7, జులై 2023, శుక్రవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-18)


                                                                       మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                       (PART-18) 

గ్రీటింగ్ కార్డు కంపెనీ.

హాయ్ రామప్ప తన చేతిలో ఉన్నవాటిని చూసి చూసి సంతోషించాడు.

అది, సంవత్సర లాభ నష్టాల లెక్క! 78 కోట్ల రూపాయల వ్యాపారంలో, 12 కోట్లు లాభం చూపించింది కంపెనీ!

ఆహా...అంతా నా కష్టంతో వచ్చింది. అది తెలియని యజమాని, తన కూతుర్ను పెట్టుకుని తన పదవిని లాక్కుంటున్నాడు. ఇడియట్!

వేగంగా తలుపుతోసుకుని లోపలకు వచ్చాడు ప్యూన్.

మూర్కుడా. నేను పిలవకుండా ఎందుకురా లోపలకు వచ్చావు? నిన్ను లేకుండా చేస్తాను! -- హాయ్ కోపగించుకున్నారు.

అవును...ప్రతి విషయానికీ నన్నే తిట్టండి. అక్కడ ఒకరు తాగేసి ఆఫీసుకు వచ్చారు

ఏమిట్రా?”

ప్యూన్ విషయం చెప్పిన తరువాత , హాయ్ కలవరపడ్డారు. వేగంగా లేచి బయటకు వెళ్లారు.

శ్యామ్ యొక్క గదిలోకి దూరారు. గుప్పుమని దుర్వాసన వచ్చింది. షాకైయ్యారు.

శ్యామ్!

టేబుల్ డ్రాలో నుండి దేనినో వంగి అర్జెంటుగా వెతుకుతున్న అతను, మెల్లగా తిరిగాడు.

తాగున్నావా?”

ఒక్క రోజుకు నన్ను క్షమించండి. మనసు వేదనను తట్టుకోలేక పోతున్నాను

శ్యామ్ మొదట బయటకుపో...పనిచేసే చోటు ఒక గుడిరా. తాగేసి రావటానికి నీకు ఎంత ధైర్యం? పో...బయటకు!

తన జీవితకాలంలో హాయ్ ఎవరిమీద ఇంతగా కోపగించుకున్నది లేదు.

శ్యామ్ కోపంగా లేచి నిలబడి అరిచాడు.

అవును...అందరూ నన్ను ఒకేసారి బయటకు తోసేయండి. మీరు నన్ను ఆఫీసు నుండి బయటకు తోసేయండి... రోహిణీ...ఆమె జీవితం నుంచే నన్ను బయటకు తోసేసింది

రోహిణీని ను కలిసావా? ఎక్కడ? ఎప్పుడు?”

పెళ్ళి చేసుకుంది సార్...ఎవడో ఒక వెధవను

అలాగా?”

అవును

ఎక్కడ...ఎక్కడ చూసావు ఆమెను...?”

గాంధీ రోడ్డులో

ఎక్కడుంటోంది? ఆమె అడ్రస్సు ఉందా...?”

ఒక కర్మా తెలియదు. తెలుసుకోవటం ఇష్టంలేదు

సరేరా. తాగితే నీ గదిలోనే ఉండి తగలడొచ్చుగా? ఇక్కడికి ఎందుకు వచ్చి ఆఫీసును కంపు చేస్తున్నావు?”

రోహిణీకి సంబంధించిన అన్ని వస్తువులనూ తీసుకువెళ్లటానికి వచ్చాను

అతను ఒక ప్లాస్టిక్ సంచీలో ఏవేవో వస్తువులను పెడుతూ లేచాడు.

గుడ్ బై. నేను వస్తాను. ఇకపై నన్ను గెట్ అవుట్చెప్పే పని మీకుండదు

శ్యామ్... శ్యామ్...

అతను వెళ్ళిపోయాడు...అర్ధంకాక నిలబడ్డారు హాయ్.

ఇతను ఎందుకు రోహిణీ వస్తువులను సేకరించి తీసుకు వెళ్తున్నాడు?’ ఆయనకు అర్ధంకాలేదు!

తీవ్ర ఆలొచన తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు. రోహిణీని కనిబెట్టటం చాలా సులభంఅని అనుకుంటూ అర్జెంటుగా బయలుదేరారు.

                                                                                                      Continued...PART-19

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి