ఆమే వస్తానంది (కథ)
వీధి చివర నిలబడి ఎవరికోసమో ఎదురుచూస్తోంది కమల. ఆమె మొహంలో ఏదో అదుర్ధా కనబడుతోంది. పక్కింటి భాస్కర్ రావడం చూసి తల దించుకుంది. భాస్కర్ ఆమెను దాటి వెడుతుంటే "ఒక్క నిమిషం" భాస్కర్ కి మాత్రమే వినబడేంత నెమ్మదిగా పలికింది. అప్పటికి కమలను దాటి రెండడుగుల దూరం వెళ్ళిన భాస్కర్ వెనక్కి తిరిగి కమలను చూసి "నన్నా" అన్నట్లు సైగచేసి అడిగేడు.`
"అవును" అన్నట్లు తలూపింది కమల.రెండడుగులు వెనక్కి వచ్చి కమల ముందు నిలబడ్డాడు భాస్కర్.
రోడ్డుకు ఇరువైపులా ఒకసారిచూసి, దగ్గరగా మరింకెవరూ లేరని నిర్ధారించుకుని “ఎవరూ లేనప్పుడు మీ ఇంటికొచ్చి, మీతో కొంచం మాట్లాడాలి. ఎవరూ లేనప్పుడు సైగ చేయండి...వస్తాను” అని మెల్లిగా భాస్కర్ కు చెప్పి గబుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది కమల.
అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోయిన భాస్కర్ తేరుకుని "ఎస్...నా ప్రయత్నం వృధా కాలేదు. లేడి నా వలలో చిక్కింది. వారం రోజుల కల. ఈ రోజు నిజమవబోతోంది. అయితే కమల ఇంత త్వరగా చిక్కుతుంది అనుకోలేదు. ఏది ఏమైనా నువ్వు గ్రేట్ రా భాస్కర్" తనని తానే ప్రశంసించుకున్నాడు భాస్కర్.
"ఇప్పుడేం చేయాలి...ఎలా చేయాలి" అన్న ఆలొచనలతో మెల్లిగా ముందుకు నడుస్తున్న భాస్కర్ కు ఏదో ఐడియా తట్టింది. "ఎస్...ఇదే కరెక్ట్" అనుకుంటూ జేబులోనుండి సెల్ ఫోన్ తీసుకుని ఏవో నెంబర్లు నొక్కి చెవి దగ్గర పెట్టుకున్నాడు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఆమే వస్తానంది...(కథ) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి