రెండు ధృవాలు (పూర్తి నవల)
పరిపూర్ణంగా కథా పాత్రల గుణగణాల ఆంశంతో రాయబడ్డ నవల! సరాసరి గుణాలు
ఉన్న మనుష్యులు కూడా, స్వార్ధం లేని ప్రేమ పక్కకు వస్తే, మనుష్యులుగా మారటానికి ఛాన్స్ ఉంది అనేది చెప్పే ఎమోషనల్ నవల.
కొన్ని సమయాలలో హద్దు మీరటం, సరిహద్దులు దాటటం మనిషి జీవితంలో
జరుగుతుంది! అది విధి! కాలం కాలంగా ఇది జరుగుతోంది. కొన్ని బంధాలను విధిలించి
పారేయలేము! ఆ కష్టాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మనకి ఏది కరెక్టు, ఏది తప్పు, తెలియని ఒక మత్తు వస్తుంది. సమయం గడిచిన
తరువాత తెలిసినప్పుడు, చేయి దాటిపోయుంటుంది.
తల్లి స్పర్ష ప్రేమ! భార్య
స్పర్ష కామం! అవసరమైన సమయాలలో కొడుకూ, కూతురి
స్పర్షలు ఆనందం! వాళ్ళు ముట్టుకునే స్పర్ష దుఃఖాన్ని దూరం చేసి, శరీరానికి కొత్త ఉత్సాహం ఇస్తుంది! కావలించుకున్నప్పుడు హృదయం చోటు
మారుతుంది!
ఈ నవలలో రెండు వేరు వేరు గుణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అనేదే ఈ నవలలోని మిగిలిన వ్యక్తుల ఆశ........మరి అది నెరవేరిందా? తెలుసుకోవటానికి ఈ ఆసక్తికరమైన నవలను చదవండి.
బలం అనేది
దెబ్బతీసేది కాదు...ఉండిపోయేది!
చివరి క్షణాలలో
పెద్దాయన.
గత ఆరు
నెలలుగానే పద్మనాభం
గారికి ఆరొగ్యం
సరిగ్గా లేదు!
ఇప్పటికే రెండుసార్లు
హార్ట్ అటాక్
వచ్చి, అన్ని
రకాల ట్రీట్మెంట్లూ
తీసుకుని, ప్రాణాన్ని
అరిచేతిలో పెట్టుకోనున్న
మనిషి.
అన్ని రకాల
వ్యాధులూ ఆయన శరీరంలో
ఉన్నాయి.
ఆహారం కంటే
కూడా మందులే
ఎక్కువగా ఆయన శరీరంలో
చోటు పట్టుకోనుంది.
వయసు యాభైనాలుగు
సంవత్సరాలే! ప్రైవేట్
కంపెనీలో పనిచేశారు--కొంచం
పెద్ద కంపెనీనే.
పెద్ద పోస్టు
మాత్రం కాదు.
జస్ట్ సూపర్
వైజర్.
ఒక అబ్బాయి, ఇద్దరు
అమ్మాయలు. కష్టపడి
ముగ్గురినీ చదివించారు.
అబ్బాయి డిగ్రీ
పూర్తి చేసి, ఒక
చోట పనికి
చేరి, ఉద్యోగం
చేస్తూనే ఎం.బి.ఏ.
ముగించి, తన
ప్రతిభతో ఒక
పెద్ద కంపెనీలో
పని సంపాదించుకున్నాడు.
అతి మేధావి!
స్కూలు చదువుకుంటున్నప్పట్నుంచి
తండ్రికి ఏ
మాత్రం డబ్బు
ఖర్చు పెట్ట
నివ్వకుండా, స్కాలర్
షిప్ తెచ్చుకుని
తన చదువును
ముగించాడు. తానుగానే
ఉద్యోగం వెతుక్కున్నాడు.
మనోజ్ కుమార్ ఎక్కువగా
మాట్లాడాడు. కోపం
చూపించడు. ఇష్టా
అయిష్టాలను చూపించడు.
ఇలాంటి సమయంలోనే ఆయన రెండో కూతురు ఎవరితోనో తిరిగుతొందని తెలుసుకున్న పద్మనాభం గారు, అదెవరు? ఆ సమస్యను ఎలా డీల్ చేయాలో తెలియక కొట్టుకుంటున్నప్పుడే ఆ రెండో వ్యక్తి ఎంటర్ అవుతాడు.
ఈ పూర్తి నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
రెండు ధృవాలు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి