మృత్యుదూత (క్రైమ్ నవల)
ఔషధానికి (మెడిసిన్) పనికి వచ్చే మొక్కలను ఓషధులు అంటారు (మెడిసినల్ హెర్బ్స్). ఔషధానికి పనికి వచ్చే మొక్కల వేరు ను మూలికలు అంటరు(మెడిసినల్ రూట్స్). అలాగే విషపూరిత మొక్కలు, వాటి వేర్లు కూడా తక్కువ మోతాదులో ఔషదంగా పనికొస్తాయి. అలాంటి మూలికలను కనుగొనటానికి ఏర్పరచిన పురావస్తు శాఖ మూలికా పరిశోధనా విభాగంలో పనిచేసి విరామం తీసుకున్నారు దశరథమూర్తి గారు. విరామం తీసుకున్న తరువాత కూడా ఆయన తన సొంత పరిశోధనా శాల ఏర్పాటు చేసుకుని, అంతర్జాతీయ మూలికా పరిశోధనా శాస్త్రవేత్తలతో కలిసి మూలికలపై తన పరిసోధనలను కొనసాగిస్తూ ప్రభుత్వానికి సహాయపడుతూ ఉంటారు.
దశరథమూర్తి గారి సొంత పరిశోధనా శాలలో ఉన్న కొన్ని అరుదైన మూలికలను దశరథమూర్తి గారిని తమ నిర్భందంలోకి తీసుకుని, ఆయన్ని బెదిరించి ఆయన పరిశోధనా శాలలో జాగ్రత్త చేసుకున్న అరుదైన మూలికలను దోపిడి చేసుకుని వెడుతుంది ఒక ముఠా.
ఆ ముఠా ఆ అరుదైన మూలికల దుష్ట శక్తులను ఉపయోగించి కొందరిని హతమారుస్తుంది. పోలీసులకు దోపిడి విషయాన్ని రిపోర్టు చేసి ఆ ముఠాను పట్టుకోమని ప్రాధేయపడతారు దశరథమూర్తి గారు.
మూలికలే కదా అని పోలీసులు మెతకగా జరుపుతున్న విచారణను వేగవంతం చేయమని, ఆ అరుదైన మూలికలకు విదేశాలలో మంచి డిమాండ్ ఉన్నదని, కోట్లు విలువ చేస్తాయని, 'ఆలస్యం అమృతం విషం' అని దశరథమూర్తి గారు పోలీసులను ప్రాధేయపడతారు.
ఆ దోపిడి చేయబడ్డ మూలికలకు విదేశాలలో అంత డిమాండ్ ఉందా? నిజంగానే మనుష్యులను హతమార్చే శక్తి ఆ మూలికలకు ఉన్నదా? ఎలా హతమార్చింది? దీన్ని పోలీసులు ఎలా నమ్మారు? కేసును సీరియస్ గా తీసుకుని చివరికి దోపిడీదార్లను పోలీసులు ఎలా కనిపెట్టారు? ఇవన్నీ తెలుసుకోవటానికి ఈ నవల చదవండి.
నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.
దశరథమూర్తి తన పరిశోధనా కేంద్రంలో
పైజమా-బనియన్ తో కూర్చుని తన ముందున్న టేబుల్ పైన వరుసగా ఉంచబడిన పురాతన
చెక్కబద్దలను ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుని, చేతిలోని
భూతద్దం ద్వారా ఆ చెక్క బద్దలపైన రాసున్న వాక్యాలను క్షుణ్నంగా పరిశీలిస్తూ చదువుతున్నప్పుడు----
ఆయన దగ్గరున్న ‘వాకీ
టాకీ’
పిలిచింది.
దాన్ని తీసుకుని చెవి దగ్గర
పెట్టుకున్నారు.
అవతల పక్క ఆయన సెక్రెటరీ పల్లవి
మాట్లాడింది.
“సార్...జూపిటర్
టీవీ నుండి బృందం వచ్చింది”
“టీ.వీ
బృందమా....? వాళ్లెందుకు వచ్చారు?”
“ఏమిటి సార్...మర్చిపోయారా? జూపిటర్
టీవీకి మీరు ఈ రోజు ఒక స్పేషల్ ఇంటర్ వ్యూ ఇవ్వవలసిన రోజు”
“అలాగా?”
“ఏమిటి సార్...అలాగా అని సావకాశంగా
అడుగుతున్నారు? ఇది క్రితం నెలే ఫిక్స్ చేసిన విషయం.
ప్రొద్దున కూడా నేను మీకు జ్ఞాపకం చేశేనే?”
“ఓ! సారీ... పల్లవి...మర్చిపోయాను”
“టీ.వీ
బృందం వచ్చి వైట్ చేస్తున్నారు సార్”
“మొత్తం
ఎంత మంది?”
“ఐదుగురు సార్”
“ఎందుకు
పల్లవి ఈ ఇంటర్ వ్యూ లన్నీ? వాళ్లను ఇక్కడికి
రప్పించకుండా చేసుండచ్చే?”
దశరథమూర్తి ‘హుష్’ అంటూ
నిట్టుర్పు విడిచారు.
“ఇక
కుదరదు సార్. తారీఖు ఫిక్స్ చేసి, టైము ఇచ్చేశాము. టీవీ
వాళ్ళు కూడా ఏదో అవుట్ డోర్ షూటింగ్ వచ్చే విధంగా విధవిధమైన వస్తువులతో వచ్చాసారు.
వాళ్ళు మీకొసం కాచుకోనున్నారు”
“ఇంటర్ వ్యూ పూర్తి చేయటానికి ఎంతసేపు
అవుతుంది?”
“ఎలాగూ ఒక గంటసేపైనా పడుతుంది సార్”
“క్రిమినల్
వేస్ట్! వచ్చేనెల ఇటలీ దేశంలో ఐదవ అంతర్జాతీయ మూలికల సదస్సు జరగనుంది...ఆ సదస్సులో
మాట్లాడటానికి కావలసిన ముఖ్యమైన టాపిక్ గురించి ఇంకా ఏ పనీ మొదలుపెట్టలేదు. ఆ
సదస్సులో అత్యంత అరుదైన, ఔషధ గుణాలున్న మూలికల
గురించి నేను మాట్లాడాలి. దానికొసం పురాతన చెక్కబద్దలను చదువుతున్నాను. ఇది పూర్తి
చేయటానికే చాలా సమయం పట్టేట్టు ఉంది...ఇప్పుడు ఈ ఇంటర్ వ్యూ లన్నీ అవసరమా? ఏదైనా
చెప్పి వాళ్ళను ప్యాకప్ చెయ్యటం కుదరదా?”
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మృత్యుదూత...(క్రైమ్ నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి