3, జులై 2023, సోమవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-16)

 

                                                                     మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                         (PART-16)

మైసూరు వెళ్ళే శతాబ్ధీ రైలు.

వ్యాపార విషయంగా బెంగళూరు వెళ్తున్నాడు శ్యామ్.

రైలులో నిజంగా అతను రోహిణీని ఎదురుచూడలేదు!

అతను తన సీటులో కూర్చో నుండ, రోహిణీ అతన్ని దాటుకుని వెళ్ల--

రోహిణీ!

అరె... శ్యామ్!

బెంగళూరు వెళ్తున్నాను. నువ్వెక్కడిదాకా?”

నేను...వచ్చి...ఒక పెళ్ళికి మైసూరు వెళ్తున్నాను

ఎందుకు ఉద్యోగానికి అంత హఠాత్తుగా రాజీనామా ఇచ్చావు? ఒక ఇన్ ఫర్మేషన్ లేదు...ఫోను లేదు. ఎక్కడికి వెళ్ళావో తెలియలేదు. పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి హాయ్ రామప్ప మూడును చెడిపావు! ఏంటి రోహిణీ ఇదంతా? నీకు నామీద ఏమిటి కోపం?”

మాధవి దెయ్యం నిన్ను లవ్చేస్తున్నట్టు అనిపించింది. సరే, మధ్యలో మనమెందుకు అనుకుని జారుకున్నాను

ఆమేకదా నన్ను లవ్ చేస్తోంది.నేను చెయ్యలేదే?”

ఎవరికి తెలుసు? నువ్వు మొదటి నుంచి అడ్డ దారిలో డబ్బుగల వాడివి అవ్వాలని లక్ష్యం పెట్టుకుని తిరుగుతూ ఉన్నావు. ఆస్తి, అంతస్తూ ఉన్న ఆమెని పట్టుకున్నావేమోనని అనుకున్నాను

అప్పుడు మనం చివరిగా ఒకటిగా ఉన్నది, నువ్వు నాకు ఉంగరం తొడిగింది...నేను నిన్ను...నిన్ను

అంతా ఒక ఆటోగ్రాఫ్లాగానే

రోహిణీ నీకు నేను నచ్చలేదా?”

బాగా నచ్చావు నచ్చకపోతే నన్ను నేను నీకెందుకు అర్పించుకుంటాను

మరి ఇంకేమిటి నీ ప్రాబ్లం?”

జీవితంలో కొన్ని సమయాల్లో...కొన్ని కారణాలు పిచ్చిగా ఉంటాయి. కానీ, అదే చాలావరకు నిజం

ఇదెందుకు మాటి మాటికీ చెబుతావు? ఎవరు ఇది చెప్పింది? అరిస్టాటిలా...రజినీషా...సాక్రటీసా?”

నేనే చెప్పాను. నిజాన్ని ఎవరు చెబితే ఏం?”

ఉరికే నన్ను అల్లరిపెట్టకు రోహిణీ

తెలుసు. నీకు నిజమే నచ్చదు. నువ్వు దాన్ని జీర్ణించుకోలేవు. ఎందుకంటే, నువ్వెప్పుడూ నిజం చెప్పే మనిషివి కావు. నీ ఉద్యోగం అలాంటిది

నా ఉద్యోగానికి ఏం తక్కువ?”

ఎప్పుడూ ఒక కల్పనలో ఉండటమే నీ ఉద్యోగం. రంగు వేసిన ప్రపంచాన్ని చూపించటం -- రైన్ బో, సూర్యుడూ, పువ్వు, జలపాతం...ఇలా ప్రక్రుతిని ఏదైనా చూపించటమే కదా! గ్రీటింగ్ కార్డులో, రోజైనా మురుగు నీటి కాలువను చూపించావా నువ్వు? మూసీ నదినీ -- గుడిసె ఇల్లును చూపించావా...? గుడిసెలో ఉండే కూలీ వాడు, మూటలు ఎత్తే వాడు, రిక్షాలాగే వాడు...కష్టపడే వాళ్లను ఎవరినైనా ఇలా ముద్రించావా...? యధార్ధాన్ని, జీవితంలోని చేదును, నిజం యొక్క నిదర్సనాన్ని ఎప్పుడైనా చూపించావా?”

హఠాత్ గొరిల్లా అటాక్ ను రోహిణీ దగ్గర నుండి ఎదురుచూడలేదు అతను. ఇప్పుడేంటి...దానికి?”

అలాంటిదే నీ ప్రేమ కూడా! ప్రేమ...అనేది ఒకటుందా? లేదు...అది కవులు కనిబెట్టిన అబద్ధం. కల్పితవాదులు కనిపెట్టిన అబద్దం. సంధర్భవాదులు కనిబెట్టిన అబద్దం. కార్యం సాధించుకోవాలనుకునే మగవాళ్ళు కనిపెట్టిన అబద్దం. ఆడపిల్లలను మొసం చేసి, వాళ్ళని తల నుండి కాలువరకు అనిభవించటానికి మగవాళ్ళు కనిబెట్టిన పచ్చి అబద్దమే ప్రేమా గీమా దోమా అన్నీ

నేను నిన్ను మొసం చేసేనా?

నువ్వంటే నువ్వు కాదు...నీలాంటి వాళ్ళు

రోహిణీ...ఏమిటి సడన్ గా పెద్ద పెద్ద డైలాగులు అన్నీ మాట్లాడుతున్నావు

రోజు లోకం ఇంత నీచంగా, కపటంగా, మోసంగా ఉంది అంటే, దానికి మీలాంటి కల్పనా వాదులూ, ఆలొచనావాదులూ, మగవాళ్ళూ, అబద్దమైన మగవారు...మీరందరూనే కారణం. ప్రేమ అనే ఒక కథను చెప్పి ఆడపిల్లలందరినీ ఎప్పుడూ మత్తులో ఉంచి పెట్టుకుంటున్నారు.

ప్రేమ, అభిమానం, మాతృత్వం, అనురాగం అని అన్నిటినీ ఒక పెద్ద మోపు చేసి చూపి, తలలోకి ఎక్కించి, మమ్మల్ని ఎక్కడికీ స్వతంత్రంగా వెళ్ళనివ్వక ఒక మూల కూర్చోబెట్టేశారు. కాళ్ళకు సంకెళ్ళు వేసి కట్టి పడేశారు

రోహిణీ....

ఆడదీ పనికట్టుకుని ప్రేమ వెనుక పిచ్చిదానిలాగా పరిగెత్తదు. ఆడవాళ్ళకు యధార్ధం అంటే నచ్చుతుంది. కానీ, మా జీవితాన్ని మేము ప్రశాంతంగా జీవించ టానికి...మగవాళ్ళు మీరు విడిచిపెట్టటం లేదు. మేము ఎలా జీవించాలో నన్న ఉద్దేశంతో మా లోకాన్ని మీరు డిజైన్చేస్తున్నారు. మేము మాట్లాడవలసిన మాటలను మీరు డైలాగులుగా రాసిస్తున్నారు. మా జీవితానికి మీరు స్క్రీన్ ప్లే ఫిక్స్ చేస్తున్నారు. ఆడవాళ్ళను, బొమ్మలుగా చేసేసారు. ఎదిరించి నిలబడితే, ఆడదానికి పొగరెక్కినదీ అని బిరుదు ఇస్తారు

రోహిణీ ఆవేశపడుతూ మాట్లాడుతూండగా, సడన్ గా ఆమె ఒక ముక్కు పక్క నుండి రక్తం దారంలాగా దిగింది.

ఏదో జ్ఞాపకం రాగా చటుక్కున వెనక్కి తిరిగి, రక్తాన్ని ముట్టుకుని చూసి రుమాలతో తుడుచుకుంది.

అయ్యో రోహిణీ...ముక్కులో నుండి రక్తం

ఎక్స్ క్యూజ్ మీ... -- వేగంగా లేచి నడిచింది.

రోహిణీ... రోహిణీ! ఎక్కడికి వెళ్తున్నావు?”

రెస్టు రూముకు వెళ్తున్నాను. దీనికి కూడా హక్కులేకుండా చేసేసారు. ఇదే నీ ప్రేమ. కట్టిపడేసేది...జైలులో ఉంచేది. నా స్వతంత్రాన్ని లాక్కొవటం. ఎక్కడికెల్తున్నావని అడగటం. ఎక్కడికీ మమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేయటం. ఇప్పుడు అర్ధమవుతోందా? అందుకోసమే నిన్ను వదిలి వెళ్లాను. కుక్కలాగా ఇక నన్ను తరమకు!

రోహిణీ కోపంగా వెళ్ళిపోగా ----

శ్యామ్ షాకై కూర్చున్నాడు.

వెళ్ళిన ఆమె రానేలేదు.

తరువాతి స్టేషన్లో దిగి వెళ్ళిపోయింది.

                                                                                                          Continued....PART-17

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి