21, జులై 2023, శుక్రవారం

దైవ రహస్యం…(నవల)


                                                                                         దైవ రహస్యం                                                                                                                                                                                (నవల) 

ఎక్కడైతే అవినీతి ఉండదో అక్కడ మాత్రమే ఉంటుంది 'తిష్టాదేవి దేవత '. అయితే ఏ రోజైతే అవినీతికి మానవుడు బానిస అయ్యాడో, ఆ రోజు 'తిష్టాదేవి దేవత' అవినీతి పరులను శిక్చించటం మొదలుపెట్టింది. అందుకని కొందరు ఈ దేవతను వాళ్ళ స్వార్ధం కోసం  ఊరి నుండి దూరంగా ఉంచారు. రోజు రోజుకూ భూమి మీదున్న మానవులు అవినీతికి పూర్తిగా బానిస అయ్యారో ఇక 'తిష్టాదేవి దేవత' ఈ భూమిని వదిలి వెళ్ళిపోయింది. 

 'తిష్టాదేవి విగ్రహం అనుకోకుండా కనిపించటం, దానివలన ఏర్పడిన సంఘటనలు, ఆ దేవత అవీనీతి పరులను ఎలా శిక్చించిది అనేది ఈ నవల చదివి తెలుసుకోవచ్చు.

 అవినీతికి పాల్పడకుండా ఉండటానికి ఈ రోజు ప్రజలు భయపడటం లేదు. ఏ చట్టాలూ వారిని భయపెట్టటం లేదు, దేవుని పేరు చెబితేనైనా భయపడతారేమో నన్న ఒక చిన్న ఆలొచన ఈ నవలకు ఆధారం.....చిన్న ప్రయత్నం.

1515 ఆగస్టు 15….విశాలపురం అనే గ్రామంలో

తన ఇంటి ముందున్న ఖాలీ స్థలంలో ఒక గుడి కట్టాలని అశోక వర్మ నిర్ణయించుకున్నాడు. మాట విని చాలా సంతోషపడింది భార్య శేషమాంబ. విశాలపురంలో ఇంట్లోనే గుడి అనేది బాగా శాస్త్రము తెలిసున్న వాళ్ళ ఇళ్ళల్లో మాత్రమే కట్టగలరు! మిగిలినవారు ఊరికి బయట పది మైళ్ళ దూరంలో ఉన్న అమ్మోరి గుడికి వెళ్ళాల్సిందే. పెళ్ళైన కొత్తలో శేషమాంబ కూడా ఊరి బయట ఉన్న అమ్మోరి గుడికే వెళ్ళిందిఅలా ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పాములను చూసి శేషమాంబ భయపడింది.   

పెళ్ళికి ముందు విజయనగరంలో శేషమాంబ ఇంటికి దగ్గరలోనే రెండు గుడులు ఉండేవి. రోజూ రెండు పూటలా గుడికి వెళ్ళి రావటం శేషమాంబకు అలవాటు. పెళ్ళి చేసుకుని విశాలపురంలోని భర్త ఇంటికి వచ్చినప్పుడు, శేషమాంబకి అంతా కొత్తగానూ, తేడాగానూ ఉండేది. వాటిల్లో శేషమాంబని ఎక్కువ కష్టపెట్టింది ఇదిగో గుడి సమస్య. గుడికి వెళ్ళాలంటే పది మైళ్ళ దూరం వెళ్ళాలి. ఆరు సంవత్సరాల తరువాత సమస్యకు ఇప్పుడు ముగింపు వచ్చింది. అదికూడా భర్త అశోక వర్మ ద్వారా రావడం శేషమాంబని ఎక్కువ సంతోష పెట్టింది.

తాపీ మేస్త్రీతో పాటు మరో నలుగురు వచ్చి దిగారు. అందరూ పని ముట్లతో సహా రెడీగా ఉన్నారు. తాపీ మేస్త్రీ గుడి కట్టాల్సిన ప్రదేశాన్ని చూశాడు.

ప్రదేశంలోని ఈశాన్య మూలలో ఐదడుగుల ఎత్తుతో ఒక రాయి ఉన్నది. మేస్త్రీ తన భుజం మీదున్న తుండుతో  రాయిని తుడిచాడు. రాయి పైన ఒక మూల త్రిశూలం ఆకారం చెక్కబడుంది. రాయి క్రింద బాగంలో ఏవో అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అయితే అక్షరాలు చెరిగిపోయున్నాయి.  

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

దైవ రహస్యం…(నవల) @ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి