14, జులై 2023, శుక్రవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-21)

 

                                                                     మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                            (PART-21)

దిల్ షుక్ నగర్.

ఎనిమిదంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో ఉన్న అపార్ట్ మెంట్లో ఉన్నది రోహిణీ యొక్క అపార్ట్ మెంట్.

లోపల: రోహిణీ, ఆమె ఎదురుగా హాయ్. చెరో కుర్చీలో కూర్చోనున్నారు. హాయ్ ఆందోళనతో అడిగాడు.

ఏమ్మాయ్...నీ భర్త...

ఇంకా మీకు అర్ధం కాలేదా సార్? శ్యామే నా భర్త

వాట్?”

అవును సార్. శ్యామ్ నే నా భర్త

ఇది శ్యామ్ కట్టిన మంగళసూత్రమా?”

లేదు. అతన్ని మనసులో తలుచుకుని...నేనే కట్టుకున్న తాలి

ఏంటమ్మా ఆటలు?”

ఇప్పుడు మీకు ఆటలాగా అనిపిస్తోంది. కానీ, చచ్చిపోతామనే ఆలొచనతో నేను తాలి కట్టుకోవటానికి నిర్ణయం తీసుకున్నప్పుడు, రోజు అది నాకు చాలా ఎమోషనల్ గా ఉన్నది సార్

అర్ధమయ్యిందమ్మా

రెండు సంవత్సరాలకు ముందు నేనొక రోజు స్ప్రుహ తప్పి పడిపోయాను. ఇదిగో నకిలీ డాక్టర్ దగ్గరకు వచ్చాను. ఆయన నెత్తురు పరిశోధనలన్నీ చేసి, తలను ఒక ఎక్స్ రే తీసి, స్కాన్ చేసి మెదడులో గడ్డ ఉన్నది. ఎక్కువ రోజులు బ్రతకవు అని చెప్పారు. అంతే అప్పుడే మనసారా చచ్చిపోయాను

రామప్ప టీ తీసుకుని తాగారు.

మీ ఆఫీసుకు ఉద్యోగానికి వచ్చినప్పుడే, ‘నా జీవితం ఇక కొన్ని రోజులే’ -- అలాగనే నిర్ణయంతోనే వచ్చాను. వచ్చిన చోట శ్యామ్ ను చూసాను. ఆయనకు మొదటి చూపులోనే నేనెలా నచ్చానో, అదేలాగానే ఆయన్నీ నేను మొదటి చూపులోనే ఇష్టపడ్డాను 

లక్కీ ఇడియట్ అమ్మా వాడు!

కానీ, నేను ఇంకో కొద్ది రోజుల్లో చచ్చిపోతాను అనే ఆలొచన, నా ఆశకు అనకట్టవేసింది. అందువల్ల నాకు ప్రేమంటేనే ఇష్టంలేదు. ప్రేమను ద్వేషిస్తున్నాఅని నాటకం ఆడవలసి వచ్చింది. కానీ, శ్యామ్ కు దూరంగా  ఉండలేకపోయాను. మనం స్నేహితులుగా ఉందామని ఒప్పుకున్నాను. అలాగైనా మనసుకు నచ్చిన వాడితో కొన్ని రోజులు జీవిద్దాం అనే చిన్న ఆశతో

నువ్వు ఉద్యోగం వదిలేసిన తరువాత, శ్యామ్ గదికి వెళ్లేవేమ్మా?”

అవును సార్. వెళ్ళాను. శ్యామ్ నా మీద పెట్టుకున్న ప్రేమను ఆపలేకపోయాను. నేను ఆపను, ఆపను ప్రేమ తీవ్రమవుతూ పెరిగింది. శ్యామ్ ను ఒక మోసపూరిత విధంగా వదిలేయటానికి నాకు మనసు రాలేదు. పెళ్ళి చేసుకుని చివరి వరకు అతనితో జీవితం పంచుకోలేకపోయినా, అతనికి చివరిగా నావల్ల ఇవ్వగలిగిన సంతోషాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. అందులో నా స్వార్ధం కూడా ఉంది. చనిపోవటానికి ముందు నేనూ...సంతోషాన్ని అనుభవించటానికి ఆశపడ్డాను. అందులో తప్పేమీ లేదన్నట్టు నాకు అనిపించింది. అందువలనే శ్యామ్ రూముకు వెళ్ళాను  

నాకు అర్ధమవుతోంది. కానీ, మనం అనుకున్నదంతా జరిగిపోతే దైవానికి పనేలేకుండా పోతుందేమ్మా?”

ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోతాను కదా అనే శ్యామ్ జీవితంలో క్రాస్ చేయలేదు.  అతన్ని భర్తగా అనుకుని నాకు నేనే తాలికట్టుకున్నాను. సంతోషం, చచ్చిపోయేదాకా దొరికితే చాలు అనుకున్నా. చావును కలుసుకోబోతున్నానని అనుకున్న దానిని, తిరిగి శ్యామ్ ను కలుసుకుంటానని ఎదురుచూడలేదు

హాయ్ కాఫీగ్లాసు టేబుల్ మీద పెట్టారు. 

అదిమాత్రం కాదుసార్...కంపెనీ ఎం.డి. గారి కూతురు మాధవి, శ్యామ్ పై  విపరీతమైన ప్రేమలో ఉన్నది. శ్యామ్ కు వసతులతో కూడిన జీవితం దొరుకుతుంది. దాన్ని చెడపడం తప్పు కదా? స్వార్ధం కాదా? అందువల్ల దూరంగా జరిగాను

అతను మాధవిని కాదు...నిన్నే ప్రేమిస్తున్నాడు...నువ్వు శ్యామ్ ను ప్రేమిస్తున్నావు కదా?”

అవును

అతన్ని పెళ్ళి చేసుకోవాలని ఆశపడుతున్నావు కదా?”

ఖచ్చితంగా సార్

గుడ్! ఇప్పుడే కరెక్టుగా నిర్ణయం తీసుకున్నావు! నీ నిర్ణయాన్ని నువ్వే నీ నోటితో శ్యామ్ కు చెప్పు

ఇప్పుడు ఎక్కడ ఉంటారు?”

ఆఫీసులోనే

హాయ్, సెల్ ఫోన్ తీసి నెంబర్లు నొక్కారు. రిసెప్షన్లో షీలా తీసింది.

షీలా...వెంటనే శ్యామ్ కి కనేక్షన్ ఇవ్వు. అతనికి ఒక తియ్యటి షాక్ ఇవ్వాలి. ఫోన్  చేసింది నేనని చెప్పకు

సార్...ఇక్కడొక పెద్ద సమస్య అయిపోయింది

ఏమిటది?”

శ్యామ్ సార్ ఉద్యోగానికి రాజీనామా చేసారు. అది మాధవి మేడం  తట్టుకోలేకపోయింది. శ్యామ్ ను భయంకరంగా తిట్టి 'నా కంటి ముందు నిలబడకు పో' అని అరిచి పంపించేసింది

భగవంతుడా...ఎందుకు తొందరపడ్డాడు? ఇప్పుడు అతను ఎక్కడ?”

డాక్టర్ను చూడటానికి వెళ్ళారు సార్

అతని ఆరోగ్యానికి ఏమయ్యింది?”

తెలియదు

డాక్టర్?”

డాక్టర్. నాగార్జున్...

వాట్! అదెలా నీకు తెలుసు?”

నేనే సార్ ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసిచ్చాను. ఆయన చాలా విరక్తిగా వెళ్తున్నట్టు ఉన్నారు. ఏమైంది సార్?’ అని అడిగాను. నేను ఇక ఆఫీసుకు రాను. మీ అందరికీ గుడ్ బై" అని చెప్పి వెళ్ళిపోయారు

ఎప్పుడు వెళ్లాడు?”

పొద్దున్నే వెళ్ళిపోయారు సార్

షాకైన హాయ్ ఫోను కట్ చేసి, రోహిణీను చూసారు.

ఏమిటి సార్ అలా చూస్తున్నారు?”

రోహిణీ...నువ్వు చెప్పింది ఏదీ ఇక జరుగబోయేది లేదమ్మా. నీ ప్రేమ గెలువబోయేదీ లేదు

సార్! ఎందుకు అలా చెబుతున్నారు?”

శ్యామ్... మెడికల్ రీసెర్చ్ సెంటర్లో ట్రీట్మెంటులో ఉన్నాడు

ఏం ట్రీట్మెంట్

నీ జ్ఞాపకాలను తన మెదడులో నుండి చెరిపేసుకోవటానికి వెళ్ళాడు

సార్!

జగదీష్ కోసం మేము చికిత్సకు వెళ్ళామే... చికిత్సకు వెళ్ళాడు. చికిత్స మొదలయ్యి చాలాసేపు అయ్యుంటుంది అనుకుంటా. ఇప్పుడు ఆ చికిత్స ఏ స్టేజీలో ఉన్నదో తెలియదు. దాన్ని ఎలాగైనా ఆపి...

అప్పుడు తలుపు తెరుచుకుని వేగంగా బయటకు వచ్చింది ఆమె. హాయ్ ఆమె వెనుకే పరిగెత్త, మూడవ అంతస్తులో పిచ్చిదానిలా వేగంగా పరిగెత్తిన ఆమె, ‘లిఫ్ట్బటన్ను పిచ్చి పిచ్చిగా నొక్కింది...లిఫ్ట్వచ్చేంతవరకు ఆగలేక, మేడమెట్ల మీద నుండి వేగంగా దిగి పరిగెత్త, రెండవ అంతస్తులో ఆమె కుడి కాలు చెప్పు, మొసైక్ నేలమీద సడన్ గా జార...

శ్యామ్...

అరుస్తూ అలాగే తలకిందలుగా మెట్ల మీద పడిపోవటం ప్రారంభమవ...

రోహిణీ...

హాయ్ షాకుతో బిగుసుకుపోయి కేకలు వెయ్య...

అంతలో డమాల్...డమాల్...డమాల్...

నాలుగైద చోట్ల మొసైక్ మెట్లమీద వేగంగా కొట్టుకోవటంతో, రోహిణీ తలకు దెబ్బ తగిలి...నెత్తుటి వరదలో అటూ ఇటూ కదులుతూ కిందకు వెళ్ళి పడింది.

రోహిణీ! అయ్యో...భగవంతుడా...

కేకలు వేస్తూనే హాయ్ పరుగునవెళ్ళి ఆమెను ఎత్తుతున్నప్పుడు...తల పగిలి నెత్తుటి వరదలో స్ప్రుహ కోల్పోయి పడున్నది రోహిణీ.    

                                                                                                      Continued...PART-22

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి