20, జులై 2023, గురువారం

ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు…(కథ)

 

                                                                    ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు                                                                                                                                                     (కథ)

పవిత్ర ప్రేమ త్యాగాన్ని కోరుతుంది, త్యాగం చేసే గొప్ప గుణాన్ని నేర్పిస్తుంది. ప్రేమించిన వారికొసం సహాయాన్నైనా అందిస్తుంది.

ఇలాంటి గుణమే అజయ్ ను ప్రేమిస్తున్న అనితలో ఉంది. అమె ప్రేమించిన అజయ్, పై చదువులకొసం విదేశంలో ఉన్నప్పుడు అనిత ఒక త్యాగం చేస్తుంది.  అనివార్య కారణాల వలన తాను చేయబోతున్న త్యాగం ప్రేమికుడికి ముందే చెప్పలేకపోతుంది. 

పురుష అహంకారం, తొందరపాటు గుణం కలిగిన అజయ్, అనిత తనతో చెప్పకుండా చేసిన త్యాగాన్ని తప్పు పడతాడు. అనితతో కఠినంగా మాట్లాడి అమెను కించ పరుచుతాడు.

అనిత ముందే తనతో తాను చేసిన త్యాగాన్ని ఎందుకు చెప్పలేదో అన్న నిజాన్ని తెలుసుకున్న అజయ్,  తన తోందరపాటుకు అనిత దగ్గర క్షమాపణ అడుగుతాడు. కానీ, ఆజయ్ క్షమాపణని అనిత అంగీకరించదు. మారుగా అనిత ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ నిర్ణయాన్ని అజయ్ తో చెబుతుంది. ఆ నిర్ణయం విని అజయ్ ఆశ్చర్యపోతాడు.  

అజయ్ ఎందుకు ఆశ్చర్యపోతాడు? అనిత తీసుకున్న ఆ నిర్ణయమేమిటి? అనిత చేసిన త్యాగం ఏమిటి? అనిత తాను చేసిన త్యాగం గురించి ఎందుకు తనతో ముందే చెప్పలేదో అనే నిజాన్ని అజయ్ ఎలా తెలుసుకున్నాడు?..... వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.

అజయ్ -- అనిత ప్రేమికులు.

వారి ప్రేమ ప్రయాణం గత ఆరు సంవత్సరాల నుండి కొనసాగుతోంది. ఇరు కుటుంబాల పెద్దలూ వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడేళ్ళ క్రితమే ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో మూడేళ్ళ పై చదువుకు అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో అజయ్ కి స్కాలర్ షిప్ సీటు దొరకడంతో, చదువు ముఖ్యం కాబట్టి పెళ్ళి వాయిదా వేసుకున్నారు.

అజయ్ చదువుకోసం అమెరికా వెళ్ళాడు.

మూడేళ్ళ విదేశీ చదువు ముగించుకుని మాతృదేశానికి తిరిగి వచ్చిన మరునాడే అజయ్ అనితను పార్కులో కలుసుకున్నాడు.

చెప్పు అనితా... నేను తిరిగి వచ్చిన వెంటనే నన్ను కలవాలని, నాతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని ఫోన్లో మాట్లాడిన ప్రతిసారి పదేపదే అన్నావే...ఏమిటా విషయం" ఆతృతతో అనితను అడిగాడు అజయ్.

"ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో తెలియదుఅందుకని విషయాన్ని చెప్పకుండా దాచనూలేను" అన్నది అనిత.

ఫోన్లో చెప్పమంటే...కాదు నేరుగానే చెప్పాలి అన్నావు. ఇప్పుడు నేరుగా ఉన్నా విషయం చెప్పకుండా మాట పొడిగిస్తున్నావు. ఎక్కువ టెన్షన్ పెట్టకుండా సూటిగా చెప్పు...ఏమిటా విషయం?"

"అదొచ్చి...రెండు సంవత్సారాల క్రితం నేను నా కిడ్నీలలో ఒక కిడ్నీని దానంగా ఇచ్చాను"

కథను చదవటనికి క్రింది లింకును క్లిక్ చేయండి:

ఆడువారి నిర్ణయాలకు అర్ధాలే వేరు...(కథ) @ కథా  కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి