3, అక్టోబర్ 2022, సోమవారం

నరకలోక ఏడుపులు?...(మిస్టరీ)

 

                                                                               నరకలోక ఏడుపులు?                                                                                                                                                                                                   (మిస్టరీ)

సోవియట్ యూనియన్ శాస్త్రవేత్త డాక్టర్ అజ్జాకోవ్ భూకంపాలను ఏర్పరస్తున్న భూమి క్రింద ఉన్నప్లేట్ టెక్టోనిక్ కదలికలను మరియు ఇతర విషయాలతోపాటు భూమి క్రింద ఉన్న ఉష్ణోగ్రతను రికార్డ్ చేయడానికి ఉద్దేశించి సైబీరియాలో ఒక బోరును తవ్వాలని ప్రభుత్వ సహాయంతో ఒక ప్రాజక్టుకు ప్లాను వేశారు.  దానికి ఒక తేదీ నిర్ణయించారు.

నిర్ణయించిన తేదీలో, డాక్టర్ విక్టర్ అజ్జాకోవ్ నేతృత్వంలోని ఒక ప్రయోగాత్మక డ్రిల్లింగ్ బృందం వాళ్ళ మిషెన్లతో  సైబీరియాలో 14.5 కిలోమీటర్ల (9 మైళ్ళు) లోతైన 'బోర్హోల్' ను రంధ్రం చేయగలిగారు. వారు ఒక  గుహకు చేరుకున్నారని సూచిస్తున్నట్టు, డ్రిల్ మిషెన్ ఇష్టం వచ్చినట్టు క్రూరంగా తిరగడం ప్రారంభించింది. వెంటనే డ్రిల్లింగ్ ను ఆపేసారు. మిషెన్లో ఏదైనా లోపం ఉందేమోనని డ్రిల్లింగ్ పైపును పైకి తీసుకువచ్చి దానిని పరీక్షించారు. లోపు బృందం లోని కొందరు కుతూహలాన్ని ఆపుకోలేక బోరు చేయబడిన రంద్రం లోపలకు చూసేరు. కాని ఏమీ కనబడలేదు. అయితే వారికి రంద్రం నుండి ఏవో శబ్ధాలు వినబడ్డాయి. సబ్ధాలను బాగా వినడానికి కొంతమంది శాస్త్రవేత్తలు చెవులు రంద్రానికి ఆనించారు. రంద్రంలో నుండి కొన్ని ఏడుపులు, కేకలూ వినబడ్డాయి. వాళ్ళు వెంటనే విషయాన్ని వాళ్ళ బృందం నాయకుడికి చెప్పారు.  మరుసటి రోజు డ్రిల్లింగ్ కొనసాగడానికి ముందు, పరిశోధకులు ప్రత్యేక మైక్రోఫోన్ మరియు ఇతర పరీక్ష పరికరాలను డ్రిల్లింగ్ మెషన్ కు తగిలించారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నరకలోక ఏడుపులు?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి