25, జులై 2023, మంగళవారం

అతడే ఆమె…(కథ)

 

                                                                                           అతడే ఆమె                                                                                                                                                                                        (కథ)

తల్లిదండ్రులు చేరదీయకపోయినా, తోడబుట్టిన వారు అంగీకరించకపోయినా, చుట్టుపక్కల వారు దరిచేరనివ్వకపోయినా, సమాజం దూరం పెట్టినా మగవలు తెగువతో బతుకుతుంటారు. ‘అర్ధనారీమణులుగా అవస్థలు పడుతూ, చీదరింపులు ఎదురైనా తమ స్వప్న లోకంలో బతుకుతూ కష్టాలకు ఎదురీదుతుంటారు. తాము కలలగన్న ప్రపంచం కోసం కన్నీళ్లను దిగమింగుకుని జీవిస్తారు. కానీ, వారిని తల్లి-తండ్రులో, తోబుట్టువులో ఆదరిస్తే, వారూ ఏమైనా చేయగలరు. హార్మోన్ల అసమతుల్య మార్పు వలన హిజ్రాగా మారుతున్న హీరో గురించి తల్లి ఎలా తెలుసుకుంది, కుటుంబ శభ్యులు ఛీ కొట్టి, చిన్న చూపు చూసినా, కన్న తల్లి అర్ధం చేసుకుని అతనికి తోడుగా ఉంటుంది... తరువాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే కథ చదివి తెలుసుకోండి.

"ఏమిటి రోజు మన ఊరి రైల్వే స్టెషన్లో ఇంతమంది పోలీసులున్నారు?...మినిస్టర్ ఎవరైనా వస్తున్నారా?" అక్కడున్న టి.టి. ని అడిగాడు అప్పుడే రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టిన ఒక ప్రయాణీకుడు.

"కాదు...కాదు...మన ఊరికి కొత్తగా నియమించబడ్డ లేడీ కలెక్టర్ రోజు చార్జ్ తీసుకోవటానికి వస్తోంది...ఆమెను రీసీవ్ చేసుకోవటానికి, బందోబస్తుకు వచ్చారు పోలీసులు" చెప్పాడు టి.టి..

అక్కడే పూలమాలతో నిలబడున్న విక్రమ్ "వచ్చేది లేడీ కలెక్టర్ కాదు...నా కలెక్టర్ తమ్ముడు, వాడితో పాటు నా తల్లి సరోజ కూడా వస్తోంది" అని చెప్పాలనుకున్నాడు. కానీ చెప్పలేకపోయాడు.

ఇంతలో రైలు వచ్చి ఆగింది. పోలీసు అధికారులందరూ ఒక్కసారిగా .సి కంపార్ట్ మెంట్ దగ్గర గుమికూడారు.

కంపార్ట్ మెంట్లో నుండి హుందాగా ఒక మహిళ దిగింది. పోలీసులు సెల్యూట్ చేశారు. ఆమె చేతికి తమ దగ్గరున్న పూల మాలలు, పూల గుచ్చాలు అందించారు. మహిళా కలెక్టర్ వెనక్కి తిరిగి కంపార్ట్ మెంట్లో నుండి దిగటానికి కష్టపడుతున్న వయసయిన మరో మహిళను తన చేతి సహాయంతో దింపింది."ఈమె నా తల్లి సరోజ" అందరికీ వినబడేలా చెప్పింది.

అందరూ కలిసి స్టేషన్ బయటకు వస్తుంటే ఎంట్రన్స్ దగ్గర విక్రమ్ నిలబడుండటం చూసిన మహిళా కలెక్టర్ తన తల్లి సరొజతో విక్రమ్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ తన చేతిలో ఉన్న పూల మాలను కలెక్టర్ తల్లి సరొజ మెడలో వేశాడు....అక్కడ గుమికూడిన వారంతా ఆశ్చర్యపోయారు. ముగ్గురూ కలిసి బయటకు నడిచారు.

"అందరివైపు చూసి వచ్చింది మహిళా కలెక్టర్ కాదు...నా తమ్ముడు" అని అరిచి చెప్పాలని అనుకున్నాడు విక్రమ్. చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనొక్కడికే తెలుసు "అతడే ఆమె" అని.

కథను చదవటానికి క్రింది లింకును క్లిక్ చేయండి:

అతడే ఆమె...(కథ)@ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి