20, జులై 2023, గురువారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-24)

 

                                                                మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                        (PART-24)

ఆరునెలల తరువాత...ముంబై.

జన సందడి ఎక్కువగా ఉన్న 'చర్చ్ గేట్ స్టేషన్ ' ఎదురు రోడ్డులో ఒక భవనంలోని రెండవ అంతస్తులో ఉన్నది, గ్రీటింగ్ కార్డుల కంపనీ. విపరీతంగా డబ్బు ఖర్చుపెట్టి లోపల అలంకారం చేసున్నారు. ఏదో స్వర్గంలోకి దూరుతున్నట్టు ఒక భ్రమ.

హాయ్ చాలా 'బిజీ' గా ఉన్నారు. గత ఆరునెలలలో కొంతవరకు హిందీ, మరాఠీ నేర్చుకున్నారు. తన అనుభవం వలన విజిటర్స్ ను ఆకట్టుకున్నారు. షాపు రోజు రోజు విజిటర్స్ పెరుగుతున్నారు.

" క్యా హై?" -- ఒక అందమైన అమ్మాయి టైట్ 'టీషర్ట్'-- జీన్స్ తో హాయ్ దగ్గరకు వచ్చింది. పద్దెనిమిదేళ్ళ వయసున్న పంజాబీ దేవత, రాసి రాయి ఉంగరాన్ని చూపించి అడిగింది.

"......జోడియాక్ ఉంగరం హై" -- తనకు తెలిసిన హిందీ భాషలో మేనేజ్ చెయ్యటానికి ట్రై చేసారు హాయ్.

"మత్లబ్?"

అంతకంటే ఆయన వల్ల మేనేజ్ చేయటం కుదరలేదు!

" రోహిణీ...ఇక్కడికి రామ్మా..." అంటూ ఆపద సైరన్ స్వరం వదిలారు.

'క్యాష్ కౌంటర్లో' కూర్చుని కంప్యూటర్లో వచ్చిన రిక్వస్ట్ '-మైల్స్ ' ను చూసి ఆనందపడింది రోహిణీ. 'ఉద్యోగానికి మనుషులు కావాలి ' అని వాళ్ళు పేపర్లో ఇచ్చిన ప్రకటనకు వందల లెక్కలో దరఖాస్తులు వచ్చినై.

"వస్తున్నా సార్..."

" అమ్మాయి ఏదో అడుగుతోంది చూడమ్మా. నా వల్ల కావటంలేదు"

రోహిణీ పంజాబీ అమ్మాయిని తీసుకు వెళ్ళింది.

హాయ్ ఆమెను చూసి పెద్ద నిట్టూర్పు విడిచారు.

హాస్పిటల్లో రోహిణీకి 'అమినీషియా' అని డాక్టర్ చెప్పినప్పుడు ఆయన షాకయ్యారు. రోహిణీకి పాత జ్ఞాపకాలు ఏవీ లేవు. హాయ్ ని కూడా ఆమెకు జ్ఞాపకం లేదు. ఆమెకు డాక్టరే ఆయన్ని పరిచయం చేయవలసి వచ్చింది. "మీ దూరపు బంధువమ్మా" అని ఒకే వాక్యంలో ముగించారు.

రోహిణీని పరిస్థితిలో ఉంచుకుని ఏం చేయాలో హాయ్ కి తెలియలేదు! ఆయన యొక్క ముంబై గ్రీటింగ్ కార్డు షాపును ప్రారంభించాల్సి ఉంది. ఆయనకు తోడుగా ఎవరైనా కావలసి ఉంది. సరి అని చెప్పి ఆయనతో వెళ్ళింది.

ముంబై కొలాబాలో మంచి వసతులతో కూడిన ఇల్లు. వెళ్ళి రావటానికి కారు.

ఇద్దరికీ గాయాలు ఆరటానికీ, కొత్త గాలి పీల్చుకోవటానికి కొత్త చోటు, అవకాశమూ అవసరమయ్యింది.

ఇంతలో రోహిణీ --తాను ఎవరు...ఎక్కడ ఉన్నాం? అనే మనో పీకుడు, దానికైన వేటలో దిగిపోయింది. ఆమెను సమాధానపరచటం పెద్ద ప్రాబ్లం గా ఉన్నది హాయ్ కి.

వాళ్ళిద్దరి మధ్యా ఏమిటి బంధుత్వం అనేది ఇద్దరికీ అర్ధం కాలేదు!

కానీ, గత ఆరునెలలుగా ఒకటిగా కలిసి ఉన్నందువలన, రోహిణీ - హాయ్ ల మధ్య ఒక సన్నిహతం ఏర్పడింది.

హాయ్ మెల్లగా తన వసం పోగొట్టుకుని, హాయ్ వసం వెళ్తున్నట్టు ఆయనకే  అర్ధమయ్యింది.

ఇద్దరికీ మధ్య పదిహేను సంవత్సరాల వయసు తేడా. అది తలుచుకుని తన మనో భావాలను అనుచుకోవటానికి ప్రయత్నించారు. చెవి వైపు కొంత తెల్ల జుట్టు, కొంచం బ్లడ్ ప్రషర్. వయసు నలభై దాటుతోంది. సమాచారాలు ఆయన ఇంకొక పెళ్ళి ఆశను ఆపినై.

కానీ, రోహిణీ చూపంతా ఆయన వైపే ఉన్నది.

ఎవరూ లేని అనాధ అయిన తనకి సపోర్టుగా ఉంటున్నారు హాయ్ అనే ఆయన అనేది రోహిణీకి అర్ధమయ్యింది.

తన పాత జ్ఞాపకాలనో, జీవితాన్నో ఆమె ఎక్కువగా తవ్వుకోవటానికి ఇష్టపడలేదు. హాయ్ గారు కూడా చెప్పలేదు. చెప్పి ఆమె బుర్రను పాడుచేసి ఇప్పుడు ఆమె సంతోషంగా ఉండటాన్ని నాశనం చేయదలుచుకోలేదు.

భవిష్యత్తు గురించిన కలలతో, జరుగుతున్న కాలాన్ని జీవించాలని ఆశపడింది. ఇప్పుడంతా ఆమె చూపులు పూర్తిగా హాయ్ వైపు తిరిగి ఉన్నాయి.

సరిగ్గా షూ వేసుకోవాలి, రోజుకో సాక్స్ మార్చుకోవాలి. నెయ్యి తినకూడదు. జాగింగ్ వెళ్ళాలి. షర్టును లోపలకు వేసుకోవాలి. నెరిసిన జుట్టుకు డై కొట్టుకోవాలి. మీసాలు దట్టంగా ఉండాలి. పొట్ట తగ్గించాలి

రోహిణీ యొక్క పూర్తి శ్రద్ధతో హాయ్ గారు కొత్తగా పాలీష్ చేయబడ్డ మొసైక్ నేలలాగా మెరిసిపోయారు.

రోజూ ఆఫీసుకు వెళ్ళే ముందు, దగ్గరకు వచ్చి 'టై' కడుతుంది.

రోహిణీనే పెళ్ళి చేసుకుంటే ఏం?’ అన్న భావం ఆయనలో తలెత్తింది.

అయినా కానీ, ఎందుకనో చెప్పలేకపోయాడు. దాని గురించిన మంచి-చెడులు ఆలొచించటం మొదలుపెట్టాడు.

ఆయన ఆలొచన ఇదే రోహిణీ ఇప్పుడు షాపులో బిజీగా ఉన్నది. ఆమెకు మొదటగా రెస్టు ఇవ్వాలి. షాపులో పనిచేస్తున్న అమ్మాయిలాగా కాకుండా, పూర్తి ఇల్లాలుగా మారిస్తే, ఆమెకు కుటుంబం గురించిన ఆలొచనలు వస్తాయి. సమయం చూసి, తన మనసులో ఉన్నది చెప్పి...ఆమె దగ్గర అనుమతి తీసుకుని, పెళ్ళిచేసుకుని, తరువాత సంతోషమే

ఆలొచనవలనే షాపులో పనిచేయటానికి మనుషులు కావాలిఅన్న ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ప్రకటనకు వచ్చిన దరఖాస్తులనే కంప్యూటర్లో పరిశీలిస్తున్నారు.

ఈలోపు, ఒక విధంగా పంజాబీ అమ్మాయికి రాసి ఫలం రాయి పొదిగిన ఉంగరం అమ్మి ఆమెను పంపించింది రోహిణీ.

ఆరోజు చాలా అందంగానూ, ఉత్సాహంగానూ కనబడింది. ఆమె మంచి మనో పరిస్థితిలో ఉండటం గ్రహించారు హాయ్. 

పెళ్ళి గురించి మాట్లాడటానికి ఇదే మంచి తరుణం అని నిర్ణయించుకున్నారు. అయినా కానీ, నోటి మాటకు, హృదయానికి మధ్య ఒక అవస్త బంతి దొర్లుతున్నది. ఎలా చెప్పటం?’ అని కన్ ఫ్యూజ్ అయ్యారు.

రోహిణీ...నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం... -- తడబడ్డారు. తరువాత మాట మార్చారు. నువ్వు మొదట తిను. తరువాత చెబుతాను

మంచి విషయాన్ని చెప్పటానికి సంధర్భం దొరికితే జార విడుచుకోకూడదు. మళ్ళీ దానికి సమయం రాకుండానే పోతుంది హాయ్

ఆయన నవ్వారు. చాలా సమయం ఉంది. నా కథలో విల్లనే లేడు. నువ్వు తిను. తరువాత చెబుతాను

రోహిణీ భోజనం చేయటం మొదలుపెట్టింది.

మెల్లగా తన చొక్కా జేబులోంచి లెటర్ తీసారు. అది, తెల్లవారు జామున రాసిన లవ్ లెటర్.

రోహిణీ భోజనం ముగించి చేతులు కడుగ...బాగా ధైర్యమయ్యారు.  

ఆమెను పిలిచి చెప్పటానికి నోరు తెరిచారు.

ఇంతలో ఎక్స్ క్యూజ్ మీ అని ఇంకో గొంతు వినబడింది.

హాయ్ తిరిగి చూసారు.

షాకయ్యారు.

శ్యామ్ నిలబడున్నాడు.

అవును... శ్యామే!

"నువ్వు...నువ్వు...నువ్వు..." తడబడ్డారు హాయ్.

"...మీరు తెలుగా? ఎంత ఆశ్చర్యం? మీ పేరు సార్!"

"రా... రా... రామప్ప! హాయ్ రామప్ప " 

శ్యామ్ సంతోషంతో ఆయన చేతులు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

" హాయ్ రామప్ప...నైస్ నేమ్. నా పేరు శ్యామ్ కుమార్. మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం"

హాయ్ నోటమాట రాక అతన్ని చూస్తూ ఉండిపోయారు.

"నేను ముంబైలో ఒక అడ్వర్టైజ్ మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇక్కడకొచ్చి ఆరునెలలే అయ్యింది. మీ ఆడ్ చూసాను"

శ్యామ్ ను పూర్తిగా పై నుంచి కిందవరకు ఒకసారి చూసారు ఆయన.  ఇంతకముందు కంటే మనిషి తలతలమని మెరుస్తూ హుందాగా ఉన్నాడు. చూడటానికి హిందీ సినిమా హీరో లాగా ఉన్నాడు. శ్యామ్ కు ఆయన్ని ఖచ్చితంగా గుర్తు లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు.

ఏమిటో తెలియటం లేదు సార్... కంపెనీ పేరు చాలా బాగా తెలిసినట్లు -- ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. అదెందుకో మనసులో అలా అనిపిస్తోంది. అందుకనే అలా ఒకసారి వచ్చి చూసి వెళ్దామని వచ్చాను. నేను చాలా ఆడ్ కంపనీలలోనూ, గ్రీటింగ్ కార్డ్ కంపనీలోనూ పనిచేసాను. ఇది నా బయో డాటా’. మీ కంపెనీలో నాకు ఉద్యోగం దొరికితే...

ఆల్రెడీ నిన్ను సెలెక్ట్ చేశేశాను అన్నారు హాయ్, ఆయనకు తెలియకుండానే!

వాట్?”

నువ్వు గుమ్మం ద్వారా లోపలకు వచ్చినప్పుడే సెలెక్ట్అయిపోయావు శ్యామ్ కుమార్ "

......ఎలా...

అది...అదొచ్చి...ఒక తెలుగతనికి ఇంకొక తెలుగువాడే సహాయం చేయకపోతే ఎలా?” -- మేనేజ్ చేశారు.

నేను తెలుగువాడినని మీకు ముందే ఎలా తెలిసింది?”

నీ మొహం చూసిన వెంటనే ఎందుకో నాకు అలా అనిపించింది

చాలా థ్యాంక్స్

రోహిణీ గదిలోంచి అప్పుడు బయటకు వచ్చింది.

ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సంప్రదాయంగా నవ్వుకున్నారు.

ఇది ఎటువంటి జీవిత పద్దతి?’ అని ఆశ్చర్య పడ్డారు హాయ్.

ఒకరి నొకరు మనసారా ఇష్టపడ్డారు...ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు గుర్తు పట్టలేకపోయారు!

రోహిణీకి...అమినీషియా. అతని గురించిన జ్ఞాపకాలే ఆమకు లేవు.

ఇద్దరూ మళ్ళీ కలుసుకుంటున్నారు...కొత్తగా.

ఇది విధి ఆడే ఆటలో రకం?

ఎవరు హాయ్ ఈయన?” -- రోహిణీ మామూలుగా అడిగింది.

ఈయన...ఈయన...ఈయన పేరు శ్యామ్ కుమార్. ఈయనే మన ఆడ్ డివిషన్ ఉద్యోగానికి సెలెక్ట్అయిన ఆయన

అలాగా? ఇంకా ఇంటర్ వ్యూలే జరగలేదే?”

అక్కర్లేదు...అతను సెలెక్ట్అయిపోయాడు

...అయితే ఇతను చాలా అదృష్టవంతుడు

అవును రోహిణీ. ఇతనికి మనం ఉద్యోగం ఇచ్చే తీరాలి. వేరే దారే లేదు"

అలాగా....?”

ఈమె ఎవరు సార్?” అడిగాడు శ్యామ్.

పేరు రోహిణీ. కంపెనీ యొక్క మెదడు, పునాది రాయి. ఈమె లేకుండా ఇక్కడ  ఒక కార్డు కూడా అమ్ముడవదు. నీకు అన్నీ ఉద్యోగ నైపుణ్యాలనూ ఈమే నేర్పించబోతుంది. .కే?”

.కే.సార్

శ్యామ్, రోహిణీ స్నేహంగా నవ్వుకున్నారు.

"హాయ్... యాం రోహిణీ..."

"హాయ్...నేను శ్యామ్. నైస్ టు మీట్ యూ"

ఆమె చేతులో ఉన్న కాగితాన్ని శ్యామ్ చూసాడు.

"ఏం రాస్తున్నారు?"

"ఒక ప్రేమ కవిత్వం...గ్రీటింగ్ కార్డు కోసం. చదివి చూస్తారా?" అంటూ కాగితాన్ని జాపింది రోహిణీ.

లేదు...లేదు. నాకు ప్రేమ అంటేనే 'అలర్జీ" అన్నాడు శ్యామ్.

అలాగా? నేను ప్రేమను ప్రేమిస్తున్నాను అన్నది రోహిణీ.

"సరేనయ్యా...మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. నాకు చిన్న పని ఉన్నది. నేను వెళ్ళి వచ్చేస్తాను"

మేనేజర్ హాయ్ రామప్ప అర్జెంటుగా బయటకు వెళ్లారు.

బయటకు వెళ్ళి నిలబడ్డారు. తన చేతిలో ఉన్న లెటర్ను చూసారు. చిన్నగా నవ్వి, ఒకసారి ఆకాశం వైపు చూసి లెటర్ను ముక్కలు ముక్కలుగా చింపి చెత్త కుండీలో పడేశారు.

ఎలాంటి ఒక మూర్ఖమైన కార్యాన్ని చెయ్యబోయేను? భగవంతుడు నా కళ్ళు తెరిపించాడుఅంటూ అక్కడున్న తన కారులోకి ఎక్కి రిలాక్స్ అయ్యారు.

ప్రేమ ఓటమి ఆయనకు నొప్పి కలిగించలేదు. ఓటమి సంతోషాన్నీ, సుధీర్ఘ ప్రశాంతతనూ ఇచ్చింది.

చెప్పాలంటే ఇది ప్రేమే కాదు.

చెప్పకుండా పోయినందువలనే ఇది ప్రేమ!

కొద్దిసేపటి క్రితం రోహిణీ మాట్లాడింది, దానికి ఆయన చెప్పిన సమాధానం అప్పుడు జ్ఞాపకం వచ్చింది.

మంచి విషయాన్ని చెప్పటానికి సంధర్భం దొరికితే మిస్చేయనే కూడదు. ఎందుకంటే దానికొసం మరో మంచి సంధర్భం రాకుండానే పోతుంది హాయ్

చాలా సంధర్భాలు వస్తాయి. నా కథలో విల్లన్ లేడు. నువ్వు తిను. నేను తరువాత చెప్తాను

నా కథకు నేనే విల్లన్అని ఆలొచిస్తూ, వెనుక వైపు నుండి లోపలకు చూసారు.

రోహిణీ, శ్యామ్ ఇద్దరూ అంతలోనే సన్నిహితం అయిపోయారు. ఒకరికొకరు ఏదో ఆశక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఉత్సాహంగా ఉన్నారు.

నిజమైన ప్రేమ...అదిగో అక్కడ విజయం సాధిస్తూ ఉన్నది.

ఇంతవరకు ఇది ప్రేమ కథ కాదు.

ఇకమీదటే ఒక ప్రేమ కథ మొదలవబోతోంది.

శ్యామ్ -- రోహిణీ ప్రేమ!

హాయ్ రామప్ప శ్వాశను గట్టిగా లోపలకు పీల్చుకుని, చల్లటి గాలిని ఊపిరితిత్తులలో నింపుకుని, సముద్రతీరం వైపు సంతోషంగా నడవటం ప్రారంభించారు.

వాళ్ళూ, వాళ్ళ ప్రేమ.

వాళ్ళకూ, వాళ్ళ ప్రేమకు జై. 

                                                                                            (సమాప్తం)

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి