు వెళ్ళి నిలబడింది. అన్నయ్య మొహంలోకి దీక్ష్గాగా చూసింది.  

ఏమిటి సితారా...?”

ఏదీ కొరియర్ లెటర్ చూపించు...

ఇప్పుడెందుకు అది? నువ్వు పెళ్ళి కూతురివి. పెళ్ళి కొడుకు చూస్తున్నాడు చూడు...

అది నాకు తెలుసు. దాని కోసం నా నమ్మకాన్ని వదులుకో లేను. లెటర్ ఖచ్చితంగా అమెరికా నుండి బావ రాసుంటాడు...

.....................”

ఏమిట్రా శిలలా నిలబడి పోయావు? బావేగా పంపింది...?” -- సితారా స్వరంలో వేగమూ, కఠినత్వమూ ఎక్కువైనై.

మొహన్ కు ఇబ్బందిగానే ఉంది.

రఘుపతి గారు వేగంగా వచ్చి, వాడి చేతిలో ఉన్న ఉత్తరాన్ని తీసుకుని అడ్రెస్సు చూసాడు. చాలా జాగ్రత్తగా చించారు. అందులో కొన్ని ఫోటోలతో ఒక ఉత్తరం ఉంది.

అందరూ ఆశ్చర్యంతో చూశారు. ముఖ్యంగా పెళ్ళి కొడుకు.

ఉత్తరాన్ని చదివిన రఘుపతి గారి ముఖం ఎర్ర బడింది.

వీడొక కొడుకా?” అని ఛీదరించుకోవటం ప్రారంభించారు. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్నీ, ఫోటోలనూ సత్యమూర్తి గారూ లాక్కుని చూసారు. ఆయన ముఖం కూడా ఎర్రబడింది.

తరువాత మొహన్, తరువాత రాజేశ్వరి, చివరగా సితారా.

ఫోటోలో పెళ్ళి దుస్తులలో షర్మీలాతో అశ్విన్! ఫోటో వెనుక ఒక నోట్.

ఇది షూటింగ్ ఫోటో కాదు. ఒరిజినల్’! సినిమా రంగానికి చెందిన నాకు  షర్మీలానే కరెక్టు జోడి. మేము విక్టరీ దంపతులుగా ఉండబోతాము. దీని తరువాత కూడా సితారా మనసు మారలేదంటే, ఆమెను రెండో భార్యగా పెళ్ళి చేసుకుని మా ఇంటి పనిమనిషిగా ఉంచుకోవటానికి నేను రెడీ! షర్మీ కూడా దానికి ఓకే చెప్పింది’---అని రాసుంది. అది చదివిన సితారా అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. 

రోజులు చాలా తొందరగా గడిచినై.

సితారాకి పెళ్ళి జరిగి, ఆమె గర్భం దాల్చింది. అశ్విన్ హీరోగా నటించిన సినిమా రిలీజ్ అవబోతోంది. ఉరంతా సినిమా పోస్టర్లేకారులో  వెళుతున్నప్పుడు పోస్టర్ను చూసిన సితారా... పోస్టర్ మీద థూఅని ఉమ్మేసింది.

మొహన్ అంతకంటే కోపంగా ఉన్నాడు. పోస్టర్ను చించాడు. రఘుపతి గారు గడ్డం పెంచుకోనున్నారు. అశ్విన్ సినిమా ఫ్లాప్ అవ్వాలని మొక్కుకుని పెంచుకున్న గడ్డం. వాడు తల ఎత్తనే కూడదు. వీధి వీధిగా వెళ్ళి అడుక్కోవాలి అనేవన్నీ ఆయన మొక్కులు. చూసే వాళ్ళందరి దగ్గర ఇదే చెప్పాడు.

అశ్విన్ సినిమా ప్రీ వ్యూషోను చూసిన డిస్టిబ్యూటర్లు క్లైమాక్స్ మార్చి తీస్తే సినిమా బాగా ఆడుతుంది అనేలాగా చెప్పారు. నిర్మాత ఆలొచనలోనే ఉన్నాడు.

కథ ప్రకారం అతను ప్రేమించిన అమ్మాయిని నిద్రపోతున్నప్పుడు నిప్పంటించి చంపేందుకు ప్లాన్ వేసుకుంటారు. ఆమె లేచి ఎక్కడికీ పారిపోకూడదని నిద్ర మాత్రలు ఇచ్చేసుంటారు. అది తెలుసుకున్న హీరో ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. పోరాటంలో అతను కూడా ప్రాణాలు వదలటంతో  -- ఇద్దరి శరీరాలూ కౌగలించుకుని మంటల్లో కాలిపోతుంటాయి.

ప్రేమకు ప్రపంచంలో ఇదే ముగింపుఅని అప్పుడు తెరమీద అక్షరాలు పడగా, సినిమా పూర్తి అవుతుంది.

ఆ సీను కోసం అశ్విన్ నిర్మాతను ఒత్తిడి చేసాడు. డూపు  లేకుండా తానే సీనులో నటిస్తానంటాడు. ఆయనేమో అతన్ని సందేహంతో చూస్తారు.

వద్దు అశ్విన్...ఇంకా కొన్ని రోజులైనా మీరు షర్మీలాతో సంతోషంగా జీవించటానికి ప్రయత్నించండి... అన్నారు.

లేదు సార్... నా ప్లాన్ ప్రకారం అంతా జరిగి ముగిసింది. నేనే ఇప్పుడు నా కుటుంబానికి విలన్. ఫాన్స్ కు మాత్రం హీరో’. హీరో విలన్ గానే ఉండిపోతేనే , నేను దేనికోసం కష్టపడ్డానో, దానికో అర్ధం ఉంటుంది. ప్లీజ్ సార్... అని ఒత్తిడి చేస్తాడు.

చివరిదాకా నిర్మాత ఒప్పుకోలేదు. కానీ, నిర్మాతకే తెలియకుండా డైరెక్టర్ దగ్గర్ షూటింగ్ పెట్టమని చెప్పి, సీనులో నటించడానికి రెడీ అయ్యాడు.

హీరోయిన్ షర్మీలా నిద్ర మత్తులో ఉన్నప్పుడు ఇల్లు తగలబడటం మొదలవుతుంది. రెడీ, స్టార్ట్ కెమేరా అని డైరెక్టర్ చెప్పటంతో, ఆవేశంగా లోపలకు పరిగెత్తాడు అశ్విన్.

వెళ్ళిన వేగంతో అతను తిరిగి వచ్చేయాలి. లోపల షర్మీలాకు మారుగా ఆమె బొమ్మ శరీరం. దాన్ని వెళ్ళి కావలించుకున్న వాడు అలాగే మంటల్లో పడిపోయాడు.

డైరెక్టర్ అరిచాడు. కట్ అని.

తరువాత ఆయన చెప్పటంతో, అటూ, ఇటూ అందరూ పరిగెత్తటంతో ఒక్క  ప్రయోజనమూ లేకపోయింది.

అక్కడ ఉండటానికి ఇష్టం లేక షర్మీలా పరిగెత్తుకు వెళ్ళి కారులో కూర్చుంది. ఏడుస్తూ డ్రైవర్ను కారు తీయమని చెప్పటంతో కారు బయలుదేరింది.

ఆమె జ్ఞాపకాలు వెనక్కి వెళ్ళినై.

ఒక కొత్త నటుడితో నటించ గలవా?’ అని అడిగిన నిర్మాత ఆమెను పిలిచి మాట్లాడినప్పుడు ఆయన చెప్పినదంతా ఒక రాతి మీద చెక్క బడినట్లు ఆమె మనసులోనూ అచ్చు అయిపోయింది.

షర్మీలా...నేను ఒక నమ్మలేని...అదే సమయం ప్రామిస్ గా ఒక నిజం చెబుతున్నా. అశ్విన్ అనే ఒక యువకుడు. అతనికి పెళ్ళి కూడా నిశ్చయమైపోయింది. నిశ్చయం కూడా జరిగిపోయింది. అలాంటి సమయంలో  అతనికి ఆటంబాంబు లాంటి వార్త తెలియవచ్చింది. అంతకు ఆరు నెలల ముందు ఒక బస్సు యాక్సిడెంట్లో అతనికి రక్తం ఎక్కించారు. రక్త మార్పిడి వలన అతనికి ఎయిడ్స్వ్యాధి సోకిందని తెలిసింది. చాలా జాగ్రత్తగా   ఉంటూ, మందులు వేసుకుంటూ ఉంటే ఒక పది సంవత్సరాలు ప్రాణాలతో ఉండటం ఎక్కువే అవుతుందని డాక్టర్లు చెప్పారట.

అది ఇతను బయట చెప్పనూ లేని పరిస్థితి. ఎందుకంటే... అతను చేసుకోబోయే అమ్మాయి అతని బంధువు. పుట్టిన దగ్గర నుండి ఇద్దరి మధ్య విపరీతమైన ప్రేమట. అతని తల్లి-తండ్రులకు ఇతను ఒకడే కొడుకు. అమ్మాయికి ఇతనంటే పిచ్చి ప్రేమ.

అలాంటి పరిస్థితుల్లో ఇతనికి పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేదు. అదే కదా మంచి నిర్ణయం అవుతుంది! కానీ అమ్మాయి కారణం అడుగుతుందే...ఆమెకు ఏం చెప్పాలి...? ఎయిడ్స్ అని చెబితే పరవాలేదుఅని చెప్పి ఆమె కలిసి జీవించటానికే ప్రయత్నిస్తుందట. ఆమె అలాంటి వ్యక్తి. ఆమె అతన్ని రిజెక్ట్ చేయాలి. వీడిని కన్న వాళ్ళు కూడా వీడ్ని రిజెక్ట్ చేయాలి. అతనికి ఎయిడ్స్ వచ్చింది బయటకు తెలియకూడదు. ఇదే ఇప్పుడు అశ్విన్ కు కావలసింది. నాకు హీరోఛాన్స్ ఇవ్వండి. నా కథనే ఒక ప్రేమ కథా చిత్రంగా తీయండి మిగిలింది నేను చూసుకుంటానన్నాడు. నాకు అర్ధమైపోయింది. ఒక మంచి కోరిక కోసం సహాయం అడుగుతున్నాడు. అతని కథ కూడా సినిమాకు పనికి వస్తుంది. నేను చేయటానికి రిస్క్ తీసుకో దలిచాను. నువ్వు కూడా సహాయపడితే చాలా బాగుంటుంది. ఏమంటావు?” --  షర్మీలా మనసులో... రోజు ఆయన అడిగింది  జ్ఞాపకమొచ్చింది.

అశ్విన్ అనుకున్నది సాధించాడు. ఒక విధంగా త్యాగంతో విధినే జయించాడు. ఎయిడ్స్వ్యాధితో కుళ్ళిపోవలసిన శరీరాన్ని, ముందే యాక్సిడెంట్ అన్న పేరుతో నిప్పుకు అర్పించుకున్నాడు. అందువలన అతని తండ్రితో సహా అందరూ ఆనందపడతారు.  

ఇలా కూడా ఒకరి వలన త్యాగం చేయటం కుదురుతుందా?’

అశ్విన్ వెక్కి వెక్కి ఏడ్చింది.

ఆమెతో పాటూ...మనలో పలువురు

************************************************సమాప్తం********************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి