18, జులై 2023, మంగళవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-23)

 

                                                                     మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                           (PART-23)

మూడు నెలల తరువాత హైదరాబాద్ వచ్చారు హాయ్.

పూర్తిగా గుణమైన రోహిణీని చూడటానికి సంతోషంగా ఆసుపత్రికి వెళ్లారు. 

హాస్పిటల్ తోటలో కొంతమంది పిల్లలతో ఆడుకుంటోంది ఆమె.

దూరం నుండే చేతులు ఊపి నవ్వారు హాయ్. ఆమె కూడా చేతులు ఊపి నవ్వింది. కానీ, వెంటనే ఆయన దగ్గరకు రాలేదు. ఒక పిల్లాడికి ఊయలను ఊపుతున్నది.

ఒక సిమెంట్ బెంచ్మీద కూర్చుని ఆమెను గమనిస్తూ ఉన్నారు రామప్ప.

రోహిణీ పూర్తిగా కోలుకోవటం ఆయనకు సంతోషాన్ని ఇచ్చింది. శ్యామ్ ఇప్పుడు అక్కడ ఉండుంటే ఎంత సంతోష పడుంటాడు అని అనిపించింది ఆయనకు.

'శ్యామ్ ఎక్కడున్నావురా నువ్వు?' అని మనసులో కేక వేసారు.

రోహిణీకి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ రాజ్ కుమార్ వచ్చి హాయ్ పక్కన కూర్చున్నారు. ఏమిటి హాయ్ గారూ, మూడు నెలలుగా మనిషే కనబడలేదు?”

సారీ డాక్టర్...నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చిందంటేనే గ్రీటింగ్ కార్డు కంపెనీలకు విపరీతమైన పని ఉంటుంది. నేనే 'ఆల్ ఇండియా టూర్ వెళ్ళాను.  వ్యాపారం బాగా ఉండటం వలన, ముంబైలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ఒక ప్లాన్. అక్కడకు వెళ్ళి, చోటు చూసి, అగ్రీమెంట్ వేసుకుని, దానికోసం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని వచ్చాను. వచ్చే నెల, నేనూ ముంబైకి వెళ్ళి 'సెటిల్ 'అయ్యి వ్యాపారాన్ని చూసుకోబోతాను. నేను ఇప్పుడు కంపెనీ పార్ట్నర్"

మంచిది. అప్పుడు రోహిణీ... అన్నారు డాక్టర్.

ఆమె జీవితాన్ని ఇక ఆమే డిసైడ్ చేయాలి. మీ దగ్గర వదిలిపెట్టి నందువలన, మూడు నెలలూ నేనూ రోహిణీ గురించి పూర్తిగా బాధా లేకుండా ఉన్నాను. ఇప్పుడు రోహిణీ పూర్తిగా గుణమయ్యింది. ఆమెకు ఎవరూ లేరు. నేనే చూసుకోవాలి. నాతో పాటూ ముంబై తీసుకు వెళ్తాను. ఇప్పుడు ఆమె, చూడటానికి ఇంతకు ముందు కంటే అందంగానూ, నాజూకుగానూ, బ్రహ్మాండంగా నయం అయ్యిందే...మీకే థ్యాంక్స్ చెప్పాలి"

హాయ్ గారు నవ్వారు. డాక్టర్ నవ్వలేదు.

రోహిణీ, పిల్లవాడిని ఊయలలో నుండి ఎత్తుకుని తన నడుంపై ఉంచుకుని హాయ్ గారిని దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నది.

రోహిణీని పిలవటానికి హాయ్ చై ఎత్తగా, డాక్టర్ అడ్డుపడ్డాడు.

ఆమెను పిలవకండి. ఆమెను వెళ్ళనివ్వండి

ఏం డాక్టర్...నేనిక్కడ కూర్చోనున్నాను. నా దగ్గర ఒకమాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతోంది. అక్కడ్నుంచి చెయ్యి ఊపింది...ఇప్పుడు హఠాత్తుగా నన్ను చూడనట్టు వెళుతోంది. మీకు ఫోను చేసినప్పుడు నేను ఆమెతో మాట్లాడనందు వలన నామీద కోపమా?”

అది కోపం కాదు రామప్ప గారు

మరి...?”

అమినీషియా

అంటే...

మేడ మెట్ల మీద నుండి పడి తల మీద బలంగా దెబ్బ తగిలినందువలన, ఆమె జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోయినై. ఆమె ఇప్పుడొక అమినీషియా పేషెంట్. ఆమెకు మిమ్మల్ని మాత్రమే కాదు...ఆమెనే ఆమెకు పూర్తిగా జ్ఞాపకం లేదు!"

"డాక్టర్..." షాక్ తో అరిచారు హాయ్.

"అవును... రోహిణీ తన జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి. ఇకమీదట మీరొక్కరే ఆమె ఒకే బంధువు"

డాక్టర్ చెప్పేది పూర్తిగా నమ్మలేని వాడిగా శిలలాగా కూర్చున్నారు హాయ్.

                                                                                                          Continued...PART-24

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి