13, జులై 2023, గురువారం

జీవన పోరాటం...(నవల)

 

                                                                                        జీవన పోరాటం                                                                                                                                                                                (నవల)

జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు. అలా తప్పు చేసిన వాళ్ళను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు. కానీ, చేసిన తప్పును అర్ధం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించే వారూ ఉన్నారు. కొన్ని సమయాలలో వీళ్ళు చేసే తప్పులవలన తప్పు చేసిన వాళ్ళూ, వాళ్ళకు సంబంధించిన వారూ బాధించపడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది.

కానీ, ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ, వివేకంగానూ ఎదుర్కోంటే ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం.

ఈ నవల లోని పాత్రలు అలాంటి ఒక జీవిత పోరాటంలోనే చిక్కుకుంటారు. వాళ్ళ చిక్కులకు పరిష్కారం దొరికిందా?

ఈ నవల చదివి తెలుసుకోండి.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.

లోపలకు వెళ్ళాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా సరే...జన సముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి.

మతం, భాష, జాతి, రాష్ట్రం అని ఏన్నో విభాగాలు కలిగిన మనుష్యుల ప్రజా సమూహం అక్కడ ఉండటంతో అదొక చిన్న భారత దేశం లాగానే కనబడుతుంది.

ఈ రోజూ అదేలాగనే కనిపిస్తోంది.

సమయం ప్రొద్దున 11.30.

తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ ఫారం పైన కాచుకోనున్నారు. ఖాలీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన  వినిపించడంతో, ప్రయాణీకులందరూ హడావిడిగా తమతమ వస్తువులతో రైలు ఎక్కటానికి రెడీ అయ్యారు.

టికెట్టు రిసర్వ్ చేసుకున్న వారు నిదానంగా తమ రైలుపెట్టెలు ఎక్కి తమతమ సీట్లలో కూర్చున్నారు. రిసర్వేషన్ చేసుకోని వారికోసం ఉన్న జెనెరల్ పెట్టెలలో గుంపు ఒకొళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కటానికి ఆందోళన పడుతున్నారు.

సుమారు ఐదు నిమిషాలు దాటినా, ఒక్కరు కూడా రైలు పెట్టెలోకి వెళ్ళినట్లు తెలియటంలేదు. ఎందుకంటే, లోపలకు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్న వారందరూ తాము లోపలకు వెళ్లకపోయినా పరవాలేదు, తనకు ముందు ఇంకెవరూ పెట్టెలోకి ఎక్కకూడదనే కారణం వలన మిగతావారిని అడ్డుకోవడానికి తమ బలాన్నంతా ఉపయోగిస్తున్నారు.

కానీ, పరంధామయ్య మాత్రం 'పోర్టర్’ ఒకతన్ని బేరమాడి....కిటికీ దగ్గరున్న సీటును పట్టుకుని హాయిగా కూర్చున్నారు.

సూట్ కేసును తన కాళ్ళ కింద పెట్టి గొలుసుతో సీటు పక్కనున్న ఇనుప కడ్డీకి కట్టి తాళం వేసి, తాళంచెవిని జాగ్రత్తగా బద్రపరచుకున్నారు. ఇంకో సంచిని తనకూ, కిటికీకి  మధ్య దిండులాగా పెట్టుకున్నారు. సంచీలో నుంచి ఒక దుప్పటి తీసి రాత్రి పూట ఉపయోగించుకోవటానికి తన భుజాలపై వేసుకున్నారు. 

రైలు బయలుదేరటానికి ఇంకా చాలా సమయం ఉన్నది.

ప్రయాణీకులు మాట్లాడిన(అరిచిన!)బెంగాలీ, హిందీ, తమిల్, కన్నడం అని ఒక కలగలపు భాష ఆ పెట్టెనే అధరగొడుతోంది. 

ప్లాట్ ఫారం పైన, రైలు పెట్టెలోనూ చిన్న చిన్న వస్తువుల వ్యాపారం చురుకుగా జరుగుతున్నది.

పరంధామయ్య, తన చుట్టూ క్షుణ్ణంగా గమనించినప్పుడు తెలుగు తెలిసిన ఎవరూ ఆయన కూర్చున్న చోట ఉన్నారనే తెలియటం లేదు. ఆయనకి హిందీ బాగా వచ్చు గనుక దాని గురించి బాధపడలేదు.

మీకు ఇప్పుడొక ఒక సందేహం రావచ్చు!

'ఆ రైలు పెట్టెలో వందాలాది ప్రయాణీకులు ఉంటే...ఎందుకు పరంధామయ్య మీద మాత్రం ఇంత శ్రద్ద?' అని అడగటం తెలుస్తోంది.

దానికి ఒక కారణం ఉంది.

రైలు బయరుదేరటానికి కొద్ది నిమిషాల ముందు ఆయన జీవితాన్నే మార్చి వేయబోయే సంఘటన జరగబోతోంది.

'అది ఏమిటి?' అని అడుగుతున్నారా! 

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

జీవన పోరాటం...(నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి