16, జులై 2023, ఆదివారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-22)

 

                                                                 మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                             (PART-22)

ప్రైవేట్ హాస్పిటల్.

రోహిణీకి తలపై బలమైన గాయం. ఎడం చేతి మనికట్టు దగ్గర ఒక ఫ్రాక్చర్. మోకాలు దగ్గర చిన్న దెబ్బ. దైవాదీనంగా శరీరంలో అక్కడక్కడా చిన్న చిన్న గాయాలు.

ఆమె కళ్ళు తెరవటానికి పదిహేను రోజులు పట్టింది. ఆరొగ్యం పూర్తిగా కోలుకోవటానికి మూడు నెలలు పట్టింది. అంతవరకు ఎమర్జన్సీ లోనే ఉంచారు.

మధ్య టైములో హాయ్, శ్యామ్ ను వెతికారు. రోజు నాగార్జున్ క్లీనిక్కుకు వెళ్ళిన శ్యామ్, తరువాత కనబడకుండా పోయాడు. అతను తన గదిని ముందురోజే ఖాలీ చేసాడు. అతని ఆఫీసు టేబుల్ పైన ఖర్చు లెక్కలు సరిగ్గా రాసుంచి, మిగిలిన డబ్బు టేబుల్ పైన పెట్టబడి ఉంది. హాయ్ టేబుల్ మీద అతని రాజీనామా లెటర్,  ఆయనకు ఇవ్వ వలసిన ఇరవై ఐదువేల డబ్బుకు ఒక చెక్కూ ఉన్నది. అన్నీ ప్లాన్ వేసుకుని చేసి ముగించి వెళ్ళాడు శ్యామ్.

డాక్టర్ నాగార్జున్ ను కలిసారు హాయ్.

శ్యామ్ జ్ఞాపకాలలో నుండి రోహిణీ విజయవంతంగా చెరిపివేయబడినట్టు డాక్టర్ నాగార్జున్ నవ్వు మొహంతో చెప్పారు.

ఆయన మొహాన్ని లాగి ఒక గుద్దు గుద్దుదామని అనిపించింది. తన బావమరిదిని గుణపరిచిన కారణంగా, కృతజ్ఞత కోసం మాట్లాడకుండా వచ్చాసారు హాయ్.

రోహిణీ జ్ఞాపకాలు శ్యామ్ యొక్క మెదడులో నుండి పూర్తిగా విజయవంతంగా తుడిచివేయబడ్డది. దాంతో కనెక్ట్ అయున్న మరికొన్ని జ్ఞాపకాలు కూడా తుడిచివేయబడి ఉండొచ్చు. అందువలనే శ్యామ్ మిమ్మల్ని కలుసుకోనుండడు. ఒకవేల ఒక చెయిన్ రియాక్షన్ వలన మిమ్మల్నీ, మీ ఆఫీసు గురించిన జ్ఞాపకాలను కూడా పోగొట్టుకోనుండచ్చు. అతను మళ్ళీ వస్తేనే వీటి గురించి తెలుస్తుంది అని  డాక్టర్ నాగార్జున్ చెప్పారు.  

చికిత్సా విధానం ఆటలు మానవ కులానికి ఎంత ప్రమాదకరమైందో హాయ్ కి అర్ధమయ్యింది.  ఏమీ చెయ్యలేని మనిషిగా బయటకు వచ్చాడు హాయ్ రామప్ప. 

హాయ్ రామప్ప జీవితంలోనూ కొన్ని టర్నింగ్ పాయింట్ సంఘటనలు జరిగినై. వాళ్ళ గ్రీటింగ్ కార్డు కంపెనీ బ్రాంచీ ఒకటి ముంబైలో తెరవబడి, అది పూర్తిగా హాయ్ గారి బాధ్యతలో అప్పగించబడింది. మేనేజర్ గా ఉన్న హాయ్ రామప్ప, ముంబై బ్రాంచీకి వర్కింగ్ పార్ట్నర్అయ్యాడు.

ముంబై బ్రాంచీ ఓపనింగ్ వేడుక మూడు నెలల కాలం వరకు ఆయన్ని ముంబై నుండి కదలనివ్వలేదు. ఉద్యోగ బాధ్యతతో ముంబైలోనే కూరుకుపోయారు హాయ్. మూడు నెలలూ రోజుకు రెండుసార్లు హైదరాబాదులో రోహిణీ ఉన్న హాస్పిటల్ కు ఫోను చేస్తూ, రోహిణీ ఆరొగ్య విషయాలు తెలుసుకుంటూనే ఉన్నారు. డాక్టర్ రోహిణీని పిలుచుకు వెళ్ళొచ్చు అని చెప్పిన వెంటనే ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు.

                                                                                                         Continued....PART-23

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి